Sunday, March 13, 2011

విధిని గెలిచిన '' మయూరి ''

నాట్య మయూరి.. సుధా చంద్రన్. 
http://farm3.static.flickr.com/2799/4122815384_54a6ae004f_z.jpg
పదిహేడో ఏట కుడికాలును పోగొట్టుకుంది రోడ్డు ప్రమాదంలో. నాట్యమే ఊపిరిగా, జీవిత గమ్యంగా ఎంచుకుని, ఎంతో కృషి చేసి టీనేజ్‌లోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన ఆమెకు కుడికాలు పోవటం ఎంత దురదృష్టకరమో ఒక్క క్షణం ఆలోచించండి. ప్రఖ్యాత గాయకులకు గొంతు పోవటం. పేరున్న పెయింటర్లకు చూపు పోవటం, రచయితలకు మతి పోవటం ఎంత అన్యాయమో కదా! ఎవర్ని ప్రశ్నించాలి ఈ అన్యాయాల గురించి, విధి లీలల్ని గురించి. మూగబోయిన భగవంతుణ్ణా..? వక్రించిన విధినా...? నూటికి తొంభై తొమ్మిది మందికి ఎవర్ని ప్రశ్నించాలో, సమాధానాలు రాబట్టుకోవాలో తెలియక నిరాశా నిస్పృహలకు లోనయి జీవితాసక్తి కోల్పోతారు. మిగిలిన ఆ ఒక్క వ్యక్తి మనకు ధైర్యానికి, ఆత్మ స్థైర్యానికి ప్రతీకగా నిలిచి మార్గదర్శకులవుతారు. మానవ మనుగడకు, పురోగతికి వారే మూల స్తంభాలు. అలాంటి వ్యక్తే సుధా చంద్రన్.http://www.scandalsnews.com/wp-content/uploads/2010/08/Sudha-Chandran.jpg
ఏకలవ్యుణ్ణి ద్రోణాచార్యుడు గురు దక్షిణగా తన కుడిచేతి బ్రొటన వేలును కోసి కానుకగా ఇమ్మన్నట్లుగా దేవుడు కుడికాలును కోసి దక్షిణగా ఇమ్మన్నట్లుగా తోచి ఉండాలి సుధకి తన కుడి కాలును తీసేస్తున్నప్పుడు. కుడి మోకాలుకి పదిన్నర అంగుళాల కింద నుంచి ఆమె కాలుని పూర్తిగా తీసేసాడు. విధి క్రూరానికి ఎంతో షాకై ఉండాలి సుధా చంద్రన్. షాక్ నుంచి కోలుకున్న సుధా చంద్రన్ చెక్క కాలుతో, క్రచెస్‌తో తన జీవితాన్ని తిరిగి జీవించటం మొదలు పెట్టింది. కాలేజ్‌కి తిరిగి వెళ్లటం మొదలైంది.

ఆ గడ్డు సమయంలో ఆమెకు గొప్ప ఊరట, ధైర్యాన్ని ఇచ్చింది ఆమె తండ్రి. తల్లీ కొడుకులు, తండ్రీ కూతుళ్ల అనుబంధం ఎంతో అపురూపమైంది కదూ! ఈ యాక్సిడెంట్ జరిగిన ఆర్నెళ్లకు ఓ పత్రికలో చదివింది జైపూర్‌లోని డాక్టర్ సేథీ కృత్రిమ కాళ్లను తయారు చేసి అమరుస్తున్నాడని, ఈ కాళ్లను అమర్చుకున్న వాళ్లు అన్ని పనులు స్వయంగా చేసుకోవచ్చని. అణగారిన ఆశలు మళ్లీ చిగురించాయి. తను మళ్లీ డాన్స్ చేయగలుగుతుంది అని. స్వర్గ సుఖాలు పొందినంత ఆనందం కలిగి ఉండాలి ఆ ఘడియల్లో సుధా చంద్రన్ కి. వెంటనే డాక్టర్ సేథీకి ఉత్తరం రాసింది తన సమస్య గురించి, అవసరాల గురించి. తండ్రితో కలిసి జైపూర్ వెళ్లి డాక్టర్ సేథీని కలుసుకుంది. తను మళ్లీ నడవగలదని డాక్టర్ సేథీ అన్నాడు మరి డాన్సో? కృత్రిమ పాదాలను అమర్చుకొని శ్రామికుడు చెట్టు ఎక్కగలుగుతున్నప్పడు డ్రైవరు డ్రైవింగ్ చేయగలిగినప్పుడు నీకు డాన్స్ చేయటం ఏమంత కష్టం కాదన్నాడు డాక్టర్ సేథీ. దీన్నో చాలెంజ్‌గా తీసుకుని కొన్నాళ్లలో కృతిమ పాదం అమర్చాడు సుధా చంద్రన్ కుడికాలుకి.
