చంద్రికా కృష్ణమూర్తి... సక్సెస్‌ఫుల్ బిజినెస్ వుమన్... న్యూయార్క్ యూనివర్శిటీ ట్రస్టు బోర్డు మెంబర్.. పెప్సికో సిఇఓ ఇంద్రానూయికి సోదరి... అది కొద్ది కాలం క్రితం వరకు ఇప్పుడు.. ఓ మంచి సంగీత విద్వాంసురాలు. 56 ఏళ్ల వయసులో తనలో దాగున్న అంతర్గత ప్రతిభకు ప్రాణం పోసుకుంది. గిటారు నేర్చుకుంది. సంగీత సాధన చేసింది. భక్తి సంగీతంతో ఓం నమశ్శివాయ పేరుతో మొదటి ఆల్బమ్‌ను విడుదల చేసింది. ఇక రెండవ ఆల్బం ఓం నయో నారాయణతో గ్రామీ అవార్డుకు ఎంపికయ్యింది.
చంద్రికా కృష్ణమూర్తి ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే చాలు.. 25 వేల రకాల పూలు నవ్వుతూ పలకరిస్తాయి. ఆ పూలలోని సుగంధం చల్లగా కదిలిస్తుంది. నెమ్మదిగా పరికించి చూస్తే అందులో ఆమె పరిచయం చేసే కొత్త విషయాలెన్నో.పాటలంటే ప్రాణం...
చిన్నతనం నుండి రేడియోలో పాటలు వింటూ పెరిగారు. అన్ని రకాల సంగీతా న్ని విని ఆనందించేవారు.శనివారం రాత్రి పాఠకులు కోరిన పాటలను ప్రసా రం చేసేవారు. అవంటే చంద్రికకు ఎంతో ఇష్టం. తప్పకుండా వినేది. ఇక టామ్ జోనెస్ పాటలు అంటే చాలా చాలా ఇష్టం. డీన్ మార్టిన్స్ సాంగ్ మొదటి సారి వినగానే ఆమెకు నచ్చింది. వుడ్ స్టాక్ సాంగ్స్‌ని ఒకే వారంలో పన్నెండు సార్లు విన్నది.అలాగే చిన్నతనం నుండి ఎక్కువ హమ్మింగ్ చేసేది. ఇక భక్తి పాటలం టే చంద్రిక ప్రాణం పెట్టేది.జాతీయ గీతాల పట్ల మక్కువ ఎక్కువ. ఫ్రెంచ్ సంగీతం కూడా నేర్చుకుంది.
నాకు నేనే ప్రశ్నగా..
పెరిగి పెద్దవుతున్న కొద్దీ చంద్రిక పూర్తిగా చదువు వైపుకి మళ్లింది. ఉన్నత స్థానానికి చేరుకుంది. కానీ ఏదో వెలితి. ఎంత సాధించి నా సంతృప్తి లేక బాధపడింది. ఓసారి తనను తాను పూర్తిగా అర్థం చేసుకునేం దుకు ప్రయత్నించింది. ‘నాకు సంబంధించి ప్రతి విషయంలోనూ సంగీతం వుంది. ఇది లేకుండా నేను బతకడం అనేది సాధ్యం కాదు. నాకు నేనే ఓ పెద్ద నీడలాంటి దాన్ని దాని గురించి నాకు నేనే ఎప్పుడూ చెప్పుకుంటూ వుంటాను. తొమ్మిది సంవత్సరాల క్రితం నా కూతురిని స్కూలుకు పంపిచడం మొదలు పెట్టాకే మేలుకున్నాను. బిజినెస్‌లో ఎంతో విజయం సాధించాను.
కానీ నా లోపల దాగున్న తృష్ణని మాత్రం ఏ మాత్రం నెరవేర్చుకోలేకపోయాను. నేను ఏంటో తెలుసుకోవాల్సిన సమయం అనిపించింది. నాకు సంతోషం కలిగించే అంశం ఏంటి అని? నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అప్పుడే అనిపించింది నాకు సంతో షాన్ని కలిగించే అంశం సంగీతం ప్రస్తుతం నా జీవితంలో అది లేదు. అప్పుడే మొదలైంది సంగీత విద్యార్థిగా. ఎంతో గొప్ప గొప్పవారి దగ్గరికి వెళ్ళి క్లాసికల్, హిందుస్థానీ సంగీతాన్ని తెలుసుకున్నాను. పండిట్ గిరిష్ వాజాల్వర్ వంటి వారి తో కలిసి పనిచేశాను. ఆయన నాకు అసలు గురువు. వీణ సహస్ర బుద్ధే దగ్గర, శుభ్ర గుహ, పండిట్ విజయ్ కిచ్‌లు దగ్గర కూడా దీన్ని నేర్చుకున్నాను’ అని చంద్రిక చెబుతోంది. ఇవంటే చాలా ఇష్టం..
