Friday, November 25, 2011

తెరచిన పుస్తకం ఆర్ .‌కె. నారాయణ్

ఆర్‌.కె. నారాయణ్‌గా సుప్రసిద్ధుడైన రాసిపురం కృష్ణస్వామి అయ్యర్‌ నారాయణస్వామి ప్రఖ్యాత భారతీయ రచయిత. ఆయన రచనలలో కాల్పనికత ఎక్కువగా కనిపిస్తుంది. ఒక కాల్పనిక పట్టణంలో ఉన్న మనుషూలు, వాళ్ల వ్యవహారాల గురించి ధారావాహిక నవలలు వ్రాసారు. ఆంగ్ల భాషలో భారతీయ సాహిత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి నారాయణ్‌.

The-Financial-Expert-by-R.K 
భారత దేశానికి చెందిన ఆంగ్ల భాష నవల రచయితలలో అత్యుత్తమ గొప్పవారిలో ఒకరిగా అరుదయిన అఖండ కీర్తిప్రతిష్టలను అందుకున్నారు.తన గురువు మరియు మిత్రుడైన గ్రహంగ్రీన్‌ సహాయంతో నారాయణ్‌ వెలుగులోకి వచ్చారు. అయిన రాసిన మొదటి నాలుగు పుస్తకాలను ప్రచురించడానికి ప్రచురణకర్తలను ఒప్పించడంలో గ్రహంగ్రీన్‌ ముఖ్య పాత్ర పోషించారు. వీటిలో, స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ , ది బ్యాచిలర్‌ అఫ్‌ ఆర్ట్‌‌స. ది ఇంగ్లీష్‌ టీచర్‌ అనే మూడు సగం-స్వీయచరిత్ర పుస్త్త్తకాలు ఉన్నాయి. http://www.iloveindia.com/indian-heroes/pics/rk-narayan.jpg
1951 సంవత్సరపు అత్యుత్తమ అసలైన నవలగా పేరొందిన ది ఫైనాన్షియల్‌ ఎక్సెపర్ట్‌ మరియు సాహిత్య అకాడమీ పురస్కారం గెలిచిన ‘ది గైడ్‌’ నారాయణ్‌ నవలలలో ధీటుగా నిలిచింది. ‘ది గైడ్‌’ నవల హిందీ, ఆంగ్ల భాషలలో ...బ్రాడ్వేలో సినిమాగా కూడా తీయడం జరిగింది. 
http://piyushaggarwal.com/wp-content/uploads/2010/06/malgudi-days.jpg
నారాయణ్‌ వ్రాసిన కథలలో ఎక్కువగా మాల్గుడి అనే ఒక కల్పిత పట్టణములో జరుగుతాయి. మొదటిసారి ఈ పట్టణం స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ నవలలో పరిచయం చేయబడింది. అయిన కథలు సామాజిక సంబంధాలని ఎత్తి చూపి, రోజూవారి జరిగే యదార్ధ సంఘటనల ద్వారా పాత్రలకు ప్రాణం పోస్తాయి. నిజమనిపించే ఒక కల్పిత పట్టాణాన్ని సృష్టించి, దాని ద్వారా రోజువారీ సామాన్య జీవితములోని హాస్యం, శక్తిని బయటకు చూపి, తన రచనలో దయ, మానవత్వం చూపిన విల్లియం ఫాక్నేర్‌తో ఆయినని పోలుస్తారు.

rk_narayans 
అరవై ఏళ్ళకు పైబడిన రచయిత వృత్తిలో, నారాయణ్‌కు అనేక పురస్కారాలు, గౌరవాలు అందాయి. రాయల్‌ సొసైటీ అఫ్‌ లిటరేచర్‌ నుండి బెన్సన్‌ మెడల్‌ మరియు భారత దేశపు రెండవ అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ని నారాయణ్‌ అందుకున్నారు. అయిన కొంతకాలం రాజ్యసభ సభ్యునిగా కూడా నామినేట్‌ అయ్యారు.తొలినాళ్లలో...అర్‌.కే. నారాయణ్‌ అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ ప్రాంతంలో జన్మించారు. అయిన తండ్రి ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. నారాయణ్‌ తన విద్యాజీవితములో కొంత కాలం తండ్రి పాఠశాలలో గడిపారు. ఉద్యోగ రీత్యా అయిన తండ్రి తరచూ బదిలీ అవుతూ ఉండడంతో, నారాయణ్‌ తన బాల్యములో కొంత బాగాన్ని అమ్మమ్మ పార్వతి రక్షణలో పెరిగారు.

