Thursday, January 26, 2012

క్షమించడు.. సహించడు

  http://topnews.in/law/files/rahul_gandhi.jpg
రాహుల్ గురించి మీకేం తెలుసు? రాజీవ్, సోనియాల కుమారుడు. గాంధీ-నెహ్రూ కుటుంబ వారసుడు. "ఎక్కడో విదేశాల్లో చదువుకొచ్చాడు, ఇప్పుడు కాంగ్రెస్ నేతగా యూపీలో ప్రచారం చేస్తున్నాడు.. అంతకన్నా ఏం తెలియదు..'' అంటున్నారా...













అయితే మీరు తాజాగా విడుదలయిన 'రాహుల్' పుస్తకాన్ని చదవాల్సిందే. రాహుల్ గురించి చాలా మందికి తెలియని అనేక విషయాలు, విశేషాలు దీనిలో ఉన్నాయి. వాటిలో నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు ......

 









అమెరికాలోని ట్రినిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన తర్వాత రాహుల్ వెంటనే భారత్‌కు రాలేదు. లండన్‌లోని మానిటర్ గ్రూప్‌లో ఉద్యోగంలో చేరాడు. తమ బ్రాండ్‌లకు సంబంధించిన వ్యవహారాలలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో కంపెనీలకు మానిటర్ గ్రూప్ సలహాలు ఇస్తుంది. ఈ గ్రూపులో రాహుల్ మూడేళ్లు పనిచేశాడు. ఆ సమయంలో రాహుల్ తన పేరు మార్చుకున్నాడు. ఎవరికీ తాను ఇందిరాగాంధీ మనవడినని గాని రాజీవ్ కొడుకునని గాని తెలియనివ్వలేదు. ఒక విధంగా ఇది సాహసమనే చెప్పాలి. "అమెరికాలో చదువు పూర్తి అయిపోయిన తర్వాత లండన్‌లో సాధారణమైన జీవితాన్ని గడిపాను. ఆ సమయంలో నాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు. ఒక విధంగా ఇది పెద్ద రిస్క్ అనే చెప్పాలి'' అని రాహుల్ ఆ తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 
http://blogs.independent.co.uk/wp-content/uploads/2010/11/Rahul-Gandhi.jpg
ఒకప్పుడు రాజీవ్ కూడా రాహుల్ మాదిరిగానే సాధారణమైన జీవితాన్ని గడపాలని కోరుకొనేవాడు. ప్రధాని అయిన తర్వాత కుదరలేదు కాని రాజీవ్‌కు విమానాలు నడపటం అంటే ప్రాణం. ఇది కూడా ప్రధాని అయిన తర్వాత సాధ్యమయ్యేది కాదు. అందుకే- "కొన్ని సార్లు నేను ఒంటరిగా కాక్‌పిట్‌లోకి వెళ్లి కూర్చుంటాను. నేను ఎగరలేనని నాకు తెలుసు. కాని బయట ప్రపంచానికి దూరంగా ఉన్నాననే భావన నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది'' అని రాజీవ్ ఒక సందర్భంలో పేర్కొన్నారు.http://pakteahouse.files.wordpress.com/2009/05/rahul-gandhi.jpg
కంపెనీ డైరెక్టర్‌గా..
ఒక వైపు రాహుల్ ఇంగ్లాండ్‌లో సాధారణమైన జీవితాన్ని గడపటానికి ప్రయత్నిస్తున్నప్పుడే భారత్‌లో సోనియా రాజకీయాలలోకి ప్రవేశించింది. ఆమెకు ప్రియాంక తోడుగా ఉండేది. రాహుల్ అప్పటికే దేశాన్ని వదలివెళ్లి పదేళ్లు అయిపోయింది. 
http://www.mobileapples.com/Assets/Content/Wallpapers/Rahul_gandhi_and_soniya.jpg http://www.pkp.in/images2/Priyanka%20Gandhi%20kids.jpg
సోనియా రాజకీయాలలో నిలదొక్కుకోవటం మొదలుపెట్టింది. రాహుల్ భారత్‌కు తిరిగి వచ్చేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో 2002లో రాహుల్ భారత్‌కు తిరిగి వచ్చాడు.http://jharkhandmirror.files.wordpress.com/2009/08/rahul1.jpg?w=298
ఇదే సమయంలో మన దేశంలో టెక్నాలజీ బూమ్ వచ్చింది. లక్షల మంది ఐటీ రంగంలోకి ప్రవేశించటం మొదలుపెట్టారు. భారత్‌కు తిరిగి వచ్చిన రాహుల్ మరి కొందరు స్నేహితులతో కలిసి ముంబాయిలో బ్యాక్ఆప్స్ (ఆపరేషన్స్) సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కంపెనీని స్థాపించాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు సలహాలు ఇవ్వటం ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం.

