Tuesday, November 15, 2011

ఒక మంచి పుస్తకం గ్లింప్సెస్‌ ఆఫ్‌ వరల్డ్‌ హిస్టరీ

1889 సంవత్సరం నవంబర్‌ 14న జన్మించిన చాచానెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా మనం జరుపుకుం టున్నాము. ఈ సందర్భంగా చాచా నెహ్రూ తన కుమార్తె ఇందిరాగాంధీకి చిన్నతనంలో ఎటువంటి బహుమతి ఇచ్చాడో తెలుసుకుందామా...


nehruu 
నెహ్రూ ఆయన తన కుమార్తె ఒకసారి ఇందిరకు భారతదేశచరిత్రతో పాటు ప్రపంచ చరిత్ర పట్ల అవగాహన కలిగించాలని సంకల్పించారు. ఇందుకోసం ఆయన జైలులో ఉన్నప్పుడు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన తన కుమార్తెకు రెండు మూడు రోజులకు ఒక ఉత్తరం చొప్పున మూడు నాలుగు సంవత్సరాలు నిరాటంకంగా వ్రాసారు. ఇవి మొత్తం 196 ఉత్తరాలు. ఈ జాబుల పరంపర 1930వ సంవత్సరం అక్టోబర్‌ నెలలో మొదలై 1933 ఆగస్ట్‌ వరకూ కొనసాగింది. http://upload.wikimedia.org/wikipedia/en/thumb/3/39/Glimpses_of_World_History_book_cover.jpg/200px-Glimpses_of_World_History_book_cover.jpg
http://upload.wikimedia.org/wikipedia/en/thumb/3/39/Glimpses_of_World_History_book_cover.jpg/200px-Glimpses_of_World_History_book_cover.jpghttp://upload.wikimedia.org/wikipedia/en/thumb/3/39/Glimpses_of_World_History_book_cover.jpg/200px-Glimpses_of_World_History_book_cover.jpghttp://upload.wikimedia.org/wikipedia/en/thumb/3/39/Glimpses_of_World_History_book_cover.jpg/200px-Glimpses_of_World_History_book_cover.jpg


తదనంతర కాలంలో ఈ జాబులన్నీ ‘గ్లింప్సెస్‌ ఆఫ్‌ వరల్డ్‌ హిస్టరీ’ పేరుతో వేయి పేజీల ఒక పెద్ద గ్రంథంగా ప్రచురింపబడ్డాయి. ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ వారు ఈ గ్రంథాన్ని చాలా కాలంపాటు సబ్సిడీ ధరకు అందించారు. ఐతే ఇటీవలి కాలంలో ఈ ప్రతులు మార్కెట్లో లభించడం లేదు. ప్రస్తుతం పెంగ్విన్‌ వారి ప్రతులే అందుబాటులో ఉన్నాయి. ఐతే అవి కొంచెం ధర ఎక్కువ. నెహ్రూ గారి రచన కనుక ఈ పుస్తకం ఏ గ్రంథాలయంలోనైనా లభించగలదు. ఈ ఉత్తరాలు ఆంగ్ల భాషలో వ్రాయబడ్డాయి. ఐతే అవన్నీ పదమూడేళ్ళ వయసులో ఉన్న తన చిన్నారి కుమార్తెను ఉద్దేశించినవి కనుక నెహ్రూ వీటిలో చాలా సులువైన భాషనే ఉపయోగించారు.


జవహర్‌లాల్‌ నెహ్రూ భారత దేశ తొలి ప్రధానిగా చేశారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ప్రముఖ నాయకుడు. పండిత్‌జీగా ప్రాచుర్యం పొందిన ఈయన రచరుుత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన మూలపురుషూడు.http://upload.wikimedia.org/wikipedia/en/thumb/3/39/Glimpses_of_World_History_book_cover.jpg/200px-Glimpses_of_World_History_book_cover.jpg
http://upload.wikimedia.org/wikipedia/en/thumb/3/39/Glimpses_of_World_History_book_cover.jpg/200px-Glimpses_of_World_History_book_cover.jpghttp://upload.wikimedia.org/wikipedia/en/thumb/3/39/Glimpses_of_World_History_book_cover.jpg/200px-Glimpses_of_World_History_book_cover.jpg
సాధారణమైన ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉన్నవారు సైతం వీటిని చదివి అర్ధం చేసుకోవచ్చు. ఈ గ్రంథం చదివేటప్పుడు నెహ్రూలో మనకు ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడు కాక తన కుమార్తెను ఒక గొప్ప నాయకురాలిగా తీర్చిదిద్దాలని తపనపడే ఒక తండ్రి మాత్రమే కనిపిస్తాడు. ఈ గ్రంథం ఏ మాత్రం విసుగనిపించదు. సంవత్సరాలను అవసరమైనంత మేరకే సాధ్యమైనంత తక్కువగా పేర్కొంటూ చరిత్రలో అసలేమి జరిగింది అన్నదానికే ప్రాధాన్యతనిస్తూ చాలా ఆసక్తికరంగా నెహ్రూ దీన్ని రచించారు. ఈ గ్రంథాన్ని చదివే కొద్దీ ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపనను మనలో కలుగజేస్తూ ఉంటుంది.


