Wednesday, November 2, 2011

అత్యున్నత సంపన్నులు ఈ అన్నదమ్ములు

మన దేశంలోనే అత్యంత శ్రీమంతుడు ముఖేష్‌ అంబానీ. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ తాజా లిస్ట్‌ ప్రకారం ఆయన దేశంలోని ధనవంతులలో మెుదటిస్థానాన్ని ఆక్రమించారు. కానీ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అతని ఆస్తుల విలువ 13,860 కోట్ల రూపాయలు తగ్గింది. ఇక ముఖేష్‌ సోదరుడు అనిల్‌ అంబానీ గత ఆరు సంవత్సరాలుగా దేశంలోని కుబేరులలో టాప్‌ టెన్‌లో ఉండగా ఈ ఏడాది ఆ లిస్ట్‌ నుంచి దిగజారడం గమనార్హం. గత ఏడాది కాలంలో అనిల్‌ అంబాని ఆస్తుల విలువ బాగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. దీంతో ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం ఈ ఏడాది ముఖేష్‌ దేశంలోనే అత్యంత కుబేరుడిగా పేరుతెచ్చుకుంటే అనిల్‌ మాత్రం దేశంలోనే పెద్ద మెుత్తంలో ధనాన్ని పోగొట్టుకున్న ధనవంతుడిగా నిలిచారు. దేశంలోని అత్యంత శ్రీమంతులైన సోదరులుగా వీరిద్దరూ నేడు ప్రపంచంలోనే పేరుతెచ్చుకున్నారు.

ముఖేష్‌ అంబానీ
ప్రపంచంలోనే తొమ్మిదవ శ్రీమంతుడు...
Muk
దేశంలోని శ్రీమంతులలో మెుదటి స్థానాన్ని దక్కించు కున్నప్పటికీ గడిచిన సంవత్సర కాలంలో ముఖేష్‌ అంబానీ ఆస్తులు తగ్గారుు. ముఖేష్‌ అంబానీ సంపద విలువ ఏడాది కాలంలో 4.4 బిలియన్‌ డాలర్లు(రూ.13,860 కోట్లు) తగ్గింది. దీంతో ప్రస్తుతం ముఖేష్‌ సంపద విలువ 22.6 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది.

ముఖేష్‌ ధీరూభాయ్‌ అంబానీ దేశంలోనే పెద్ద వ్యాపారవేత్త. కంగ్లొమెరేట్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఆయన చైర్మన్‌, మేనేజిం గ్‌ డైరెక్టర్‌. ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేట్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజ్‌గా రిలయన్స్‌ పేరొందిందని ‘ఫార్చ్యూన్‌ 500’ మ్యాగజైన్‌లో పేర్కొ న్నారు. ఇక రిలయన్స్‌ ఇండీస్ట్రీస్‌లో ఆయన వ్యక్తిగత వాటా 48 శాతం. గత ఏడాది ఫోర్బ్స్‌ లిస్ట్‌ ప్రకారం ప్రపంచంలోనే శక్తివం తమైన వ్యక్తులలో 68వ స్థానంలో ముఖేష్‌ అంబాని నిలిచారు. ఈ ఏడాది ఆయన ఆస్తుల ప్రకారం ఆసియాలోనే రెండవ ధనవంతుడి గా ఆయన నిలవగా ప్రపంచంలోని శ్రీమంతులలో తొమ్మిదవ స్థానా న్ని ఆయన అలంకరించారు. 2007లో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీల షేర్ల ధరలు విపరీతంగా పెరగడంతో ఆయ న ప్రపంచంలోని శ్రీమంతులలో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం ‘బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా కార్పొరేషన్‌’ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సభ్యులలో ఒకరైన ముఖే ష్‌ అంబానీ కౌన్సిల్‌ ఆన్‌ ఫారెన్‌ రిలేషన్స్‌లోని ఇంటర్నేషనల్‌ అడెవైజరీ బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

తగ్గిన సంపద...
తాజాగా ఫోర్బ్స్‌ విడుదల చేసిన లిస్టులో ఆయన దేశంలోనే సంపన్నుడి గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానం వైపునకు దూసుకెళ్తున్న ఆయనకు గత ఏడాది కాలం పూర్తిగా కలిసిరాలేదు. దేశంలోని శ్రీమంతులలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ గడిచిన సంవత్సర కాలంలో ఆస్తుల విలువ తగ్గింది. ముఖేష్‌ అంబానీ సంపద విలువ ఏడాది కాలంలో 4.4 బిలియన్‌ డాలర్లు(రూ.13,860 కోట్లు) తగ్గింది. దీంతో ప్రస్తుతం ముఖేష్‌ సంపద విలువ 22.6 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది.

వ్యక్తిగత జీవితం...
family
ముఖేష్‌ అంబానీకి భార్య నీతా అంబానీతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారికి ముంబరుులో దేశంలోనే అత్యంత ఖరీదైన 27 అంతస్తుల భారీ భవంతి ఉంది. అంటిలియా అని పేరుపెట్టుకున్న ఈ భవనం విలువ 77మిలియన్ల యుఎస్‌ డాలర్లు.ముఖేష్‌ అంబానీకి భార్య నీతా అంబానీతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారికి ముంబయిలో దేశంలోనే అత్యంత ఖరీదైన 27 అంతస్తుల భారీ భవంతి ఉంది. అంటిలియా అని పేరుపెట్టుకున్న ఈ భవనం విలువ 77మిలియన్ల యుఎస్‌ డాలర్లు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోని ముంబయి ఇండియన్స్‌ టీంకు ముఖేష్‌ యజమాని.
group


అవార్డులు, గౌరవాలు...