అమెరికాలో టాప్ 40 హిట్ పాటలన్నీ చంద్రికకు చాలా ఇష్టం. నును డెమీస్ రౌసెస్, ఊమ్ కథోమ్, నానా మస్కౌరి వారి పాటల నుండి ఎంతో నేర్చు కుంది. వాటి నుండి స్ఫూర్తి పొందింది. ఇక వారి మెలోడీ పాటలు ఆమెను ఎంతగానో ప్రోత్సహించాయి. ఎబిబిఎ, బ్రెజిలి యన్ సంగీతం, ది ఈగల్స్, బిగీస్, జోన్ బేజ్ వంటి ఎన్నో కలెక్షన్స్ ఆమె దగ్గర వున్నాయి. పాశ్చాత్య సంగీత క్లాసిక్స్ అన్నీ సేకరించారు.
ఆషామాషీ కాదు..
మొదటి ఆల్బమ్‌ను 2005లో చంద్రిక విడుదల చేసింది. అనుకున్నదే తడవు గా చేసింది కాదిది.అందుకు ఆమె ఎంతో శ్రమించింది. ‘ఆల్బమ్ మొదలు పెట్టే ముందే అన్నిటికీ సిద్ధం అయ్యాను. భారతదేశంలో ఎంతో మంది ప్రముఖుల ను కలుసుకున్నాను. సంగీతాన్ని తెలుసుకున్నాను’ అని చంద్రిక అంటోంది.
గ్రామీ అవార్డుకు ఎంపిక...
పాశ్చాత్య పాప్ సంగీతాన్ని అక్కడి సంగీత హోరును అన్నిటినీ మరిపించి చం ద్రిక రెండవ ఆల్బం ఓం నమో నారాయణ గ్రామీ అవార్డుకు ఎంపికయ్యిం ది. బేలాఫ్లెక్, బేబిల్ గిల్‌బర్టో, అంజెలి క్యూ కిడ్జో, సెర్జియో మెండెస్ వం టి ప్రముఖుల ఆల్బమ్స్‌ను దాటుకుని ఆమె నామినీగా నిలిచినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది.
మీ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నా రా? అని చంద్రికను అడిగితే ‘ఇదో గౌరవం. అసలు ఎంపిక అవ్వడమే ఎంతో గర్వంగా అనిపించింది.కలలో కూడా అనుకోలేదు. నేను ఏదో అవార్డు వస్తుంది.. తెచ్చుకోవాలని అనే ఆశతో అయితే పని చేయలేదు.భవిష్యత్తులో దాని కోసం ప్రయత్నించే దా న్ని. కానీ ఇప్పుడే వ స్తుందని మాత్రం అ నుకోలేదు’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఎంత ఎదిగినా ఒదిగే...
‘నా జీవితం ఏమీ మార దు. నేను నా శక్తి వంచన లే కుండా నాలోని ప్రతిభను పూర్తిగా వినియోగించుకుని ఆల్బమ్ చేశాను. ఇక గ్రామీ నామినేషన్ అనేది నా సంగీతాన్ని ఎంతో మందికి తెలిసేలా చేసింది. ఎన్నోకష్టాలను దాటుకు ని అది ఆ స్థానానికి చేరుకుంది. సంగీతం అనేది మనసు మూలాలను తాకేదిగా వుండాలి. అప్పుడే విజయం సాధిస్తుంది. నా పాటల్లో ఆ ప్రత్యేకత వుంది కాబట్టే ఈ స్థాయికి వచ్చింది’ అని ఎంతో వినమ్రత ప్రదర్శిస్తారు.
ఎవరి ప్రత్యేకత వారిదే..