జవహర్‌ లాల్‌ నెహ్రూ ఈ గ్రంథంతో పాటు తన ఆత్మ కథ అయిన ‘యాన్‌ ఆటోబయోగ్రఫీ’ అనే గ్రంథాన్నీ మరియూ భారత దేశ చరిత్రను,దాని యొక్క పురాతన వైభవాన్ని, దాని ఘన సంస్కృతిని మిగతా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’ అనే గ్రంథాన్ని కూడా రచించారు. ఐతే ఈ మూడింటిలో ‘గ్లింప్సెస్‌ ఆఫ్‌ వరల్డ్‌ హిస్టరీ’ అనబడే ఈ గ్రంథమే అత్యంత ప్రజాదరణ పొందినది. ఈ గ్రంథం చదివిన తరు వాత ఎవరికైనా ప్రపంచ చరిత్ర గురించి పూర్తి అవగాహన కలుగుతుంది.
http://www.festivalsofindia.in/id/childrenday/img/nehru.jpg
ఒక్క భారతదేశ యు వతకేగాక యావత్‌ ప్రపంచ దేశాలలోని యువత మొత్తానికీ ఉపయుక్తమయ్యే విధంగా ఈ ఉత్తరాలను రచించి నెహ్రూ ఒక అంతర్జాతీయ స్థాయి నాయ కుడిగా తన స్థానాన్నీ,స్థాయినీ ఇనుమడిం పేసు కున్నారు. పండిత్‌జీగా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ - గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు. నెహ్రూ ఉత్తర్రపదేశ్‌ రాష్ట్రంలోని అలహాబాదు నగరం నందు జన్మించారు. స్వరూపరాణి, మోతీలాల్‌ నెహ్రూ దంపతులకు మొదటి సంతానం. వీరు కాశ్మీరుకు చెందిన సరస్వతి బ్రాహ్మణ కులమునకు చెందినవారు. న్యాయవాది ఉద్యోగం నిమిత్తం కుటుంబం అలహాబాదుకు వలస మార్చింది.


మోతీలాల్‌ న్యాయవాదిగా బాగా రాణించి, తన కుటుంబానికి సకల సంపదలు సమకూర్చారు. నెహ్రూ అయన తోబుట్టువులు అనంద్‌భవన్‌ అనే ఒక భవంతిలో ఉంటూ, దుస్తుల విషయంలో హావభావాల వ్యక్తీకరణలో పాశ్చాత్య నాగరికులవలె మెలిగేవారు. వీరంతా హిందీ, సంస్కృతంతో పాటు ఆంగ్లంలో కూడా తర్ఫీదు ఇవ్వబడ్డారు. నెహ్రూ 15 సంవత్సరాల వయస్సులో ఇంగ్లాండుకు పయనమయ్యాడు. అంతకముందు విద్యాబ్యాసం అంతా ఇంటి వద్ద... ఇంకా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పాఠశాలలందు జరిగింది. మొదట ఇంగ్లాండులో హారో పాఠశాలలో ఆ తరువాత ట్రినిటీ కళాశాలలో విద్యనబ్యసించారు నెహ్రూ. పుట్టడమే ధనికుడిగా పుట్టిన నెహ్రూ స్వాతంత్య్ర పోరాటానికి తన యావదాస్తిని ధారబోసి ఒక సాధారణ వ్యక్తివలే జీవించి ఎందరికో ఆదర్శప్రాయులయ్యారు.

No comments:

Post a Comment