గత ఏడాది ఆసియా సొసైటి ముఖేష్‌ అంబానీని గ్లోబల్‌ విజన్‌ అవార్డుతో సన్మానించింది. అదే ఏడాది ఎన్డీటివి బిజినెస్‌ లీడర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు, ఫైనాన్షియల్‌ క్రానికల్‌ బిజినెస్‌మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు, ఇండియన్‌ మర్చంట్స్‌ ఛాంబర్‌ జురాన్‌ క్వాలిటీ మెడల్‌ ఫర్‌ 2009 అవార్డు, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ అప్లైడ్‌ సైన్స్‌ డీన్స్‌ మెడల్‌తో ఘనంగా సత్కరించాయి. 2007లో యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ లీడర్‌షిప్‌ అవార్డుతో సన్మానించింది. ఇవేగాకుండా ఎన్నో అవార్డులు, సత్కారాలను ఆయన అందుకున్నారు.

అనిల్‌ అంబానీ
ada-new24_0 

2004 నుంచి వరుసగా దేశంలోని పది మంది శ్రీమంతులలో ఒకరిగా నిలుస్తూ వస్తున్న అనిల్‌ అంబానీ ఈసారి ఆ లిస్ట్‌ నుంచి దిగజారారు. ఫోర్బ్స్‌ ధనవంతుల టాప్‌ టెన్‌ లిస్టులో ఆయనకు చోటు దక్కలేదు. గడిచిన సంవత్సర కాలంలో ఆయన సంపద 7.4 బిలియన్‌ డాలర్ల నుంచి 5.9 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోవడమే ఇందుకు కారణం.

కాలం కలిసిరాలేదు...
ముఖేష్‌ అంబానీ ఈ ఏడాది కూడా దేశంలోని శ్రీమంతుల లో మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా ఆయన తమ్ముడు అనిల్‌ అంబానీ మాత్రం దేశంలోని ధనవంతుల టాప్‌ టెన్‌ లిస్టు నుంచి తప్పుకున్నారు. ఆయనకు గడిచిన సంవత్సరం ఏమా త్రం కలిసి రాలేదు. 2004 నుంచి వరసగా దేశంలోని పది మంది శ్రీమంతులలో ఒకరిగా నిలుస్తూ వస్తున్న అనిల్‌ అంబానీ ఈ సారి ఆ లిస్ట్‌ నుంచి దిగజారారు. సంవత్సర కాలం లో ఆయ న సంపద 7.4 బిలియన్‌ డాలర్ల నుంచి 5.9 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోవడమే ఇందుకు కారణం. ఇక రిలయన్స్‌ అనిల్‌ ధీరూభా య్‌ అంబానీ గ్రూప్‌కు చైర్మన్‌ అనిల్‌ అంబానీ. పెన్సీల్వేని యాలోని వార్టన్‌ స్కూల్‌ ఆప్‌ ద యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ ఓవర్సీస్‌ సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. కాన్పూర్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, అహ్మదాబాద్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.

వ్యక్తిగత జీవితం...

Anil-Ambani-Tina-Munim-1 

అనిల్‌ అంబానీ బాలీవుడ్‌ తార టీనా మునిమ్‌ను వివాహమాడా రు. ఈ దంపతులకు అన్మోల్‌, అన్షుల్‌ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక మంచి రన్నర్‌ అయిన అనిల్‌ ముంబయి మారథాన్‌ రేసులో పాల్గొ న్నారు. ఇంగ్లీష్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్లబ్‌కు అభిమాని అయిన ఆయన 2008లో ఆ క్లబ్‌ను కొనేం దుకు ప్రయత్నించా రు. ఇక 2004లో అనిల్‌ అంబానీ రాజ్య సభ సభ్యుడిగా ఎంపికయ్యారు. బిజెపి మద్దతులో ఎంపి పదవిని పొందారు. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గం టలకు అనిల్‌ నిద్రలేస్తారు. ఆ తర్వాత వార్తాపత్రికల ను చూసి కొంత సేపు రన్నింగ్‌ చేస్తారు. ప్రతిరోజు ఆరు లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగే అనిల్‌ అంబానీకి పావ్‌బాజీ అంటే ఎంతో ఇష్టం. ఆయనకు సొంతంగా పదమూడు సీట్ల బెల్‌ 412 హెలికాప్టర్‌ ఉంది. 2001లో దీన్ని కొన్నారు.
group-d


అవార్డులు...
2009లో ఇండియా టుడే పవర్‌ లిస్ట్‌లో అనిల్‌ అంబాని మూడవ స్థానాన్ని పొందారు. 2006లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పోల్‌లో బిజినెస్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా, 2003లో ఎంటివి యూత్‌ ఐకాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. 2002లో బాంబే మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆయన్ని ద ఎంట్రప్రీన్యూర్‌ ఆఫ్‌ ద డికేడ్‌ అవార్డును అందజేసి సన్మానించింది. ఇవేగాకుండా పలు అవార్డులను సొంతం చేసుకున్నారు అనిల్‌ అంబానీ.

No comments:

Post a Comment