Thursday, June 28, 2012

నేతాజీ ఆఖరి ఘడియలు!

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనకున్న మిస్టరీ ఏమిటి? ఈ ప్రశ్న గత 65 ఏళ్లుగా చాలా మందిని వేధిస్తోంది. నేతాజీ మరణం కేవలం ప్రమాదమేనని ఇప్పటి దాకా అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు చెబుతున్నాయి. అయినా నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదనేది కొందరి నమ్మకం. ఈ నేపథ్యంలో బోస్ మరణానికి సంబంధించి- ఇటీవల అమెరికా, రష్యా, సింగపూర్ గూఢచారి సంస్థలు విడుదల చేసిన కొన్ని రహస్య పత్రాల ఆధారంగా అనుజ్ థార్ రాసిన పుస్తకమే ' ఇండియాస్ బిగ్గెస్ట్ కవరప్ '. ఆద్యంతం ఆసక్తి కలిగించే ఈ పుస్తకంలో నుంచి కొన్ని ముఖ్యమైన భాగాలు..

ఆగస్టు 17, 1946
"సియాగాం ఎయిర్‌పోర్టులో మిత్సుబిషి కేఐ-21 బాంబర్ సిద్ధంగా ఉంది. దీనిని అందరూ ముద్దుగా 'సెలీ' అని కూడా పిలుచుకుంటారు. సాయంత్రం 4.30కి బోస్, ఆయన సహచరులు ఎయిర్‌పోర్టుకు వచ్చేసరికి ఈ బాంబర్ బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. బోస్ విమానం దగ్గరకు వచ్చిన వెంటనే ఆయనకు జపాన్ సైన్యానికి చెందిన ఒక జనరల్ సెల్యూట్ చేసి స్వాగతం పలికాడు. బోస్ తన ట్రేడ్‌మార్క్ ఐఎన్ఏ టోపి, కాకీ బుష్ షర్ట్, ప్యాంట్ వేసుకొని హుందాగా ఆ వందనాన్ని స్వీకరించారు. విమానాశ్రయానికి తనతో పాటు వచ్చిన సహచరులకు వీడ్కోలు చెప్పి విమానం ఎక్కారు. ఆయన వెనకే రహమాన్ (బోస్ బాడీగార్డ్) కూడా విమానం ఎక్కాడు.

బోస్, రహమాన్‌లు ఎక్కింది ట్రాన్స్‌పోర్టు విమానం కావటంతో కూర్చోవటానికి సరైన సౌకర్యాలు లేవు. సీట్లు చాలా చిన్నవిగా ఉన్నాయి. విమానంలో సగభాగం సైనికుల సామాన్లతోనే నిండిపోయింది. పైలెట్ వెనకున్న సీటులో బోస్ కూర్చున్నారు. ఆయన వెనక సీటులో రహమాన్ కూర్చున్నాడు. వీరిద్దరితో పాటు ప్రయాణిస్తున్న జపాన్ సైనికాధికారులు మిగిలిన సీట్లలో సర్దుకొని కూర్చున్నారు. విమానం రాత్రి ఏడు గంటలకు వియత్నాంలోని డా నాంగ్ సైనిక విమానాశ్రయంలో దిగింది.

బోస్, రహమాన్, జపాన్ సైనికాధికారులు ఆ రాత్రి ఒక హోటల్‌లో బస చేశారు. 18 ఉదయాన్నే వీరందరూ టోక్యోకు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు విమానం తైవాన్ రాజధాని తైపీలో దిగింది. (విమానం 14 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించటం వల్ల చాలా చలిగా ఉంది.) బోస్ విమానం దిగి దూరంగా ఉన్న భవంతులను చూస్తున్నారు. ఆయన ఏదో ఆలోచనలో ఉన్నారు. రెండో ప్రపంచయుద్ధంలో ఆ విమానాశ్రయం కూడా పూర్తిగా దెబ్బతింది. విమానాశ్రయంలో పనిచేసే సిబ్బంది సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. రన్‌వేకు దూరంగా వేసిన ఒక టెంట్‌లో అందరూ లంచ్ తిన్నారు.

సమయం మధ్యాహ్నం 2.30 గంటలు
మళ్లీ అందరూ విమానం ఎక్కారు. విమానం బయలుదేరింది. మూడు నిమిషాలు గడిచిందో లేదో.. తైపీ విమానాశ్రయంలో మెయింటెనెన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కెప్టెన్ నాకామూరకు ఒక పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే అతను కిటికీ దగ్గరకు పరిగెత్తుకొని వెళ్లి రన్‌వే వైపు చూశాడు. అతని కళ్లెదుటగా ఆకాశం నుంచి విమానం ప్రొపెల్లర్, ఇంజన్ కింద పడ్డాయి. విమానం అటూ ఇటూ ఊగిపోవటం మొదలుపెట్టింది. దట్టమైన పొగ వ్యాపించింది. విమానాన్ని అదుపుచేయటంలో పైలెట్లు విఫలమయ్యారు. సెకనుకు 300 అడుగుల చొప్పున విమానం కిందకు పడిపోవటం మొదలుపెట్టింది.

మూడు వందల కిలోమీటర్ల వేగంతో రన్‌వేను తాకింది. వెంటనే పెద్ద శబ్దం వచ్చింది. విమానంలో ఉన్న పెట్రోలు ట్యాంకు బద్దలయి ప్రయాణీకుల మీద పడింది. విమానం రన్‌వే మీద వేగంగా ప్రయాణించటం మొదలుపెట్టింది. ఒక పెద్ద రాళ్ల గుట్టను తాకి ఆగింది. విమానం కెప్టెన్ తలకు జాయిస్టిక్ (విమానాన్ని నడపటానికి ఉపయోగించే స్టీరింగ్) గుచ్చుకొని అతను మరణించాడు. జపాన్ సైనికాధికారులందరూ తీవ్రంగా గాయపడ్డారు. విమానం ముందుభాగంలో మంటలు వ్యాపించాయి. బోస్, రహమాన్‌ల వెనక సామాన్లు ఉన్నాయి. అవన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి.

వాటిని తప్పించుకొని బయటపడటానికి బోస్, రహమాన్‌లు ప్రయత్నించారు. బోస్‌ను చూసి రహమాన్ -'ఆగేసే నేతాజీ'! (ముందువైపు నుంచి నేతాజీ!) అని గట్టిగా అరిచాడు. బోస్ ముందు భాగం వైపు వచ్చారు. కాని అప్పటికే మంటలు అన్నివైపులా వ్యాపించాయి. బోస్ ఆ మంటలలోనుంచి కిందకు దూకారు. బోస్ బట్టలకు మంటలంటుకున్నాయి. బోస్ వెనకే రహమాన్ కూడా బయటకు దూకి పరిగెత్తుకుంటూ బోస్ దగ్గరకు వెళ్లాడు. అప్పటికే బోస్ శరీర పైభాగం బాగా కాలిపోయింది. తల మీద నాలుగు అంగుళాల గాయం కూడా తగిలింది. రహమాన్‌కు కూడా తీవ్రంగా గాయాలు తగిలాయి. ఇద్దరూ సొమ్మసిల్లి ఒకరి పక్కన మరొకరు పడిపోయారు.

