Sunday, November 27, 2011

బడుగులకు భగవంతుడు జ్యోతిరావ్‌ ఫూలె

 http://farm3.static.flickr.com/2505/4228610546_b1766199f5.jpg
గ్రామీణులు, వ్యవసాయ కూలీలు, రైతాంగం, మహిళలు, సమాజంలో అట్టడుగు వర్గాలవారూ పడుతున్న కష్టనష్టాలకు మూలాలు వెతికి వారిని క్రాంతి పథంలోకి నడిపిన మహనీయుడు జ్యోతీరావ్‌ ఫూలే. ఆయన ఆలోచనలు, కార్యపథం ఎవ్వరికైనా సర్వదా ఆచరణీయం. చెప్పింది ఆచరించి చూపి మార్గదర్శి అయ్యారాయన. సమాజంలో కులం, మతం, ఆర్ధిక స్థోమత ఆధారిత అజ్ఞానం, అణచివేత, ఆధిపత్య దోరణే సమాజంలో విలువలు దెబ్బతినడానికి కారణాలుగా ఫూలె గ్రహించారు. pule2
వాటిని వ్యతిరేకించి మనిషికి సహజంగా ఉన్న మానవ హక్కులను అణగారిన వర్గాలు తెలుసుకుని అనుభవించే వాతావరణం ఏర్పాటుకు ఫూలే అహోరాత్రులూ శ్రమించారు. సమాజంలో మతం, మూర్ఖత్వం, అజ్ఞానాంధకారంలో సమాజశ్రేయస్సునే నిర్లక్ష్యం చేసిన వారిపట్ల ధ్వజమెత్తారు. సమాజంలో అట్టడుగువర్గాలవారూ సంపూర్ణ స్వేచ్ఛాఫలాలు అందుకోవాలని, కొత్త సమాజం కోసం ఆయన కలలు కన్నారు. సమాజంలో అణగారిన వర్గాల ఐక్యత, అభివృద్ధి కోసం ఫూలె ఎంతో పాటుపడ్డారు.

బాలికలకు పాఠశాల...
pule3పూణేలో 1848లో బాలికలకు తొలి పాఠశాలను ఆయనే ప్రారంభించారు. అణగారిని వర్గాల్లో మహిళలు చదువుకోవాలని ప్రభోదించారు. అంతేగాక ‘పూణె స్థానిక మహిళల పాఠశాలలు’, ‘మహార్‌, మాంగ్‌ల విద్యాభివృద్ధి సమాఖ్య’ పేర రెండు సంస్థలు నెలకొల్పారు. ఆ ఉద్యమంలో తన భార్యకు భాగస్వామ్యం కల్పించారు. బాలికల పాఠశాలలో ఫూలె తన భార్య సావిత్రిని టీచర్‌గా చేరాలని ఉత్సాహపరిచారు. కానీ సమాజంలో మతఛాందసులు, సంప్రదాయాలకు కట్టుబడినవారంతా సావిత్రిబాయి విద్యాబోధనను వ్యతిరేకించారు. ముఖ్యంగా ఆమె అణగారిన కులానికి చెందినదని, విద్యాబోధనకు అనర్హురాలని భారీ ఎత్తున వ్యతిరేకించారు. కానీ అందుకు ఏమాత్రం వెరవక ఫూలె, సావిత్రీబాయి తమ లక్ష్యసాధనలో మనస్పూర్తిగా కొనసాగారు. ఆ విధంగా దేశంలో మహిళలకు, బాలికలకు తొలి పాఠశాలను నెలకొల్పిన గొప్పవ్యక్తిగా ఫూలె కీర్తింపబడ్డారు. విద్యారంగంలో ఆయన సేవలను బ్రిటీష్‌ ప్రభుత్వం గుర్తించింది. 1852 నవంబర్‌ 16న ఆయన్ను ఘనంగా సత్కరించింది.

సమాజం అన్ని విధాలా ఎదగడానికి మహిళలు చదువుకోవాలన్న స్పూర్తిని కల్పించడంతోనే ఆగక వితంతు వివాహాలను కూడా ఆయన ప్రోత్సహించడం గమనార్హం. అంతేగాక బాలహత్య ప్రతిబంధక్‌ గృహ పేర ఒక సంస్థను ఏర్పాటు చేసి వితంతువుల పిల్లలను హత్యచేసే కుసంస్కారాన్ని, మూర్ఖ ఆచారానికి స్వస్తి పలికారు.

వితంతు వివాహాలు...
సమాజం అన్ని విధాలా ఎదగడానికి మహిళలు చదువుకోవాలన్న స్పూర్తిని కల్పించడంతోనే ఆగక వితంతు వివాహాలను కూడా ఆయన ప్రోత్సహించడం గమనార్హం. అంతేగాక బాలహత్య ప్రతిబంధక్‌ గృహ పేర ఒక సంస్థను ఏర్పాటు చేసి వితంతువుల పిల్లలను హత్యచేసే కుసంస్కారాన్ని, మూర్ఖ ఆచారానికి స్వస్తి పలికారు. ఈ యావత్‌ కార్యక్రమాల్లోనూ ఆయనకు చేదోడువాదోడుగా ఆయన భార్య సావిత్రీబాయి, ఇతర మిత్రుల సహకారం ఎంతో గొప్పది.

పూణేలో 1848లో బాలికలకు తొలి పాఠశాలను ఫూలె ప్రారంభించారు. అణగారిన వర్గాల్లో మహిళలు చదువుకోవాలని ప్రభోదించారు. ‘పూణె స్థానిక మహిళల పాఠశాలలు’, ‘మహార్‌, మాంగ్‌ల విద్యాభివృద్ధి సమాఖ్య’ పేర రెండు సంస్థలను ఆయన నెలకొల్పారు.

సత్యశోధక్‌ సమాజ్‌...
విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఫూలె సంస్థలు అన్ని విధాలా ప్రజల్ని ఆకట్టుకున్నాయి. ఆ లక్ష్యసాధనకు మరింత పట్టుగా 1873 సెప్టెంబర్‌ 24న ‘సత్యశోధక్‌ సమాజ్‌’ అనే మరో సంస్థను ఏర్పాటుచేశారు. సామాజిక, మత పరమైన అణచివేతను సంపూర్ణంగా అణచివేయడమే ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు కొన్ని సూత్రాలు రూపొందించింది. అవి.. దీక్షలు, సంప్రదాయాలపేర చేసే పనులు, పునర్జన్మ అనేవి సత్యదూరం. దేవునిసేవకు భట్‌లు(బ్రాహ్మలు) లేదా ఇతర మధ్యవర్తుల అవసరంలేదు. ఈ సమాజం అందించిన సందేశం యావత్‌ మహారాష్టన్రు కదిలించింది. అయితే సమాజంలో అనాదిగా వున్న అర్ధరహిత సంప్రదాయాలు, అగ్రవర్ణాల దాష్టికాలను అధిగమించి స్వేచ్ఛ పొందడానికి అణగారిని వర్గాలకు చెందిన ప్రతీ మహిళా విద్యావంతురాలు కావాలని ఆ సంస్థ ప్రచారం చేసింది.

జ్యోతీరావ్‌ 1827 ఏప్రిల్‌ 11వ తేదీన జన్మించారు. ఏడాది తిరక్కుండానే తల్లిని పోగొట్టుకున్నారు. 1834-38 మధ్య కాలంలో ప్రాథమిక విద్యనభ్యసించారు. 1840లో సతారా జిల్లా నయాగోవ్‌ గ్రామానికి చెందిన ఖండోజీ నవషో పాటిల్‌ కుమార్తె సావిత్రీబారుని ఫూలె పెళ్లి చేసుకున్నారు.

కుటుంబ నేపధ్యం....
 http://blog.insightyv.com/wp-content/uploads/2009/11/savitribai_phule.jpg
జ్యోతీరావ్‌ ఫూలే పూర్వీకులు సతారా జిల్లా ఖతావ్‌ తాలూకాలోని కాట్గున్‌ గ్రామస్తులు. ఇంటిపేరు గోర్ఖే. ఫూలే ముత్తాత కోండిబ గోర్ఖే గ్రామపెద్దగా ఉండేవారు. ఆయనకు మరో గ్రామపెద్ద కులకర్ణికీ మధ్య విభేదాలు తలెత్తడంతో కొట్లాటలు జరిగాయి. అందులో దురదృష్టవశాత్తూ కులకర్ణి హత్యకు గురయ్యాడు. హంతకుడనే అపవాదు నుంచీ తప్పించుకోవడానికి ఆయన పూణేలోని పురందర్‌ జిల్లా ఖానావాడి తాలూక కాల్గున్‌ గ్రామానికి వెళ్లి పోయారు. ఆ తర్వాత కొండిబా కుమారుడు షెతిబా అక్కడ కరువు కాటకాల కారణంగా పూణేకి మకాం మార్చాడు. దీంతో వారి ఇంటి పేరు ఫూలేగా మారింది. షతిబాకు ముగ్గురు కుమారులు.. రానోజి, కృష్ణాజీ, గోవింద్‌. గోవిందరావుకు చిమ్నాబాయ్‌ అనే ఆమెతో పెళ్లయింది. వారి కుమారుడే జ్యోతిరావ్‌. ఆయనే భారత దేశంలో మహోన్నతమైన సామాజిక విప్లవానికి నాంది వేసిన జ్యోతిరావ్‌ ఫూలె.