ఇంద్రానూయి చెల్లెలుగా పుట్టడం ఎంతో గర్వంగా అనిపిస్తుందని చంద్రిక అం టోంది. ‘ఆమె ఎంతో శక్తివంతమైన మహిళ. లక్షలాది మంది అభిమానులు ఆమెకున్నారు. వారందరిలో నేను ముందు వరుసలో వుంటాను. కలలను నెరవే ర్చుకోవడం అంటే ఏంటో ఆమె నుండే నేర్చుకోవాలి. ఇద్దరం ఎంతో సన్నిహి తంగా వుంటాం. 35 సంవత్సరాలుగా ఎవరికి వారు బతుకుతున్నాం. ఆమె వ్యా పారంలో అంచెలంచెలుగా ఎదిగింది. నేను నా స్థాయిలో వున్నాను. ఓ ఫౌండేష న్‌ని ఏర్పాటు చేశాను. బిజినెస్ స్కూలుకు బోర్డు మెంబర్‌గా వున్నాను. దీనితో పాటు అమెరికన్ ఇండియా ఫౌండేషన్‌లో కూడా భాగస్వామిగా వున్నాను’ అని చంద్రిక వారి మధ్య గల ప్రత్యేకతలను చెబుతున్నారు. అంతే కాదు..ఇంద్రా నూయి చంద్రికకు ఎంతో సపోర్టుగా కూడా వుంటారు. సంగీతం వైపుకు వెళ్లేందుకు మార్గదర్శకురాలు కూడా. ఈ విజయం అనేది ఆమెకు ఓ స్వీట్ న్యూస్. భవిష్యత్తులో తన ప్రతిభకు మరింత పదును పెట్టుకుని ముందుకెళ్ళేందుకు ఇప్పుడు చంద్రిక సిద్ధమవుతోంది. ఆమెకు ఆల్‌దిబెస్ట్.

వేసవి సెలవుల్లో సదన్ సూపరింటెండెంట్ వాళ్లతోనే ఉంటూ టైపింగ్‌ను నేర్చుకుంది జ్యోతి. అక్కడ టెన్త్ పూర్తయిన తర్వాత టీచరు ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో ఒకేషనల్‌కోర్సులో చేరితే అది పూర్తయిన తర్వాత కాని తెలియలేదు జ్యోతికి... ఆ కోర్సుతో టీచర్ ఉద్యోగం రాదని! జ్యోతి హతాశురాలయ్యింది. చదువుకుంటానని మొత్తుకుంది. కాని ఇంట్లో వినకుండా పెళ్లి చేసేశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అత్తగారి కుటుంబం జ్యోతి కుటుంబానికి దగ్గరి బంధువులే అయినా అప్పటిదాకా పెరిగిన హాస్టల్ జీవితానికి పూర్తిగా భిన్నంగా అనిపించిందామెకు. వ్యవసాయ కుటుంబం కావడంతో పనులు చేయడానికి పిల్లలను ఇంటిదగ్గరే వదిలిపెట్టి పొలం దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. ఏ పని చేస్తున్నా సరే ఏదో వెలితి ఆమెను వెన్నాడటం మానలేదు. అప్పుడే నేషనల్ సర్వీస్ వాలంటీర్ నోటిఫికేషన్ రావడంతో అతికష్టం మీద జ్యోతి అందులో చేరింది. ఉద్యోగరీత్యా జిల్లా అంతా తిరగాల్సి వచ్చేది. దాంతో వరంగల్‌కు మకాం మార్చి ప్రత్యామ్నాయాల అన్వేషణలో పడింది. ఎలాగో టైలరింగ్ నేర్చుకుని లంగాలు కుట్టి దుకాణాలకిచ్చేది. అప్పుడే టైపింగ్ పరీక్ష కూడా పాసయ్యారు. అప్పుడు వచ్చిన ఓ ఆలోచన ఆమె జీవితాన్నే మలుపుతిప్పింది.
ఆడపిల్లగా పుట్టినంత మాత్రాన జీవితాంతం తండ్రి, భర్త, పిల్లలు ఇలా ఎవరో ఒకరిపై ఆధారపడుతూనే ఉండాలా? లింగ భేదానికి అతీతంగా ప్రతివారు పనిచేయాలి. ఎవరిమీదా ఆధారపడకూడదు. అలాగని కుటుంబ సంబంధాలు, ప్రేమానురాగాల్లేకుండా ఉండాలనేది నా అభిమతం కాదు. పని సంస్కృతికి ప్రతి గ్రామీణ మహిళా అలవాటు పడాలి. ఇందుకోసం గ్రామీణప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వనరులను గుర్తించి, శిక్షణ, ఉపాధి వంటి వాటికోసం నా శక్తిని, అనుభవాన్ని ఉపయోగించాలని ఉంది.
ఐశ్వర్యవంతులు తమ సరదాల కోసం లలు, కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు. తమకేదేమైనా ఇష్టమైతే ఎంత ఖరీదైనా కొనుగోలు చేసేందుకు వెనుకాడరు.అది ఒక పడవ కావచ్చు, విమానం కావచ్చు లేదా ద్వీపమే కావచ్చు. అది ఏదైనా సరే వారి మనసు దాని పైకి మళ్లిందో అది వారి స్వంతం కావలసిందే. ఇటువంటి కొందరు బిలియనీర్ల గురించి తెలుసుకుంటే అమ్మో...అనకుండా ఉండలేము.
