Friday, May 4, 2012

పొలిటికల్ ఫైర్ బ్రాండ్స్ ...

కొన్ని దశాబ్దాల క్రితం రాజకీయంలో మహిళలు  రాణించలేరు అనే ఒక అపోహ చాలా మందిలో ఉండేది. మామూలుగా రాణించలేరేమో కానీ ఓ రేంజ్‌లో రాణించగలరని నిరూపించారు మాజీ దేశ ప్రధాని ఇందిరా గాంధీ. అధికారాన్ని ఏ అభివృద్ధికోసం వినియోగించాలో ఆమెకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అని చాలా మంది అభిప్రాయం. ఇందిరా గాంధీ ఏది చేసినా సంచలనమే. ఆమె ప్రతీ నిర్ణయం ఓ రహస్యమే. ఇలా సాగిన ఆమె పాలనా సిద్ధాంతాన్ని కొన్ని మార్పులు చేసి నేడు జయలలితా, మాయావతి, మమతా బేనర్జీ రాజకీయంలో అదరగొడుతున్నారు. మొండితనం వారి బలం. ఆయుధం వారనుకున్నది వారు సాధిస్తారు ఆదే వారి విజయ రహస్యం. వారలా ఎందుకు చేయాల్సి వస్తోంది అని ప్రశ్నిస్తే రాజకీయ మనుగడకు ఇలాంటి జిత్తుల మారి ఎత్తులు అవసరమే అని జవాబు వస్తుంది. వివాదాలు.. విజయాలు కామన్‌. దూసుకుపోవడమే న్యాయం అనేది వాని తత్వం.

మాయావతి
ప్రొఫైల్‌

పూర్తి పేరు : మాయావతి
పుట్టిన తేది : జనవరి 15
జన్మస్థలం  : ఢిల్లీ
విద్యాభ్యాసం: ఎల్‌.ఎల్‌.బి, బిఈడి
వృత్తి  : రాజకీయ నాయకురాలు
పార్టీ  : బహుజన్‌ సమాజ్‌ పార్టీ

Uns 

మాయావతి అనగానే చాలా మందికి తెల్ల ఏనుగులు గుర్తుకు వస్తాయి. ఆమె వేల కోట్లు ఖర్చుపెట్టి ఉత్తర్‌ ప్రదేశ్‌లో కళాత్మక దృష్టితో నిర్మిస్తున్న ఏనుగుల బొమ్మలు. ఈ బొమ్మలు ఆమె పార్టీ గుర్తు.ఉత్తర్‌ ప్రదేశ్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల విగ్రహాలతో పాటు తన పాలరాతి బొమ్మను కూడా సెంట్రల్‌ పార్క్‌లో నిర్మించి ఉత్తర్‌ ప్రదేశ్‌కు ఇది సరికొత్త పర్యాటక స్థలం అని ప్రకటించారు. మాయావతికి ఈ విగ్రహాలపై ఇంత అభిమానం ఎందుకో తెలీయదు కానీ శిల్పకారులకు మాత్రం స్వర్ణయుగంగా అవతరించింది ( ఒకటా రెండా ఏకంగా రూ.2500 కోట్లు ప్రాజెక్టు మరి). ఆమె పుట్టిన రోజు సందడిని టీవి ఛానల్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ప్రతీ పుట్టిన రోజు ఏదో విధంగా వైవిధ్యశైలిలో జరగడమే దీనికి కారణం.కొన్నేళ్ళ క్రితం అభిమానులు కరెన్సీ నోట్లతో చేసి దండ ఆమె మెడలో వాలినప్పుడు ఆశ్చర్య పోవడం ప్రేక్షకుల వంతైంది.ఇంత వైవిధ్యాన్ని భరించలేని ప్రజలు వేరే పార్టీకీ ముఖ్యమంత్రి ఛాన్స్‌ను అందించారు.