జీవిత చరిత్ర...

http://im.rediff.com/getahead/2011/sep/05teacher-savitribai-phule.jpg
జ్యోతీరావ్‌ 1827 ఏప్రిల్‌ 11వ తేదీన జన్మించారు. ఏడాది తిరక్కుండానే తల్లిని పోగొట్టుకున్నారు. 1834-38 మధ్య కాలంలో ప్రాథమిక విద్యనభ్యసించారు. 1840లో సతారా జిల్లా నయాగోవ్‌ గ్రామానికి చెందిన ఖండోజీ నవషో పాటిల్‌ కుమార్తె సావిత్రీబాయిని ఫూలె పెళ్లి చేసుకున్నారు. పరిస్థితుల కారణంగా కొంతకాలం ఫూలె విద్యకు స్వస్తి పలకాల్సివచ్చింది. అయితే ఆయనలో విద్య పట్ల ఆసక్తిని గ్రహించిన మున్షీ గఫార్‌ బేగ్‌, లిజిత్‌ అనేవారు సలహా మేరకు ఆంగ్లంలో చదువును కొనసాగించారు. వారి సూచన మేరకే 1841లో ఆయన ఇంగ్లీష్‌ పాఠశాలలో చేరారు. అక్కడ చదువుతున్న రోజుల్లో పూలె ‘రైట్స్‌ ఆఫ్‌ మాన్‌’ అనే పుస్తకం చదివారు. దీన్ని థామస్‌ పెయిన్‌ రాశారు. సమాజంలో సంభవించే మార్పులు, చేర్పులపై ఎంతో అవగాహన ఏర్పడింది. https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj-xF5osR5SqPC6oG2J6PrsjaG8yuwuJouu6PT9OZyQF70na-_gJr05PrI4IE3QvNhsEAp9F0uahG5IDes2lLul0BLQc886nPMdUGHI5xtXHch2lR0BO9tdSY_VVPb_w9Our6D73WXcooQE/s1600/phule.jpg
చదువు పూర్తిచేసుకున్న ఫూలె అందరిలా ఉద్యోగంలో చేరలేదు. తండ్రికి వ్యాపారంలో సహకరించారు. ఈ సమయంలోనే అంటే 1848లో ఆయన జీవితంలో ఓ గొప్ప సంఘటన చోటుచేసుకుంది. ఒకరోజు ఆయన తన స్నేహితుని ఇంట పెళ్లికి వెళ్లారు. అక్కడ అగ్రకులాలకు చెందినవారి హేళనతో మనస్తాపానికి గురయ్యారు. దీన్ని సామాజిక అసమానతగా ఖండించారు. దీన్ని అధిగమించడానికి ఈ తరహా దుష్టచర్యలకు సరైన మందూ విద్యమాత్రమే అని ఆయన గ్రహించారు. శూద్రలు, అతి శూద్రులనే అణగారిని వర్గాల స్వేచ్ఛా స్వాతంత్రాలకు, గౌరవమర్యాదలు కాపాడేందుకు విద్య ఒక్కటే సరైన ఆయుధమని, మార్గమని తెలుసుకున్నారు. సమాజంలో అజ్ఞానాన్ని, దారిద్య్రాన్ని తొలగించడానికి సమానత్వం నెలకొల్పడానికి కృషిచేయడం ప్రారంభించారు.

ఒక సామ్రాజ్య సంకేతం - టాటాగ్రూప్‌

టాటా కంపెనీ రూపశిల్పులు
జంషెడ్‌జీ టాటా
jamshedji 

భారతదేశంలో ఎంతో పేరున్న టాటా కంపెనీ ఇప్పటిది కాదు. 1868లో టాటా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ప్రారంభమైంది. అంటే 148 ఏళ్ల కిందట ప్రారంభమైంది. జంషెడ్‌జీ నస్సెర్‌వాన్‌జీ టాటా గ్రూప్‌ కంపెనీల వ్యవస్థాపకుడు. టాటా కంపెనీలకు ఆయన పితామహుడు. ఈరోజు టాటా ఇంతగా విస్తరించిందంటే అది ఆయన వేసిన పునాదివల్లే.

దోరాబ్జీ టాటా
dorabjitata1 

టాటా గ్రూప్‌లో ఈయన టాటా స్టీల్‌, టాటా పవర్‌ సంస్థలను ప్రారం భించారు. టాటా గ్రూప్‌లో ఇప్పటికీ ఈ రెండు కంపెనీలే కీలకంగా ఉన్నా యి. ఒకవంక కొత్త కంపెనీలను ప్రారంభించడమే కాక, మరోవైపు భారత విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ -ఐఐఎస్‌సి) ప్రారంభానికి ఆయన నిధులిచ్చి సహకరించారు. బెంగళూరు వెలుపల నెలకొన్న మొదటి పరిశోధనా సంస్థ ఇది.

నౌరోజీ సక్లత్‌వాలా
past_chair_saklatvala 

టాటా కుటుంబంతో సం బంధంలేని బయటి వ్యక్తి నౌరోజీ. సైరస్‌కు టాటాలతో దూరపు చుట్టరికం ఉన్నా, నౌరోజీకి అది కూడా లేదు. టాటా కుటుంబంతో సం బంధం లేకుండా ఆ గ్రూప్‌ నకు ఛైర్మన్‌ అయిన ఘనత ఈయనది.

జహన్‌గీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌ టాటా
jahangir-ratanji 

టాటా కంపెనీల విస్తరణకు ఈయన ఎంతో కృషి చేశారు. నేడు ఉన్న అనేక టాటా కంపెనీలకు ఆయన పునాదులు వేశారు. జెఆర్‌డి టాటాగా ఈయన ప్రసిద్ధిచెందారు. జెఆర్‌డి టాటా కంపెనీకి వచ్చేనాటికి ఆ గ్రూప్‌లో 14 సంస్థలే ఉండేవి. వాటిని 95 సంస్థలుగా విస్తరించిన ఘనత ఈయనకే దక్కుతుంది. జెఆర్‌డికి విమానయానమంటే మక్కువ. ఆ అభిరుచితో ఈయన టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని జాతీయం చేసి, ఎయిర్‌ ఇండియాగా మార్చింది. సర్‌ దోరాబ్జీ టాటా ట్రస్ట్‌కు ఆయన ట్రస్టీగా ఉన్నప్పుడు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టిఐఎఫ్‌ఆర్‌), టాటా మెమోరియల్‌ సెంటర్‌ ఫర్‌ కేన్సర్‌ రీసెర్చ్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిఐఎస్‌ఎస్‌), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (ఎన్‌సిపిఏ)లను జెఆర్‌డి నెలకొల్పారు.

రతన్‌ టాటా
Ratan-Tataa 

టాటాకు ఉన్న వివిధ కంపెనీల బిజినెస్‌ను ఈయన విస్తరించారు. మొదట ఇండియాకే పరిమితమైన అనేక టాటా కంపెనీలను అంతర్జాతీయ స్థాయికి తెచ్చారు. అంతర్జాతీయ రంగంలో టాటాకు సముచిత స్థానాన్ని కల్పించారు. అంతర్జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కంపెనీలను తీర్చిదిద్దారు.

బాంబే హౌస్‌

bombay_house_tata 

టాటా గ్రూప్‌ ప్రధాన కేంద్రం బాంబే హౌస్‌. 87 ఏళ్ల నాటి బాంబే హౌస్‌ టాటా కార్పొరేట్‌ హెడ్‌క్వార్టర్స్‌. గత ఇరవై ఏళ్లలో అంటే...రతన్‌ టాటా టాటా సామ్రాజ్యానికి అధిపతి అయ్యాక బాంబే హౌస్‌లో ఎన్నో మార్పులు జరిగాయి. ఆయన బాంబే హౌస్‌లో మార్పులు చేయాల నుకున్నారు. చేశారు. అంతకుముందు జెఆర్‌డి టాటా హ యాం స్వర్ణయుగంగా భాసిందని చెప్పేవారు రతన్‌ వచ్చి చేసిన మార్పుల్ని జీర్ణించుకోలేకపోయారు.

