Saturday, November 19, 2011

కూతుళ్లకు రోల్‌ మోడల్స్‌ ..... రోల్‌ మోడల్‌ ఫాదర్స్‌

నేడు ఆడ పిల్లల సంరక్షణలో తల్లితో పాటు తండ్రి కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. ఆడ పిల్లల ఆలానాపాలనలో తల్లితో పాటు తండ్రి కూడా ముందుంటున్నాడు. ఒకప్పుడు పిల్లల పెంపకం, వారిని ఆలనాపాలనా అంతా తల్లిదే బాధ్యత అని భావిస్తుండేవారు. నేడు కాలం మారింది. దాంతో పాటు తండ్రులు కూడా తమ కూతుళ్లను చక్కగా పెంచి వారిని ఉన్నత స్థానాల్లో నిలుపుతున్నారు. తమ కూతుళ్లకు రోల్‌ మోడల్స్‌గా నిలుస్తూ తామున్న రంగంలో వారిని కూడా పైకి తీసుకువస్తున్నారు. ఇటువంటి వారిలో సినీ రంగాన్ని తీసుకుంటే ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు, దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విలక్షణ నటుడు కమల్‌హాసన్‌లు తమ కూతుళ్లు మంచు లక్ష్మీ ప్రసన్న, సౌందర్య, శృతిహాసన్‌లను సినీ రంగంలో ఉన్నత స్థానానికి తీసుకువచ్చేందుకు వారిని అన్నివిధాలా ప్రోత్సహించారు. ఇక రాజకీయ రంగంలోనైతే జవహర్‌లాల్‌ నెహ్రూ, బాబు జగ్జీవన్‌రాంలను ఆదర్శంగా తీసుకొని వారి కూతుళ్లు ఇందిరాగాంధీ, మీరాకుమారిలు ఉన్నత పదవుల్లో పేరు,ప్రతిష్టలు తెచ్చుకున్నారు.

నేడు ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 19న ప్రతి ఏటా అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1999లో ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోలో ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. నేడు కరేబియన్‌ దీవులతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, ఆసియా, యూరప్‌, ఆఫ్రికా, నార్త్‌ అమెరికా దేశాలలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.

నెహ్రూ-ఇందిరాగాంధీ....
nehruu 
మన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ. ఆయన దేశ స్వాతంత్య్రోద్యమంలో మహాత్మా గాంధీతో కలిసి పాల్గొని దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చేందుకు అహింసా మార్గంలో పోరాడారు. జవహర్‌లాల్‌ నెహ్రూ భావి భారత దేశ నిర్మాణానికి బాటలు వేశారు. ఇక ఆయన కూతురిగా ఇందిరా ప్రియదర్శిని గాంధీ దేశ ప్రధానిగా తనదైన ముద్ర వేశారు.

తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ దేశ ప్రధానిగా 1966 నుంచి 1977వరకు వరుసగా మూడు సార్లు, 1980 నుంచి 84 వరకు నాలుగవ సారి ప్రధానిగా కొనసాగారు. శ్రీలంక ప్రధానమంత్రి సిరిమావో బండారనాయకే తర్వాత ప్రపంచంలోనే ఎక్కువ సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా కొనసాగిన మహిళగా రికార్డు సృష్టించారు. తన తండ్రి ప్రారంభించిన ప్రగతి విధానాలను ముందుకు కొనసాగించి దేశ అభివృద్దికి ఆమె ఎంతో కృషిచేశారు. నాటి సోవియట్‌ యూనియన్‌తో మన దేశానికి మంచి సంబంధాలను నెలకొల్పిన ఘనత ఆమెకు దక్కుతుంది.

జగ్జీవన్‌రాం-మీరాకుమార్‌
meera-kumar 
బడుగువర్గాల నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా పేరుతెచ్చుకున్న వ్యక్తి బాబు జగ్జీవన్‌ రామ్‌. బీహార్‌కు చెందిన ఆయన ఆలిండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ను ప్రారంభించడంలో కీలక పాత్ర వహించారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వంలో యంగెస్ట్‌ మినిస్టర్‌ అయిన ఆయన తొలి కేంద్ర కార్మిక శాఖమంత్రి. బడుగులకు సాంఘీక న్యాయం కోసం నిరంతరం పోరాడిన బాబు జగ్జీవన్‌రాం తన కూతురు మీరా కుమారిని సైతం తన అడుగుజాడల్లో నడిపించారు.

తండ్రిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఆమె అయిదుసార్లు పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపికవ్వడం విశేషం. దేశ తొలి మహిళా స్పీకర్‌గా 2009 జూన్‌ 3న పదవీబాధ్యతలు స్వీకరించిన ఆమె నాటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. న్యాయవాది అయిన ఆమె 2004 నుంచి 2009 వరకు కేంద్ర సాంఘీక సంక్షేమ, సాధికారికత మంత్రిగా బడుగులకు సాంఘీక న్యాయం జరిగేందుకు తన వంతు కృషిచేశారు.
 
