Sunday, November 27, 2011

ఒక సామ్రాజ్య సంకేతం - టాటాగ్రూప్‌

టాటా కంపెనీ రూపశిల్పులు
జంషెడ్‌జీ టాటా
jamshedji 

భారతదేశంలో ఎంతో పేరున్న టాటా కంపెనీ ఇప్పటిది కాదు. 1868లో టాటా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ప్రారంభమైంది. అంటే 148 ఏళ్ల కిందట ప్రారంభమైంది. జంషెడ్‌జీ నస్సెర్‌వాన్‌జీ టాటా గ్రూప్‌ కంపెనీల వ్యవస్థాపకుడు. టాటా కంపెనీలకు ఆయన పితామహుడు. ఈరోజు టాటా ఇంతగా విస్తరించిందంటే అది ఆయన వేసిన పునాదివల్లే.

దోరాబ్జీ టాటా
dorabjitata1 

టాటా గ్రూప్‌లో ఈయన టాటా స్టీల్‌, టాటా పవర్‌ సంస్థలను ప్రారం భించారు. టాటా గ్రూప్‌లో ఇప్పటికీ ఈ రెండు కంపెనీలే కీలకంగా ఉన్నా యి. ఒకవంక కొత్త కంపెనీలను ప్రారంభించడమే కాక, మరోవైపు భారత విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ -ఐఐఎస్‌సి) ప్రారంభానికి ఆయన నిధులిచ్చి సహకరించారు. బెంగళూరు వెలుపల నెలకొన్న మొదటి పరిశోధనా సంస్థ ఇది.

నౌరోజీ సక్లత్‌వాలా
past_chair_saklatvala 

టాటా కుటుంబంతో సం బంధంలేని బయటి వ్యక్తి నౌరోజీ. సైరస్‌కు టాటాలతో దూరపు చుట్టరికం ఉన్నా, నౌరోజీకి అది కూడా లేదు. టాటా కుటుంబంతో సం బంధం లేకుండా ఆ గ్రూప్‌ నకు ఛైర్మన్‌ అయిన ఘనత ఈయనది.

జహన్‌గీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌ టాటా
jahangir-ratanji 

టాటా కంపెనీల విస్తరణకు ఈయన ఎంతో కృషి చేశారు. నేడు ఉన్న అనేక టాటా కంపెనీలకు ఆయన పునాదులు వేశారు. జెఆర్‌డి టాటాగా ఈయన ప్రసిద్ధిచెందారు. జెఆర్‌డి టాటా కంపెనీకి వచ్చేనాటికి ఆ గ్రూప్‌లో 14 సంస్థలే ఉండేవి. వాటిని 95 సంస్థలుగా విస్తరించిన ఘనత ఈయనకే దక్కుతుంది. జెఆర్‌డికి విమానయానమంటే మక్కువ. ఆ అభిరుచితో ఈయన టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని జాతీయం చేసి, ఎయిర్‌ ఇండియాగా మార్చింది. సర్‌ దోరాబ్జీ టాటా ట్రస్ట్‌కు ఆయన ట్రస్టీగా ఉన్నప్పుడు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టిఐఎఫ్‌ఆర్‌), టాటా మెమోరియల్‌ సెంటర్‌ ఫర్‌ కేన్సర్‌ రీసెర్చ్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిఐఎస్‌ఎస్‌), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (ఎన్‌సిపిఏ)లను జెఆర్‌డి నెలకొల్పారు.

రతన్‌ టాటా
Ratan-Tataa 

టాటాకు ఉన్న వివిధ కంపెనీల బిజినెస్‌ను ఈయన విస్తరించారు. మొదట ఇండియాకే పరిమితమైన అనేక టాటా కంపెనీలను అంతర్జాతీయ స్థాయికి తెచ్చారు. అంతర్జాతీయ రంగంలో టాటాకు సముచిత స్థానాన్ని కల్పించారు. అంతర్జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కంపెనీలను తీర్చిదిద్దారు.

బాంబే హౌస్‌

bombay_house_tata 

టాటా గ్రూప్‌ ప్రధాన కేంద్రం బాంబే హౌస్‌. 87 ఏళ్ల నాటి బాంబే హౌస్‌ టాటా కార్పొరేట్‌ హెడ్‌క్వార్టర్స్‌. గత ఇరవై ఏళ్లలో అంటే...రతన్‌ టాటా టాటా సామ్రాజ్యానికి అధిపతి అయ్యాక బాంబే హౌస్‌లో ఎన్నో మార్పులు జరిగాయి. ఆయన బాంబే హౌస్‌లో మార్పులు చేయాల నుకున్నారు. చేశారు. అంతకుముందు జెఆర్‌డి టాటా హ యాం స్వర్ణయుగంగా భాసిందని చెప్పేవారు రతన్‌ వచ్చి చేసిన మార్పుల్ని జీర్ణించుకోలేకపోయారు.