ఆయన పగ్గాలు చేపట్టగానే, ప్రక్షాళన ప్రారంభించారు. అక్కడి పాత కాపులకు, వృద్ధతరానికి ఆయన ఉద్వాసన పలికారు. ఆ చర్య చాలామందికి నచ్చలేదు. ఆగ్రహం తెప్పించింది. నిన్నమొన్న వచ్చిన రతన్‌ ఈ మార్పులు ఎలా చేయగలరు? అంతకు ముందు జెఆర్‌డి హయాంలో ఇలాంటిది కనీవినీ ఎరగం’ అన్నారు. తనపై వచ్చిన విమ ర్శలకు రతన్‌ సమాధానం చెప్పకుండా ఉండడంతో ఆయ నపై అనుమానాలూ వచ్చాయి. ఎప్పటినుంచో ఉన్నవారిని తొలగించి విమర్శలకు గురైన రతన్‌ ఇండికా కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో మొదట కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినా, తర్వాత ప్రశంసలు పొందారు. అలాగే, నానో కారు కూడా బాంబే హౌస్‌ నుంచి వచ్చిందే. ఇది టాటా సంస్థకు మరింత పేరు తెచ్చిపెట్టింది. నానో కారు పూర్తిగా రతన్‌ టాటా ఆలోచనే అంటారు. ఇది సా మాన్య ప్రజల్లో మొదట్లో ఆసక్తిని రేకెత్తించింది. లక్ష ల్లోనే ఆర్డర్లు వచ్చాయి. కానీ, ప్రస్తుతం డిమాండ్‌ తగ్గింది. కార్ల ఉత్పత్తిరంగంలో టాటా సుస్థిరస్థానాన్ని సంపాదిం చడానికి రతన్‌టాటాయే కారణమనడంలో సందేహం లేదు.

టాటాకు యువకోణం
cyrus-pallonji 

రతన్‌జీ టాటా వారసుడిగా సైరస్‌ కొత్తగా రంగంమీద కనిపిస్తున్నా ఆయనకు టాటా ఆధిపత్యం కట్టబెట్టాలన్న ఆలోచన కొన్నేళ్ల కిందటే వచ్చింది. సమర్థులైన యువతరం వారికి టాటా సారథ్యాన్ని అందివ్వాలని రతన్‌ టాటా అనుకున్నారు. ఆ ఆలోచనతోనే టాటా కంపెనీల్లో యువకులకు ప్రాధాన్యత ఇచ్చారు. 42 ఏళ్ల ఆర్‌ ముకుందన్‌ను 2008లో టాటా కెమికల్స్‌కు సిఈఓను చేశారు. 2009లో ఎన్‌ చంద్రశేఖరన్‌ను టిసిఎస్‌కు సీఈఓగా నియమించారు. అప్పుడాయన వయసు 46. అలాగే 2008లో టాటా టెలీసర్వీసెస్‌కు సారథిగా నియమితులైనప్పుడు ముకుంద్‌ రాజన్‌ వయసు కేవలం 40 ఏళ్లు.

టాటా కమ్యునికేషన్స్‌లో ఉన్నత పదవిలో నియమితులయ్యేనాటికి ఎన్‌ శ్రీనాథ్‌ వయసు 45 సంవత్సరాలు. మరో చిత్రమైన ఉదాహరణ కూడా ఉంది. బ్రోతిన్‌ బెనర్జీ 35 ఏళ్ల వయసులోనే టాటా హౌసింగ్‌కు సీఈఓగా మూడే ళ్ల క్రితమే ఎంపికయ్యారు. టాటా కంపెనీల్లో ఉన్నత పదవులు చేపట్టే నాటికి వీరందరి వయసుల సగటును తీస్తే సైరస్‌ 43 ఏళ్ల వయసు పెద్ద ఎక్కువేమీ కాదు. టాటా సంస్థల్లో ఉన్నత పదవులు చేపట్టే వారి సగటు వయ సు తగ్గించాలన్నది రతన్‌జీ ఉద్దేశం. దానిపై ఏమైనా సందే హాలుంటే అవి సైరస్‌ నియామకంతో తీరిపోయాయనే చెప్పాలి. ప్రస్తుతం టాటా కంపెనీల్లో ఉన్నత పదవుల్లో ఉన్న కొందరి వయసు 64 నుంచి 73 వరకు ఉంది.

మరి మిస్ర్తీ ఏమంటారు?
రతన్‌జీ మాదిరిగానే సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ కూడా ఆలోచి స్తారా? అన్న సందేహం కలగడం సహజం. టాటా కంపెనీల్లో ఉన్నత పదవుల్ని యువతకు కట్టబెట్టడంలో సైరస్‌ పాత్ర కూడా ఉందని ఆయనను టాటా సామ్రాజ్యానికి సారథిగా ఎంపిక చేసిన అయిదుగురి కమిటీలో ఒక సభ్యుడు తెలిపారు. టాటా కంపెనీ ల్లో యువరక్తాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన సైరస్‌కూడా ఉందని ఆయన అన్నారు. ఇతర కంపెనీల్లో సమర్థులైన వారిని తమ కంపెనీల సీఈఓలుగా, టాటా సన్స్‌ డైరెక్టర్ల బోర్డులో నియమిం చడం సాధారణంగా జరుగుతూ వస్తున్నదే. ‘యువనాయకత్వం సంస్థకు యవ్వనాన్నిస్తుంది.

కుమార మంగళం బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు సారథ్యం వహించినప్పుడు యువకులకు ప్రాధాన్య మిచ్చారు. మిస్ర్తీ సారథ్యాన్ని స్వీకరించిన తర్వాత టాటా గ్రూప్‌లో కూడా అదే జరుగుతుంది. యువతకు ప్రాధాన్యమిస్తారు’ అని ఏబీసీ కన్సల్టెంట్‌ సీఈఓ శివ్‌ అగర్వాల్‌ అన్నారు.మిస్ర్తీకి టాటా గ్రూప్‌లో అత్యున్నత పదవినిచ్చి సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారనవచ్చు. మిస్ర్తీకి కలిసొచ్చే మరొక అంశం ఏమిటంటే, ఇప్పటికే టాటాకు చెందిన అనేక సంస్థల్లో యువకులే కీలక పదవుల్లో ఉన్నారు కనుక, వారితో పని తీసుకోవడం సులభతరమవుతుంది.

వయసు మీరిన వారూ ఉన్నారు
యువకులకు ప్రాధాన్యం ఇస్తున్న మాట నిజమే అయినా, దీనికి వ్యతిరేకమైన మరో వాదం కూడా వినిపిస్తోంది. టాటా సన్స్‌ డైరెక్టర్లలో ఆయన మాత్రమే 50 ఏళ్ల లోపు వారనీ, మిగతా వారు కనీసం పదేళ్లు పెద్దవారనీ అంటున్నారు. గ్రూప్‌లో టాప్‌లో ఉన్న అయిదు కంపెనీ బోర్డుల్లో దాదాపు 50 మంది డైరెక్టర్లున్నారు. వారిలో 70 శాతం మంది 60 ఏళ్ల పైబడిన వారే.

ఎవరీ సైరస్‌ ?
pallonji 

టాటా గ్రూప్‌ సంస్థలకు రతన్‌జీ టాటా వారసుడిగా ఎన్నికైన సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ పల్లోంజీ కుటుంబానికి చెందినవారు. 2012 డిసెంబర్‌లో రతన్‌ టాటా నుంచి అధికార పగ్గాలు స్వీకరిస్తారు. మిస్ర్తీ అంటే ఎవరో ఇప్పటివరకు..అంటే టాటా గ్రూప్‌నకు రతన్‌ వారసుడిగా ఎంపికయ్యే వరకు చాలా మందికి తెలీదు. పారిశ్రా మిక మహాసామ్రాజ్యం షాపూర్జీ పల్లోంజీ సంస్థ (ఎస్‌పి) అధిపతి షాపూర్జీ పల్లోంజీ కుమారుడు. షాపూర్జీకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు షాపూర్‌, సైరస్‌. కుమార్తెలు లైలా, అలూ. ఫోర్బ్స్‌ మాగజైన్‌ అంచనా ప్రకారం షాపూర్‌జీకి 2011 నాటికి ఉన్న సంపద విలువ 8.8 బిలియన్‌ డాలర్లు అంటే రూ 45,760 కోట్లు. రతన్‌జీ టాటా వారసుడిగా ఎన్నికైన సైరస్‌ 1968 జూలై 4న పుట్టారు. లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీ నుంచి బిఇ సివిల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు.

లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో మాస్టర్‌ డిగ్రీ పొందారు. ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌లో ఫెలో.సైరస్‌ ఇదివరకు టాటా సన్స్‌, టాటా ఎల్‌క్సిసి (ఇండియా)కు డైరెక్టర్‌గా పనిచేశారు. షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ, ఫోర్బ్స్‌ గోకక్‌, అఫ్‌కాన్స్‌ ఇన్‌ఫ్రా, యునైటెడ్‌ మోటార్స్‌ (ఇండియా)తో సహా అనేక కంపెనీలకు డైరెక్టర్‌గా పనిచేశారు.సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ 1991లోనే షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌లో డైరెక్టర్‌గా చేరారు. బుధవారం టాటా గ్రూప్‌నకు రతన్‌జీ టాటా వారసుడిగా ఎన్నికైన తర్వాత సైరస్‌ ఒక ప్రకటన చేస్తూ- తను టాటా సంస్థ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, చట్టబద్ధంగా షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి వైదొలుగుతానని ప్రకటించారు.