రహమాన్‌కు కొద్దిగా స్పృహ వచ్చింది. కళ్లు విప్పి చూసేసరికి దూరంగా విమానం కాలిపోతోంది. విమాన శకలాల మధ్యలో ఎవరో కూర్చుని ఏడుస్తున్నారు. "ఆప్ కో జాదాతో నహీ లగ్‌గయా..?'' అన్న నేతాజీ మాటలు విని రహమాన్ తల తిప్పి చూశాడు. "మీకు ఎలా ఉంది?'' అని నేతాజీని రహమాన్ ఆతృతగా అడిగాడు. "బతుకుతానన్న నమ్మకం నాకు లేదు..'' అన్నారు నేతాజీ. అప్పటికే ఆయన తల నుంచి రక్తం కారుతోంది. "మీకు ఏం కాదు. మీరు బతుకుతారు..'' అని రహమాన్ గట్టిగా అరవటం మొదలుపెట్టాడు.

నేతాజీ ఆ మాటల్ని నమ్మలేదు. "మీరు మన దేశానికి వెళ్లినప్పుడు- నా చివర శ్వాస వరకూ దేశ స్వాతంత్య్రం కోసమే పోరాడానని ప్రజలకు చెప్పండి. వారిని పోరాటం కొనసాగించమని చెప్పండి. మనకు అతి త్వరలోనే స్వాతంత్య్రం వస్తుందనే నమ్మకం నాకుంది. మనను ఎక్కువ కాలం ఎవరూ అణిచిపెట్టి ఉంచలేరు..''అని రహమాన్‌తో నేతాజీ చెప్పారు. ఇంతలో నేతాజీని, ఇతర క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లటానికి సైనికాధికారులు ఒక లారీని తీసుకువచ్చారు. దగ్గరలో ఉన్న మిలటరీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

వెంటనే డాక్టర్లు నేతాజీకి ఆపరేషన్ థియేటర్‌లో చికిత్స చేయటం ప్రారంభించారు. ఆ సమయంలో బోస్ శరీర ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెంటిగ్రేడ్‌గా నమోదైంది. పల్స్ నిమిషానికి 120 సార్లు కొట్టుకుంటోంది. డాక్టర్లు బోస్ శరీరానికి జింక్ ఆయింట్‌మెంట్‌ను పూసి కట్లు కట్టారు. పల్స్ రేటును నియంత్రించటం కోసం రక్తాన్ని ఎక్కించటం మొదలుపెట్టారు. బోస్ రెండు సార్లు నీళ్లు అడిగి తాగారు. వార్డుకు తీసుకువచ్చిన గంట తర్వాత పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయారు. రాత్రి తొమ్మిది గంటలకు రహమాన్, కొందరు డాక్టర్లు సమక్షంలో బోస్ మరణించారు...


గాంధీజీకి ఏం తెలుసు?
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బోస్ మరణం మిస్టరీని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. బోస్‌తో పాటు విమానంలో ఉన్న రహమాన్ పాకిస్తాన్‌కు వలస వెళ్లిపోయాడు. దీంతో ఈ కేసు ఎవరిని దృష్టినీ ఆకర్షించలేదు. అయితే బోస్ మరణం గురించి, ఆయన ఎక్కడ ఉన్నాడనే విషయం గురించి గాంధీజీకి తెలుసుననే వాదన ఒకటి ప్రచారంలో ఉండేది. దీనికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో- ఒక రోజు- కాందిశీకులపై జరుగుతున్న దాడులను ఆపటంలో ప్రభుత్వం విఫలమవుతోందని నెహ్రూ, పటేల్‌లపై గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

"నా ఇంకో బిడ్డ ఇక్కడుంటే బావుండేది..'' అని గాంధీజీ ఆవేశంతో అన్నప్పుడు- ఆ సమావేశంలో పాల్గొన్న మరో నేత- "నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారు'' అని గుర్తు చేశారు. వెంటనే గాంధీజీ ఆయన వైపు తిరిగి "నీకెవరు చెప్పారు. అతను రష్యాలో ఉన్నాడు'' అని సమాధానమిచ్చారు. ఈ ఒక్క చోటే కాదు చాలా సార్లు నేతాజీ బతికే ఉన్నాడని గాంధీ చెబుతూ ఉండేవారు.
  - ఇండియాస్ బిగ్గెస్ట్ కవరప్
రచయిత: అనుజ్ థార్, పబ్లిషర్: మానస్ పబ్లికేషన్స్
ధర: రూ. 600, పేజీలు: 587

Friday, May 4, 2012

పొలిటికల్ ఫైర్ బ్రాండ్స్ ...

కొన్ని దశాబ్దాల క్రితం రాజకీయంలో మహిళలు  రాణించలేరు అనే ఒక అపోహ చాలా మందిలో ఉండేది. మామూలుగా రాణించలేరేమో కానీ ఓ రేంజ్‌లో రాణించగలరని నిరూపించారు మాజీ దేశ ప్రధాని ఇందిరా గాంధీ. అధికారాన్ని ఏ అభివృద్ధికోసం వినియోగించాలో ఆమెకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అని చాలా మంది అభిప్రాయం. ఇందిరా గాంధీ ఏది చేసినా సంచలనమే. ఆమె ప్రతీ నిర్ణయం ఓ రహస్యమే. ఇలా సాగిన ఆమె పాలనా సిద్ధాంతాన్ని కొన్ని మార్పులు చేసి నేడు జయలలితా, మాయావతి, మమతా బేనర్జీ రాజకీయంలో అదరగొడుతున్నారు. మొండితనం వారి బలం. ఆయుధం వారనుకున్నది వారు సాధిస్తారు ఆదే వారి విజయ రహస్యం. వారలా ఎందుకు చేయాల్సి వస్తోంది అని ప్రశ్నిస్తే రాజకీయ మనుగడకు ఇలాంటి జిత్తుల మారి ఎత్తులు అవసరమే అని జవాబు వస్తుంది. వివాదాలు.. విజయాలు కామన్‌. దూసుకుపోవడమే న్యాయం అనేది వాని తత్వం.

మాయావతి
ప్రొఫైల్‌

పూర్తి పేరు : మాయావతి
పుట్టిన తేది : జనవరి 15
జన్మస్థలం  : ఢిల్లీ
విద్యాభ్యాసం: ఎల్‌.ఎల్‌.బి, బిఈడి
వృత్తి  : రాజకీయ నాయకురాలు
పార్టీ  : బహుజన్‌ సమాజ్‌ పార్టీ

Uns 

మాయావతి అనగానే చాలా మందికి తెల్ల ఏనుగులు గుర్తుకు వస్తాయి. ఆమె వేల కోట్లు ఖర్చుపెట్టి ఉత్తర్‌ ప్రదేశ్‌లో కళాత్మక దృష్టితో నిర్మిస్తున్న ఏనుగుల బొమ్మలు. ఈ బొమ్మలు ఆమె పార్టీ గుర్తు.ఉత్తర్‌ ప్రదేశ్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల విగ్రహాలతో పాటు తన పాలరాతి బొమ్మను కూడా సెంట్రల్‌ పార్క్‌లో నిర్మించి ఉత్తర్‌ ప్రదేశ్‌కు ఇది సరికొత్త పర్యాటక స్థలం అని ప్రకటించారు. మాయావతికి ఈ విగ్రహాలపై ఇంత అభిమానం ఎందుకో తెలీయదు కానీ శిల్పకారులకు మాత్రం స్వర్ణయుగంగా అవతరించింది ( ఒకటా రెండా ఏకంగా రూ.2500 కోట్లు ప్రాజెక్టు మరి). ఆమె పుట్టిన రోజు సందడిని టీవి ఛానల్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ప్రతీ పుట్టిన రోజు ఏదో విధంగా వైవిధ్యశైలిలో జరగడమే దీనికి కారణం.కొన్నేళ్ళ క్రితం అభిమానులు కరెన్సీ నోట్లతో చేసి దండ ఆమె మెడలో వాలినప్పుడు ఆశ్చర్య పోవడం ప్రేక్షకుల వంతైంది.ఇంత వైవిధ్యాన్ని భరించలేని ప్రజలు వేరే పార్టీకీ ముఖ్యమంత్రి ఛాన్స్‌ను అందించారు.

