Sunday, December 11, 2011

వందేళ్ల రాజధాని ఢిల్లీ

 http://www.wheninindia.com/_/rsrc/1316456855159/history-of-Delhi/43.jpg
భారతదేశానికి ఢిల్లీ రాజధానిగా మారి డిసెంబర్‌ 12 నాటికి వందేళ్ళు పూర్తి కానున్నాయి. ఈ వందేళ్ళలో ఎంతో మార్పు. నాటి బ్రిటిష్‌ ఇండియాకు రాజధానిగా కోల్‌కతా ఉండింది. సరిగ్గా వందేళ్ళ క్రితం బ్రిటిష్‌ వారు ఢిల్లీని రాజధానిగా ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకూ రాజధాని నగరంలో ఎన్నెన్నో మార్పులు. పాత అందాలు అదృశ్యమై కొత్త అందాలు చేరాయి . పట్నం వాతావరణం మాయమైపోయాయి. మెట్రోపాలిటన్‌ కల్చర్‌ చేరింది. ఎంతో అభివృద్ధి ... మరెంతో విధ్వంసం ... 

http://karol-bagh.com/images1/rashtrapati-bhavan-india-picture-photo.jpg
ఒక నగరం జీవితకాలంలో వందేళ్ళు ఏమంత పెద్దది కాదు. అందులో విశేష మూ ఉండదు. ఢిల్లీ నగరం మాత్రం ఇందుకు భిన్నం. ఈ నగరం దేశరాజధాని హోదాను సంతరించుకొని వందేళ్ళు గడిచాయి. ఈ వం దేళ్ళలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకు న్నాయి. పాత ఆనవాళ్ళు చెదిరిపోయాయి. కొత్త ఆనవాళ్ళు వచ్చిపడ్డాయి. ఒక శతాబ్ది కా లంలో...ఒక్కో దశాబ్దిలో ఒక్కో రకం పోకడ. వెరసి నేటికి రాజధాని ఢిల్లీ ‘న్యూఢిల్లీ’గా మారిపోయింది. ‘‘కౌన్సిల్‌లో గవర్నర్‌ జనరల్‌తో సంప్రదిం పుల అనంతరం మంత్రులు ఇచ్చిన సలహా మేరకు భారత ప్రభుత్వం దేశ రాజధానిని కలకత్తా నుంచి ప్రాచీన రాజధాని అయిన ఢిల్లీకి మార్చాలని నిర్ణయించినట్లు తెలియజే సేందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం’’ - అని 1911 డిసెంబర్‌ 12న నాటి రాజు ఐదో జార్జ్‌ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆయన దేశం లో సంచలనం కలిగించారు. 18వ శతాబ్ది నుంచి కూడా బ్రిటిష్‌ సామ్రాజ్యానికి భారతదేశంలో ఆయువుపట్టుగా ఉన్న కలకత్తా నుంచి రాజధాని హోదా ఢిల్లీకి మారింది. ఆ ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచే ఢిల్లీకి రాజధాని హంగులు సమకూరసాగాయి. http://delhi.gov.in/wps/wcm/connect/24f200004fe87b85b02dbbd9d1b46642/red+fort.jpg?MOD=AJPERES&lmod=827272050&CACHEID=24f200004fe87b85b02dbbd9d1b46642
భారత సామ్రాజ్యాధీశుడిగా కింగ్‌ జార్జ్‌ను పట్టాభిషిక్తుడిని చేసే సమయంలో రాజధాని మార్పు ప్రకటన వెలువడింది. అప్పట్లో ఢిల్లీ జనాభా 2,33,000గా ఉండింది. చక్రవర్తి పర్యటనను పురస్కరించుకొని, ఇటీవల కామ న్వెల్త్‌ గేమ్స్‌ సందర్భంగా చేసినట్లుగానే, 300 మంది అసాంఘిక శక్తులను అరెస్టు చేశారు. ఇలా అరెస్టు అయిన వారిలో నిరుపేదలే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ ఆనవాయితీకి పట్టాభిషేక మహోత్సవం నుంచే బీజం పడింది. అది నేటికీ కొనసాగుతోంది.