టాటా గ్రూప్‌తో అనుబంధం
పల్లోంజీ కుటుంబానికి టాటా సంస్థతో అనుబంధం బంధుత్వంతో ఏర్పడింది. షాపూర్‌జీ కుమార్తె అలూ రతన్‌ టాటాకు సోదరుడి వరసయిన నోయల్‌ టాటాను వివాహమాడింది. ఆ రకంగా టాటా సామ్రాజ్యంతో పల్లోంజీ కుటుంబానికి అనుబంధం ఏర్పడింది.

thetata

శోభాయమాన రచయిత్రి

dheera2 
ఆమె ఒక వివాదాస్పద రచయిత్రి. స్ర్తీ స్వేచ్ఛను పరిపూర్ణంగా కోరుకునే అభ్యుదయభావాలు కలిగిన నేటి మహిళ...స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి సంవత్సరమే పుట్టడం యాధృచ్ఛికమే  అయి నా...స్వాతంత్య్ర కాలానికి ముందునాటి స్ర్తీ ఎలాంటి బానిసత్వపు సంెకళ్లలో బతికిందో...ఇప్పుడు దానికి వ్యతిరేకంగా దేశంలోని స్ర్తీలంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో...ఆధునికతను పుణికిపుచ్చుకోవాలనేది ఆమె ఆశయం. అందుేక తన కెరీర్‌ తొలినాళ్లలో మోడలింగ్‌ చేసింది. అందమైన ఆమె మోము...మోడలింగ్‌కు సరిగ్గా సరిపోతుంది. అయినా ఆమెలోని నిరంతర తపన...జర్నలిస్ట్‌గా ఎదగాలనే అకుంఠిత దీక్ష ఆమెను కుదురుగా ఒకే  చోట నిలబడనీయలేదు. http://www.topnews.in/files/Shobhaa-De.jpg
అందుకే  మోడలింగ్‌ను పక్కకు పెట్టేసింది. జర్నలిస్ట్‌గా కొత్త అవతారమెత్తింది...తొలిసారిగా దేశంలోనే సెలెబ్రిటీలమీద, బాలీవుడ్గ నటులమీద గాసిప్స్‌తో వ్యంగ్యంగా విమర్శించే ఒక మేగజైన్‌ను స్థాపించింది. ఒక మహిళగా ఆ రోజుల్లో ఇలాంటి గాసిప్‌ మేగజైన్‌ను నడిపించడానికి ఎన్ని గట్స్‌ ఉండాలి...వేటినీ లెక్కచేయని ఆమె వ్యక్తిత్వం...మరికొన్ని పత్రికలు స్థాపించేందుకు పురిగొల్పింది. అనేక జాతీయ, అంతర్జాతీయ సామాజికాంశాలపై ప్రశంసాత్మక వ్యాసాలు రాసి బెస్ట్‌ అనిపించుకున్నారు. మోడల్‌, కాపీరైటర్‌,జర్నలిస్ట్‌, స్క్రిప్ట్‌రైటర్‌, నావలిస్ట్‌గా సుపరిచితురాలైన ఆమె పేరు శోభాడే...ధైర్యసాహసాలకు మారుపేరు అదే...http://www.masala.com/images/venues/souk_al_bahar/full/shobhaaitpimages_full.jpg

శోభాడే ఒక సంచలన రచయిత్రి. ఆరుపదుల వయసులోనూ...ఇప్పటికీ అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటోంది. ఇండియన్‌ జాకా కొలీన్స్‌గా పిలువబడే శోభ అసలు పేరు శోభా రాజాధ్యక్ష...  మహారాష్టల్రోని ముంబాయిలో జనవరి 7, 1948 సంవత్సరంలో పుట్టింది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన శోభ ఆచార వ్యవహారాలలో ఇంట్లో చాలా కఠినంగా ఉండేవారు. అయినా ఆ రోజుల్లోనే ఆమె పట్టుబట్టి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. ముంబాయిలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో ఫిలాసఫీ ప్రధానాంశంగా తీసుకుని ఎంతో పట్టుదలతో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది.

dheera4 
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో...ఇంకా మన దేశంలో స్ర్తీవిద్యపై పూర్తిగా ఎవరికీ అవగాహన లేదు. పైగా దేశాలలోని చట్టాలన్నీ కూడా పురుషులకే అనుకూలంగా ఉండేవి. స్ర్తీవిద్యకు ప్రాధాన్యం అంతగాలేని ఆ రోజుల్లో ఒక మహిళ డిగ్రీ వరకూ చదవడమే గొప్ప అంశంగా భావించేవారు. అయితే కాలేజీ రోజుల్లోనే శోభ చిన్నచిన్న అభ్యుదయ కవితలు రాసుకునేది. అందరిలో ఒకదానిలా కాకుండా ఒక్కరే అందరిలో అనిపించుకోవడం గొప్పగా భావించేది శోభ. http://www.lovingyourchild.com/wp-content/uploads/2010/04/shobhaa_de.jpg
జర్నలిస్ట్‌గా తొలి అడుగు...
వనితాభ్యుదయానికి నిరంతర శ్రామికురాలిగా పనిచేయాలంటే అందుకు తప్పక ఒక ఆయుధం ఉండాలని...అందుకోసం తన కెరీర్‌నే మలుపుతిప్పిన జర్నలిజంను వృత్తిగా మలచుకుంది. మొదట్లో కొన్ని దినపత్రిక, మేగజైన్‌లలో పనిచేసిన శోభ తనే సొంతంగా ఒక పత్రిక నెలకొల్పాలని అనుకుంది. అది సాదాసీదాగా ఉండకూడదు...అంతర్జాతీయస్థాయిలో మన్ననలు అందుకునేలా ఉండాలని భావించింది. అందుకే ఒక వివాదాస్పద పత్రికను నెలకొల్పింది. అదే స్టార్‌డస్ట్‌...తొలిసారిగా అందులో సినీతారల ప్రైవేట్‌ జీవితాలను బహిరంగం చేసింది. అనేక వివాదాలతో కూడిన ఆ పత్రిక తొలినాళ్లలోనే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.
http://librarykvpattom.files.wordpress.com/2008/07/ldh1.jpg
మార్కెట్లో స్టార్‌డస్ట్‌ రాగానే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యేవి. విదేశాలలో కూడా ఈ పత్రిక అంటే క్రేజ్‌ ఏర్పడింది. అలా తను ఆరంభించిన స్టార్‌డస్ట్‌ మేగజైన్‌ అంతలా ప్రాచుర్యం పొందడంతో ఆమె మరో అడుగు ముందుకేసి సొసైటీ, సెలెబ్రిటీ అనే మేగజైన్స్‌ కూడా నెలకొల్పింది. ఇలా ఒకేసారి మూడు పత్రికల నిర్వహణ కష్టమయ్యేసరికి...ఆ తర్వాత ఆమె ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా మారి మార్కెట్లో ఉన్న వివిధ పత్రికలకే కాకుండా...అంతర్జాతీయ మేగజైన్స్‌కు కూడా ఆమె తన ప్రత్యేక వ్యాసాలను అందించేవారు. అంతర్జాతీయంగా కూడా ఆమె పేరు మారుమోగిపోయింది.