జయలలిత

 
ప్రొఫైల్‌

పూర్తి పేరు  : జయలలిత 
పుట్టిన తేది  :  ఫిబ్రవరి 24
జస్మస్థలం   : మైసూర్‌
వృత్తి    : రాజకీయనాయకురాలు
పార్టీ    : ఆమె ఆల్‌ ఇండియా  
            ఆన్నా ద్రవిడ మున్నెట్ట 
            కజగం (ఏఐఏడిఎమ్‌కే)
ప్రస్తుత హోదా: తమిళనాడు ముఖ్యమంత్రి

Unt6 

ఇక దక్షిణాదికి వస్తే తమిళనాడు ఆమ్మగా పిలవబడే జయలలిత రూటే వేరు. ఆమె పథకాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో..అమె నిర్ణయాలు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయని సన్నిహితుల అభిప్రాయం. రాజకీయంలో పురుషులతో సమానంగా రాణించాలంటే పురుషుల కన్నా ఎక్కువగా పనిచేయాలి అనేది ఆమె నమ్మే సిద్ధాంతం. ప్రాంతీయా భిమానం విపరీతంగా ఉన్న జయలలితా పాలన విషయంలో ప్రజల అభిప్రాయానికి అత్యంతవిలువ నిస్తుంది. టీవిలు, సెల్‌ఫోన్లు వంటివి ప్రజల జీవన ప్రమాణాన్ని సౌఖ్యానికే అని తెలిపారామె. జయలలిత ఒక్క చూపుకోసం అభిమానులు, కార్యకర్తలు ఎన్నిగంటలైనా వేచి చూస్తారంటే ఆమె ఏ విధంగా తన మార్కును సృష్టించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. మంచి నటిగా గుర్తింపు సాధించాకా అమె రాజకీయంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి నేటికీ విజయవంతంగా కొనసాగుతున్నారు. ఆమె అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరగడం విశేషం.2011 సాధారణ ఎన్నికల్లో కరుణానిధిని కాదని జయలలితను మూడవసారి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు ప్రజలు. 2011 మే 16న ఆమె తన ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకు క్రితం ఆమె 2002-2006, 2001 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు.

మమతా బెనర్జి
ప్రొఫైల్‌

పూర్తి పేరు  : మమతా బెనర్జి
పుట్టిన తేది  : జనవరి 5
జస్మస్థలం          : కలకత్తా
వృత్తి   : రాజకీయ వేత్త
పార్టీ   : త్రినమూల్‌ కాంగ్రెస్‌
ప్రస్తుత హోదా  : పశ్చిమబెంగాల్‌ 
    ముఖ్యమంత్రి

Us 

బెంగాలీ ‘దీది’మమతా బేనర్జీలోని పాజిటీవ్‌ కోణాన్ని గతేడాది చూసి చాలా మంది మురిసి పోయి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనుకున్నారు. కానీ 2012లో మమతాలో వచ్చిన మార్పుకు యావత్‌ భారతం ఆశ్చర్యపోయింది. రైల్వే బడ్జెట్‌ తరువాత మమతాలో ప్రారంభమైన నిరంకుశ ధోరణి ఆమె అభిమానులను సైతం నిరాశ పరిచింది. గతేడాది విదేశీ సంస్థాగత పెట్టుబడి విషయంలో ప్రారంభమైన ఆమె మొండి వైఖరి, రైల్వే ఛార్జీలలో స్వల్ప మార్పు చేసిన ముకుల్‌ రాయ్‌ను రాజీనామా చేయించినా అక్కడితో ఆగలేదు. మమతా నిర్వాకాన్ని గమనిస్తున్ను మీడియా ఆమెపై దుమ్మెత్తి పోయడం ప్రారంభించింది. అందులో భాగంగా ఒక వార్తా పత్రిక కార్టూనిస్ట్‌ ఆమెకు వ్యతిరేకంగా కార్టూన్‌ వేశాడు.ఇది ఆమెకు కోపాన్ని కలిగించింది . సదరు కార్టూనిస్ట్‌ను అరెస్ట్‌ చేయించడమే కాకుండా మీడియాకు మార్గదర్శకాను జారీ చేసింది. పబ్లిక్‌ లైబ్రెరీలో కొన్ని పత్రికలను నిషేదించింది, ఏ పత్రికలు చదవాలో కూడా ఆమెనే నిర్ణయించి. .ఏ టీవి ఛానల్‌ను చూడాలో కూడా తెలిపింది. ఇలా ఆమెలోని నెగెటీవ్‌నెస్‌ ప్రజాస్వామ్యానికే ప్రమాదంగా దాపురించిందని విజ్ఞులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమతా ఇలా ఎందుకు మారిందో ఆమెకే తెలియాలి.

Friday, March 30, 2012

కుచిపూడి అరుణ కిరణం

 కూచిపూడి నృత్యకళాకారిణి అరుణిమా కుమార్‌ గురించి కళాభిమానులకు ప్రత్యేక పరిచయం అవస రంలేదు. కూచిపూడి నృత్యానికి అరుణిమ చేస్తున్న సేవ అమెకు అంతర్జాతీయంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. తోమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆమ్రపాలి పాత్రలో బ్యాలెట్‌ ప్రదర్శన నిచ్చి కళాప్రియులను అలరించింది. ఈ ప్రదర్శన తరువాతే పూర్తి స్థాయిలో కూచిపూడి నృత్యాన్ని అభ్యసించడానికి ఉద్దండుల వద్ద చేరారామే. 1995లో జిఆర్కే మెమోరియల్‌ ట్రస్ట్‌ వారి కూచిపూడి డ్యాన్స్‌ అకాడమీ ఆమె అరంగేట్రం కోసం ఢిల్లీలోని త్రివేణి కళా సంఘంలో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

















బాల్యం నుంచే నాట్యాసక్తి 
పద్మభూషణ్‌ అవార్డు గ్రీహత స్వప్నసుందరి నుంచి ఏడవ ఏటనే కూచిపూడి నృత్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించిన అరుణి తరువాత పద్మశ్రీ అవార్డు గ్రహీత జయరామారావు, వన శ్రీ రావు వద్ద శిక్షణను కొనసాగించారు. దాదాపు 15 సంవత్సరా లుగా ఆమె 15 దేశాలలో అనేక నాట్యోత్సవాలు, సాహిత్య, కళా ఉత్సవాలలో ప్రదర్శనలిచ్చారు. కళాభిమానులు ఆమె నాట్య భంగిమలతో పాటు అభినయాన్ని చూడటానికి ఆసక్తిని చూపిస్తారు. బృంద ప్రదర్శనలిచ్చినా, సోలో పర్ఫార్మెన్స్‌లు ఇచ్చినా శాస్త్రీయ నృత్యప్రేమికులను అలరించడం ఆమె ప్రత్యేకత. రంగస్థలంపై ఆమె నృత్యప్రదర్శన కోసం అభిమానులు వేయికన్నులతో వేచి చూస్తుంటారు.
K-(7)

అరుణిమా ఆశయం
కూచిపూడి నృత్యాన్ని అంతర్జాతీయంగా ప్రసిద్ధం చేయాలని సంకల్పించిన కళాకారులలో అరుణిమా ఒకరు. దేశంలోనే అత్యుత్తమ కూచిపూడి నృత్యకారిణులలో ఆమె ఒకరు. ఆమె కళా ప్రజ్ఞను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను సంగీత నాటక్‌ అకాడమీ వారి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కారంతో గౌరవించింది. నృత్యం, సంగీతం, నాటకాలలో కృషి చేసిన వారికి ఈ బహుమతిని అందజేస్తారు.