అదే సమయంలో, ఒక నెమలి, అల్లరి కోతి ఆయినకు ఆప్తమిత్రులుగా ఉండేవట. ఆయిన అమ్మమ్మ ఆయినకి కుంజప్ప అని ముద్దుపేరు పెట్టారు. అయిన కుటుంబీకుల మధ్య ఈ పేరు నిలిచిపోయింది. ఆమె నారాయణ్‌కు గణితం, పురాణాలు, భారతీయ శాస్ర్తీయ సంగీతం, సంస్కృతం నేర్పించారు. అయిన తమ్ముడు అర్‌.కే. లక్ష్మణ్‌ సుప్రసిద్ధ కార్టూనిస్టు. వాళ్ల ఇంట్లో అంతా సహజంగా ఆంగ్లంలోనే సంభాషించేవారు. నారాయణ్‌ అయిన తోబుట్టువులు ఏదైనా వ్యాకరణ తప్పులు చేస్తే, కుటుంబీకులు సహించే వారు కాదు. అమ్మమ్మతో ఉన్నప్పుడు నారాయణ్‌ పురసవాకంలోని లూథరన్‌ మిషన్‌ స్కూల్‌, సి.ఆర్‌.సి. హైస్కూల్‌, క్రిస్టియన్‌ కాలేజీ హై స్కూల్‌లలో విద్యాభ్యాసం చేశారు. నారాయణ్‌ చిన్నతనం నుంచే పుస్తకాల పురుగు. చిన్నతనంలోనే అయిన డికెన్స్‌, వోడ్‌ హౌస్‌, ఆర్థర్‌ కోనన్‌ డోయల్‌, థామస్‌ హర్డి వ్రాసిన పుస్త్తకాలను చదివారు.

500 
12 సంవత్సరాల వయసులో నారాయణ్‌ ఒక స్వాతంత్ర పోరాట సభలో పాల్గొన్నారు. దాని పర్యావసానం మామయ్యతో తిట్లు తినాల్సివచ్చింది. వారి కుటుంబం రాజకీయానికి అతీతంగా ఉండేది అప్పట్లో. నారాయణన్‌ తండ్రికి మహారాజ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఉన్నత పాఠశాలకు బదలీ కావటంతో ఆయన కుటుంబసమేతంగా మైసూరుకు మారారు. తండ్రి పాఠశాల ప్రాంగణంలోని గ్రంథాలయంలో పనిచేస్తుండటంతో ఆర్కేకు చిన్నతనం నుంచి పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం హాబీగా మారింది. చిన్నతనం నుంచే తన ఆలోచనలన్నీ కూడా ఒక కార్యాచరణ రూపంలో పెట్టేందుకు యత్నించేవారు.

చిన్న చిన్న కవితలు, వ్యాసాలు ఇంగ్లీష్‌లో రాసేవారు ఆర్కే. ఉన్నత పాఠశాల విద్య ముగించినాక, ఆర్కే విశ్వవిద్యాలయమునకు ప్రవేశ పరీక్ష వ్రాసి సఫలీకృతుడు కాలేక, ఇంటిలోనే చదువుకుంటూ, వ్రాసుకుంటూ ఒక సంవత్సరం గడిపి, పిమ్మట 1926 సంవత్సరములో పరీక్షలో సఫలీకృతుడయ్యారు. ఆ తర్వాత మైసూరు మహారాజ కళాశాలలో చేరారు. బ్యాచిలర్‌ పట్టా పొందడానికి నారాయణ్‌ నాలుగు సంవత్సరాలు తీసుకున్నారు. ఇది మామూలుకంటే ఒక సంవత్సరము ఎక్కువ. కొంతకాలం అయిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేసారు. అయితే ప్రధాన ఉపాధ్యాయుడు ఆయినని వ్యాయమ ఉపాధ్యాయుడు స్థానములో పని చేయమనగానే ఇక ఆ రంగంలో ఉండటం ఎంతమాత్రం ఇష్టంలేక ఉద్యోగాన్ని మానేశారు. తనకు తగిన వృత్తి రచయిత అని భావించి ఇంట్లోనే ఉండి నవలలు వ్రాయడం ప్రారంభించారు.