స్క్రిప్ట్‌రైటర్‌గా...
dheera3 
శోభాడే స్క్రిప్ట్‌రైటర్‌గా కొన్ని టీవీ సీరియల్స్‌కు కూడా పనిచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వాభిమాన్‌ అనే సీరియల్‌కు స్క్రిప్ట్‌ వర్క్‌ చేశారు ఆమె. ఇప్పటికీ మహిళల సమస్యలపై విభిన్న కోణాలలో ఆలోచనలు చేస్తుంటారు. దిలీప్‌డేను తన రెండవ భర్తగా పెళ్లాడారు. శోభాడేకు ఆరుగురు పిల్లలు. ఒక పక్క ఇన్ని రచనలు చేస్తూనే ఇంటిపనులు కూడా బాధ్యతా యుతంగా నిర్వర్తించేవారు. భర్త దిలీప్‌ డే కూడా శోభకు అనుకూలమైన భర్త. ఆమె స్వేచ్ఛకు ఏనాడూ అతడు అడ్డురాలేదు. http://www.yahindnews.com/wp-content/uploads/2010/10/Shobha-de.jpg
తన ఎదుగుదలలో భర్త ప్రోత్సాహం మరువలేనిదని ఆమె అంటుంది. 1980 సంవత్సరంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో సండే మ్యాగజైన్‌ సెక్షన్‌ విజయవంతంగా నిర్వహించేది. ఆ పత్రికలో ముంబాయిలో తారల వ్యక్తిగత జీవితాలను ఎండగట్టేది. వారు ఎలాంటి తప్పు పనులు చేసినా శోభ వెంటనే తన కలానికి పదునుపెట్టేది. ప్రస్తుతం ఆమె స్వేచ్ఛాయుత జీవితానికి అనుగుణంగా తను వివిధ పత్రికలకు ఇప్పటికీ కాలమిస్ట్‌గా వ్యవహరిస్తోంది. http://www.dancewithshadows.com/politics/wp-content/uploads/2008/11/shobhaa-de.jpg
వివాదాలు...
శోభాడే స్త్రీల గురించి మాట్లాడుతూ మన దేశంలో మహిళలు సెక్స్‌ భావాలను మగవారు స్వేచ్ఛగా వ్యక్తీకరించినట్లుగా చెప్పలేకపోతున్నారు అని ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచేవారు. శృంగారం అనేది తప్పుకాదని అది కూడా ఒక కళ అని...అయితే కళారాధన పేరుతో శృతిమించరాదని ఆమె వాదన. ఆమె తన రచనలలో తరచుగా శృంగార భావనలను బాహాటంగానే వ్యక్తీకరించేవారు. అందుకే ఆమె కొంతమంది దృష్టిలో శృంగార నవలారాణి. అయితే ఈ విషయాన్ని మాత్రం శోభ ఖండిస్తారు. నవరసాలలో ఉన్న అన్ని అంశాలతోపాటు శృంగారం కూడా స్మృజించాల్సిన అంశమే అని ఆమె వాదిస్తారు. మూఢాచారాల మాటున స్ర్తీకి శృంగార స్వేచ్ఛ కల్పించకపోవడం కూడా ఒకరకంగా కట్టుబానిసత్వమే అంటారామె. అయితే ఈ విషయంలో మన దేశం ఇంకా అటువంటి స్థాయిలో లేదు కాబట్టి కొందరు స్ర్తీలు కూడా శోభాడేను ఆ రోజుల్లో తప్పుబట్టారు.
http://www.itimes.com/files/rsz/fit_s_180x230/files/06-2010/558630/29efe676a02a78c169a10adff2a22023_1275464316.jpg
మోడల్‌గా తొలిరోజుల్లో
dheera1 
శోభా తన కెరీర్‌ తొలిరోజుల్లో మోడలింగ్‌ చేసింది. వ్యాపార ప్రకటనలకు, కొన్ని సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఆమె తనకీ వృత్తిలో తృప్తిలేదని భావించింది. పైగా గ్లామర్‌ ఫీల్డ్‌... కొంతకాలానికి మరొకరు...ఆ తర్వాతకాలానికి ఇంకొకరు...ఇలా వస్తునేవుంటారు. కేవలం రెండు లేక మూడు సంవత్సరాల కెరీర్‌ ఉండే ఫీల్డ్‌ అని భావించింది. ఏ రంగంలో ఉన్నా కూడా స్త్రీల సమస్యలపట్ల తీవ్రంగా ఆలోచించేది. పురుషులతో సమానంగా స్ర్తీలు కూడా ఉండాలని ఆమె అభిలాష.http://timesofindia.indiatimes.com/thumb.cms?photoid=4229678&width=415&resizemode=4http://images.indiaplaza.in/books/9788/1899/9788189917418.jpg

ఆమె రాసిన పుస్తకాలు
  • శోభా ఎట్‌ సిక్ట్సీ (2010)
  • సంధ్యాస్‌ సీక్రెట్‌ (2009)
  • సూపర్‌ స్టార్‌ ఇండియా-ఫ్రమ్‌ ఇంక్రెడిబుల్‌ టు అన్‌ స్టాపబల్‌
  • స్ట్రేంజ్‌ అబ్సెషన్‌
  • స్నాప్‌ షాట్స్‌
  • స్పౌస్‌-ది ట్రుత్‌ అబౌట్‌ మ్యారేజ్‌
  • స్పీడ్‌ పోస్ట్‌(1999)
  • సరెవైవింగ్‌ మెన్‌(1998)
  • సెలెక్టివ్‌ మెమోరి (1998)
  • సెకండ్‌ థాట్‌(1996)
  • స్మాల్‌ బిట్రేయల్‌ (1995)
  • షూటింగ్‌ ఫ్రమ్‌ హిప్‌ (1994)
  • అన్‌ సర్టెన్‌ లైజన్స్‌ (1993)
  • స్టారీ సిస్టర్స్‌ (1989)
  • సోషలైట్‌ ఈవ్‌నింగ్‌ (1989) 
  • http://im.rediff.com/getahead/2009/dec/04shobhaa.jpg

Friday, November 25, 2011

తెరచిన పుస్తకం ఆర్ .‌కె. నారాయణ్

ఆర్‌.కె. నారాయణ్‌గా సుప్రసిద్ధుడైన రాసిపురం కృష్ణస్వామి అయ్యర్‌ నారాయణస్వామి ప్రఖ్యాత భారతీయ రచయిత. ఆయన రచనలలో కాల్పనికత ఎక్కువగా కనిపిస్తుంది. ఒక కాల్పనిక పట్టణంలో ఉన్న మనుషూలు, వాళ్ల వ్యవహారాల గురించి ధారావాహిక నవలలు వ్రాసారు. ఆంగ్ల భాషలో భారతీయ సాహిత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి నారాయణ్‌.

The-Financial-Expert-by-R.K 
భారత దేశానికి చెందిన ఆంగ్ల భాష నవల రచయితలలో అత్యుత్తమ గొప్పవారిలో ఒకరిగా అరుదయిన అఖండ కీర్తిప్రతిష్టలను అందుకున్నారు.తన గురువు మరియు మిత్రుడైన గ్రహంగ్రీన్‌ సహాయంతో నారాయణ్‌ వెలుగులోకి వచ్చారు. అయిన రాసిన మొదటి నాలుగు పుస్తకాలను ప్రచురించడానికి ప్రచురణకర్తలను ఒప్పించడంలో గ్రహంగ్రీన్‌ ముఖ్య పాత్ర పోషించారు. వీటిలో, స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ , ది బ్యాచిలర్‌ అఫ్‌ ఆర్ట్‌‌స. ది ఇంగ్లీష్‌ టీచర్‌ అనే మూడు సగం-స్వీయచరిత్ర పుస్త్త్తకాలు ఉన్నాయి. http://www.iloveindia.com/indian-heroes/pics/rk-narayan.jpg
1951 సంవత్సరపు అత్యుత్తమ అసలైన నవలగా పేరొందిన ది ఫైనాన్షియల్‌ ఎక్సెపర్ట్‌ మరియు సాహిత్య అకాడమీ పురస్కారం గెలిచిన ‘ది గైడ్‌’ నారాయణ్‌ నవలలలో ధీటుగా నిలిచింది. ‘ది గైడ్‌’ నవల హిందీ, ఆంగ్ల భాషలలో ...బ్రాడ్వేలో సినిమాగా కూడా తీయడం జరిగింది. 
http://piyushaggarwal.com/wp-content/uploads/2010/06/malgudi-days.jpg
నారాయణ్‌ వ్రాసిన కథలలో ఎక్కువగా మాల్గుడి అనే ఒక కల్పిత పట్టణములో జరుగుతాయి. మొదటిసారి ఈ పట్టణం స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ నవలలో పరిచయం చేయబడింది. అయిన కథలు సామాజిక సంబంధాలని ఎత్తి చూపి, రోజూవారి జరిగే యదార్ధ సంఘటనల ద్వారా పాత్రలకు ప్రాణం పోస్తాయి. నిజమనిపించే ఒక కల్పిత పట్టాణాన్ని సృష్టించి, దాని ద్వారా రోజువారీ సామాన్య జీవితములోని హాస్యం, శక్తిని బయటకు చూపి, తన రచనలో దయ, మానవత్వం చూపిన విల్లియం ఫాక్నేర్‌తో ఆయినని పోలుస్తారు.

rk_narayans 
అరవై ఏళ్ళకు పైబడిన రచయిత వృత్తిలో, నారాయణ్‌కు అనేక పురస్కారాలు, గౌరవాలు అందాయి. రాయల్‌ సొసైటీ అఫ్‌ లిటరేచర్‌ నుండి బెన్సన్‌ మెడల్‌ మరియు భారత దేశపు రెండవ అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ని నారాయణ్‌ అందుకున్నారు. అయిన కొంతకాలం రాజ్యసభ సభ్యునిగా కూడా నామినేట్‌ అయ్యారు.తొలినాళ్లలో...అర్‌.కే. నారాయణ్‌ అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ ప్రాంతంలో జన్మించారు. అయిన తండ్రి ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. నారాయణ్‌ తన విద్యాజీవితములో కొంత కాలం తండ్రి పాఠశాలలో గడిపారు. ఉద్యోగ రీత్యా అయిన తండ్రి తరచూ బదిలీ అవుతూ ఉండడంతో, నారాయణ్‌ తన బాల్యములో కొంత బాగాన్ని అమ్మమ్మ పార్వతి రక్షణలో పెరిగారు.