బిలియనీర్ సోదరులలో పెద్దవాడైనా ముఖేష్ అంబానీ లాగే అనిల్ అంబానీకి సైతం కొన్ని రకాల ఇష్టాలున్నాయి. అనిల్ అంబానీకి స్పీడ్‌గా వెళ్లే కార్లంటే ప్రాణం. వేగంగా వెళ్లే ఆరు లగ్జరీ కార్లను ఆయన కోట్ల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేశారు. లాంబ్రోగిని గల్లార్డో, మెర్సీడీజ్ ఎస్ క్లాస్, మేబ్యాచ్, బిఎండబ్ల్యూ 7 సీరీస్, అడీ క్యూ7, రాల్స్ రా యిస్, పోర్స్చ్, లెక్సస్ వంటి ఖరీదైన కార్లు ఆయన వద్ద ఉన్నాయి. మన దేశంలో ఇంతటి ఖరీదైన కార్లు మరెవరి దగ్గరి కూడా లేవంటే అతి శయోక్తి కాదు.ఈ విలాసవంతమైన కార్ల కోసం ఆయన తన నివాసం వద్ద ఓ ప్రత్యేక గ్యారేజీని కూడా ఏర్పాటుచేసుకున్నారు.
ఈ మాట అనగానే అందరికీ గుర్తొచ్చేది లిక్కర్ కింగ్ విజయా మాల్యా అని. ఈ ఐశ్వ ర్యవంతుడు విలాస వంతమైన మనిషిగా పేరు గాంచారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత కూడా అయిన ఈ బిలియ నీర్‌కు విలాసవంతమైన బోట్లు అంటే ఎంతో ఇష్టం. ఆయన ఇటీవల 450 కోట్ల రూపాయలను వెచ్చించి ఖతారి రాయల్స్ 95 మీటర్ల బోటును కొన్నారు. ఇండియన్ ఎంప్రెస్‌ని దీనికి పేరుపెట్టారు. నీటిపైన తేలియాడే ఖరీదైన ఈ ప్యాలెస్ బోటును ఎంతో అం దంగా నిర్మించారు.ఇందులో ప్రఖ్యాత ఆర్టిస్ట్‌లు రెనాయిర్, చగల్ పెయింటిం గ్స్‌ను ఏర్పాటుచేయడం విశేషం.
రియల్ ఎస్టేట్ మొగల్‌గా పేరుగాంచిన సన్నీ దీవాన్ దేశంలోని టాప్ బిలియనీర్లలో ఒకరిగా నిలుస్తారు.ఈ బిలియనీర్ 527 కోట్ల రూపాయలతో ఫెర్రెట్టీ 881 బోటును కొన్నారు. 90 అడుగుల ఈ బోటులో విలాసవంతమైన సౌకర్యాలెన్నో ఉన్నాయి. అత్యాధు నిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ బోటు సముద్రంలో వేగంగా దూసుకెళ్తుంది. సముద్రంపై షికారుకెళ్లే సన్నీ దీవాన్ తర చుగా తన బోటును గేట్‌ఆఫ్ ఇండియా వద్ద పార్క్ చేస్తుం టారు. ఈ బోటును తిలకించేందుకు పర్యాటకులు అక్క డికి వస్తుంటారు.బాగున్నాయి కదూ మన వారి టేస్టులు? ఏమైనా పైసా మె హై పరమాత్మ. 
ఎన్నికల ప్రక్రియ మరింత బలోపేతంగా పారదర్శకంగా పరిణతి చెందుతున్న తరుణంలో రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోకి తరలిపోతున్నది. వీళ్ళ ఇంటి పేర్లు తెలిస్తే చాలు. వీరి గురించి తెలుసుకున్నట్లే. కొత్త పార్లమెంటు సభ్యులు చాలావరకు కొడుకులే కావడం విశేషం. రాజీవ్ గాంధి కొడుకు రాహుల్, జితేంద్ర ప్రసాద కొడుకు జితిన్ , మాధవ్‌రావ్ సింధియా కొడుకు జ్యోతిరాదిత్య,రాజేశ్ పైలెట్ కొడుకు, ఒమర్ అబ్దుల్లా బామ్మర్ది సచిన్, ఫరూక్ అబ్దుల్లా కొడుకు, షేఖ్ అబ్దుల్లా మనవడు ఒమర్ అబ్దుల్లా, ములాయమ్ సింగ్ యాదవ్ కొడుకు అఖిలేశ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, మాధవరావ్‌సింధియా కుమారుడు దుష్యంతు ఇలా ఈ పేర్ల ప్రవాహం అనంతంగా కొనసాగుతూనే వుంటుంది. మరి వీరి సిద్ధాంతాలేమిటి? వీరి భావజాలం ఏమిటి? వీటికి స్పష్టమైన సమాధానం దొరకదు. అవి వీరి హృదయాల్లో నిర్దిష్టమైన రూపురేఖలు దాల్చలేదు. ఈ పిల్లలు ప్రపంచం చుట్టివచ్చారు. వీరికో సిద్ధాంతం లేదు. బహుశా సిద్ధాంతాల రాజకీయాలతో ఇండియా నష్టపోయింది.