రజనీకాంత్‌-సౌందర్య...
rajini 
దక్షిణ భారతదేశ సినీ సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ గురించి తెలియని దక్షిణాది సినీ ప్రియులు ఉండరు. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో సైతం పలు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న హీరో ఆయన. ఆసియాలోనే జాీచాన్‌ తర్వాత అత్యధికంగా పారితోషికం తీసుకున్న హీరోగా రజనీకాంత్‌ పేరు తెచ్చుకున్నారు. ఈ సూపర్‌స్టార్‌ తనయురాలే సౌందర్య.

ఆమె తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని సినీ రంగంలోకి ప్రవేశించి సినీ నిర్మాతగా, ఫిల్మ్‌ గ్రాఫిక్‌ డిజైనర్‌గా, దర్శకురాలిగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆమె పలు తమిళ చిత్రాలకు పనిచేసి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సినీ రంగంలో రాణించేందుకు రజనీకాంత్‌ తన కూతురును ఎంతగానో ప్రోత్సహించారు. ఓచర్‌ పిక్చర్‌ ప్రొడక్షన్స్‌ వ్యవస్థాపకురాలు, ఛీప్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన సౌందర్య సినీ నిర్మాణ రంగంలో తనదైన శైలిని కనబరిచారు. 2007లో ఓచర్‌ స్టూడియోస్‌ వార్నర్‌ బ్రదర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఒప్పందం కుదుర్చుకొని తమిళ చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌ చేస్తుండడం విశేషం.

తండ్రి మోహన్‌బాబు ప్రోత్సాహంతో సినీ నటిగా, నిర్మాతగా, టెలివిజన్‌ ెస్ట్‌గా నేడు లక్ష్మీ ప్రసన్న ఎంతో పాపులారిటీ సంపాదించారు. తండ్రిని ఆదర్శంగా తీసుకొని నటనా రంగంలో రాణిస్తున్న మంచు లక్ష్మి ఒకలెమా సిటీ యూనివర్సిటీలో థియేటర్‌ బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తిచేశారు. అమెరికన్‌ టెలివిజన్‌ సీరీస్‌లు లాస్‌వెగాస్‌, డెస్పరేట్‌ హౌస్‌వైవ్స్‌లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న నటీమణి ఆమె.

మోహన్‌బాబు-లక్ష్మిప్రసన్న...
mohan 
టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు. మాజీ రాజ్యసభ సభ్యుడైన ఆయనకు 2007లో పద్మ శ్రీ అవార్డు దక్కింది. ఆయన కూతురే మంచు లక్ష్మీ ప్రసన్న. తండ్రి మోహన్‌బాబు ప్రోత్సాహంతో సినీ నటిగా, నిర్మాతగా, టెలివిజన్‌ హోస్ట్‌గా నేడు లక్ష్మీ ప్రసన్న ఎంతో పాపులారిటీ సంపాదించారు. సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని నటనా రంగంలో రాణిస్తున్న మంచు లక్ష్మి ఒకలహోమా సిటీ యూనివర్సిటీలో థియేటర్‌ బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తిచేశారు. అమెరికన్‌ టెలివిజన్‌ సీరీస్‌లు లాస్‌వెగాస్‌, డెస్పరేట్‌ హౌస్‌వైవ్స్‌లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న నటీమణి ఆమె. టయోటా, ఎఎఆర్‌పి, చెవ్రలెట్‌ కంపెనీల యాడ్స్‌లో సైతం దర్శనమిచ్చి మెరిసారు.

విలక్షణ నటుడైన తండ్రి కమల్‌హాసన్‌ బాటలో పయనిస్తూ శృతిహాసన్‌ నేడు సినీ నటిగా, గాయకురాలిగా, మ్యూజిక్‌ కంపోజర్‌గా రాణిస్తుండడం విశేషం. తండ్రి ప్రోత్సాహంతో ఆమె హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె 2009లో లక్‌ సినిమా ద్వారా హీరోరుున్‌గా తన సినీ ెకరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత వాల్‌ డిస్నీ చిత్రం అనగనగా ఓ ధీరుడు చిత్రంలో మెరిసి అందర్నీ అలరించారు.

కమల్‌హాసన్‌-శృతిహాసన్‌...

kamall 
భారతదేశ సినీ రంగంలో విలక్షణ నటునిగా కమల్‌హాసన్‌ పేరొందారు. దశావతారం వంటి సినిమాల్లో నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన విశ్వ విఖ్యాత నటుడు ఆయన. ఈ పాపులర్‌ హీరో కూతురే శృతిహాసన్‌. సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న తన తండ్రి బాటలో పయనిస్తూ ఆమె నేడు సినీ నటిగా, గాయకురాలిగా, మ్యూజిక్‌ కంపోజర్‌గా రాణిస్తుండడం విశేషం. ఇక తండ్రి కమల్‌హాసన్‌ ప్రోత్సాహంతో శృతిహాసన్‌ హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె 2009లో లక్‌ సినిమా ద్వారా హీరోయిన్‌గా తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత వాల్‌ డిస్నీ చిత్రం అనగనగా ఓ ధీరుడు చిత్రంలో మెరిసి అందర్నీ అలరించారు.
 

No comments:

Post a Comment