టివి, రేడియో కార్యక్రమాలలో
అరుణిమకు శాస్ర్తీయ నృత్యంతో పాటు నటన అంటే కూడా ప్రత్యేకాభిమానం. స్టార్‌న్యూస్‌లో యోగ్‌ యాత్ర అనే టివి కార్యక్రమానికి ఆమెను ప్రేక్షకులు అభినందించారు. ఢిల్లీలో ఆమె అనేక సంగీతాధారిత వీడియోలను, వాణిజ్య ప్రకటనలు, చిరుచిత్రాలలో నటించారు. గ్లోబస్‌లో జరిగిన మైక్రోసాఫ్ట్‌ అంతార్జాతీయ చిత్రోత్సవాలలో ప్రత్యేక ప్రదర్శననిచ్చారు. ఇటీవలే వచ్చిన ప్రకాశ్‌ ఝా చిత్రం రాజ్‌నీతిలో అతిథి పాత్రలో కనిపించి అలరించారు.

ప్రొఫైల్‌
K-(3)

పూర్తి పేరు : అరుణిమా కుమార్‌
పుట్టిన తేది: 1978 జూలై 1
జన్మస్థలం : ఢిల్లీ
వృత్తి  : కూచిపూడి కళాకారిణి
అవార్డులు : సంగీత నాటక్‌ అకాఅవార్డు వంటి 
          అవార్డులు అనేకం..

భారతదేశంలో ఉత్తమ ప్రదర్శనలలో కొన్ని
  • Kddf 
  • ఆమ్రపాలి బ్యాలెట్‌ -1987 ( తొలి ప్రదర్శన)
  • హైదరాబాద్‌ కళాఉత్సవం
  • ఇండియా హాబిట్‌ సెంటర్‌-1998, 1999,2003.
  • ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ 1999, 2002,2003,2006.
  • భారత్‌యాత్రా ఫెస్టివల్‌, కూచిపూడి గ్రామం
  • శృంగారమణి ఉత్సవం-2001‚
  • ఖుతాబ్‌ ఉత్సవం
  • విరాసత్‌ ఉత్సవం, డెహ్రాడూన్‌ 2005
  • గోవా అంతర్జాతీయ కేంద్రం -2006
  • హైదరాబాద్‌ బయోటెక్‌ కాన్ఫరెన్స్‌-2006
  • నెహ్రూ సెంటర్‌, ముంబై 2006
  • ఉగాది ( ఏపి భవన్‌) ఉత్సవాలు-2006
  • బ్రహ్మ గాన సభ, చెనై్న -2008
  • ఉస్తాద్‌ అల్లా ఉద్దిన్‌ ఖాన్‌ సమారోహ్‌, గ్వాలియర్‌-2008
  • ఖజురహో నృత్యోత్సవం 2010

    లండన్‌ ప్రదర్శనలలో ఉత్తమం
  • K-(2)f 
  • రాయల్‌ ఒపేరా హౌజ్‌, లండన్‌-2009
  • సాల్ఫర్డ్‌లోని లోవ్రిలో డ్యాన్స్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా-2009
  • ఇండియా సెంటర్‌, కార్డిఫ్‌-2009
  • ఎక్పో 1998, లిస్బన్‌, పోర్చుగల్‌
  • ఎక్పో 2000 హాన్నవర్‌, జర్మని
  • ఐసిసిఆర్‌ టూర్‌, ఆస్ట్రేలియా 2003
  • ఇండోనేషియా అంతర్జాతీయ నాట్యోత్సవం-2004
  • ఫిలిప్పెన్స్‌ ఎసియన్‌ ఆర్ట్‌‌స ఫెస్టివల్‌-2007
  • టాగోర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ బెర్లిన్‌-2005
  • ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన భారతదేశ వారోత్సవాలు 2005
  • ఇంటర్నేషనల్‌ కూచిపూడి డ్యాన్స్‌ కన్వెన్షన్‌, కాలిఫోర్నియా 2008

    అవార్డులు, గౌరవాలు
  • K-(5)f 
  • ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కారం (సంగీత నాటక్‌ అకాడమీ)-2009
  • సాహిత్య కళా పరిషత్‌ స్కాలర్‌షిప్‌ -1998
  • సుర్‌ శృంగార్‌ సంస్థనుంచి శృంగారమణి టైటిల్‌-2004
  • 2006లో రాష్టప్రతి భవన్‌లో రాష్టప్రతి ఎదుట ప్రదర్శన
  • అల్‌ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో ఏ గ్రేడ్‌ పొందిన కళాకారిణి
  • గిన్నిస్‌ బుక్‌ రికార్డును సాధించడానికి కాలిఫోర్నియాలో 400 మంది కళాకారులతో కలిసి కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు.
  • దూరదర్శన్‌, సోని, ఆజ్‌తక్‌, స్టార్‌న్యూస్‌, హిందుస్తాన్‌ టైమ్స్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, బిజినెస్‌ స్టాండర్డ్‌ వంటి ఛానల్స్‌, పత్రికలు ఉత్తమ మహిళల లిస్ట్‌లో స్థానం సంపాదించారు.
  • లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ప్రత్యేక గౌరవం
  • గతీ అనే నృత్య కళాకారుల ఫారమ్‌కు స్పాన్సర్‌ కూడా.
    ప్రముఖ ప్రదర్శనలు
  • మలేషియాలోని ఇండియన్‌ కల్చర్‌ సెంటర్‌లో..
  • కెఎల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, కౌలలంపూర్‌, మలేషియాలో-2010
  • అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ఎన్నో నృత్యప్రదర్శనలనిచ్చారు.

Thursday, February 9, 2012

కలలకు వ్యవధి ఏదీ...



మనకున్న ఫైర్‌బ్రాండ్ నేతల్లో మమతా బెనర్జీ ఒకరు. క్రీడా మంత్రిగా పనిచేసినా, రైల్వే మంత్రిగా ఉన్నా, ప్రస్తుతం బెంగాల్ ముఖ్యమంత్రి అయినా - మమత ఎప్పుడూ సంచలనమే. కమ్యూనిస్టులకు పెట్టని కోటలాంటి బెంగాల్‌లో పాగా వేసిన ఆమె వ్యక్తిగత జీవితం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. మమత రాజకీయ ప్రస్థానం గురించి మోనిబినా గుప్తా రాసిన పుస్తకం 'దీది'. ఈ పుస్తకంలోని ఆసక్తికరమైన విశేషాలే ఈవారం ఓపెన్‌డయాస్...

(జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలలోను, సుఖఃదుఖాలలోను మమతకు తోడుగా నిలిచింది ఆమె కుటుంబ సభ్యులే. తన జ్ఞాపకాలలో కూడా మమత ఈ విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొంది)
మమతకు వాళ్ల అమ్మకు మధ్య సాన్నిహిత్యం చాలా ఎక్కువ. "మమత వాళ్ల అమ్మగారికి ఎనభై ఏళ్లు. ఆమె అంటే మమతకు చాలా అనురాగం..ఆమెకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది'' అంటారు కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ. "ఈ రోజుకు కూడా ఎక్కడికైనా వెళ్లే ముందు, అమ్మ దగ్గరకు వెళ్లి పదిరూపాయలు అడిగి తీసుకుంటుంది'' అని ఆయన వెల్లడించారు. మమతకు కాళీఘాట్‌లో ఒక ఇల్లు ఉంది.