http://www.thefilmstreetjournal.com/wp-content/uploads/2010/06/Sudha-Chandran1.jpg
అప్పుడే మొదలైంది అసలు సంగ్రామం. కృత్రిమ పాదంతో నడక నేర్చుకొన్నాక నాట్యం మొదలుబెట్టింది. విపరీతమైన నొప్పి, రక్తం కారటం. డాన్స్‌కి ఈ లెగ్ పనికి రాదేమోనన్న సందేహం. డాక్టర్ సేథీ తన మనిషిని పంపాడు సుధా చంద్రన్‌కి సహాయం చేయటానికని. ఆమె డాన్స్ కదలికలకు అనుకూలంగా కృత్రిమ పాదాన్ని సరిచేసే వాడాయన. అయినా సమస్య సమసిపోలేదు. విపరీతమైన నొప్పి, రక్తం కారటం అలాగే ఉండిపోయినాయి. మళ్లీ జైపూర్ ప్రయాణం, ఈ సారి తన డాన్స్ టీచర్‌తో. సుధా చంద్రన్ డాన్స్ మూవ్‌మెంట్స్‌కి అనుగుణంగా మరో పాదం చేసి అమర్చాడు డాక్టర్ సేథీ. అమర్చి నేను చేయగలిగినంతా చేశాను.. ఇక మిగతాదినే కృషేనన్నాడు. తిరిగి కొత్త పాదంతో నృత్యం ప్రాక్టీసు మొదలుపెట్టింది. మళ్లీ అవే సమస్యలు.. భరించలేని నొప్పి, రక్తస్రావం. అయినా పట్టు విడవని విక్రమార్కుడిలాగా ప్రాక్టీస్ విడువలేదు. నొప్పి ముఖం మీద కనబడనీయకుండా అలవాటు చేసుకుంది. కాలక్రమేణా నొప్పి, రక్తస్రావం ఆగాయి. సుధా చంద్రన్ కలలు సాకారమయ్యే తరుణం ఆసన్నమైంది. తిరిగి జీవితంలో డాన్స్ చేయలేననుకొన్న సుధా చంద్రన్ మళ్లీ నాట్య ప్రదర్శనకు సిద్దమైంది.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjGTvX2hJMd-xHraenzDrxHBcXpX-QIQ0UUjc0I8E9cH2sD-dUE5vcMMk78dBwll9wKKLbid3lgNpLLGFgX_l35DtWjEmI3-VANl7pilvbrwFE0kO773Tp5lRqtz28kFVETFli5TmRmNS0/s320/sudha.jpg
జనవరి 28, 1984.. తనకు యాక్సిడెంట్ జరిగిన మూడేళ్లలోపే తిరిగి నాట్య ప్రదర్శనకు సిద్దమైంది సుధా చంద్రన్. అయితే చిన్న చిక్కుంది ఇక్కడ. యాక్సిడెంట్ జరగక ముందు ఎన్నో ప్రదర్శనలిచ్చి ఓ గొప్ప నృత్య కళాకారిణిగా పేరు ప్రఖ్యాతులార్జించింది. వాటితోపాటు ఎన్నో బిరుదులు, సన్మానాలు.. నృత్య మయూరి, నవ జ్యోతి వగైరాలు. తన కృత్రిమ పాదంతో తిరిగి నాట్యం చేసి తాను గతంలో సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను నాశనం చేసుకోదు కదా? అసలు తన కృత్రిమ పాదంతో గతంలో లాగా బాగా నాట్యం చేయగలదా? సందేహాల వెల్లువ. అయితే అమితమైన ఆత్మ స్థైర్యం 'నేను సాధించగలను' అనే అచంచలమైన విశ్వాసం. ఆమెను తిరిగి స్టేజీ మీద అడుగు పెట్టేలా చేసినాయి. 