కొన్ని దశాబ్దాల క్రితం రాజకీయంలో
మహిళలు రాణించలేరు అనే ఒక అపోహ చాలా మందిలో ఉండేది. మామూలుగా రాణించలేరేమో
కానీ ఓ రేంజ్‌లో రాణించగలరని నిరూపించారు మాజీ దేశ ప్రధాని ఇందిరా గాంధీ.
అధికారాన్ని ఏ అభివృద్ధికోసం వినియోగించాలో ఆమెకు తెలిసినంతగా మరొకరికి
తెలియదు అని చాలా మంది అభిప్రాయం. ఇందిరా గాంధీ ఏది చేసినా సంచలనమే. ఆమె
ప్రతీ నిర్ణయం ఓ రహస్యమే. ఇలా సాగిన ఆమె పాలనా సిద్ధాంతాన్ని కొన్ని
మార్పులు చేసి నేడు జయలలితా, మాయావతి, మమతా బేనర్జీ రాజకీయంలో
అదరగొడుతున్నారు. మొండితనం వారి బలం. ఆయుధం వారనుకున్నది వారు సాధిస్తారు
ఆదే వారి విజయ రహస్యం. వారలా ఎందుకు చేయాల్సి వస్తోంది అని ప్రశ్నిస్తే
రాజకీయ మనుగడకు ఇలాంటి జిత్తుల మారి ఎత్తులు అవసరమే అని జవాబు వస్తుంది.
వివాదాలు.. విజయాలు కామన్. దూసుకుపోవడమే న్యాయం అనేది వాని తత్వం.
మాయావతి
ప్రొఫైల్
పూర్తి పేరు : మాయావతి
పుట్టిన తేది : జనవరి 15
జన్మస్థలం : ఢిల్లీ
విద్యాభ్యాసం: ఎల్.ఎల్.బి, బిఈడి
వృత్తి : రాజకీయ నాయకురాలు
పార్టీ : బహుజన్ సమాజ్ పార్టీ
మాయావతి అనగానే చాలా మందికి తెల్ల ఏనుగులు గుర్తుకు వస్తాయి. ఆమె వేల కోట్లు ఖర్చుపెట్టి ఉత్తర్ ప్రదేశ్‌లో కళాత్మక దృష్టితో నిర్మిస్తున్న ఏనుగుల బొమ్మలు. ఈ బొమ్మలు ఆమె పార్టీ గుర్తు.ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల విగ్రహాలతో పాటు తన పాలరాతి బొమ్మను కూడా సెంట్రల్ పార్క్‌లో నిర్మించి ఉత్తర్ ప్రదేశ్‌కు ఇది సరికొత్త పర్యాటక స్థలం అని ప్రకటించారు. మాయావతికి ఈ విగ్రహాలపై ఇంత అభిమానం ఎందుకో తెలీయదు కానీ శిల్పకారులకు మాత్రం స్వర్ణయుగంగా అవతరించింది ( ఒకటా రెండా ఏకంగా రూ.2500 కోట్లు ప్రాజెక్టు మరి). ఆమె పుట్టిన రోజు సందడిని టీవి ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ప్రతీ పుట్టిన రోజు ఏదో విధంగా వైవిధ్యశైలిలో జరగడమే దీనికి కారణం.కొన్నేళ్ళ క్రితం అభిమానులు కరెన్సీ నోట్లతో చేసి దండ ఆమె మెడలో వాలినప్పుడు ఆశ్చర్య పోవడం ప్రేక్షకుల వంతైంది.ఇంత వైవిధ్యాన్ని భరించలేని ప్రజలు వేరే పార్టీకీ ముఖ్యమంత్రి ఛాన్స్‌ను అందించారు.