ఆమె అన్నలు, వదినలు, మేనకోడళ్లు, మేనళ్లులు- అందరూ అదే ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో నివసిస్తారు. "నా మొత్తం సమయమంతా రాజకీయాలకే సరిపోతుంది. నేను కోల్‌కత్తాలో ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్లకు విశ్రాంతి లభించదు. చాలామంది అర్థరాత్రి.. అపరాత్రి అని లేకుండా ఏదో ఒక పని మీద కలవటానికి వస్తూ ఉంటారు. వీరందరి వల్ల మా అమ్మకు నిద్రపోవటానికి కూడా ఉండదు. కానీ మా ఇంట్లో వాళ్లు ఎప్పుడూ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. వారికి రాజకీయాలంటే ఎలా ఉంటాయో తెలుసు'' అని మమత ఒక చోట పేర్కొన్నారు.

మమత మొదట్నించి తన తోటి వారి కన్నా భిన్నంగా ఉండేది. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మిగిలిన వారందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మమత మాత్రం దూరంగా ఒక మూల కూర్చునేది. పదో క్లాసులో స్నేహితులందరూ ఇంటర్‌లో జాయిన్ కావాల్సిన కాలేజీ గురించి, మేకప్ గురించి బాతాఖాని వేసుకుంటుంటే మమత మాత్రం తనకున్న సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండేది. "మా అమ్మకు ఒంట్లో బావుండేది కాదు.

అందువల్ల ఉదయాన మూడున్నరకే లేవాల్సి వచ్చేది. మొత్తం వంట చేసి చెల్లెళ్లను, అన్నయ్యలను నిద్రలేపేదాన్ని. వారందరూ తయారయిన తర్వాత నేను కూడా తయారయ్యేదాన్ని. అతికష్టం మీద టైంకు స్కూలుకు వెళ్లగలిగేదాన్ని. స్కూలు అయిన వెంటనే రాత్రి వంట చేయటానికి వెంటనే ఇంటికి వచ్చేసేదాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో నాకు భవిష్యత్తు గురించి కలలు కనటానికి సమయం ఎక్కడ దొరుకుతుంది'' అని ఒక చోట మమత తన చిన్ననాటి రోజుల గురించి వర్ణించారు.

(మమతకు ప్రేమ పట్ల నమ్మకం లేదా? చిన్నప్పుడు ఎప్పుడూ ప్రేమలో పడలేదా? లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి కూడా ఈ పుస్తకం ప్రయత్నించింది..)
స్కూలులోను, కాలేజీలోను చదివే రోజుల్లో మమత స్నేహితులు తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్తూ ఉండేవారు. కొందరు ప్రేమవ్యవహారాలు నడుపుతూ ఉండేవారు. మరి మమత మాటేమిటి? ప్రేమకు కేటాయించటానికి ఆమె దగ్గర సమయం లేదా? లేక అలాంటి భావనలను అణగదొక్కేసిందా? లాంటి ప్రశ్నలు తలెత్తుతాయి..

మమత రాసిన ఏకాంత (ఒంటరిగా..) అనే పుస్తకంలో ఇలాంటి సంఘటనలు కొన్నింటిని మనం చూడచ్చు. మమత స్కూలుకు వెళ్లే రోజుల్లో భారతీ దీదీ అనే ఆవిడ మమతను తీసికెళ్లడం, తిరిగి తీసుకురావడం చేస్తుండేది. ఒక రోజు భారతీ దీదికి ఒంట్లో బావులేక రాలేదు. దీనితో మమత ఒంటరిగా స్కూలుకు వెళ్లాల్సి వచ్చింది. స్కూలు నుంచి తిరిగి వస్తున్న సమయంలో మిగిలిన స్నేహితులు పార్క్ గోడ మీద కూర్చుని ఉన్న కుర్రాళ్లతో మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్లు ఎవరని మమత తన స్నేహితులను అడిగింది.

వారు తమ స్నేహితులని, తమ ప్రేమికులని చెప్పారు. "వాళ్లు ఆ మాట చెప్పేసరికి నాకు ప్రాణం పోయినంత పనయింది. పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లిపోయా. ఆ తర్వాత భారతీదీది లేకుండా స్కూలుకు వెళ్లలేదు. ప్రేమికులకు అర్థమేమిటో ఎవరినీ అడగలేదు కూడా. అలా అడిగితే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారని భయపడ్డా. నేను ఈ విషయాలను నాలోనే దాచుకున్నా. ఆ తర్వాత నా స్నేహితులతో కలిసి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లలేదు'' అని మమత 'ఏకాంత' పుస్తకంలో పేర్కొంది.

(మమత అలవాట్లు ఏమిటి? ఆమె రాత్రిళ్లు ఎందుకంత సేపు మెలకువగా ఉంటారు)
మమత సాధారణంగా రాత్రిళ్లు ఎక్కువ సేపు నిద్రపోరు. చాలా పొద్దుపోయే వరకు కూడా పనిచేస్తూనే ఉంటారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆమెకు ఈ అలవాటు పోలేదు. 1990లలో మమత తలకు గట్టి దెబ్బ తగిలింది. మృత్యువు సమీపంలోకి వెళ్లి వచ్చింది. బహుశా అప్పటి నుంచి రాత్రిళ్లు మెలుకువగా ఉండే అలవాటు ఆమెకు వచ్చి ఉండచ్చు. "ఆమె ఆ సమయంలో ఎంపీగా ఢిల్లీలో ఉండేది.

ఆమె ఆ దెబ్బ నుంచి కోలుకుంటున్న సమయంలో అనేక రాత్రిళ్లు ఆమెకు తోడుగా ఉండేవాళ్లం. రవీంద్రసంగీత్ పాడుతూ గడిపేవాళ్లం'' అని తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు, ఎంపీ కృష్ణబోస్ వెల్లడించారు. రోజులో ఉండే మొత్తం కాలాన్నంతా ఉపయోగించుకోవటానికి మమత ప్రయత్నిస్తూ ఉంటుంది. రాజకీయాలతో పాటు సంగీతానికి, చిత్రలేఖనానికి, పుస్తకాలు రాయటానికి తన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటుంది. లేకపోతే పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తూ, ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తూ 23 పుస్తకాలు ఎలా వెలువరించగలుగుతుంది? తాను విమానాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఎక్కువగా రాస్తూ ఉంటానని ఆమె చెబుతుంది.

(మమతకు అతీంద్రియ శక్తులంటే చాలా నమ్మకం..దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు..)
అనేక సార్లు రాజకీయ దుష్టశక్తుల నుంచి తృటి ప్రాయంలో తప్పించుకోవటం వల్ల కావచ్చు మమతకు అతీంద్రియశక్తులంటే విపరీతమైన నమ్మకం ఏర్పడింది. తాను జీవించటమే ఒక పెద్ద అద్భుతమని మమత భావిస్తూ ఉంటుంది.