అదే సమయంలో, ఒక నెమలి, అల్లరి కోతి ఆయినకు ఆప్తమిత్రులుగా ఉండేవట. ఆయిన అమ్మమ్మ ఆయినకి కుంజప్ప అని ముద్దుపేరు పెట్టారు. అయిన కుటుంబీకుల మధ్య ఈ పేరు నిలిచిపోయింది. ఆమె నారాయణ్‌కు గణితం, పురాణాలు, భారతీయ శాస్ర్తీయ సంగీతం, సంస్కృతం నేర్పించారు. అయిన తమ్ముడు అర్‌.కే. లక్ష్మణ్‌ సుప్రసిద్ధ కార్టూనిస్టు. వాళ్ల ఇంట్లో అంతా సహజంగా ఆంగ్లంలోనే సంభాషించేవారు. నారాయణ్‌ అయిన తోబుట్టువులు ఏదైనా వ్యాకరణ తప్పులు చేస్తే, కుటుంబీకులు సహించే వారు కాదు. అమ్మమ్మతో ఉన్నప్పుడు నారాయణ్‌ పురసవాకంలోని లూథరన్‌ మిషన్‌ స్కూల్‌, సి.ఆర్‌.సి. హైస్కూల్‌, క్రిస్టియన్‌ కాలేజీ హై స్కూల్‌లలో విద్యాభ్యాసం చేశారు. నారాయణ్‌ చిన్నతనం నుంచే పుస్తకాల పురుగు. చిన్నతనంలోనే అయిన డికెన్స్‌, వోడ్‌ హౌస్‌, ఆర్థర్‌ కోనన్‌ డోయల్‌, థామస్‌ హర్డి వ్రాసిన పుస్త్తకాలను చదివారు.

500 
12 సంవత్సరాల వయసులో నారాయణ్‌ ఒక స్వాతంత్ర పోరాట సభలో పాల్గొన్నారు. దాని పర్యావసానం మామయ్యతో తిట్లు తినాల్సివచ్చింది. వారి కుటుంబం రాజకీయానికి అతీతంగా ఉండేది అప్పట్లో. నారాయణన్‌ తండ్రికి మహారాజ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఉన్నత పాఠశాలకు బదలీ కావటంతో ఆయన కుటుంబసమేతంగా మైసూరుకు మారారు. తండ్రి పాఠశాల ప్రాంగణంలోని గ్రంథాలయంలో పనిచేస్తుండటంతో ఆర్కేకు చిన్నతనం నుంచి పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం హాబీగా మారింది. చిన్నతనం నుంచే తన ఆలోచనలన్నీ కూడా ఒక కార్యాచరణ రూపంలో పెట్టేందుకు యత్నించేవారు.

చిన్న చిన్న కవితలు, వ్యాసాలు ఇంగ్లీష్‌లో రాసేవారు ఆర్కే. ఉన్నత పాఠశాల విద్య ముగించినాక, ఆర్కే విశ్వవిద్యాలయమునకు ప్రవేశ పరీక్ష వ్రాసి సఫలీకృతుడు కాలేక, ఇంటిలోనే చదువుకుంటూ, వ్రాసుకుంటూ ఒక సంవత్సరం గడిపి, పిమ్మట 1926 సంవత్సరములో పరీక్షలో సఫలీకృతుడయ్యారు. ఆ తర్వాత మైసూరు మహారాజ కళాశాలలో చేరారు. బ్యాచిలర్‌ పట్టా పొందడానికి నారాయణ్‌ నాలుగు సంవత్సరాలు తీసుకున్నారు. ఇది మామూలుకంటే ఒక సంవత్సరము ఎక్కువ. కొంతకాలం అయిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేసారు. అయితే ప్రధాన ఉపాధ్యాయుడు ఆయినని వ్యాయమ ఉపాధ్యాయుడు స్థానములో పని చేయమనగానే ఇక ఆ రంగంలో ఉండటం ఎంతమాత్రం ఇష్టంలేక ఉద్యోగాన్ని మానేశారు. తనకు తగిన వృత్తి రచయిత అని భావించి ఇంట్లోనే ఉండి నవలలు వ్రాయడం ప్రారంభించారు.

డెవెలప్‌మెంట్‌ అఫ్‌ మారిటైం లాస్‌ అఫ్‌ సెవంటీన్త్‌-సెంచురీ ఇంగ్లాండ్‌ అనే పుస్తక గ్రంథ పరిచయం ద్వారా ఆయన తొలిసారిగా రచయితగా పరిచయం కాబడ్డారు. తర్వాత అయిన ఆంగ్ల భాష వార్తాపత్రికలు, సంచికలకు స్థానిక కథలు అప్పుడప్పుడు వ్రాయడం ప్రారంభించారు.మొదటి సంవత్సరం అయిన సంపాదన తొమ్మిది రూపాయిల పన్నెండు అణాలు. రాయడం ద్వారా సంపాదన ఎక్కువ రానప్పటికీ ఆయినకి ఒక స్థిరమైన జీవితం ఏర్పడింది. కాకపోతే ఆయనకు అవసరాలు బాగా తక్కువగా ఉండేవి. అసాధరణమైన వృత్తిని అయిన ఎన్నుకున్నందుకు అయిన కుటుంబం, మిత్రులు ఆయినకు సహకరించి గౌరవించారు.
http://www.exoticindia.com/books/rk_narayans_malgudi_days_volume_hindi_dvd_video_icl083.jpg
1930లో నారాయణ్‌ తన మొదటి నవల స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ని వ్రాసారు. అనేక ప్రచురణకర్తలు ఆ నవలని తిరస్కరించారు. ఈ పుస్త్తకంలోనే నారాయణ్‌, దేశ సామాజిక వాతావరణాన్ని చూపించే మాల్గుడి అనే ఒక పట్టణాన్ని సృష్టించారు.

టర్నింగ్‌పాయింట్‌

1933లో కోయంబత్తూర్‌లో తన ప్రక్కనే నివసిస్తున్న రాజం అనే 15 సంవత్సరాల అమ్మాయిని కలిసి ఆమెతో ప్రేమలో పడ్డారు ఆర్కే. ఎట్టకేలకు ఆ అమ్మాయి తండ్రి ఆమోదం పొంది ఆమెని వివాహం చేసుకున్నారు. వివాహం పిమ్మట, నారాయణ్‌ ‘ది జస్టిస్‌’ అనే ఒక మద్రాస్‌ పత్రికకు విలేకరి అయ్యారు. అది బ్రాహ్మిణ్‌-కాని వారి ప్రయోజనాలు మీద శ్రద్ధ చూపిస్తున్న పత్రిక. వారి పక్షాన ఒక బ్రాహ్మణ్‌ అయ్యర్‌ ఉండడం ప్రచురణకర్తలకు ఉత్సాహం కలిగించింది. ఈ ఉద్యోగం ద్వారా అయిన రకరకాల జనాలు, వారి సమస్యలతో పరిచయం ఏర్పడింది. అంతకు ముందు ఆర్కే స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ నవల యొక్క వ్రాతప్రతిని ఆక్స్‌ఫర్డ్‌లోని ఒక మిత్రునికి పంపారు.
ఆ మిత్రుడు ఆ ప్రతిని గ్రహంగ్రీన్‌కు చూపించారు. గ్రీన్‌ ఆ పుస్త్తకాన్ని తన ప్రచురణకర్తకు సిఫార్సు చేస్తే, ఆ పుస్త్త్తకం చివరిగా 1935లో ప్రచురించబడింది. ఆంగ్లం మాట్లాడే ప్రేక్షకులకు సులువుగా ఉండే విధంగా పేరుని క్లుప్తం చేసుకోమని ఆర్కేకు గ్రీన్‌ సలహా ఇచ్చారు. ఆ పుస్తకం అర్ధ-స్వయచరిత్ర లాగ ఉండి, అయిన బాల్యం నుండి అనేక సంఘటనల ఆధారంగా వ్రాయబడింది. పుస్త్తకం గురించి మంచి విమర్శలు వచ్చినప్పటికీ, అమ్మకాలు మాత్రం తక్కువగానే ఉండేవి. ఆర్కే తర్వాత రాసిన నవలది బ్యాచిలర్‌ అఫ్‌ ఆర్ట్‌‌స (1937) కొంత వరకు అయిన కళాశాల అనుభవ స్ఫూర్తితో వ్రాయబడింది. ఒక తిరగబడే బాలుడు సర్దుకోగలిగిన... ఎదిగిన వ్యక్తిగాగా మార్పుచెందే పరిస్థితిని గురించి ఈ పుస్తకం వివరిస్తుంది.