జయలలిత
ప్రొఫైల్
పూర్తి పేరు : జయలలిత
పుట్టిన తేది : ఫిబ్రవరి 24
జస్మస్థలం : మైసూర్
వృత్తి : రాజకీయనాయకురాలు
పార్టీ : ఆమె ఆల్ ఇండియా
ఆన్నా ద్రవిడ మున్నెట్ట
కజగం (ఏఐఏడిఎమ్‌కే)
ప్రస్తుత హోదా: తమిళనాడు ముఖ్యమంత్రి
ఇక దక్షిణాదికి వస్తే తమిళనాడు ఆమ్మగా పిలవబడే జయలలిత రూటే వేరు. ఆమె పథకాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో..అమె నిర్ణయాలు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయని సన్నిహితుల అభిప్రాయం. రాజకీయంలో పురుషులతో సమానంగా రాణించాలంటే పురుషుల కన్నా ఎక్కువగా పనిచేయాలి అనేది ఆమె నమ్మే సిద్ధాంతం. ప్రాంతీయా భిమానం విపరీతంగా ఉన్న జయలలితా పాలన విషయంలో ప్రజల అభిప్రాయానికి అత్యంతవిలువ నిస్తుంది. టీవిలు, సెల్‌ఫోన్లు వంటివి ప్రజల జీవన ప్రమాణాన్ని సౌఖ్యానికే అని తెలిపారామె. జయలలిత ఒక్క చూపుకోసం అభిమానులు, కార్యకర్తలు ఎన్నిగంటలైనా వేచి చూస్తారంటే ఆమె ఏ విధంగా తన మార్కును సృష్టించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. మంచి నటిగా గుర్తింపు సాధించాకా అమె రాజకీయంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి నేటికీ విజయవంతంగా కొనసాగుతున్నారు. ఆమె అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరగడం విశేషం.2011 సాధారణ ఎన్నికల్లో కరుణానిధిని కాదని జయలలితను మూడవసారి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు ప్రజలు. 2011 మే 16న ఆమె తన ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకు క్రితం ఆమె 2002-2006, 2001 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు.
మమతా బెనర్జి
ప్రొఫైల్
పూర్తి పేరు : మమతా బెనర్జి
పుట్టిన తేది : జనవరి 5
జస్మస్థలం : కలకత్తా
వృత్తి : రాజకీయ వేత్త
పార్టీ : త్రినమూల్ కాంగ్రెస్
ప్రస్తుత హోదా : పశ్చిమబెంగాల్
ముఖ్యమంత్రి
బెంగాలీ ‘దీది’మమతా బేనర్జీలోని పాజిటీవ్ కోణాన్ని గతేడాది చూసి చాలా మంది మురిసి పోయి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనుకున్నారు. కానీ 2012లో మమతాలో వచ్చిన మార్పుకు యావత్ భారతం ఆశ్చర్యపోయింది. రైల్వే బడ్జెట్ తరువాత మమతాలో ప్రారంభమైన నిరంకుశ ధోరణి ఆమె అభిమానులను సైతం నిరాశ పరిచింది. గతేడాది విదేశీ సంస్థాగత పెట్టుబడి విషయంలో ప్రారంభమైన ఆమె మొండి వైఖరి, రైల్వే ఛార్జీలలో స్వల్ప మార్పు చేసిన ముకుల్ రాయ్‌ను రాజీనామా చేయించినా అక్కడితో ఆగలేదు. మమతా నిర్వాకాన్ని గమనిస్తున్ను మీడియా ఆమెపై దుమ్మెత్తి పోయడం ప్రారంభించింది. అందులో భాగంగా ఒక వార్తా పత్రిక కార్టూనిస్ట్ ఆమెకు వ్యతిరేకంగా కార్టూన్ వేశాడు.ఇది ఆమెకు కోపాన్ని కలిగించింది . సదరు కార్టూనిస్ట్‌ను అరెస్ట్ చేయించడమే కాకుండా మీడియాకు మార్గదర్శకాను జారీ చేసింది. పబ్లిక్ లైబ్రెరీలో కొన్ని పత్రికలను నిషేదించింది, ఏ పత్రికలు చదవాలో కూడా ఆమెనే నిర్ణయించి. .ఏ టీవి ఛానల్‌ను చూడాలో కూడా తెలిపింది. ఇలా ఆమెలోని నెగెటీవ్‌నెస్ ప్రజాస్వామ్యానికే ప్రమాదంగా దాపురించిందని విజ్ఞులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమతా ఇలా ఎందుకు మారిందో ఆమెకే తెలియాలి.















అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎంజీఆర్ వారసత్వంతో 1982లో రాజ కీయాల్లోకి వచ్చి ఆయన మార్గంలోనే నడిచారు. మొదటి సారి బోదినా యక్కలనూర్ నియో జకవర్గం నుండి పోటీ చేసి గెలు పొందారు. ఈ ప్రాం తం కేరళకు సమీపంలో వుంది. తరువాత ఈ ప్రాంతం రెండుగా విభజిత మైంది.అందులో ఒక భాగం, తమిళనాడులో, మరో ప్రాంతం కేరళలో వుంది.






ఎన్నికల ప్రక్రియ మరింత బలోపేతంగా పారదర్శకంగా పరిణతి చెందుతున్న తరుణంలో రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోకి తరలిపోతున్నది. వీళ్ళ ఇంటి పేర్లు తెలిస్తే చాలు. వీరి గురించి తెలుసుకున్నట్లే. కొత్త పార్లమెంటు సభ్యులు చాలావరకు కొడుకులే కావడం విశేషం. రాజీవ్ గాంధి కొడుకు రాహుల్, జితేంద్ర ప్రసాద కొడుకు జితిన్ , మాధవ్‌రావ్ సింధియా కొడుకు జ్యోతిరాదిత్య,రాజేశ్ పైలెట్ కొడుకు, ఒమర్ అబ్దుల్లా బామ్మర్ది సచిన్, ఫరూక్ అబ్దుల్లా కొడుకు, షేఖ్ అబ్దుల్లా మనవడు ఒమర్ అబ్దుల్లా, ములాయమ్ సింగ్ యాదవ్ కొడుకు అఖిలేశ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, మాధవరావ్‌సింధియా కుమారుడు దుష్యంతు ఇలా ఈ పేర్ల ప్రవాహం అనంతంగా కొనసాగుతూనే వుంటుంది. మరి వీరి సిద్ధాంతాలేమిటి? వీరి భావజాలం ఏమిటి? వీటికి స్పష్టమైన సమాధానం దొరకదు. అవి వీరి హృదయాల్లో నిర్దిష్టమైన రూపురేఖలు దాల్చలేదు. ఈ పిల్లలు ప్రపంచం చుట్టివచ్చారు. వీరికో సిద్ధాంతం లేదు. బహుశా సిద్ధాంతాల రాజకీయాలతో ఇండియా నష్టపోయింది.
లక్షద్వీప్ దీవులకు ఇండియాలో అతి కుర్ర ఎంపి హమ్దుల్లా సరుూద్ ఒకప్పుడు ఇండియాలో అతి చిన్న వయసు ఎంపి కుమారుడు. ఈ వారసుడు లక్షద్వీపులో పుట్టలేదు కనుక అక్కడ్నించి ఎన్నిక పోటీచేసేట్లు మన కేంద్ర ప్రభుత్వం 2008లో రాజ్యాంగ సవరణ తీసుకువచ్చింది. 29ఏళ్ళ చిరుత ప్రాయంలోనే మంత్రి అయిన మేఘాలయకు చెందిన అగథా సంగ్మా మాజీ స్పీకరు కుమార్తె. కుటుంబ వ్యవస్థలోనే అధికార క్రమాన్ని ఖచ్చితంగా ఏర్పడివుంది. శరద్‌పవార్ కూతురు సుప్రి యా సూలే తన తండ్రి విరోధు లతో కలిసి సంతోషంగా పనిచేసింది.