ఎంతో గోప్యం
olddhelli 

కోల్‌కతా నుంచి కంటే కూడా ఢిల్లీ నుంచి దేశాన్ని పాలించడం సులభం అని బ్రిటిష్‌ వారు భావించిన నేపథ్యంలో న్యూఢిల్లీ రాజధానిగా ఏర్పడింది. తమ నగరానికి రాజధాని హోదా కావాలని ఢిల్లీవాసులు కోరుకోలేదు. అందుకు ఉద్యమించలేదు. అయినా ఢిల్లీ నగరానికి ఆ హోదా దక్కింది. చివరి క్షణం వరకూ ఈ ప్రక టనను ఎంతో గోప్యంగా ఉంచడం విశేషం. ఆ ప్రకటన చేయగానే సభలో కొద్దిసేపటి వరకు నిశ్శబ్దం తాండవించింది. సభికులకు విషయం అర్థమయ్యేందుకు కొంత సమయం పట్టింది. ఆ తరువాత కలకలం మొదలైంది. అత్యంత గోప్యంగా ఉంచిన రహస్యాల్లో ఒక టిగా ఇది చరిత్రలో నిలిచిపోయింది.

ఢిల్లీని నూతన రాజధానిగా తీర్చిదిద్దడం ఎన్నో సవాళ్ళతో కూడుకున్నదిగా ఉండింది. ఢిల్లీ పట్టణానికి అవసరమైన మౌలిక వసతు లను సమకూర్చడం కన్నా పట్టణానికి నగర రూపురేఖలు జోడించడమే అప్పట్లో బ్రిటిష్‌ వారికి ప్రధానంగా ఉండింది. నేటికీ అదే తరహాలో ఢిల్లీ అభివృద్ధి కొనసాగుతోంది. కొత్తఢిల్లీ నిర్మాణయత్నం ఢిల్లీని రాజధానిగా ప్రకటించిన వెంటనే ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలిక ఏర్పా ట్లు మొదలయ్యాయి. పాత ఢిల్లీకి చేరువలోనే కొత్త ఢిల్లీని నిర్మించే ప్రయత్నాలూ ఆరంభమయ్యాయి. అందుకోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. సబ్జి మండి, సివిల్‌ లైన్స్‌ తదితరాలను పరిశీలించి వివిధ కారణాల రీత్యా తోసిపుచ్చారు. చివరకు రైజినా గ్రామ ప్రాంతం బ్రిటిష్‌ ఉన్నతాధికారులకు నచ్చింది.
http://lh5.ggpht.com/-2XM46lxzMJU/SGTdcyCaKcE/AAAAAAAADkM/mreWX_bGH4o/INDIADelhiMyFavouriteCityInIndia.jpg
అక్కడ ఉన్న గుట్టను తొలచివేసి ప్రభుత్వ భవ నాల నిర్మాణాలను ఆరంభించారు. ఎడ్విన్‌ లాండ్‌సీర్‌ లుటెన్స్‌, తన స్నేహితుడు హెర్‌బెర్ట్‌ బాకెర్‌ అనే ఆర్కిటెక్ట్‌లు ఈ పనులు చేపట్టా రు. లుటెన్స్‌ అప్పటి వరకూ గొప్ప ట్రాక్‌ రికా ర్డు ఏమీ లేనప్పటికీ, కొంతమంది బ్రిటిష్‌ సంపన్నుల భవనాలను అందంగా నిర్మించిన కారణంగా ఆయనకు ఈ పని అప్పచెప్పారు. నాటి వైస్రాయి లార్డ్‌ లైటన్‌ ఏకైక కుమార్తెను లుటెన్స్‌ వివాహం చేసుకోవడం కూడా ఇందు కు కారణం కావచ్చు. స్థూలంగా న్యూఢిల్లీ, గవర్నమెంట్‌ హౌస్‌ (రాష్టప్రతి భవన్‌) డిజైన్‌ ను లుటెన్స్‌ పర్యవేక్షించగా, సెక్రటరి యేట్స్‌ (నార్త్‌ , సౌత్‌ బ్లాక్స్‌), కౌన్సిల్‌ (పార్ల మెంట్‌) డిజైన్‌ బాధ్యతలను బాకెర్‌ చేపట్టారు. బ్రిటిష్‌ సామ్రాజ్య దర్పాన్ని ప్రతిబింబించే విధంగా ఆనాటి భవనాలు, కట్టడాలు రూపుదిద్దు కున్నాయి. ఢిల్లీలో యూనివర్సిటీ కోసం నాటి నాయ కులు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఫలితంగా 1922లో అక్కడ యూనివర్సిటీ రూపుదిద్దుకుంది. దాని నిర్మాణానికి అరకొర నిధులనే వెచ్చించారు.