Saturday, November 19, 2011

కూతుళ్లకు రోల్‌ మోడల్స్‌ ..... రోల్‌ మోడల్‌ ఫాదర్స్‌

నేడు ఆడ పిల్లల సంరక్షణలో తల్లితో పాటు తండ్రి కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. ఆడ పిల్లల ఆలానాపాలనలో తల్లితో పాటు తండ్రి కూడా ముందుంటున్నాడు. ఒకప్పుడు పిల్లల పెంపకం, వారిని ఆలనాపాలనా అంతా తల్లిదే బాధ్యత అని భావిస్తుండేవారు. నేడు కాలం మారింది. దాంతో పాటు తండ్రులు కూడా తమ కూతుళ్లను చక్కగా పెంచి వారిని ఉన్నత స్థానాల్లో నిలుపుతున్నారు. తమ కూతుళ్లకు రోల్‌ మోడల్స్‌గా నిలుస్తూ తామున్న రంగంలో వారిని కూడా పైకి తీసుకువస్తున్నారు. ఇటువంటి వారిలో సినీ రంగాన్ని తీసుకుంటే ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు, దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విలక్షణ నటుడు కమల్‌హాసన్‌లు తమ కూతుళ్లు మంచు లక్ష్మీ ప్రసన్న, సౌందర్య, శృతిహాసన్‌లను సినీ రంగంలో ఉన్నత స్థానానికి తీసుకువచ్చేందుకు వారిని అన్నివిధాలా ప్రోత్సహించారు. ఇక రాజకీయ రంగంలోనైతే జవహర్‌లాల్‌ నెహ్రూ, బాబు జగ్జీవన్‌రాంలను ఆదర్శంగా తీసుకొని వారి కూతుళ్లు ఇందిరాగాంధీ, మీరాకుమారిలు ఉన్నత పదవుల్లో పేరు,ప్రతిష్టలు తెచ్చుకున్నారు.

నేడు ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 19న ప్రతి ఏటా అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1999లో ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోలో ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. నేడు కరేబియన్‌ దీవులతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, ఆసియా, యూరప్‌, ఆఫ్రికా, నార్త్‌ అమెరికా దేశాలలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.

నెహ్రూ-ఇందిరాగాంధీ....
nehruu 
మన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ. ఆయన దేశ స్వాతంత్య్రోద్యమంలో మహాత్మా గాంధీతో కలిసి పాల్గొని దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చేందుకు అహింసా మార్గంలో పోరాడారు. జవహర్‌లాల్‌ నెహ్రూ భావి భారత దేశ నిర్మాణానికి బాటలు వేశారు. ఇక ఆయన కూతురిగా ఇందిరా ప్రియదర్శిని గాంధీ దేశ ప్రధానిగా తనదైన ముద్ర వేశారు.

తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ దేశ ప్రధానిగా 1966 నుంచి 1977వరకు వరుసగా మూడు సార్లు, 1980 నుంచి 84 వరకు నాలుగవ సారి ప్రధానిగా కొనసాగారు. శ్రీలంక ప్రధానమంత్రి సిరిమావో బండారనాయకే తర్వాత ప్రపంచంలోనే ఎక్కువ సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా కొనసాగిన మహిళగా రికార్డు సృష్టించారు. తన తండ్రి ప్రారంభించిన ప్రగతి విధానాలను ముందుకు కొనసాగించి దేశ అభివృద్దికి ఆమె ఎంతో కృషిచేశారు. నాటి సోవియట్‌ యూనియన్‌తో మన దేశానికి మంచి సంబంధాలను నెలకొల్పిన ఘనత ఆమెకు దక్కుతుంది.

జగ్జీవన్‌రాం-మీరాకుమార్‌
meera-kumar 
బడుగువర్గాల నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా పేరుతెచ్చుకున్న వ్యక్తి బాబు జగ్జీవన్‌ రామ్‌. బీహార్‌కు చెందిన ఆయన ఆలిండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ను ప్రారంభించడంలో కీలక పాత్ర వహించారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వంలో యంగెస్ట్‌ మినిస్టర్‌ అయిన ఆయన తొలి కేంద్ర కార్మిక శాఖమంత్రి. బడుగులకు సాంఘీక న్యాయం కోసం నిరంతరం పోరాడిన బాబు జగ్జీవన్‌రాం తన కూతురు మీరా కుమారిని సైతం తన అడుగుజాడల్లో నడిపించారు.

తండ్రిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఆమె అయిదుసార్లు పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపికవ్వడం విశేషం. దేశ తొలి మహిళా స్పీకర్‌గా 2009 జూన్‌ 3న పదవీబాధ్యతలు స్వీకరించిన ఆమె నాటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. న్యాయవాది అయిన ఆమె 2004 నుంచి 2009 వరకు కేంద్ర సాంఘీక సంక్షేమ, సాధికారికత మంత్రిగా బడుగులకు సాంఘీక న్యాయం జరిగేందుకు తన వంతు కృషిచేశారు.
 
రజనీకాంత్‌-సౌందర్య...
rajini 
దక్షిణ భారతదేశ సినీ సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ గురించి తెలియని దక్షిణాది సినీ ప్రియులు ఉండరు. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో సైతం పలు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న హీరో ఆయన. ఆసియాలోనే జాీచాన్‌ తర్వాత అత్యధికంగా పారితోషికం తీసుకున్న హీరోగా రజనీకాంత్‌ పేరు తెచ్చుకున్నారు. ఈ సూపర్‌స్టార్‌ తనయురాలే సౌందర్య.

ఆమె తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని సినీ రంగంలోకి ప్రవేశించి సినీ నిర్మాతగా, ఫిల్మ్‌ గ్రాఫిక్‌ డిజైనర్‌గా, దర్శకురాలిగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆమె పలు తమిళ చిత్రాలకు పనిచేసి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సినీ రంగంలో రాణించేందుకు రజనీకాంత్‌ తన కూతురును ఎంతగానో ప్రోత్సహించారు. ఓచర్‌ పిక్చర్‌ ప్రొడక్షన్స్‌ వ్యవస్థాపకురాలు, ఛీప్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన సౌందర్య సినీ నిర్మాణ రంగంలో తనదైన శైలిని కనబరిచారు. 2007లో ఓచర్‌ స్టూడియోస్‌ వార్నర్‌ బ్రదర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఒప్పందం కుదుర్చుకొని తమిళ చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌ చేస్తుండడం విశేషం.

తండ్రి మోహన్‌బాబు ప్రోత్సాహంతో సినీ నటిగా, నిర్మాతగా, టెలివిజన్‌ ెస్ట్‌గా నేడు లక్ష్మీ ప్రసన్న ఎంతో పాపులారిటీ సంపాదించారు. తండ్రిని ఆదర్శంగా తీసుకొని నటనా రంగంలో రాణిస్తున్న మంచు లక్ష్మి ఒకలెమా సిటీ యూనివర్సిటీలో థియేటర్‌ బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తిచేశారు. అమెరికన్‌ టెలివిజన్‌ సీరీస్‌లు లాస్‌వెగాస్‌, డెస్పరేట్‌ హౌస్‌వైవ్స్‌లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న నటీమణి ఆమె.

మోహన్‌బాబు-లక్ష్మిప్రసన్న...
mohan 
టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు. మాజీ రాజ్యసభ సభ్యుడైన ఆయనకు 2007లో పద్మ శ్రీ అవార్డు దక్కింది. ఆయన కూతురే మంచు లక్ష్మీ ప్రసన్న. తండ్రి మోహన్‌బాబు ప్రోత్సాహంతో సినీ నటిగా, నిర్మాతగా, టెలివిజన్‌ హోస్ట్‌గా నేడు లక్ష్మీ ప్రసన్న ఎంతో పాపులారిటీ సంపాదించారు. సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని నటనా రంగంలో రాణిస్తున్న మంచు లక్ష్మి ఒకలహోమా సిటీ యూనివర్సిటీలో థియేటర్‌ బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తిచేశారు. అమెరికన్‌ టెలివిజన్‌ సీరీస్‌లు లాస్‌వెగాస్‌, డెస్పరేట్‌ హౌస్‌వైవ్స్‌లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న నటీమణి ఆమె. టయోటా, ఎఎఆర్‌పి, చెవ్రలెట్‌ కంపెనీల యాడ్స్‌లో సైతం దర్శనమిచ్చి మెరిసారు.

విలక్షణ నటుడైన తండ్రి కమల్‌హాసన్‌ బాటలో పయనిస్తూ శృతిహాసన్‌ నేడు సినీ నటిగా, గాయకురాలిగా, మ్యూజిక్‌ కంపోజర్‌గా రాణిస్తుండడం విశేషం. తండ్రి ప్రోత్సాహంతో ఆమె హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె 2009లో లక్‌ సినిమా ద్వారా హీరోరుున్‌గా తన సినీ ెకరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత వాల్‌ డిస్నీ చిత్రం అనగనగా ఓ ధీరుడు చిత్రంలో మెరిసి అందర్నీ అలరించారు.

కమల్‌హాసన్‌-శృతిహాసన్‌...

kamall 
భారతదేశ సినీ రంగంలో విలక్షణ నటునిగా కమల్‌హాసన్‌ పేరొందారు. దశావతారం వంటి సినిమాల్లో నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన విశ్వ విఖ్యాత నటుడు ఆయన. ఈ పాపులర్‌ హీరో కూతురే శృతిహాసన్‌. సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న తన తండ్రి బాటలో పయనిస్తూ ఆమె నేడు సినీ నటిగా, గాయకురాలిగా, మ్యూజిక్‌ కంపోజర్‌గా రాణిస్తుండడం విశేషం. ఇక తండ్రి కమల్‌హాసన్‌ ప్రోత్సాహంతో శృతిహాసన్‌ హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె 2009లో లక్‌ సినిమా ద్వారా హీరోయిన్‌గా తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత వాల్‌ డిస్నీ చిత్రం అనగనగా ఓ ధీరుడు చిత్రంలో మెరిసి అందర్నీ అలరించారు.
 

