Sunday, November 27, 2011

శోభాయమాన రచయిత్రి

dheera2 
ఆమె ఒక వివాదాస్పద రచయిత్రి. స్ర్తీ స్వేచ్ఛను పరిపూర్ణంగా కోరుకునే అభ్యుదయభావాలు కలిగిన నేటి మహిళ...స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి సంవత్సరమే పుట్టడం యాధృచ్ఛికమే  అయి నా...స్వాతంత్య్ర కాలానికి ముందునాటి స్ర్తీ ఎలాంటి బానిసత్వపు సంెకళ్లలో బతికిందో...ఇప్పుడు దానికి వ్యతిరేకంగా దేశంలోని స్ర్తీలంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో...ఆధునికతను పుణికిపుచ్చుకోవాలనేది ఆమె ఆశయం. అందుేక తన కెరీర్‌ తొలినాళ్లలో మోడలింగ్‌ చేసింది. అందమైన ఆమె మోము...మోడలింగ్‌కు సరిగ్గా సరిపోతుంది. అయినా ఆమెలోని నిరంతర తపన...జర్నలిస్ట్‌గా ఎదగాలనే అకుంఠిత దీక్ష ఆమెను కుదురుగా ఒకే  చోట నిలబడనీయలేదు. http://www.topnews.in/files/Shobhaa-De.jpg
అందుకే  మోడలింగ్‌ను పక్కకు పెట్టేసింది. జర్నలిస్ట్‌గా కొత్త అవతారమెత్తింది...తొలిసారిగా దేశంలోనే సెలెబ్రిటీలమీద, బాలీవుడ్గ నటులమీద గాసిప్స్‌తో వ్యంగ్యంగా విమర్శించే ఒక మేగజైన్‌ను స్థాపించింది. ఒక మహిళగా ఆ రోజుల్లో ఇలాంటి గాసిప్‌ మేగజైన్‌ను నడిపించడానికి ఎన్ని గట్స్‌ ఉండాలి...వేటినీ లెక్కచేయని ఆమె వ్యక్తిత్వం...మరికొన్ని పత్రికలు స్థాపించేందుకు పురిగొల్పింది. అనేక జాతీయ, అంతర్జాతీయ సామాజికాంశాలపై ప్రశంసాత్మక వ్యాసాలు రాసి బెస్ట్‌ అనిపించుకున్నారు. మోడల్‌, కాపీరైటర్‌,జర్నలిస్ట్‌, స్క్రిప్ట్‌రైటర్‌, నావలిస్ట్‌గా సుపరిచితురాలైన ఆమె పేరు శోభాడే...ధైర్యసాహసాలకు మారుపేరు అదే...http://www.masala.com/images/venues/souk_al_bahar/full/shobhaaitpimages_full.jpg

శోభాడే ఒక సంచలన రచయిత్రి. ఆరుపదుల వయసులోనూ...ఇప్పటికీ అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటోంది. ఇండియన్‌ జాకా కొలీన్స్‌గా పిలువబడే శోభ అసలు పేరు శోభా రాజాధ్యక్ష...  మహారాష్టల్రోని ముంబాయిలో జనవరి 7, 1948 సంవత్సరంలో పుట్టింది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన శోభ ఆచార వ్యవహారాలలో ఇంట్లో చాలా కఠినంగా ఉండేవారు. అయినా ఆ రోజుల్లోనే ఆమె పట్టుబట్టి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. ముంబాయిలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో ఫిలాసఫీ ప్రధానాంశంగా తీసుకుని ఎంతో పట్టుదలతో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది.