ఎన్నెన్నో సమస్యలు

 http://images.beijing2008.cn/20080314/Img214268841.jpg
పాత ఢిల్లీ నగరంలో వసతులు మెరుగుపర్చేందుకు నాటి ప్రభత్వం ఏమాత్రం శ్రద్ధ వహిం చలేదు. 1927లో కౌన్సిల్‌ హౌస్‌ (నేటి పార్ల మెంట్‌)ను ప్రారంభించారు. దాన్ని ప్రారంభిం చిన రెండేళ్ళకే భగత్‌ సింగ్‌, బి.కె.దత్‌ అందు లో చిన్న పాటి బాంబు పేల్చారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఢిల్లీలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దేశవిభజన సందర్భంగా పాకిస్తాన్‌ నుంచి పెద్ద ఎత్తున హిందువులు ఢిల్లీకి వలస వచ్చారు. వారందరికీ కొన్నేళ్ళ పాటు ఢిల్లీలోనే ఆవాసం కల్పించారు. అదే సమయంలో ఢిల్లీలో పలువురు ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్ళగా వారి ఇళ్ళను ఇతరులు ఆక్రమించారు.
మాస్టర్‌ ప్లాన్‌
http://delhi-masterplan.com/wp-content/uploads/2009/07/delhi_1483_sq_km.jpg
ఢిల్లీ ప్రణాళికారహితంగా విస్తరించడం మొదలైంది. దీనిపై నాటి ప్రధాని నెహ్రూ సై తం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణాళికాబ ద్దంగా ఢిల్లీని విస్తరించే ప్రయత్నాలకు అప్పు డే బీజం పడింది. విస్తరణను నియంత్రించేం దుకు ఒక సెంట్రల్‌ అథారిటీ ఉండాలని నెహ్రూ భావించారు. 1957లో మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ, ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటయ్యాయి. మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించే యత్నాలు మొదలయ్యాయి.

1981 వరకు ఢిల్లీ విస్తరణ అంతా ఆనాడు నెహ్రూ ఆమోదించిన మార్గదర్శకాలకు అను గుణంగానే జరిగింది. చారిత్రక కట్టడాల చుట్టూరా ఉన్న విశాల స్థలాలను ఉద్యానవనా లుగా తీర్చిదిద్దారు. పచ్చదనం పెంపొందిం చారు. నేడు ఢిల్లీ ఎన్నో పర్యాటక, చారిత్రక స్థలాలతో అలరారుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ వీసీగా ఉండిన గ్యాయర్‌ ఆ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతో కృషి చే శారు. ఎన్నో కళాశాలలను ఏర్పాటు చేశారు. మరోవంకన ఢిల్లీ విలాసజీవితానికి మారు పేరుగా కూడా మారిపోయింది. ఆరోగ్య సదుపాయాలు, ఆసుపత్రులు విస్తరించాయి. ఢిల్లీ అభివృద్ధికి మరాఠాలు, బెంగాలీలు, తమిళు లతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఎంతో కృషి చేశారు. నేడు ఢిల్లీ నగరం భిన్న ప్రాంతీయుల ఆచార వ్యవహారాలతో కళకళలాడుతుంటుంది. ఎవ రికి ఏ పండుగ వచ్చినా మిగిలిన వారూ ఆ వేడుకలో భాగస్వాములవుతుంటారు.

