Saturday, November 20, 2010

No. 1 C.E.O.

Nooyi
అమెరికాలో అత్యధికంగా వేతనాలు పొందుతున్న భారతీయ సంతతికి చెందిన సిఇఓగా ఇంద్రానూయి నిలిచారు. మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ హే గ్రూపు నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.అమెరికాలో భారతీయ సంతతికి చెందిన, అత్యధిక వేతనం అందుకుంటున్న సిఇఓల్లో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. ఈ సర్వేలో 400 కోట్ల డాలర్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన కంపెనీలను సర్వే పరిగణలోనికి తీసుకుంది. ఇందులో 1.4 కోట్ల డాలర్లు(63 కోట్లు) వార్షిక వేతనంతో పెప్సికో కంపెనీ సిఇఓ అత్యధికంగా వేతనాలు పొందుతున్న సిఇఓల్లో 67వ స్థానంలో నిలిచింది.

ప్రొఫైల్‌..
పుట్టినది      *    అక్టోబర్‌ 28, 1955, చెన్నై

పౌరసత్వం   *   అమెరికా
విద్య           *   మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజ్‌ ఐఐఎం కలకత్తా, యాలే స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ 

హోదా       *   పెప్సికో కంపెనీ ఛైర్‌పర్సన్‌, సిఇఓ

Friday, November 19, 2010

షరతులతో కూడిన స్నేహం

Friendship1
సంజన, కునాల్‌ మంచి స్నేహితులు. చాలా ఏళ్ళ నుంచి ఒకరినొకరు విడిచి ఉండలేనంత స్నేహం వారిది. ఒకరోజు కునాల్‌ తాను శ్రావ్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. దాంతో సంజన చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లిపోయింది. చివరకు కాలేజీకి కూడా రావడం మానేసింది. ఒక రోజు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న కునాల్‌ వెంటనే సంజనను కలిసి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావ్‌ ? అని అడిగాడు. సంజన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు. ఇంతకీ సంజన చెప్పిన విషయం ఏంటంటే... కునాల్‌ను ప్రేమిస్తున్నానని, వేరే అమ్మాయితో కలిసి తిరగడం తనకు నచ్చలేదని, ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటుంటే కోపం వస్తుందని అందుకే ఈ పనిచేశానని చెప్పింది. ఇలా నేడు కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు తమ స్నేహితులు ఇతరులతో ప్రేమలో పడితే సహించలేకపోతున్నారు. పెత్తనం చెలాయించేలా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు సమాధానం గా కొందరు యువతీ యువకులు కొందరు కొన్ని షరతులతో కూడిన స్నేహం చేయాలని నిర్ణయం తీసుకుంటున్నా రు. తాము స్నేహితులమో, ప్రేమికులమో ముందే చర్చించుకుంటే మంచిదని భావిస్తున్నారు.

friendship
సృష్టిలో తీయనిది స్నేహమేనోయి... అని అనేక మంది కవులు, రచయితలు ఎప్పుడో అన్నారు. అది నిజం కూడా. కానీ, స్నేహితులంటే ఇద్దరు అబ్బాయిల మధ్య, అమ్మాయిల మధ్య మాత్రమే కాదు. నేటి రోజుల్లో యువతీ యువకుల మధ్య కూడా ఫ్రెండ్‌షిప్‌ పెరిగింది. అసలు చిక్కు అక్కడే ఉంది. చాలా కాలం స్నేహితులుగా ఉన్న వారి మధ్య సాధారణంగా ప్రేమ చిగురించేందుకు ఆస్కారం ఉంది. ప్రేమ పుట్టకపోయేందుకు కూడా అంత అవకాశం ఉంది. కానీ నేడు కొంతమంది స్నేహానికీ, ప్రేమకూ తేడాలు తెలియకుండా పోతోంది. ఇతరులతో స్నేహం చేసినా, ప్రేమలో పడినా వారు సహించలేకపోతున్నారు. బెదిరించడం, అఘాయిత్యాలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అందుకే నేడు కొత్త పద్ధతిని కుర్రకారు ప్రవేశపెట్టారు. అదే షరతులతో కూడిన స్నేహం. తాము స్నేహితులమో, ప్రేమికులమో ముందే ఒక ఒప్పందానికి రావడం ఇందులోని ప్రధా‚న విషయం. ప్రస్తుతం చాలామంది యువత ఈ పద్ధతిని ఆమోదిస్తున్నారు. ఆచరణలో పెడుతున్నారు. స్నేహానికి సరికొత్త భాష్యం చెబుతున్నారు.

కాలం మారింది... : కాలం మారింది. కాలంతో పాటే మనుషుల అభిప్రాయాలు, ఆలోచనలు మారాయి. అధునిక నాగరికత మూలంగా అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఉండే గీత చెరిగిపో యింది. కలిసి ఒకే కాలేజీలో చదువుకోవడం, ఒకే చోట ఉద్యోగాలు చేయడం వల్ల వారి మధ్య సహజంగానే స్నేహం ఏర్పడుతుంది. కొన్ని సంవత్సరాలకు ముందు ఆడ ఫ్రెండ్‌ ఉందంటే చిత్రంగా అనుకునేవారు. ప్రస్తుతం స్నేహితురాలయినా, స్నేహితుడయినా పెద్ద తేడాలేకుండా అయిపోయింది. అయితే, నేడు యువతీ యువకులు స్నేహితులుగా ఉన్న వారి మధ్య ఉన్నది స్నేహమా లేక ప్రేమా తేల్చుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. అది కొన్ని సమస్యలకు కూడా దారి తీస్తోంది.