అతీంద్రియ శక్తుల నుంచి శక్తిని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. 'ఏకాంత' పుస్తకంలో ఆమె ఇలాంటి సంఘటనలనేకం ప్రస్తావించింది. " తారాపీఠ్‌కు వెళ్లి చాలా కాలం అయింది. ఢిల్లీలో ఉన్న సమయంలో నేను తారాపీఠ్‌లో పూజ చేస్తున్నట్లు కల వచ్చింది. లేచిన తర్వాత తారాపీఠ్‌కు ఎప్పుడు వెళ్తే బాగుంటుందని ఆలోచించా. కోల్‌కత్తా తిరిగి వెళ్లిన తర్వాత నాకు వచ్చిన కల గురించి మా అమ్మకు చెప్పా.

అప్పుడు ఆమె ఒక సంఘటన చెప్పింది. కొన్ని రోజుల క్రితం మా ఇంటికి ఒక ముసలామె వచ్చిందిట. ఆమె వెళ్లే ముందు- ''నీ కూతురుని తారాపీఠ్‌కు వెళ్లమని చెప్పు" అని చెప్పిందిట..'' అని మమత ఆ పుస్తకంలో పేర్కొన్నారు. తనకు కల రావడం, అవ్వ వచ్చి చెప్పడం ఏదో సందేశాన్ని ఇచ్చినట్టు మమత భావించి ఉండొచ్చు. అందుకే వెంటనే ఆమె తారాపీఠ్‌కు వెళ్లి వచ్చారు.
మా అమ్మకు ఒంట్లో బావుండేది కాదు. అందువల్ల ఉదయాన మూడున్నరకే లేవాల్సి వచ్చేది. మొత్తం వంట చేసి చెల్లెళ్లను, అన్నయ్యలను నిద్రలేపేదాన్ని. వారందరూ తయారయిన తర్వాత నేను కూడా తయారయ్యేదాన్ని. అతికష్టం మీద టైంకు స్కూలుకు వెళ్లగలిగేదాన్ని. స్కూలు అయిన వెంటనే రాత్రి వంట చేయటానికి వెంటనే ఇంటికి వచ్చేసేదాన్ని.

Friday, January 27, 2012

బాపూతత్త్వం - గాంధీవర్ధంతి సందర్భంగా నివాళి... * జనవరి 30 గాంధీజీ వర్ధంతి

చెరగని చిరునవ్వు. ప్రశాంతమైన ముఖం. మృదువైన మాటలు. వ్యక్తిత్వాన్ని స్వయంగా పెంపొందించుకోవడం. ఇవి ఆయనలోని ప్రత్యేక లక్షణాలు. అహింసనే ఆయుధంగా స్వీకరించాడు. సత్యవ్రతాన్ని జీర్ణించుకున్నాడు. పరుషవాక్కుకు దూరంగా ఉన్నాడు. సాత్వికాహారం తీసుకున్నాడు. ప్రకృతితో మమైకమై జీవనాన్ని సాగించాడు. ప్రజలతో సహజీవనం చేసి ‘నాయకుడు అంటే ఇలా ఉండాలి’ అని ఆచరణపూర్వకంగా చూపాడు. కోట్లాది భారతీయుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. తుదిశ్వాస విడుస్తూ ‘హేరామ్’ అని భగవద్ధ్యానం చేశాడు. 
గాంధీవర్ధంతి సందర్భంగా నివాళి...

‘గ్రామాల్లోనే భారతదేశం ఉంది. గ్రామాలు అంతరిస్తే భారతదేశం అంతరించినట్లే. అందుకోసమే గ్రామాల్లో కుటీరపరిశ్రమలను, ఇతర చిన్నతరహా పరిశ్రమలను స్థాపించేలా ప్రోత్సహించాలి’... ఇది మహాత్ముని ఆశయం. భారీ పరిశ్రమల పట్ల తన వైముఖ్యాన్ని ప్రకటిస్తూ, రాజకీయ, ఆర్థిక వికేంద్రీకరణే గ్రామీణాభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.
http://harlemworldblog.files.wordpress.com/2010/09/mahatma_gandhi.jpg
భారతీయ సంస్కృతి ఏ ఒక్కరిదీ కాదు...
‘భారతీయ సంస్కృతి అందరి భావాల మిశ్రమం. ఇంట్లో అన్ని భాగాలలోకి వెలుగునిచ్చే సంస్కృతి నాది’ అన్నారు గాంధీజీ. ఆయనకు భారతీయ సంస్కృతి అంటే వల్లమాలిన అభిమానం. ఆయన సిద్ధాంతవేత్త కాదు. కాని నమ్మిన సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తి. 

http://wagingnonviolence.org/wp-content/uploads/2011/11/gandhi-and-crowd.jpg
ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఇంక తిరుగులేదు. అదే ఆయనను బలమైన శక్తిగా రూపొందించింది. ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించినవారు సైతం ఆయనను జాతిపితగా కీర్తిస్తున్నారు. సామాన్యుడిగా జన్మించినప్పటికీ భారతావనికి జాతిపితగా కీర్తి పొందారు. స్వాతంత్య్ర సాధనకు ఆయన చేసిన సేవ ఒక ఎత్తయితే, మహాత్ముడిగా మానవాళికి అందించిన సేవలు మరో ఎత్తు.
http://www.kamat.com/mmgandhi/dandimarch.jpg
స్వయంగా ఎదిగినవాడు...
మహాత్ముడు తనకు తానుగానే ఎదిగిన మహోన్నత ప్రజానాయకుడు. ఆయనలో ఉన్న నైతికవర్తనే ఆయనను నేతను చేసింది. ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమ’ని విర్రవీగిన ఆంగ్లేయులను... చేతిలో ఆయుధం లేకుండా, సత్యాగ్రహమనే ఆయుధంతో పారదోలిన వీరుడు.
http://www.nobelprize.org/nobel_prizes/peace/articles/gandhi/images/gandhi2.jpg
భిన్నత్వంలో ఏకత్వం...
సామాన్యుల్లో ఎంతో ప్రభావం చూపిన ఆయన ఆలోచనలు, ఆచరించిన విధానాలు ఈనాటికీ ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. తాను అనుసరించనిదేదీ ఇతరులకు చెప్పలేదు. సత్యం, అహింసల ప్రేరణతో దేశస్వాతంత్య్రం కోసం ఆయన చేసిన సహాయ నిరాకరణోద్యమం ప్రజలందరినీ ఒకచోటకు చేర్చి, జాతీయభావాన్ని పెంపొందించింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించారు. హింస, రక్తపాతం, మతకల్లోలాలకు వ్యతిరేకంగా ఆయన నిర్వర్తించిన పాత్రను ‘ఒన్‌మాన్ ఆర్మీ’ గా భారత తొలి గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ అభివర్ణించారు. వేలాది సైనికులు చేయలేని శాంతిస్థాపనను ఆయన ‘ఒక్కరే’ సాధించారని కొనియాడా రు. అంతవరకు వారు చూసిన నేతలకు, గాంధీజీకి మధ్య ఉన్న తారతమ్యాన్ని గమనించారు.
http://www.aparnaonline.com/images/GANDHI.jpg
నెహ్రూ ప్రశంస...
జవహర్‌లాల్ నెహ్రూ రచించిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో... ‘‘తాను చెప్పిన మాటల్నే ఆయన కొలబద్దగా తీసుకుని అనుసరించేవారు. తానెన్నుకున్న మార్గాన్ని అనుసరించడంలో అవరోధాలు కలిగినప్పుడు వాటిని అధిగమించేందుకు ప్రయత్నించేవారు. తన మాటలకు, మార్గానికి తానే ప్రారంభకుడు అయ్యేవారు. సత్యం, అహింసల నేపథ్యంలో నైతికవర్తనకున్న ప్రాముఖ్యతను, దానివలన అలవడే క్రమశిక్షణను గమనించారు’’ అని వివరించారు.