జయలలిత

 
ప్రొఫైల్‌

పూర్తి పేరు  : జయలలిత 
పుట్టిన తేది  :  ఫిబ్రవరి 24
జస్మస్థలం   : మైసూర్‌
వృత్తి    : రాజకీయనాయకురాలు
పార్టీ    : ఆమె ఆల్‌ ఇండియా  
            ఆన్నా ద్రవిడ మున్నెట్ట 
            కజగం (ఏఐఏడిఎమ్‌కే)
ప్రస్తుత హోదా: తమిళనాడు ముఖ్యమంత్రి

Unt6 

ఇక దక్షిణాదికి వస్తే తమిళనాడు ఆమ్మగా పిలవబడే జయలలిత రూటే వేరు. ఆమె పథకాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో..అమె నిర్ణయాలు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయని సన్నిహితుల అభిప్రాయం. రాజకీయంలో పురుషులతో సమానంగా రాణించాలంటే పురుషుల కన్నా ఎక్కువగా పనిచేయాలి అనేది ఆమె నమ్మే సిద్ధాంతం. ప్రాంతీయా భిమానం విపరీతంగా ఉన్న జయలలితా పాలన విషయంలో ప్రజల అభిప్రాయానికి అత్యంతవిలువ నిస్తుంది. టీవిలు, సెల్‌ఫోన్లు వంటివి ప్రజల జీవన ప్రమాణాన్ని సౌఖ్యానికే అని తెలిపారామె. జయలలిత ఒక్క చూపుకోసం అభిమానులు, కార్యకర్తలు ఎన్నిగంటలైనా వేచి చూస్తారంటే ఆమె ఏ విధంగా తన మార్కును సృష్టించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. మంచి నటిగా గుర్తింపు సాధించాకా అమె రాజకీయంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి నేటికీ విజయవంతంగా కొనసాగుతున్నారు. ఆమె అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరగడం విశేషం.2011 సాధారణ ఎన్నికల్లో కరుణానిధిని కాదని జయలలితను మూడవసారి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు ప్రజలు. 2011 మే 16న ఆమె తన ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకు క్రితం ఆమె 2002-2006, 2001 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు.

మమతా బెనర్జి
ప్రొఫైల్‌

పూర్తి పేరు  : మమతా బెనర్జి
పుట్టిన తేది  : జనవరి 5
జస్మస్థలం          : కలకత్తా
వృత్తి   : రాజకీయ వేత్త
పార్టీ   : త్రినమూల్‌ కాంగ్రెస్‌
ప్రస్తుత హోదా  : పశ్చిమబెంగాల్‌ 
    ముఖ్యమంత్రి

Us 

బెంగాలీ ‘దీది’మమతా బేనర్జీలోని పాజిటీవ్‌ కోణాన్ని గతేడాది చూసి చాలా మంది మురిసి పోయి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనుకున్నారు. కానీ 2012లో మమతాలో వచ్చిన మార్పుకు యావత్‌ భారతం ఆశ్చర్యపోయింది. రైల్వే బడ్జెట్‌ తరువాత మమతాలో ప్రారంభమైన నిరంకుశ ధోరణి ఆమె అభిమానులను సైతం నిరాశ పరిచింది. గతేడాది విదేశీ సంస్థాగత పెట్టుబడి విషయంలో ప్రారంభమైన ఆమె మొండి వైఖరి, రైల్వే ఛార్జీలలో స్వల్ప మార్పు చేసిన ముకుల్‌ రాయ్‌ను రాజీనామా చేయించినా అక్కడితో ఆగలేదు. మమతా నిర్వాకాన్ని గమనిస్తున్ను మీడియా ఆమెపై దుమ్మెత్తి పోయడం ప్రారంభించింది. అందులో భాగంగా ఒక వార్తా పత్రిక కార్టూనిస్ట్‌ ఆమెకు వ్యతిరేకంగా కార్టూన్‌ వేశాడు.ఇది ఆమెకు కోపాన్ని కలిగించింది . సదరు కార్టూనిస్ట్‌ను అరెస్ట్‌ చేయించడమే కాకుండా మీడియాకు మార్గదర్శకాను జారీ చేసింది. పబ్లిక్‌ లైబ్రెరీలో కొన్ని పత్రికలను నిషేదించింది, ఏ పత్రికలు చదవాలో కూడా ఆమెనే నిర్ణయించి. .ఏ టీవి ఛానల్‌ను చూడాలో కూడా తెలిపింది. ఇలా ఆమెలోని నెగెటీవ్‌నెస్‌ ప్రజాస్వామ్యానికే ప్రమాదంగా దాపురించిందని విజ్ఞులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమతా ఇలా ఎందుకు మారిందో ఆమెకే తెలియాలి.

No comments:

Post a Comment