లక్షద్వీప్ దీవులకు ఇండియాలో అతి కుర్ర ఎంపి హమ్దుల్లా సరుూద్ ఒకప్పుడు ఇండియాలో అతి చిన్న వయసు ఎంపి కుమారుడు. ఈ వారసుడు లక్షద్వీపులో పుట్టలేదు కనుక అక్కడ్నించి ఎన్నిక పోటీచేసేట్లు మన కేంద్ర ప్రభుత్వం 2008లో రాజ్యాంగ సవరణ తీసుకువచ్చింది. 29ఏళ్ళ చిరుత ప్రాయంలోనే మంత్రి అయిన మేఘాలయకు చెందిన అగథా సంగ్మా మాజీ స్పీకరు కుమార్తె. కుటుంబ వ్యవస్థలోనే అధికార క్రమాన్ని ఖచ్చితంగా ఏర్పడివుంది. శరద్‌పవార్ కూతురు సుప్రి యా సూలే తన తండ్రి విరోధు లతో కలిసి సంతోషంగా పనిచేసింది.
పార్టీ ఎంపీలందరూ వారసత్వమార్గంలో ఎంపికైనవారు కావడంతో ఆర్‌ఎల్‌డి ప్రథమ శ్రేణిలో నిలిచింది. కాంగ్రెస్ నుంచి చీలిపోయి,7 వారసత్వ ఎంపీలున్న ఎన్‌సిపి రెండవస్థానంలో ఉంది. 42.9శాతం ఉన్న బిజెడి మూడవస్థానంలో ఉంది. లోక్‌సభలో స్వల్పసంఖ్యలో సీట్లున్నాయి ఇక శివసేన పార్టీయే థాక్రే కుటుంబం అధీనంలో ఉంది. ఇక మాయావతి బిఎస్‌పిలో మూడవ వంతు ఎంపీలు వారసులు. ఇక 324 సీట్లు కలిగివున్న రెండు పెద్ద పార్టీలు బిజెపి, కాంగ్రెస్. బిజెపిలో 19శాతం సభ్యులే వారసులు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 37.5శాతం ఎంపీలు కుటుంబ సంబంధం ద్వారా లోక్‌సభలోకి ప్రవేశించారు. పార్టీ ఎంపీలందరూ వారసత్వమార్గంలో ఎంపికైనవారు కావడంతో ఆర్‌ఎల్‌డి ప్రథమ శ్రేణిలో నిలిచింది. కాంగ్రెస్ నుంచి చీలిపోయి,7 వారసత్వ ఎంపీలున్న ఎన్‌సిపి రెండవస్థానంలో ఉంది. 42.9శాతం ఉన్న బిజెడి మూడవస్థానంలో ఉంది. లోక్‌సభలో స్వల్పసంఖ్యలో సీట్లున్నాయికనుక ఈ పార్టీలకు ఫలితాలు గణాంకాల రీత్యా అంత గణనీయమైనవి కావు.
మన రాష్ట్రం విషయానికి వస్తే వారసత్వ రాజకీయాలు ఉన్నప్పటికీ అంతిమ అధికారాన్ని సాధించడంలో వీరంతా విఫలమయ్యారు. తాజాగా జగన్ ముఖ్యమంత్రి పీఠం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం తెలిసిందే. కేంద్రంలో ప్రధాని పదవిని నెహ్రూ కుటుంబానికి వారసత్వంగా ఇచ్చిన పార్టీయే ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని జగన్‌కు కట్టబెట్టే సమయంలో ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడడం ఒక వైచిత్రి. అయితే రాజకీయాలలో ఒక వెలుగు వెలిగి మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆ స్థాయిలో పీఠాలు దక్కకపోయినా రాజకీయ వారసత్వం నిస్సందేహంగా దక్కిందనేది వాస్తవం. అర్హులైన వారసులు లేనప్పుడు భార్యకు, ఉంటే కుమారుడికి లేదా కుమార్తెకు ఆ స్థానం కట్టబెట్టడం దేశంలో ఒక సంప్రదాయం అయిపోయింది. చిత్రమేమి టంటే దాదాపు 69.5శాతం మహిళా ఎంపీలు కుటుంబ రాజకీయాల వర్గానికి చెందినవారు.