డెవెలప్‌మెంట్‌ అఫ్‌ మారిటైం లాస్‌ అఫ్‌ సెవంటీన్త్‌-సెంచురీ ఇంగ్లాండ్‌ అనే పుస్తక గ్రంథ పరిచయం ద్వారా ఆయన తొలిసారిగా రచయితగా పరిచయం కాబడ్డారు. తర్వాత అయిన ఆంగ్ల భాష వార్తాపత్రికలు, సంచికలకు స్థానిక కథలు అప్పుడప్పుడు వ్రాయడం ప్రారంభించారు.మొదటి సంవత్సరం అయిన సంపాదన తొమ్మిది రూపాయిల పన్నెండు అణాలు. రాయడం ద్వారా సంపాదన ఎక్కువ రానప్పటికీ ఆయినకి ఒక స్థిరమైన జీవితం ఏర్పడింది. కాకపోతే ఆయనకు అవసరాలు బాగా తక్కువగా ఉండేవి. అసాధరణమైన వృత్తిని అయిన ఎన్నుకున్నందుకు అయిన కుటుంబం, మిత్రులు ఆయినకు సహకరించి గౌరవించారు.
http://www.exoticindia.com/books/rk_narayans_malgudi_days_volume_hindi_dvd_video_icl083.jpg
1930లో నారాయణ్‌ తన మొదటి నవల స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ని వ్రాసారు. అనేక ప్రచురణకర్తలు ఆ నవలని తిరస్కరించారు. ఈ పుస్త్తకంలోనే నారాయణ్‌, దేశ సామాజిక వాతావరణాన్ని చూపించే మాల్గుడి అనే ఒక పట్టణాన్ని సృష్టించారు.

టర్నింగ్‌పాయింట్‌

1933లో కోయంబత్తూర్‌లో తన ప్రక్కనే నివసిస్తున్న రాజం అనే 15 సంవత్సరాల అమ్మాయిని కలిసి ఆమెతో ప్రేమలో పడ్డారు ఆర్కే. ఎట్టకేలకు ఆ అమ్మాయి తండ్రి ఆమోదం పొంది ఆమెని వివాహం చేసుకున్నారు. వివాహం పిమ్మట, నారాయణ్‌ ‘ది జస్టిస్‌’ అనే ఒక మద్రాస్‌ పత్రికకు విలేకరి అయ్యారు. అది బ్రాహ్మిణ్‌-కాని వారి ప్రయోజనాలు మీద శ్రద్ధ చూపిస్తున్న పత్రిక. వారి పక్షాన ఒక బ్రాహ్మణ్‌ అయ్యర్‌ ఉండడం ప్రచురణకర్తలకు ఉత్సాహం కలిగించింది. ఈ ఉద్యోగం ద్వారా అయిన రకరకాల జనాలు, వారి సమస్యలతో పరిచయం ఏర్పడింది. అంతకు ముందు ఆర్కే స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ నవల యొక్క వ్రాతప్రతిని ఆక్స్‌ఫర్డ్‌లోని ఒక మిత్రునికి పంపారు.
ఆ మిత్రుడు ఆ ప్రతిని గ్రహంగ్రీన్‌కు చూపించారు. గ్రీన్‌ ఆ పుస్త్తకాన్ని తన ప్రచురణకర్తకు సిఫార్సు చేస్తే, ఆ పుస్త్త్తకం చివరిగా 1935లో ప్రచురించబడింది. ఆంగ్లం మాట్లాడే ప్రేక్షకులకు సులువుగా ఉండే విధంగా పేరుని క్లుప్తం చేసుకోమని ఆర్కేకు గ్రీన్‌ సలహా ఇచ్చారు. ఆ పుస్తకం అర్ధ-స్వయచరిత్ర లాగ ఉండి, అయిన బాల్యం నుండి అనేక సంఘటనల ఆధారంగా వ్రాయబడింది. పుస్త్తకం గురించి మంచి విమర్శలు వచ్చినప్పటికీ, అమ్మకాలు మాత్రం తక్కువగానే ఉండేవి. ఆర్కే తర్వాత రాసిన నవలది బ్యాచిలర్‌ అఫ్‌ ఆర్ట్‌‌స (1937) కొంత వరకు అయిన కళాశాల అనుభవ స్ఫూర్తితో వ్రాయబడింది. ఒక తిరగబడే బాలుడు సర్దుకోగలిగిన... ఎదిగిన వ్యక్తిగాగా మార్పుచెందే పరిస్థితిని గురించి ఈ పుస్తకం వివరిస్తుంది.

No comments:

Post a Comment