రవాణా

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgYP2qdJSF_Qnp_84wBOs7yWGU1zBhJkY11csq8KG65jjddW4RT032ITbjVU-fLuJbrKTTg6Z7O3apO4zr8dAx40AuwmYHnQqWgJ0VcVgpZzI6umMIyAXNiP5TWGkW-KKn8qaiG5GqXrXc/s1600/Delhi+(Metro+Rail).jpgరాజ్‌పథ్‌, జన్‌పథ్‌, అక్బర్‌ రోడ్‌ లాంటి మార్గాలు దేశమంతటా ప్రసిద్ధి చెందాయి. ఢిల్లీ అంతటా భూగర్భ సబ్‌వేలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఢిల్లీ మొత్తం మీద 2,700 బస్‌ స్టాప్‌లు ఉన్నాయి. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ ప్రపంచంలోని అతి పెద్ద రైల్వేస్టేషన్లలో ఒకటి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బాగా పేరొందింది. 2006-07లో 23 లక్షల కు పైగా ప్రయాణికులు దీన్ని ఉపయోగించు కున్నారు. 2020 నాటికి దీన్ని ఉపయోగించు కునే వారి సంఖ్య ఏటా 100 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఢిల్లీలో రవాణా సాధనాలుగా బస్సులు, ఆటోలు, రైళ్ళు బాగా వాడుకలో ఉన్నాయి. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొ రేషన్‌ యావత్‌ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పర్యావరణ స్నేహపూర్వక సీఎన్‌జీ బస్సులను కలిగి ఉంది. బస్‌ ర్యాపిడ్‌ సిస్టమ్‌ అంబేద్కర్‌ నగర్‌ నుంచి ఢిల్లీ గేట్‌ వరకు అమల్లో ఉంది. రైల్వే వ్యవస్థ 153 కి.మీ మేర రైలు మార్గాన్ని కలిగి ఉంది. 2020 నాటికి ఇది 413 కి.మీ.కు చేరుకోగలదని అంచనా. 130 స్టేషన్లు ఉన్నాయి.

కన్నాట్‌ ప్లేస్‌

ఢిల్లీలో కన్నాట్‌ ప్లేస్‌ అనేది వృత్తాకారంలో ఉన్న వాణిజ్య ప్రాంతం. దీని అవుటర్‌ రింగ్‌ నుంచి 12 మార్గాలు ఉన్నాయి. ఇందులో ఒకటి జన్‌పథ్‌.

జనాభా

 http://www.science-express.com/wp-content/uploads/2007/11/delhi.jpg
2011 నాటి జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీలో ఓ చిన్న భాగమైన న్యూఢిల్లీ జనాభా సుమా రుగా 2.50 క్షలు. హిందువులు 86.8 శాతం, ముస్లింలు 6.3 శాతం, సిక్కులు 2.4 శాతం, జైనులు 1.1 శాతం, క్రైస్తవులు 0.9 శాతం. పలు రకాల భాషలు మాట్లాడే వారు ఇక్కడ నివసిస్తున్నారు. నగరంలో ఎక్కడ చూ సినా కాస్మోపాలిటన్‌ సంస్కృతి కనిపిస్తుంది. స్వాతంత్య్రదిన, గణతంత్రదిన వేడుకలు భారీస్థాయిలో జరుగుతాయి. వాటిని చూసేం దుకు విదేశీయులు కూడా వస్తుంటారు.

ప్రగతి మైదాన్‌

 http://www.delhitourism.com/images/trade_fair_delhi.jpg
ప్రగతి మైదాన్‌లో జరిగే ఆటో ఎక్స్‌పో ఆసియాలోనే అతి పెద్దదిగా చెప్పవచ్చు. రెండేళ్ళ కోసారి ఈ ప్రదర్శన జరుగుతుంది.

సిస్టర్‌ సిటీస్‌

http://ashevillesistercities.org/joomla/images/stories/scilogo.jpg
న్యూఢిల్లీ, షికాగో (అమెరికా), లండన్‌ (బ్రిటన్‌), ఉలాన్‌ బటార్‌ (మంగోలియా), మాస్కో (రష్యా), సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ (రష్యా), జోహాన్స్‌ బర్గ్‌ (దక్షిణాఫ్రికా)లతో సిస్టర్‌ సిటీ ఒప్పందాలను కలిగి ఉంది.