1984 జనవరి 28నాడు సుధా చంద్రన్ తన కృత్రిమ కుడి పాదంతో భరత నాట్యం మొదలుపెట్టింది. నాట్యంలో పూర్తిగా మునిగిపోయి తనకు కృత్రిమ పాదం ఉన్నదనే సత్యాన్నే మరిచిపోయి పురి విప్పిన మమూరిలాగా ఎంతో హృద్యమంగా, ఎంతో వేగంగా డాన్స్ చేసింది. డాన్స్ ముగించింది. ఒక్క క్షణం నిశ్శబ్దం ఆడిటోరియంలో తమ కళ్ల ముందు జరిగింది నిజమా కలా ? అంతే మరుక్షణం చప్పట్లతో, ప్రశంసలతో ఆ ప్రదేశం మార్మోగిపోయింది.http://www.tribuneindia.com/2004/20040404/spectrum/tv2.jpg
సుధా చంద్రన్ కల నిజమైంది. మనిషి తలచుకుంటే అసాధ్యాలంటూ ఏవీ లేవని మరోసారి నిరూపించబడింది. ఆ నాట్య ప్రదర్శనను ఒక అద్భుతంగా గొప్ప అనుభూతిగా అసాధారణ విజయంగా వర్ణించినాయి పత్రికలు. స్టార్ మారిపోయింది సుధా చంద్రన్ క్షణాల్లో. అంతే కాదు ఆమె జీవిత గాధ ఆధారంగా మయూరి అనే సినిమా మొదలైంది. అందులో ఆమె కథానాయిక. గొప్ప సంచలనం సృష్టించింది ఈ సినిమా యావద్దేశంలో. ఇప్పుడో క్షణం ఆగి ఒక్కసారి సుధా చంద్రన్ చరిత్రను పునరావృతం చేసుకొని ఆలోచించి చూడండి. మనకు నిజానికి అసాధ్యాలంటూ ఏవైనా ఉంటాయా ?
http://orissadiary.com/Movies/Sudha_Chandran_performing_dance_at_Bhubaneswar/sudha-chandran3.jpg
మనసా వాచా కర్మణా ఏమైనా సాధించాలి మనం కోరుకుని శ్రమిస్తే, ఆ కలలు సాకారం కాకుండా ఉంటాయా ? సుధా చంద్రన్ పోరాటం ఆమె విజయాలు గగుర్పాటు కలిగించేవి. ఆమె ఒక గొప్ప నర్తకే కాదు అంతకన్నా గొప్ప ఫైటర్. తిరిగి గతంలోలాగానే అంతే అద్భుతంగానే నాట్య ప్రదర్శనలివ్వాలని ఆమె చేసిన పోరాటం, ఆమె చూపిన ధైర్యసాహసాలు, ఆమె ఆత్మ విశ్వాసం, ఆమె సాధించిన విజయాలు మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి ఎంతో కాలం. వచ్చే వారం మరో విశిష్ట వ్యక్తి విజేత సర్ రోజర్ బెన్నిస్టర్‌ని కలుసుకుందాం. ఈయన జీవిత గాధ కూడా ఎంతో స్ఫూర్తినిచ్చేదే. అసాధ్యాలంటూ ఏవీ లేవని చెప్పేదే... 
- ఎజి కృష్ణమూర్తి
Sudha Chandran's Performance @ Hyderabad
Sudha Chandran, is an Indian actress, who was born in 1964. She is a dancer who lost her leg in an accident in 1982.

In 1984, based on her life and how she overcame the loss of a leg, the Telugu movie Mayuri was released. She starred in the movie. It won the Special Jury Award at the National Film Award ceremony. The same movie, retaining her in the lead, was released in Hindi as Naache Mayuri (1986).
Sudha Chandran's Performance @ Hyderabad by emmydavid