ఆయన పగ్గాలు చేపట్టగానే, ప్రక్షాళన ప్రారంభించారు. అక్కడి పాత కాపులకు, వృద్ధతరానికి ఆయన ఉద్వాసన పలికారు. ఆ చర్య చాలామందికి నచ్చలేదు. ఆగ్రహం తెప్పించింది. నిన్నమొన్న వచ్చిన రతన్‌ ఈ మార్పులు ఎలా చేయగలరు? అంతకు ముందు జెఆర్‌డి హయాంలో ఇలాంటిది కనీవినీ ఎరగం’ అన్నారు. తనపై వచ్చిన విమ ర్శలకు రతన్‌ సమాధానం చెప్పకుండా ఉండడంతో ఆయ నపై అనుమానాలూ వచ్చాయి. ఎప్పటినుంచో ఉన్నవారిని తొలగించి విమర్శలకు గురైన రతన్‌ ఇండికా కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో మొదట కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినా, తర్వాత ప్రశంసలు పొందారు. అలాగే, నానో కారు కూడా బాంబే హౌస్‌ నుంచి వచ్చిందే. ఇది టాటా సంస్థకు మరింత పేరు తెచ్చిపెట్టింది. నానో కారు పూర్తిగా రతన్‌ టాటా ఆలోచనే అంటారు. ఇది సా మాన్య ప్రజల్లో మొదట్లో ఆసక్తిని రేకెత్తించింది. లక్ష ల్లోనే ఆర్డర్లు వచ్చాయి. కానీ, ప్రస్తుతం డిమాండ్‌ తగ్గింది. కార్ల ఉత్పత్తిరంగంలో టాటా సుస్థిరస్థానాన్ని సంపాదిం చడానికి రతన్‌టాటాయే కారణమనడంలో సందేహం లేదు.

టాటాకు యువకోణం
cyrus-pallonji 

రతన్‌జీ టాటా వారసుడిగా సైరస్‌ కొత్తగా రంగంమీద కనిపిస్తున్నా ఆయనకు టాటా ఆధిపత్యం కట్టబెట్టాలన్న ఆలోచన కొన్నేళ్ల కిందటే వచ్చింది. సమర్థులైన యువతరం వారికి టాటా సారథ్యాన్ని అందివ్వాలని రతన్‌ టాటా అనుకున్నారు. ఆ ఆలోచనతోనే టాటా కంపెనీల్లో యువకులకు ప్రాధాన్యత ఇచ్చారు. 42 ఏళ్ల ఆర్‌ ముకుందన్‌ను 2008లో టాటా కెమికల్స్‌కు సిఈఓను చేశారు. 2009లో ఎన్‌ చంద్రశేఖరన్‌ను టిసిఎస్‌కు సీఈఓగా నియమించారు. అప్పుడాయన వయసు 46. అలాగే 2008లో టాటా టెలీసర్వీసెస్‌కు సారథిగా నియమితులైనప్పుడు ముకుంద్‌ రాజన్‌ వయసు కేవలం 40 ఏళ్లు.

టాటా కమ్యునికేషన్స్‌లో ఉన్నత పదవిలో నియమితులయ్యేనాటికి ఎన్‌ శ్రీనాథ్‌ వయసు 45 సంవత్సరాలు. మరో చిత్రమైన ఉదాహరణ కూడా ఉంది. బ్రోతిన్‌ బెనర్జీ 35 ఏళ్ల వయసులోనే టాటా హౌసింగ్‌కు సీఈఓగా మూడే ళ్ల క్రితమే ఎంపికయ్యారు. టాటా కంపెనీల్లో ఉన్నత పదవులు చేపట్టే నాటికి వీరందరి వయసుల సగటును తీస్తే సైరస్‌ 43 ఏళ్ల వయసు పెద్ద ఎక్కువేమీ కాదు. టాటా సంస్థల్లో ఉన్నత పదవులు చేపట్టే వారి సగటు వయ సు తగ్గించాలన్నది రతన్‌జీ ఉద్దేశం. దానిపై ఏమైనా సందే హాలుంటే అవి సైరస్‌ నియామకంతో తీరిపోయాయనే చెప్పాలి. ప్రస్తుతం టాటా కంపెనీల్లో ఉన్నత పదవుల్లో ఉన్న కొందరి వయసు 64 నుంచి 73 వరకు ఉంది.

మరి మిస్ర్తీ ఏమంటారు?
రతన్‌జీ మాదిరిగానే సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ కూడా ఆలోచి స్తారా? అన్న సందేహం కలగడం సహజం. టాటా కంపెనీల్లో ఉన్నత పదవుల్ని యువతకు కట్టబెట్టడంలో సైరస్‌ పాత్ర కూడా ఉందని ఆయనను టాటా సామ్రాజ్యానికి సారథిగా ఎంపిక చేసిన అయిదుగురి కమిటీలో ఒక సభ్యుడు తెలిపారు. టాటా కంపెనీ ల్లో యువరక్తాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన సైరస్‌కూడా ఉందని ఆయన అన్నారు. ఇతర కంపెనీల్లో సమర్థులైన వారిని తమ కంపెనీల సీఈఓలుగా, టాటా సన్స్‌ డైరెక్టర్ల బోర్డులో నియమిం చడం సాధారణంగా జరుగుతూ వస్తున్నదే. ‘యువనాయకత్వం సంస్థకు యవ్వనాన్నిస్తుంది.