అందరికీ అనుసరణీయం...
ఒకరి మార్గం మరొకరికి అపమార్గంగా కనబడవచ్చు. ఒకరి విధానం ఇంకొకరికి అనుసరణీయం కాకపోవచ్చు. కానీ గాంధీజీ అనుసరించిన మార్గమే తమకు సమ్మతమని భారతీయులంతా భావించారు. ఆయన నెలకొల్పిన ఈ నాయకత్వ లక్షణాలు ఇప్పటికీ ప్రపంచదేశాలను ఆకర్షిస్తున్నాయి.
http://www.totalbhakti.com/wallpaper/image/Mahatma-Gandhi-Jayanti-2421.jpg
జాతిభేదాలు వద్దు... మనిషిని మనిషిగా చూడు
ఒకసారి మాటల సందర్భంలో ‘మీరు స్వదేశీయులను ప్రేమించినంతగా విదేశీయులను ప్రేమించరు కదా!’ అని ఒక ఆంగ్లేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన, ‘నేను మనిషిని మనిషిగానే చూస్తాను. స్వదేశీయుడా? విదేశీయుడా? అన్నది ముఖ్యం కాదు. పొరుగువాడికి తోడ్పడమే మానవసేవ’ అని చెప్పారు. 

http://www.ruraluniv.ac.in/Gandhi%20with%20Jinnah.JPG
http://upload.wikimedia.org/wikipedia/commons/9/94/Jinnah_Gandhi.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/9/94/Jinnah_Gandhi.jpg http://upload.wikimedia.org/wikipedia/commons/9/94/Jinnah_Gandhi.jpg
ఈ సందర్భంలోనూ ఆ వ్యక్తి, ‘ముస్లింలీగ్‌కు ఎందుకు తోడ్పడం లేదు’ అని మరో ప్రశ్న వేశాడు. ‘సహకరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అయితే, నా మార్గంలో లేనివారిపై నా సేవలను రుద్దలేను’ అని జవాబిచ్చారు.http://3ifactory.files.wordpress.com/2010/02/gandhi-walking_out_for_lunch_2.jpg
దేవాలయాలలోకి...
హరిజనుల దేవాలయ ప్రవేశానికి సంబంధించి ఆయన, ‘ఒకసారి వారిని దేవాలయంలో ప్రవేశించడానికి అనుమతించిన తరువాత వాళ్లు లోపలికి వస్తారా? రారా? అనేది సమస్య కాదు. దేవాలయ ప్రవేశానికి తమకు హక్కు ఉందని హరిజనులు వాదించే ప్రశ్నా కాదు. వారికి కూడా దేవాలయ ప్రవేశార్హత ఉందని భావించడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అన్నారు.
http://geekiest.net/image.axd?picture=image_399.png
ఆయన చెప్పిన ప్రతి మాటలోనూ సత్యాహింసలు ఉంటాయి. ఆ రెండూ జీవితాంతం ఆయనతో అంటిపెట్టుకునే ఉన్నాయి. స్వాతంత్య్ర సముపార్జనలో ప్రజలశక్తి ఆయనే. ప్రజల విశ్వాసం ఆయన పట్లే. జనానికి దూరంగా ఆయన ఏనాడూ లేరు. ‘నేత అనేవాడు జనంతోనే మమైకమైపోవాలి. వారితో కలిసే పనిచేయాలి. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. వారి ఇష్టాయిష్టాల్ని తెలుసుకోవాలి’ అని ఆచరించి చూపించారు. నిజమైన నేతగా విశ్వాసం పొందాలంటే ఇంతకంటే కావలసినదేముంటుంది? నిరుపేద కూడా ‘ఇది నా దేశం’ అని భావించే భారతదేశం కోసం పాటుపడతాను, పేదలకు ఆహారం రూపంలో పరమాత్ముడిని అందించాలి... అని ఆలోచించిన గాంధీజీని స్మరించుకోవడం భారతీయుల ధర్మం.
గాంధీజీ సూచించిన ఏడు విసర్జనీయ సూత్రాలు
 నేటికీ అనుసరించదగినవి.
 







 - విడిచిపెట్టవలసినవి...
* సోమరితనం, 
* ఇతరులకు నచ్చని విధంగా నడుచుకోవడం,
* వ్యక్తిత్వం లేని జ్ఞానం, 
* నైతికత లేని వ్యాపారం, 
* మానవత్వం లేని విజ్ఞానం, 
* త్యాగంలేని మతం, 
* సిద్ధాంతం లేని రాజకీయం.

వీటిని తప్పనిసరిగా విసర్జించాలని చెప్పారు. అంతేకాక వీటిని అనుసరిస్తే దేశానికి, సమాజానికి వాటిల్లే నష్టాలను కూడా తెలియజెప్పారు.

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjFphrw3P37aa515ZTD9x1M1VYpv_CWxhzHOzNHgcvIy4e4ppSmvFWi74ktmLnT12RFnBO-mafpZcbmw3YLImfVBC9wXOQVlLqdGEylZrRVJyM0aPzsKhv31XtIDTAlfGwjXu4MqXMpjho/s1600/3378454931_ded4cfdee5.jpg
మాటలో శక్తి...
సహాయ నిరాకరణ ప్రారంభించినప్పుడు... ఒకచోట ప్రజలు పోలీసు స్టేషన్ తగులబెట్టి హింసకు పాల్పడ్డారని తెలిసి, మొత్తం ఉద్యమాన్నే నిలిపివేశారు. అంత ఆగ్రహంలో ఉన్న ప్రజలు కూడా ఆయన మాటను శిరసావహించి ఉద్యమానికి విరామం ప్రకటించారంటే గాంధీజీ మాటల్లో దాగి ఉన్న శక్తి ఎంతటిదో అర్థమవుతుంది.

కలలుగన్న భారతం
‘నా ఆకాంక్ష ఉన్నతవర్గాలు, నిమ్నవర్గాలు లేని దేశం. అంటరానితనం, మద్యపానం, మాదకద్రవ్యాలు లేని విధంగా నాదేశం రూపుదిద్దుకోవాలి. పురుషుల్లాగే మహిళలు కూడా సమానహక్కులు అనుభవించగలగాలి.’ ఇదీ మహాత్ముడు కలలుగన్న భారతదేశం.

 http://s1.hubimg.com/u/1351200_f520.jpg
- తాడేపల్లి శివరామకృష్ణారావు

Thursday, January 26, 2012

క్షమించడు.. సహించడు

  http://topnews.in/law/files/rahul_gandhi.jpg
రాహుల్ గురించి మీకేం తెలుసు? రాజీవ్, సోనియాల కుమారుడు. గాంధీ-నెహ్రూ కుటుంబ వారసుడు. "ఎక్కడో విదేశాల్లో చదువుకొచ్చాడు, ఇప్పుడు కాంగ్రెస్ నేతగా యూపీలో ప్రచారం చేస్తున్నాడు.. అంతకన్నా ఏం తెలియదు..'' అంటున్నారా...













అయితే మీరు తాజాగా విడుదలయిన 'రాహుల్' పుస్తకాన్ని చదవాల్సిందే. రాహుల్ గురించి చాలా మందికి తెలియని అనేక విషయాలు, విశేషాలు దీనిలో ఉన్నాయి. వాటిలో నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు ......