dheera4 
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో...ఇంకా మన దేశంలో స్ర్తీవిద్యపై పూర్తిగా ఎవరికీ అవగాహన లేదు. పైగా దేశాలలోని చట్టాలన్నీ కూడా పురుషులకే అనుకూలంగా ఉండేవి. స్ర్తీవిద్యకు ప్రాధాన్యం అంతగాలేని ఆ రోజుల్లో ఒక మహిళ డిగ్రీ వరకూ చదవడమే గొప్ప అంశంగా భావించేవారు. అయితే కాలేజీ రోజుల్లోనే శోభ చిన్నచిన్న అభ్యుదయ కవితలు రాసుకునేది. అందరిలో ఒకదానిలా కాకుండా ఒక్కరే అందరిలో అనిపించుకోవడం గొప్పగా భావించేది శోభ. http://www.lovingyourchild.com/wp-content/uploads/2010/04/shobhaa_de.jpg
జర్నలిస్ట్‌గా తొలి అడుగు...
వనితాభ్యుదయానికి నిరంతర శ్రామికురాలిగా పనిచేయాలంటే అందుకు తప్పక ఒక ఆయుధం ఉండాలని...అందుకోసం తన కెరీర్‌నే మలుపుతిప్పిన జర్నలిజంను వృత్తిగా మలచుకుంది. మొదట్లో కొన్ని దినపత్రిక, మేగజైన్‌లలో పనిచేసిన శోభ తనే సొంతంగా ఒక పత్రిక నెలకొల్పాలని అనుకుంది. అది సాదాసీదాగా ఉండకూడదు...అంతర్జాతీయస్థాయిలో మన్ననలు అందుకునేలా ఉండాలని భావించింది. అందుకే ఒక వివాదాస్పద పత్రికను నెలకొల్పింది. అదే స్టార్‌డస్ట్‌...తొలిసారిగా అందులో సినీతారల ప్రైవేట్‌ జీవితాలను బహిరంగం చేసింది. అనేక వివాదాలతో కూడిన ఆ పత్రిక తొలినాళ్లలోనే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.
http://librarykvpattom.files.wordpress.com/2008/07/ldh1.jpg
మార్కెట్లో స్టార్‌డస్ట్‌ రాగానే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యేవి. విదేశాలలో కూడా ఈ పత్రిక అంటే క్రేజ్‌ ఏర్పడింది. అలా తను ఆరంభించిన స్టార్‌డస్ట్‌ మేగజైన్‌ అంతలా ప్రాచుర్యం పొందడంతో ఆమె మరో అడుగు ముందుకేసి సొసైటీ, సెలెబ్రిటీ అనే మేగజైన్స్‌ కూడా నెలకొల్పింది. ఇలా ఒకేసారి మూడు పత్రికల నిర్వహణ కష్టమయ్యేసరికి...ఆ తర్వాత ఆమె ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా మారి మార్కెట్లో ఉన్న వివిధ పత్రికలకే కాకుండా...అంతర్జాతీయ మేగజైన్స్‌కు కూడా ఆమె తన ప్రత్యేక వ్యాసాలను అందించేవారు. అంతర్జాతీయంగా కూడా ఆమె పేరు మారుమోగిపోయింది.