Friendship2
ఒప్పందం కుదుర్చుకుంటున్నారు... : నేడు స్నేహం చేసే అమ్మాయిలు, అబ్బాయిలు ముందే ఒక ఒప్పం దం కుదుర్చుకుంటున్నారు. ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం తమ స్నేహాన్ని విస్తరించుకుంటున్నారు. ‘కలిసి ప్రయాణిస్తున్న స్నేహం అనే బోటులో ఎప్పుడైనా ఇద్దరి మధ్య ప్రేమ కలగవచ్చు, లేకుండా పోవచ్చు. ఇతరులపై ఆమెకు లేదా అతనికి ప్రేమ కలగవచ్చు. అలాంటప్పుడు ఇంత కాలం స్నేహం చేసిన వారు బాధపడకుండా ఉం డాలంటే ముందుగానే షరతు ఉండాలని నేననుకుంటున్నాను. పరిచయం అయిన వెంటనే మీ డ్రీమ్‌ గర్ల్‌ / బాయ్‌తో ప్రేమిస్తున్నామని చెప్పడం కుదరదు. ప్రేమ ఎప్పుడు ఎవరితో ఏ సమయంలో కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ నేడు కొంతమంది స్నేహం కూడా ప్రేమే అని అనుకుంటున్నారు. అలా కాకుండా ముందుగానే కొన్ని షరతులతో ఒప్పదం కుదుర్చుకొని స్నేహం చేయడం మంచిది. చెప్పుకోవడానికి హాస్యాస్పదంగానే కనిపి స్తున్నా నేడు జరుగుతున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే అవసరమే అనిపిస్తుంది’ అని మెడిసిన్‌ చదువుతున్న ప్రసాద్‌ తెలిపాడు.

మంచిది కాదు... : ‘నా ఫ్రెండ్‌ నేను చాలా కాలం నుంచి స్నేహితులుగా ఉన్నాం. సన్నిహితంగా మారిపో యాం. నాకు తన మీద స్నేహం కన్నా ప్రేమ ఎక్కువైంది. ఆ సమయంలో తను ఒక రోజు వేరే అమ్మాయిని ప్రేమి స్తున్నానని చెప్పాడు. అప్పుడు తనకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నేను ప్రేమిస్తున్నానన్న సంగతి ముందుగానే తెలియజేసి ఉంటే బాగుండేది అని నాకా టైములో అనిపించింది. కానీ ఎటువంటి సంబంధం లేని అతన్ని ఆపే హక్కు నాకు లేదు. అందుకే ఒకరోజు వాళ్లిద్దరికీ క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ ఏర్పాటు చేశాను. తరువాత అతనితో ఫ్రెండ్‌షిప్‌ కొనసాగిస్తూనే ఉన్నాను. మనం ప్రేమిస్తున్నామని తను కూడా ప్రేమించాలనుకోవడం మంచిది కాదని నాకు అప్పుడు అనిపించింది’ అని ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ సులోచన పేర్కొంది.

సిద్ధాంతం లేదు... : ‘ఒక అమ్మాయి, అబ్బాయి స్నేహితులుగా ఉన్నంత మాత్రాన అబ్బాయి మరొక అమ్మా యితో ప్రేమలో పడకూడదని ఎక్కడా లేదు. మరెందుకు స్నేహితులుగా ఉన్న అబ్బాయిలు వేరే అమ్మాయిని ప్రేమించినా, స్నేహం చేసినా బాధపడడం, ఏడవడం ఎందుకు చేస్తారో నాకు అర్థంకాదు. ఇది అర్థం పర్థంలేని విషయాలుగా నాకనిపిస్తుంది. స్నేహం చేస్తున్నంత మాత్రాన పెళ్లి అయిపోయినట్టే అనుకుంటే అది వారి మూర్ఖత్వంగానే పరిగణిస్తాను. ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిల విషయంలోనూ వర్తిస్తుంది. తమ ఆడ ఫ్రెండ్‌ వేరే అబ్బాయితో మా ట్లాడినా, స్నేహం చేసినా కొంతమంది అబ్బాయిలు ఆ అమ్మాయిపై పెత్తనం చెలాయిస్తారు. దాదాపు అందరూ తమ స్నేహాన్ని విస్తరించా లనుకుంటారు. అది సహజం. అది ఎవరియినా కావచ్చు. అందుకే ముందుగానే చర్చించుకోవడం మంచిదే అని నా అభిప్రాయం. తమ మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా అనేది ముందుగానే నిర్ణయించుకో వడం ప్రస్తుతం తప్పనిసరి’ అని బికాం విద్యారి కిరణ్‌ చెప్పాడు.

చిరాకుగా అనిపించింది... : ‘నా ఫ్రెండ్‌ తనొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అందుకు నేనేం అభ్యంతరం చెప్పలేదు. అయితే, కాలేజీలో చాలా మంది నీ బాయ్‌ఫ్రెండ్‌ నిన్ను మోసం చేస్తే ఎందుకు కామ్‌గా ఉన్నావని అడిగారు. అలా అడగడం నాకు చాలా చిరాకుగా అనిపించింది. స్నేహానికి, ప్రేమకు తేడా తెలియనివారు ఇప్పుడు కూడా ఉన్నారా? అని అనిపించింది’ అని నిఖితా చెప్పింది.