కుమార మంగళం బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు సారథ్యం వహించినప్పుడు యువకులకు ప్రాధాన్య మిచ్చారు. మిస్ర్తీ సారథ్యాన్ని స్వీకరించిన తర్వాత టాటా గ్రూప్‌లో కూడా అదే జరుగుతుంది. యువతకు ప్రాధాన్యమిస్తారు’ అని ఏబీసీ కన్సల్టెంట్‌ సీఈఓ శివ్‌ అగర్వాల్‌ అన్నారు.మిస్ర్తీకి టాటా గ్రూప్‌లో అత్యున్నత పదవినిచ్చి సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారనవచ్చు. మిస్ర్తీకి కలిసొచ్చే మరొక అంశం ఏమిటంటే, ఇప్పటికే టాటాకు చెందిన అనేక సంస్థల్లో యువకులే కీలక పదవుల్లో ఉన్నారు కనుక, వారితో పని తీసుకోవడం సులభతరమవుతుంది.

వయసు మీరిన వారూ ఉన్నారు
యువకులకు ప్రాధాన్యం ఇస్తున్న మాట నిజమే అయినా, దీనికి వ్యతిరేకమైన మరో వాదం కూడా వినిపిస్తోంది. టాటా సన్స్‌ డైరెక్టర్లలో ఆయన మాత్రమే 50 ఏళ్ల లోపు వారనీ, మిగతా వారు కనీసం పదేళ్లు పెద్దవారనీ అంటున్నారు. గ్రూప్‌లో టాప్‌లో ఉన్న అయిదు కంపెనీ బోర్డుల్లో దాదాపు 50 మంది డైరెక్టర్లున్నారు. వారిలో 70 శాతం మంది 60 ఏళ్ల పైబడిన వారే.

ఎవరీ సైరస్‌ ?
pallonji 

టాటా గ్రూప్‌ సంస్థలకు రతన్‌జీ టాటా వారసుడిగా ఎన్నికైన సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ పల్లోంజీ కుటుంబానికి చెందినవారు. 2012 డిసెంబర్‌లో రతన్‌ టాటా నుంచి అధికార పగ్గాలు స్వీకరిస్తారు. మిస్ర్తీ అంటే ఎవరో ఇప్పటివరకు..అంటే టాటా గ్రూప్‌నకు రతన్‌ వారసుడిగా ఎంపికయ్యే వరకు చాలా మందికి తెలీదు. పారిశ్రా మిక మహాసామ్రాజ్యం షాపూర్జీ పల్లోంజీ సంస్థ (ఎస్‌పి) అధిపతి షాపూర్జీ పల్లోంజీ కుమారుడు. షాపూర్జీకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు షాపూర్‌, సైరస్‌. కుమార్తెలు లైలా, అలూ. ఫోర్బ్స్‌ మాగజైన్‌ అంచనా ప్రకారం షాపూర్‌జీకి 2011 నాటికి ఉన్న సంపద విలువ 8.8 బిలియన్‌ డాలర్లు అంటే రూ 45,760 కోట్లు. రతన్‌జీ టాటా వారసుడిగా ఎన్నికైన సైరస్‌ 1968 జూలై 4న పుట్టారు. లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీ నుంచి బిఇ సివిల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు.

లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో మాస్టర్‌ డిగ్రీ పొందారు. ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌లో ఫెలో.సైరస్‌ ఇదివరకు టాటా సన్స్‌, టాటా ఎల్‌క్సిసి (ఇండియా)కు డైరెక్టర్‌గా పనిచేశారు. షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ, ఫోర్బ్స్‌ గోకక్‌, అఫ్‌కాన్స్‌ ఇన్‌ఫ్రా, యునైటెడ్‌ మోటార్స్‌ (ఇండియా)తో సహా అనేక కంపెనీలకు డైరెక్టర్‌గా పనిచేశారు.సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ 1991లోనే షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌లో డైరెక్టర్‌గా చేరారు. బుధవారం టాటా గ్రూప్‌నకు రతన్‌జీ టాటా వారసుడిగా ఎన్నికైన తర్వాత సైరస్‌ ఒక ప్రకటన చేస్తూ- తను టాటా సంస్థ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, చట్టబద్ధంగా షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి వైదొలుగుతానని ప్రకటించారు.

టాటా గ్రూప్‌తో అనుబంధం
పల్లోంజీ కుటుంబానికి టాటా సంస్థతో అనుబంధం బంధుత్వంతో ఏర్పడింది. షాపూర్‌జీ కుమార్తె అలూ రతన్‌ టాటాకు సోదరుడి వరసయిన నోయల్‌ టాటాను వివాహమాడింది. ఆ రకంగా టాటా సామ్రాజ్యంతో పల్లోంజీ కుటుంబానికి అనుబంధం ఏర్పడింది.

thetata

No comments:

Post a Comment