స్క్రిప్ట్‌రైటర్‌గా...
dheera3 
శోభాడే స్క్రిప్ట్‌రైటర్‌గా కొన్ని టీవీ సీరియల్స్‌కు కూడా పనిచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వాభిమాన్‌ అనే సీరియల్‌కు స్క్రిప్ట్‌ వర్క్‌ చేశారు ఆమె. ఇప్పటికీ మహిళల సమస్యలపై విభిన్న కోణాలలో ఆలోచనలు చేస్తుంటారు. దిలీప్‌డేను తన రెండవ భర్తగా పెళ్లాడారు. శోభాడేకు ఆరుగురు పిల్లలు. ఒక పక్క ఇన్ని రచనలు చేస్తూనే ఇంటిపనులు కూడా బాధ్యతా యుతంగా నిర్వర్తించేవారు. భర్త దిలీప్‌ డే కూడా శోభకు అనుకూలమైన భర్త. ఆమె స్వేచ్ఛకు ఏనాడూ అతడు అడ్డురాలేదు. http://www.yahindnews.com/wp-content/uploads/2010/10/Shobha-de.jpg
తన ఎదుగుదలలో భర్త ప్రోత్సాహం మరువలేనిదని ఆమె అంటుంది. 1980 సంవత్సరంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో సండే మ్యాగజైన్‌ సెక్షన్‌ విజయవంతంగా నిర్వహించేది. ఆ పత్రికలో ముంబాయిలో తారల వ్యక్తిగత జీవితాలను ఎండగట్టేది. వారు ఎలాంటి తప్పు పనులు చేసినా శోభ వెంటనే తన కలానికి పదునుపెట్టేది. ప్రస్తుతం ఆమె స్వేచ్ఛాయుత జీవితానికి అనుగుణంగా తను వివిధ పత్రికలకు ఇప్పటికీ కాలమిస్ట్‌గా వ్యవహరిస్తోంది. http://www.dancewithshadows.com/politics/wp-content/uploads/2008/11/shobhaa-de.jpg
వివాదాలు...
శోభాడే స్త్రీల గురించి మాట్లాడుతూ మన దేశంలో మహిళలు సెక్స్‌ భావాలను మగవారు స్వేచ్ఛగా వ్యక్తీకరించినట్లుగా చెప్పలేకపోతున్నారు అని ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచేవారు. శృంగారం అనేది తప్పుకాదని అది కూడా ఒక కళ అని...అయితే కళారాధన పేరుతో శృతిమించరాదని ఆమె వాదన. ఆమె తన రచనలలో తరచుగా శృంగార భావనలను బాహాటంగానే వ్యక్తీకరించేవారు. అందుకే ఆమె కొంతమంది దృష్టిలో శృంగార నవలారాణి. అయితే ఈ విషయాన్ని మాత్రం శోభ ఖండిస్తారు. నవరసాలలో ఉన్న అన్ని అంశాలతోపాటు శృంగారం కూడా స్మృజించాల్సిన అంశమే అని ఆమె వాదిస్తారు. మూఢాచారాల మాటున స్ర్తీకి శృంగార స్వేచ్ఛ కల్పించకపోవడం కూడా ఒకరకంగా కట్టుబానిసత్వమే అంటారామె. అయితే ఈ విషయంలో మన దేశం ఇంకా అటువంటి స్థాయిలో లేదు కాబట్టి కొందరు స్ర్తీలు కూడా శోభాడేను ఆ రోజుల్లో తప్పుబట్టారు.
http://www.itimes.com/files/rsz/fit_s_180x230/files/06-2010/558630/29efe676a02a78c169a10adff2a22023_1275464316.jpg
మోడల్‌గా తొలిరోజుల్లో
dheera1 
శోభా తన కెరీర్‌ తొలిరోజుల్లో మోడలింగ్‌ చేసింది. వ్యాపార ప్రకటనలకు, కొన్ని సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఆమె తనకీ వృత్తిలో తృప్తిలేదని భావించింది. పైగా గ్లామర్‌ ఫీల్డ్‌... కొంతకాలానికి మరొకరు...ఆ తర్వాతకాలానికి ఇంకొకరు...ఇలా వస్తునేవుంటారు. కేవలం రెండు లేక మూడు సంవత్సరాల కెరీర్‌ ఉండే ఫీల్డ్‌ అని భావించింది. ఏ రంగంలో ఉన్నా కూడా స్త్రీల సమస్యలపట్ల తీవ్రంగా ఆలోచించేది. పురుషులతో సమానంగా స్ర్తీలు కూడా ఉండాలని ఆమె అభిలాష.http://timesofindia.indiatimes.com/thumb.cms?photoid=4229678&width=415&resizemode=4http://images.indiaplaza.in/books/9788/1899/9788189917418.jpg

ఆమె రాసిన పుస్తకాలు
  • శోభా ఎట్‌ సిక్ట్సీ (2010)
  • సంధ్యాస్‌ సీక్రెట్‌ (2009)
  • సూపర్‌ స్టార్‌ ఇండియా-ఫ్రమ్‌ ఇంక్రెడిబుల్‌ టు అన్‌ స్టాపబల్‌
  • స్ట్రేంజ్‌ అబ్సెషన్‌
  • స్నాప్‌ షాట్స్‌
  • స్పౌస్‌-ది ట్రుత్‌ అబౌట్‌ మ్యారేజ్‌
  • స్పీడ్‌ పోస్ట్‌(1999)
  • సరెవైవింగ్‌ మెన్‌(1998)
  • సెలెక్టివ్‌ మెమోరి (1998)
  • సెకండ్‌ థాట్‌(1996)
  • స్మాల్‌ బిట్రేయల్‌ (1995)
  • షూటింగ్‌ ఫ్రమ్‌ హిప్‌ (1994)
  • అన్‌ సర్టెన్‌ లైజన్స్‌ (1993)
  • స్టారీ సిస్టర్స్‌ (1989)
  • సోషలైట్‌ ఈవ్‌నింగ్‌ (1989) 
  • http://im.rediff.com/getahead/2009/dec/04shobhaa.jpg

No comments:

Post a Comment