లోక్‌సభలో 30 ఏళ్ళలోపు సభ్యులందరూ ఆ సీటు వారసత్వంగా పొందినవారే. 66 యువ ఎంపీల్లో మూడింట రెండొం తులు వారసత్వ ఎంపీలే. కొత్త తరం శాసన సభ్యులు రాజకీయాల్లో ఇతర సభ్యులకంటే ఒక దశాబ్దపు సౌలభ్యం ఉన్నవారు. కాంగ్రెస్‌లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. 35ఏళ్ళ లోపు ప్రతి ఎంపీ వారసత్వ సభ్యుడే. ఈ ధోరణి కొనసాగితే భారతీయ పార్లమెంటులో వారసత్వ సభ్యులు మాత్రమే ఉండే రోజు దూరంలో లేదు. దేశం 60 ఏళ్ళకు పూర్వం స్వాతంత్య్రానికి పూర్వం ఎక్కడ ఉండేదో అక్కడికి చేరుకుంటుంది. వారసత్వంగా వచ్చిన మహరాజు ఆయన దర్బారులో సామంత రాజులు ఉంటారు.
దక్షిణ భారతదేశంలో వారసత్వ రాజకీయాలు బలంగా ఉన్న పార్టీ డిఎంకె అనే చెప్పాలి. ఆ పార్టీ అధినేత కరుణానిధి కుటుంబమంతా రాజకీయాలలోనే ఉన్న వైనం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయన పెద్ద కుమారుడు కేంద్రంలో మంత్రి, చిన్న కుమారుడు డిప్యూటీ ముఖ్యమంత్రి కాగా కుమార్తె ఎంపి. అంతే కాదు ఆయన మేనల్లుడి కుమారుడు కూడా కేంద్రం లో మంత్రిగా ఉన్నాడు.
ఆస్ట్రేలియా వెళ్లాక కృష్ణా ఒబేరాయ్‌లో ఉన్న అనుభవంతో అక్కడా ఓ మంచి హోటల్లోనే ఉద్యోగం దొరికింది. అలా చేస్తున్నప్పుడే అక్కడి ఓ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (స్వచ్ఛంద సంస్థ)లో పనిచేసే మంచి అవకాశం దొరికింది.
ఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు చేసిన సందడి అభిమానులను ఉక్కిరిబిక్కిరిచేసింది. దీంతో సినీతారలు, మోడల్స్, క్రీడాకారులు, వ్యాపార ప్రముఖులు తదితర సెలబ్రిటీలు వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. బిగ్‌బాస్-4 రియాల్టీ షోలో పమేలా ఆండర్సన్ మొదలుకొని టెస్టుల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 50 సెంచరీలు, బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ టాప్ హీరోగా నిలిచి తమ అభిమానులకు మధురానుభూతులను పంచారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ ఏడాది వార్తల్లో ప్రముఖులుగా నిలిచి ఆకట్టుకున్నారు. అభిమానులను మైమరపించిన ఈ సెలబ్రిటీల గురించి తెలుసుకుందామా...
ఈ ఏడాది బాలీవుడ్ టాప్ హీరోగా సల్మాన్ ఖాన్ నిలిచారు. సల్మాన్ ఇటీవలే 45వ బర్త్‌డే వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. సల్మాన్‌కు అమీర్‌ఖాన్‌కు ఉన్న యాక్టింగ్ స్కిల్స్, షారూఖ్ ఖాన్ వంటి చరిష్మా లేకున్నా ఈ ఏడాది ఆయన పలు హిట్ సినిమాలతో బాలీవుడ్ టాప్ హీరోగా నిలిచారు. ఈ ఏడాది సల్మాన్ నటించిన దబంగ్ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతోపాటు బిగ్ బాస్ సీజన్ 4లో యాంకర్‌గా చేసిన సల్మాన్‌కు ఎంతో పాపులారిటీ దక్కింది. బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్, షారూఖ్ ఖాన్‌లు, సల్మాన్ ఖాన్‌లు ఖాన్‌ల త్రయంగా పేరుగాం చారు. ఈ ఏడాది ఖాన్‌ల త్రయంలో సల్మానే బెస్ట్‌గా నిలిచారు. ఇతర ఖాన్‌లకంటే తక్కువ వయస్సుగల ఈ బాలీవుడ్ కండలవీరుడు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని మానవతా వాదిగా సైతం పేరుతెచ్చుకున్నారు. బాలీవుడ్ ట్రేడ్ కన్సల్టెంట్ అమోద్ మెహ్రా మాట్లాడుతూ ‘ఈ ఏడాది బాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమాలతో కలిసి 237 హిందీ సినిమాలు విడుదల య్యాయి. వీటన్నింట్లో నిజమైన సూపర్ హిట్ సినిమాలుగా నిలిచినవి మాత్రం దబంగ్, గోల్‌మాల్ 3 మాత్రమే. ఈ ఏడాది ఖానో మే ఖాన్ కౌన్ హై...అంటే నేను సల్మాన్ ఖాన్ అని చెబుతాను. సల్మాన్ నటించిన వీర్ సినిమా ఫెయిలైనప్పటికీ దబంగ్ సినిమాతో ఆయన టాప్‌స్టార్‌గా నిలిచారు’ అని ఆయన సల్మాన్‌ను పొగిడారు.