పార్టీ ఎంపీలందరూ వారసత్వమార్గంలో ఎంపికైనవారు కావడంతో ఆర్‌ఎల్‌డి ప్రథమ శ్రేణిలో నిలిచింది. కాంగ్రెస్ నుంచి చీలిపోయి,7 వారసత్వ ఎంపీలున్న ఎన్‌సిపి రెండవస్థానంలో ఉంది. 42.9శాతం ఉన్న బిజెడి మూడవస్థానంలో ఉంది. లోక్‌సభలో స్వల్పసంఖ్యలో సీట్లున్నాయి ఇక శివసేన పార్టీయే థాక్రే కుటుంబం అధీనంలో ఉంది. ఇక మాయావతి బిఎస్‌పిలో మూడవ వంతు ఎంపీలు వారసులు. ఇక 324 సీట్లు కలిగివున్న రెండు పెద్ద పార్టీలు బిజెపి, కాంగ్రెస్. బిజెపిలో 19శాతం సభ్యులే వారసులు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 37.5శాతం ఎంపీలు కుటుంబ సంబంధం ద్వారా లోక్‌సభలోకి ప్రవేశించారు. పార్టీ ఎంపీలందరూ వారసత్వమార్గంలో ఎంపికైనవారు కావడంతో ఆర్‌ఎల్‌డి ప్రథమ శ్రేణిలో నిలిచింది. కాంగ్రెస్ నుంచి చీలిపోయి,7 వారసత్వ ఎంపీలున్న ఎన్‌సిపి రెండవస్థానంలో ఉంది. 42.9శాతం ఉన్న బిజెడి మూడవస్థానంలో ఉంది. లోక్‌సభలో స్వల్పసంఖ్యలో సీట్లున్నాయికనుక ఈ పార్టీలకు ఫలితాలు గణాంకాల రీత్యా అంత గణనీయమైనవి కావు.
మన రాష్ట్రం విషయానికి వస్తే వారసత్వ రాజకీయాలు ఉన్నప్పటికీ అంతిమ అధికారాన్ని సాధించడంలో వీరంతా విఫలమయ్యారు. తాజాగా జగన్ ముఖ్యమంత్రి పీఠం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం తెలిసిందే. కేంద్రంలో ప్రధాని పదవిని నెహ్రూ కుటుంబానికి వారసత్వంగా ఇచ్చిన పార్టీయే ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని జగన్‌కు కట్టబెట్టే సమయంలో ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడడం ఒక వైచిత్రి. అయితే రాజకీయాలలో ఒక వెలుగు వెలిగి మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆ స్థాయిలో పీఠాలు దక్కకపోయినా రాజకీయ వారసత్వం నిస్సందేహంగా దక్కిందనేది వాస్తవం. అర్హులైన వారసులు లేనప్పుడు భార్యకు, ఉంటే కుమారుడికి లేదా కుమార్తెకు ఆ స్థానం కట్టబెట్టడం దేశంలో ఒక సంప్రదాయం అయిపోయింది. చిత్రమేమి టంటే దాదాపు 69.5శాతం మహిళా ఎంపీలు కుటుంబ రాజకీయాల వర్గానికి చెందినవారు.
లోక్‌సభలో 30 ఏళ్ళలోపు సభ్యులందరూ ఆ సీటు వారసత్వంగా పొందినవారే. 66 యువ ఎంపీల్లో మూడింట రెండొం తులు వారసత్వ ఎంపీలే. కొత్త తరం శాసన సభ్యులు రాజకీయాల్లో ఇతర సభ్యులకంటే ఒక దశాబ్దపు సౌలభ్యం ఉన్నవారు. కాంగ్రెస్‌లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. 35ఏళ్ళ లోపు ప్రతి ఎంపీ వారసత్వ సభ్యుడే. ఈ ధోరణి కొనసాగితే భారతీయ పార్లమెంటులో వారసత్వ సభ్యులు మాత్రమే ఉండే రోజు దూరంలో లేదు. దేశం 60 ఏళ్ళకు పూర్వం స్వాతంత్య్రానికి పూర్వం ఎక్కడ ఉండేదో అక్కడికి చేరుకుంటుంది. వారసత్వంగా వచ్చిన మహరాజు ఆయన దర్బారులో సామంత రాజులు ఉంటారు.
దక్షిణ భారతదేశంలో వారసత్వ రాజకీయాలు బలంగా ఉన్న పార్టీ డిఎంకె అనే చెప్పాలి. ఆ పార్టీ అధినేత కరుణానిధి కుటుంబమంతా రాజకీయాలలోనే ఉన్న వైనం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయన పెద్ద కుమారుడు కేంద్రంలో మంత్రి, చిన్న కుమారుడు డిప్యూటీ ముఖ్యమంత్రి కాగా కుమార్తె ఎంపి. అంతే కాదు ఆయన మేనల్లుడి కుమారుడు కూడా కేంద్రం లో మంత్రిగా ఉన్నాడు.