Tuesday, November 15, 2011

ఒక మంచి పుస్తకం గ్లింప్సెస్‌ ఆఫ్‌ వరల్డ్‌ హిస్టరీ

1889 సంవత్సరం నవంబర్‌ 14న జన్మించిన చాచానెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా మనం జరుపుకుం టున్నాము. ఈ సందర్భంగా చాచా నెహ్రూ తన కుమార్తె ఇందిరాగాంధీకి చిన్నతనంలో ఎటువంటి బహుమతి ఇచ్చాడో తెలుసుకుందామా...


nehruu 
నెహ్రూ ఆయన తన కుమార్తె ఒకసారి ఇందిరకు భారతదేశచరిత్రతో పాటు ప్రపంచ చరిత్ర పట్ల అవగాహన కలిగించాలని సంకల్పించారు. ఇందుకోసం ఆయన జైలులో ఉన్నప్పుడు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన తన కుమార్తెకు రెండు మూడు రోజులకు ఒక ఉత్తరం చొప్పున మూడు నాలుగు సంవత్సరాలు నిరాటంకంగా వ్రాసారు. ఇవి మొత్తం 196 ఉత్తరాలు. ఈ జాబుల పరంపర 1930వ సంవత్సరం అక్టోబర్‌ నెలలో మొదలై 1933 ఆగస్ట్‌ వరకూ కొనసాగింది. http://upload.wikimedia.org/wikipedia/en/thumb/3/39/Glimpses_of_World_History_book_cover.jpg/200px-Glimpses_of_World_History_book_cover.jpg
http://upload.wikimedia.org/wikipedia/en/thumb/3/39/Glimpses_of_World_History_book_cover.jpg/200px-Glimpses_of_World_History_book_cover.jpghttp://upload.wikimedia.org/wikipedia/en/thumb/3/39/Glimpses_of_World_History_book_cover.jpg/200px-Glimpses_of_World_History_book_cover.jpghttp://upload.wikimedia.org/wikipedia/en/thumb/3/39/Glimpses_of_World_History_book_cover.jpg/200px-Glimpses_of_World_History_book_cover.jpg


తదనంతర కాలంలో ఈ జాబులన్నీ ‘గ్లింప్సెస్‌ ఆఫ్‌ వరల్డ్‌ హిస్టరీ’ పేరుతో వేయి పేజీల ఒక పెద్ద గ్రంథంగా ప్రచురింపబడ్డాయి. ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ వారు ఈ గ్రంథాన్ని చాలా కాలంపాటు సబ్సిడీ ధరకు అందించారు. ఐతే ఇటీవలి కాలంలో ఈ ప్రతులు మార్కెట్లో లభించడం లేదు. ప్రస్తుతం పెంగ్విన్‌ వారి ప్రతులే అందుబాటులో ఉన్నాయి. ఐతే అవి కొంచెం ధర ఎక్కువ. నెహ్రూ గారి రచన కనుక ఈ పుస్తకం ఏ గ్రంథాలయంలోనైనా లభించగలదు. ఈ ఉత్తరాలు ఆంగ్ల భాషలో వ్రాయబడ్డాయి. ఐతే అవన్నీ పదమూడేళ్ళ వయసులో ఉన్న తన చిన్నారి కుమార్తెను ఉద్దేశించినవి కనుక నెహ్రూ వీటిలో చాలా సులువైన భాషనే ఉపయోగించారు.


జవహర్‌లాల్‌ నెహ్రూ భారత దేశ తొలి ప్రధానిగా చేశారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ప్రముఖ నాయకుడు. పండిత్‌జీగా ప్రాచుర్యం పొందిన ఈయన రచరుుత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన మూలపురుషూడు.http://upload.wikimedia.org/wikipedia/en/thumb/3/39/Glimpses_of_World_History_book_cover.jpg/200px-Glimpses_of_World_History_book_cover.jpg
http://upload.wikimedia.org/wikipedia/en/thumb/3/39/Glimpses_of_World_History_book_cover.jpg/200px-Glimpses_of_World_History_book_cover.jpghttp://upload.wikimedia.org/wikipedia/en/thumb/3/39/Glimpses_of_World_History_book_cover.jpg/200px-Glimpses_of_World_History_book_cover.jpg
సాధారణమైన ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉన్నవారు సైతం వీటిని చదివి అర్ధం చేసుకోవచ్చు. ఈ గ్రంథం చదివేటప్పుడు నెహ్రూలో మనకు ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడు కాక తన కుమార్తెను ఒక గొప్ప నాయకురాలిగా తీర్చిదిద్దాలని తపనపడే ఒక తండ్రి మాత్రమే కనిపిస్తాడు. ఈ గ్రంథం ఏ మాత్రం విసుగనిపించదు. సంవత్సరాలను అవసరమైనంత మేరకే సాధ్యమైనంత తక్కువగా పేర్కొంటూ చరిత్రలో అసలేమి జరిగింది అన్నదానికే ప్రాధాన్యతనిస్తూ చాలా ఆసక్తికరంగా నెహ్రూ దీన్ని రచించారు. ఈ గ్రంథాన్ని చదివే కొద్దీ ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపనను మనలో కలుగజేస్తూ ఉంటుంది.


జవహర్‌ లాల్‌ నెహ్రూ ఈ గ్రంథంతో పాటు తన ఆత్మ కథ అయిన ‘యాన్‌ ఆటోబయోగ్రఫీ’ అనే గ్రంథాన్నీ మరియూ భారత దేశ చరిత్రను,దాని యొక్క పురాతన వైభవాన్ని, దాని ఘన సంస్కృతిని మిగతా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’ అనే గ్రంథాన్ని కూడా రచించారు. ఐతే ఈ మూడింటిలో ‘గ్లింప్సెస్‌ ఆఫ్‌ వరల్డ్‌ హిస్టరీ’ అనబడే ఈ గ్రంథమే అత్యంత ప్రజాదరణ పొందినది. ఈ గ్రంథం చదివిన తరు వాత ఎవరికైనా ప్రపంచ చరిత్ర గురించి పూర్తి అవగాహన కలుగుతుంది.
http://www.festivalsofindia.in/id/childrenday/img/nehru.jpg
ఒక్క భారతదేశ యు వతకేగాక యావత్‌ ప్రపంచ దేశాలలోని యువత మొత్తానికీ ఉపయుక్తమయ్యే విధంగా ఈ ఉత్తరాలను రచించి నెహ్రూ ఒక అంతర్జాతీయ స్థాయి నాయ కుడిగా తన స్థానాన్నీ,స్థాయినీ ఇనుమడిం పేసు కున్నారు. పండిత్‌జీగా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ - గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు. నెహ్రూ ఉత్తర్రపదేశ్‌ రాష్ట్రంలోని అలహాబాదు నగరం నందు జన్మించారు. స్వరూపరాణి, మోతీలాల్‌ నెహ్రూ దంపతులకు మొదటి సంతానం. వీరు కాశ్మీరుకు చెందిన సరస్వతి బ్రాహ్మణ కులమునకు చెందినవారు. న్యాయవాది ఉద్యోగం నిమిత్తం కుటుంబం అలహాబాదుకు వలస మార్చింది.


మోతీలాల్‌ న్యాయవాదిగా బాగా రాణించి, తన కుటుంబానికి సకల సంపదలు సమకూర్చారు. నెహ్రూ అయన తోబుట్టువులు అనంద్‌భవన్‌ అనే ఒక భవంతిలో ఉంటూ, దుస్తుల విషయంలో హావభావాల వ్యక్తీకరణలో పాశ్చాత్య నాగరికులవలె మెలిగేవారు. వీరంతా హిందీ, సంస్కృతంతో పాటు ఆంగ్లంలో కూడా తర్ఫీదు ఇవ్వబడ్డారు. నెహ్రూ 15 సంవత్సరాల వయస్సులో ఇంగ్లాండుకు పయనమయ్యాడు. అంతకముందు విద్యాబ్యాసం అంతా ఇంటి వద్ద... ఇంకా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పాఠశాలలందు జరిగింది. మొదట ఇంగ్లాండులో హారో పాఠశాలలో ఆ తరువాత ట్రినిటీ కళాశాలలో విద్యనబ్యసించారు నెహ్రూ. పుట్టడమే ధనికుడిగా పుట్టిన నెహ్రూ స్వాతంత్య్ర పోరాటానికి తన యావదాస్తిని ధారబోసి ఒక సాధారణ వ్యక్తివలే జీవించి ఎందరికో ఆదర్శప్రాయులయ్యారు.