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ను వివాహమాడి కొత్త జీవితంలోకి ప్రవేశించారు. దీంతో పాటు టెన్నిస్‌లో పలు విజయాలు ఆమెకు సంతోషాన్ని మిగిల్చాయి. ‘2010 సంవత్సరం నా జీవితంలోనే అదృష్టమైన సంవత్సరంగా భావిస్తాను. ముందుగా నా పెళ్లి షోయబ్‌తో జరగడంతో నా జీవితంలో ఆనం దం వెల్లివిరిసింది. ఇక ఆసియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో మెడల్స్ గెల్చుకోవడం సంతోషాన్నిచ్చింది. దీంతో పాటు దుబాయ్‌లో జరిగిన ఇంటర్నే షనల్ టెన్నిస్ ఫెడరేషన్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాను. వీటన్నింటితో ఈ ఏడాది నాకు అదృష్ట సంవత్సరంగా మారింది. గాయంనుంచి కోలుకొని గత కొన్ని నెలలుగా టెన్నిస్‌లో మళ్లీ పుంజుకొని విజయాలు సాధించడం నాకు ఊరటనిచ్చింది. వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కూడా నా ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను’ అని సానియా పేర్కొన్నారు. ‘షోయబ్ సహకారం, ప్రోత్సాహం నాకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఇటీ వల ఢిల్లీలోని ఓ టెన్నిస్ అకాడమీని సందర్శించాను. అక్కడ పలువురు యువ తులు టెన్నిస్ ఆడుతూ కనిపించడం గొప్పగా అనిపించింది. యువకులకు ధీటుగా యువతులు సైతం నేడు మనదేశంలో టెన్నిస్‌లో రాణిస్తుండడం శుభ పరిణామం. చిన్నతనంలో టెన్నిస్ నేర్చుకుంటున్న ప్రారంభంలో నా తల్లిదండ్రులు సైతం టెన్నిస్ నేర్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. చివరికి పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేసుకోవాల్సిన అమ్మాయిలకు స్పోర్ట్‌స ఎందుకనే వారు నేడు చాలా మంది ఉన్నారు. కానీ కేవలం భర్త, పిల్లలు, ఇల్లే కాదు క్రీడల్లోకూడా మహిళలు రాణించాల్సిన అవసరం ఉంది’ అని సానియా పేర్కొ న్నారు. ‘నన్ను పూర్తిగా అర్థం చేసుకునే భర్త షోయబ్ నాకు దక్కడం నా అదృ ష్టంగానే భావిస్తాను.
దేశంలోని కోటీశ్వరులలో ఒకరైన విజయ్‌మాల్యా గురించి తెలియని వారుండరు. ఆయన లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమానిగా ప్రపంచ ప్రసిద్దిగాంచారు. ఐపిఎల్ ట్వంటీ ట్వంటీ క్రికెట్లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ టీం యజమాని కూడా విజయ్‌మాల్యానే. ఇక విజయ్‌మాల్యా తనయుడు సిద్దార్థ మాల్యా తండ్రి వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడు. సిద్దార్థ ఐపిఎల్‌లో తమ టీం బెంగళూర్ క్రికెట్ మ్యాచుల్లో కనిపించి సందడిచేశారు. బెంగళూర్ జట్టుకు సెలబ్రిటీ సపోర్టర్‌గా ఉన్న బాలీవుడ్ అందాలతార దీపికా పదుకునే సైతం ఐపిఎల్ మ్యాచుల్లో సిద్దార్థతో కలిసి మెరిసారు. అప్పటి నుంచి ప్రారంభమైంది వీరిద్దరి మధ్య ప్రేమాయణం. వారిద్దరు కలిసి న్యూ ఇయర్ వేడు కలను లండన్‌లో జరుపుకు నేందు కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇద్దరూ కలిసి లండన్ షాపింగ్ చేయ డం, పార్టీల్లో పాల్గొనడం, ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ వేడులను జరుపుకొని మధురానుభూతులను పొందేందుకు సిద్దమయ్యారు. ఈ మధ్యన దీపికా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె కొంత నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో సిద్దార్థతో కలిసి లండన్‌లో కొద్ది రోజులు గడిపితే కొత్త ఉత్సాహంతో మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొనవచ్చని దీపికా భావిస్తున్నారు. ఇక దీపికా తన వెంట చాలు అంతకంటే మించిన ఆనందం మరోటి లేదని సిద్దార్థ అంటున్నారు.