గతమెంతో ఘనం

 http://www.newdelhiairport.in/images/top-banner-img.jpg
ఢిల్లీ నగరానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 12వ శతాబ్ది నుంచి 19 వ శతాబ్ది మధ్య కాలం దాకా ఎన్నో ఎంతో మంది రాజులు దాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. నిజానికి ఢిల్లీ అనేది ఒక్క నగరం కాదు. ఏడు పట్టణాలు కలసి రూపొందిన నగరం. సిరి, తుగ్లకాబాద్‌, జహా నాపనా, ఫిరోజాబాద్‌, దినపానా, షేర్‌గఢ్‌, షా హజనానాబాద్‌లు కలసి ఢిల్లీ నగరంగా రూ పాంతరం చెందాయి. వీటికి తోడుగా న్యూఢి ల్లీ కూడా ఈ జాబితాలో చేరింది. షాజహాన్‌ క్రీ.శ. 1639-1648 మధ్య కాలంలో నిర్మించినషాహజనానాబాద్‌ 1857 వరకు కూడా మొగల్‌ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండింది. ఢిల్లీ భౌగోళిక నేపథ్యం కారణంగా ఎంతో మంది రాజులు దాన్ని తమ రాజధా నిగా చేసుకున్నారు. యమునా నది ఒడ్డున ఉండడం, ఆయా సామ్రాజ్యాలకు పాలనకు అనువైన ప్రాంతంలో, వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉండడం, ఆరావళి పర్వత పంక్తి లాంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

ఒకప్పుడు 70,000 మంది అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన ఢిల్లీ నగరంలో నేడు 1.6 కోట్ల మంది నివసిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా మౌలిక వసతులు మాత్రం వృద్ధి చెందలేదు. పర్వతపంక్తిని దెబ్బ తీయడం, యమునా నదిని కలుషితం చేయడం లాంటి వి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఢిల్లీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒకప్పుడు ఒకే వర సగా ఉన్న కొండలు, గుట్టలు నేడు ఎక్కడిక్క డ ముక్కచెక్కలుగా మారాయి. పట్టణీకరణ అటు కొండలను, ఇటు యమునా నదిని దెబ్బ తీస్తోంది.

వేగంగా విస్తరిస్తున్న నగరం

 http://k53.pbase.com/v3/30/52730/2/46484484.uppadjul20.jpg
దేశరాజధానిగా వ్యవహరించే న్యూఢిల్లీ ప్రాంతం ఢిల్లీ మెట్రో పోలీస్‌ పరిధిలో ఉంటుంది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని తొమ్మిది జిల్లాల్లో అది ఒకటి. దీని విస్తీర్ణం 42.7 చ.కి. మీ. 134 దేశాలకు చెందిన విదేశీ రాయబార కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. 1911 డిసెంబర్‌ 15న న్యూఢిల్లీకి శంకుస్థాపన జరిగింది. 1931 ఫిబ్రవరి 13న బ్రిటిష్‌ ఇండియా గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని హుమాయున్‌ సమాధి, కుతుబ్‌ కాంప్లెక్స్‌ రెండూ కూడా యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్స్‌గా గుర్తింపు పొందాయి. ప్రపంచంలోనే అతివేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఒకటిగా ఢిల్లీ గుర్తింపు పొందింది. జీవిత కాలంలో కనీసం ఒకసారి సందర్శించిన నగరాల్లో ఒకటిగా ఈ నగరం ప్రఖ్యాతి చెందింది. కొత్త ఢిల్లీ అనేది ఏడు పాత పట్టణాలను కలుపుకుంటూ ఏర్పడింది. అందుకే జంతర్‌ మంతర్‌, లోధీ గార్డెన్స్‌ వంటి చారిత్రక కట్టడాలు కూడా దీని పరిధిలోకి వచ్చాయి.