 









అమెరికాలోని ట్రినిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన తర్వాత రాహుల్ వెంటనే భారత్‌కు రాలేదు. లండన్‌లోని మానిటర్ గ్రూప్‌లో ఉద్యోగంలో చేరాడు. తమ బ్రాండ్‌లకు సంబంధించిన వ్యవహారాలలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో కంపెనీలకు మానిటర్ గ్రూప్ సలహాలు ఇస్తుంది. ఈ గ్రూపులో రాహుల్ మూడేళ్లు పనిచేశాడు. ఆ సమయంలో రాహుల్ తన పేరు మార్చుకున్నాడు. ఎవరికీ తాను ఇందిరాగాంధీ మనవడినని గాని రాజీవ్ కొడుకునని గాని తెలియనివ్వలేదు. ఒక విధంగా ఇది సాహసమనే చెప్పాలి. "అమెరికాలో చదువు పూర్తి అయిపోయిన తర్వాత లండన్‌లో సాధారణమైన జీవితాన్ని గడిపాను. ఆ సమయంలో నాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు. ఒక విధంగా ఇది పెద్ద రిస్క్ అనే చెప్పాలి'' అని రాహుల్ ఆ తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 
http://blogs.independent.co.uk/wp-content/uploads/2010/11/Rahul-Gandhi.jpg
ఒకప్పుడు రాజీవ్ కూడా రాహుల్ మాదిరిగానే సాధారణమైన జీవితాన్ని గడపాలని కోరుకొనేవాడు. ప్రధాని అయిన తర్వాత కుదరలేదు కాని రాజీవ్‌కు విమానాలు నడపటం అంటే ప్రాణం. ఇది కూడా ప్రధాని అయిన తర్వాత సాధ్యమయ్యేది కాదు. అందుకే- "కొన్ని సార్లు నేను ఒంటరిగా కాక్‌పిట్‌లోకి వెళ్లి కూర్చుంటాను. నేను ఎగరలేనని నాకు తెలుసు. కాని బయట ప్రపంచానికి దూరంగా ఉన్నాననే భావన నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది'' అని రాజీవ్ ఒక సందర్భంలో పేర్కొన్నారు.http://pakteahouse.files.wordpress.com/2009/05/rahul-gandhi.jpg
కంపెనీ డైరెక్టర్‌గా..
ఒక వైపు రాహుల్ ఇంగ్లాండ్‌లో సాధారణమైన జీవితాన్ని గడపటానికి ప్రయత్నిస్తున్నప్పుడే భారత్‌లో సోనియా రాజకీయాలలోకి ప్రవేశించింది. ఆమెకు ప్రియాంక తోడుగా ఉండేది. రాహుల్ అప్పటికే దేశాన్ని వదలివెళ్లి పదేళ్లు అయిపోయింది. 
http://www.mobileapples.com/Assets/Content/Wallpapers/Rahul_gandhi_and_soniya.jpg http://www.pkp.in/images2/Priyanka%20Gandhi%20kids.jpg
సోనియా రాజకీయాలలో నిలదొక్కుకోవటం మొదలుపెట్టింది. రాహుల్ భారత్‌కు తిరిగి వచ్చేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో 2002లో రాహుల్ భారత్‌కు తిరిగి వచ్చాడు.http://jharkhandmirror.files.wordpress.com/2009/08/rahul1.jpg?w=298
ఇదే సమయంలో మన దేశంలో టెక్నాలజీ బూమ్ వచ్చింది. లక్షల మంది ఐటీ రంగంలోకి ప్రవేశించటం మొదలుపెట్టారు. భారత్‌కు తిరిగి వచ్చిన రాహుల్ మరి కొందరు స్నేహితులతో కలిసి ముంబాయిలో బ్యాక్ఆప్స్ (ఆపరేషన్స్) సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కంపెనీని స్థాపించాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు సలహాలు ఇవ్వటం ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం.

దీనిలో రాహుల్‌తో పాటుగా మనోజ్ మట్టు (రాహుల్‌కు చిన్ననాటి మిత్రుడు), అనిల్ ఠాకూర్ (మాజీ కేంద్ర మంత్రి రామేశ్వర్ ఠాకూర్ కుమారుడు), రన్వీర్ సిన్హా (రాహుల్ మిత్రుడు) డైరెక్టర్లుగా ఉండేవారు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు రాహుల్ సమర్పించిన అఫిడవిట్‌లో తనకు బ్యాక్ఆప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 83 శాతం వాటా ఉన్నట్లు రాహుల్ పేర్కొన్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల ముందు రాహుల్ ఈ కంపెనీలో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశాడు.
http://satyameva-jayate.org/wp-content/uploads/2010/11/Rahul-Gandhi-Congress.jpg
అయితే రాజకీయాలలోకి పూర్తిస్థాయిలో ప్రవేశించటం వల్ల ఈ బిజినెస్‌ను నడపటానికి రాహుల్‌కు సమయం లేదని ఆయన సన్నిహిత వర్గాలు ఆ సమయంలో పేర్కొన్నాయి.''
Rahul gandhi

పట్టువీడని తత్వం..
"రాహుల్ ఏ విషయానీ మర్చిపోడు.తప్పు జరిగితే ఎవరినీ క్షమించడు.'' 
http://mangalorean.com/images/newstemp17/20080329rahul6.jpg
 ఈ విషయాన్ని కొందరు జర్నలిస్టులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. 2009, జనవరి 22వ తేదీన ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో ఒక వర్క్‌షాప్ జరిగింది. దీనిలో రాహుల్ ఒక ప్రజంటేషన్ ఇచ్చాడు. మధ్యాహ్నం అందరితో కలిసి లంచ్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఆ ప్రజంటేషన్‌కు సంబంధించిన కాగితాలు కనిపించలేదు. ఈ వర్క్‌షాప్‌ను చిత్రీకరించటానికి వచ్చిన కొందరు ఛానెల్ రిపోర్టర్లు ఆ కాగితాలను రాహుల్‌కు చెప్పకుండా తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాల్సిందేనని రాహుల్ పట్టుపట్టాడు. http://www.publictrustofindia.com/wp-content/uploads/2011/07/r2.jpg
పోయినవి ప్రజంటేషన్ కాగితాలే కాబట్టి పట్టించుకోవద్దని అక్కడున్న నేతలు నచ్చచెప్పటానికి ప్రయత్నించారు. కాని రాహుల్ తన పట్టు వీడలేదు. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు హిబీ ఇడెన్ పార్లమెంట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు మూడు ఛానెల్స్‌కు సంబంధించిన రిపోర్టర్లను పిలిచి విచారించారు. పోలీసు రిపోర్టు ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది నేతలు - ఆ ప్రజంటేషన్‌లో రహస్యాలు ఏమీ లేవు కాబట్టి రిపోర్టును వెనక్కి తీసుకుందామని రాహుల్‌కు నచ్చచెప్పటానికి ప్రయత్నించారు. 
http://indiacurrentaffairs.org/wp-content/uploads/2011/07/Rahul-Gandhi%E2%80%99s-Thesis-On-Terrorism.jpg
కాని రాహుల్ అంగీకరించలేదు. తనకు చెప్పకుండా కాగితాలు తీసుకోవటం కూడా దొంగతనం కిందకే వస్తుందని వాదించాడు.http://newsleaks.in/wp-content/uploads/2011/04/M_Id_63449_Rahul_Gandhi.jpg
 పుస్తకం పేరు: రాహుల్
రచయితలు: జితిన్ గాంధీ, వీను సంధు
http://4.bp.blogspot.com/-I9MwcXJthxI/TjJhJGA1rAI/AAAAAAAABck/c4oIWIhLLZ8/s1600/rahul+indira+gandhi.jpg
ప్రచురణకర్త: వైకింగ్, ధర: రూ. 499