మన దేశంలోని పలు టివి ఛానెల్స్‌లో ఈ మధ్యన రియాల్టీ షోలు హంగామా చేస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలను దృష్టిలో పెట్టుకొని పలు ఛానెల్స్ వెరైటీగా రియాల్టీ షోలను నిర్వహిస్తున్నాయి. ఈ రియాల్టీ షోలలో అన్నిటికంటే గొప్ప సక్సెస్‌ను సాధించింది మాత్రం బిగ్ బాస్. దీని హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక బిగ్ బాస్-4లో సెలబ్రిటీ గెస్ట్‌గా హాలీవుడ్ ‘అందాల’ తార, బేవాచ్ గర్ల్ పమేలా ఆండర్సన్ సెలబ్రిటీ గెస్ట్‌గా పాల్గొని అభిమానులకు కనువిందుచేశారు. ఇందుకోసం ఈ హాలీవుడ్ నటి పమేలా ముంబయ్‌కు విచ్చేశారు. ఆమె సెలబ్రిటీ గెస్ట్‌గా బిగ్ బాస్ 4 హౌస్‌లో మూడు రోజుల పాటు గడిపారు. పమేలా బిగ్ బాస్ షో కోసం ప్రత్యేకంగా తళుకులీనే తెల్లటి చీరను ధరించారు. జుంకాలు, గాజులతో పాటు ముఖానికి బింధీ ధరించి అభిమానులను మైమరపించారు. ఈ డ్రెస్సింగ్‌లో ఆమె యానా గుప్తా ఐటమ్ సాంగ్ ‘బాబూజీ జరా ధీరే చలో’ పాట మధ్య బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. అనంతరం ఆమె రెండు చేతులు జోడించి నమస్తే అంటూ హౌస్ మేట్స్ అందరినీ పలకరించి ఆకట్టుకున్నారు. మూడవ గెస్ట్‌గా ప్రవేశించిన పమేలాను చూసి ఈ షోలో పాల్గొన్నవారు ఆనందపడ్డారు. పమేలా ఆండర్సన్‌ను అకస్మాత్తుగాచూసి ఈ షోలో పాల్గొన్న అస్మిత్ పటేల్, హృషాంత్ గోస్వామిలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కలర్స్ టివి ఛానెల్‌లో ప్రసారమైన బిగ్ బాస్-4 షో పమేలా ఎంట్రీతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
ఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు తమ జీవిత భాగస్వామితో విడిపోయి సైతం వార్తల్లోకెక్కారు. ఇటువంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ ఉడ్స్ గురించి. ఆయన వివాహేతర సంబంధాలతో వార్తల్లోకెక్కారు. పలువురు మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్న అతని విషయం చివరికి భార్యకు తెలిసింది. దీంతో అతని భార్య టైగర్ ఉడ్స్ నుంచి విడాకులు తీసుకుంది. భార్య నుంచి దూరమైన అనంతరం టైగర్ ఉడ్స్ పశ్చాత్తాపపడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇక బ్రిటన్ సెలబ్రిటీ లిజ్ హర్లీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్‌వార్న్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భారతీయ సంతతికి చెందిన బిజినెస్ టైకూన్ అరుణ్ నాయర్‌ను పెళ్లి చేసుకున్న లిజ్ కొంతకాలం క్రితం నుంచి అతనితో సఖ్యతగా ఉండడం లేదు. చివరికి షేన్‌వార్న్‌తో జతకట్టింది లిజ్. ఈ జంట లండన్‌లోని ఓ హోటల్‌లో కొన్ని రోజులు కూడా గడిపారు. ఈ విషయం మీడియా ద్వారా బయటపడడంతో లిజ్ భర్త అరుణ్ నాయర్‌తో కొద్ది రోజుల నుంచే దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. షేన్‌వార్న్‌తో తన సంబంధం గురించి మాత్రం ఏమీ చెప్పలేదు.