చరిత్రలో సుస్థిర స్థానం

 http://www.virtualtripping.com/wp-content/uploads/2009/07/Traffic-in-delhi-450x339.jpg
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరు వాత ఢిల్లీకి పరిమిత స్వయం ప్రతిపత్తి కల్పించారు. కేంద్రప్రభుత్వం ఓ చీఫ్‌ కమిషనర్‌ను నియమించింది. 1956లో ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతం గా మార్చారు. ఫలితంగా చీఫ్‌ కమిష నర్‌ స్థానంలోనే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నియమితులయ్యారు. ఒకప్పుడు సఫ్దరజంగ్‌ విమానాశ్రయం నగరానికి ఒక మూలన ఉండింది. అది ఇప్పుడు నగరం నడిబొడ్డుకు చేరింది. ప్రస్తుతం దీన్ని కమర్షియల్‌ విమానాలకు ఉపయోగించడం లేదు. 1962 నుంచి పాలం విమానాశ్రయం వాడుక లోకి వచ్చింది. 1982లో జరిగిన ఆసియన్‌ గేమ్స్‌, 2010లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ క్రీడారంగ చరిత్రలో ఢిల్లీ నగరానికి సుస్థిర స్థానాన్ని కల్పించాయి.

ఫ్యాషన్లకు నిలయం
1930 ప్రాంతం నుంచే ఢిల్లీలో మహిళల జీవనశైలిలో పెనుమార్పులు వ్యక్తమవుతూ వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ బాక్సా ఫీస్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ఈ మార్పులకు కారణమనవచ్చు. విదేశీయుల తాకిడి అధి కంగా ఉండడం, మెట్రోపాలిటన్‌ సంస్కృతి ఇవన్నీ ఢిల్లీని ఫ్యాషన్‌ కేంద్రంగా మార్చా యి. వివిధ రకాల ఫ్యాషన్‌ మ్యాగజైన్లు లాంటివి కూడా ఇందుకు కారణమయ్యా యి. స్వాతంత్య్రం రాకముందు వరకు కూడా బ్రిటన్‌ లైఫ్‌స్టయిల్‌ ఢిల్లీ నగరంపై తన ప్రభావాన్ని విపరీతంగా కనబర్చింది.

ఇదీ నేటి పరిస్థితి
ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిల్చిన ఢిల్లీ నగరం నేడు అశాంతికి నిల యంగా మారిపోయింది. ఉగ్రవాదం పడగ నీడన ఢిల్లీవాసులు కాలం గడుపుతున్నారు. ఏ క్షణంలో ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సామాజిక అశాంతి పెచ్చుమీరిపోయింది. భూఆక్ర మణలు పెరిగిపోయాయి. అడ్డూ అదుపు లేకుండా నగరం విస్తరిస్తుండడంతో చుట్టు పక్కల పల్లెల్లోని వారు ఏ క్షణంలో తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుం టుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఢిల్లీలోని ముఖ్య స్థలాలు.....

http://www.bobzworldcity.com/wp-content/uploads/2011/05/Parliament-House-in-New-Delhi.jpg 
http://www.liveindia.com/delhi/rashtrapatibhawan-main.jpg
http://delhitourism.blog.com/files/2011/03/akshardham00f.jpg 
http://www.delhimalayalee.com/images/39_new_delhi.jpg 
రాష్టప్రతి భవన్‌, పార్లమెంట్‌ భవనం, ఇండియా గేట్‌, జామా మసీదు, ఎర్రకోట, కుతుబ్‌ మినార్‌, హుమాయున్‌ సమాధి, జంతర్‌ మంతర్‌, పురానా ఖిల్లా, లక్ష్మీనారాయణ టెంపుల్‌, అక్షరధామం, బహాయి లోటస్‌ టెంపుల్‌, ఇస్కాన్‌ టెంపుల్‌, రాజ్‌ఘాట్‌, సెక్ర టరియేట్‌, రాజ్‌పథ్‌, విజయ్‌ చౌక్‌, సఫ్దర్‌ జంగ్‌ సమాధి, మొగల్‌ గార్డెన్స్‌ లాంటి చారి త్రక, పర్యటక స్థలాలను ఢిల్లీలో చూడవచ్చు.

- వి.