దీనిలో రాహుల్‌తో పాటుగా మనోజ్ మట్టు (రాహుల్‌కు చిన్ననాటి మిత్రుడు), అనిల్ ఠాకూర్ (మాజీ కేంద్ర మంత్రి రామేశ్వర్ ఠాకూర్ కుమారుడు), రన్వీర్ సిన్హా (రాహుల్ మిత్రుడు) డైరెక్టర్లుగా ఉండేవారు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు రాహుల్ సమర్పించిన అఫిడవిట్‌లో తనకు బ్యాక్ఆప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 83 శాతం వాటా ఉన్నట్లు రాహుల్ పేర్కొన్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల ముందు రాహుల్ ఈ కంపెనీలో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశాడు.
http://satyameva-jayate.org/wp-content/uploads/2010/11/Rahul-Gandhi-Congress.jpg
అయితే రాజకీయాలలోకి పూర్తిస్థాయిలో ప్రవేశించటం వల్ల ఈ బిజినెస్‌ను నడపటానికి రాహుల్‌కు సమయం లేదని ఆయన సన్నిహిత వర్గాలు ఆ సమయంలో పేర్కొన్నాయి.''
Rahul gandhi

పట్టువీడని తత్వం..
"రాహుల్ ఏ విషయానీ మర్చిపోడు.తప్పు జరిగితే ఎవరినీ క్షమించడు.'' 
http://mangalorean.com/images/newstemp17/20080329rahul6.jpg
 ఈ విషయాన్ని కొందరు జర్నలిస్టులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. 2009, జనవరి 22వ తేదీన ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో ఒక వర్క్‌షాప్ జరిగింది. దీనిలో రాహుల్ ఒక ప్రజంటేషన్ ఇచ్చాడు. మధ్యాహ్నం అందరితో కలిసి లంచ్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఆ ప్రజంటేషన్‌కు సంబంధించిన కాగితాలు కనిపించలేదు. ఈ వర్క్‌షాప్‌ను చిత్రీకరించటానికి వచ్చిన కొందరు ఛానెల్ రిపోర్టర్లు ఆ కాగితాలను రాహుల్‌కు చెప్పకుండా తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాల్సిందేనని రాహుల్ పట్టుపట్టాడు. http://www.publictrustofindia.com/wp-content/uploads/2011/07/r2.jpg
పోయినవి ప్రజంటేషన్ కాగితాలే కాబట్టి పట్టించుకోవద్దని అక్కడున్న నేతలు నచ్చచెప్పటానికి ప్రయత్నించారు. కాని రాహుల్ తన పట్టు వీడలేదు. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు హిబీ ఇడెన్ పార్లమెంట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు మూడు ఛానెల్స్‌కు సంబంధించిన రిపోర్టర్లను పిలిచి విచారించారు. పోలీసు రిపోర్టు ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది నేతలు - ఆ ప్రజంటేషన్‌లో రహస్యాలు ఏమీ లేవు కాబట్టి రిపోర్టును వెనక్కి తీసుకుందామని రాహుల్‌కు నచ్చచెప్పటానికి ప్రయత్నించారు. 
http://indiacurrentaffairs.org/wp-content/uploads/2011/07/Rahul-Gandhi%E2%80%99s-Thesis-On-Terrorism.jpg
కాని రాహుల్ అంగీకరించలేదు. తనకు చెప్పకుండా కాగితాలు తీసుకోవటం కూడా దొంగతనం కిందకే వస్తుందని వాదించాడు.http://newsleaks.in/wp-content/uploads/2011/04/M_Id_63449_Rahul_Gandhi.jpg
 పుస్తకం పేరు: రాహుల్
రచయితలు: జితిన్ గాంధీ, వీను సంధు
http://4.bp.blogspot.com/-I9MwcXJthxI/TjJhJGA1rAI/AAAAAAAABck/c4oIWIhLLZ8/s1600/rahul+indira+gandhi.jpg
ప్రచురణకర్త: వైకింగ్, ధర: రూ. 499

No comments:

Post a Comment