Tuesday, January 17, 2012

ఫీనిక్స్ జ్యోతి * ఈమె జీవితం కూడా తెలుసుకోవాల్సిన ఓ పాఠమే!

jyothi telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaగ్రీకు పురాణాల్లో ఫీనిక్స్ అనే పక్షి ఉంటుంది సూర్యుడిని అందుకోవాలని అది ఆశపడుతుంది ఎగిరి.. ఎగిరి.. సూర్యునికి దగ్గరవుతుంది వేడికి రెక్కలు మాడి కింద పడిపోతుంది కానీ దాని కోరిక చావదు
గాయాలు మానాక మళ్లీ ఎగరడం మొదలెడుతుంది ఇది ఫీనిక్స్ పట్టుదలను పాఠంగా నేర్పే కథ! 

ఈమె జీవితం కూడా తెలుసుకోవాల్సిన ఓ పాఠమే!


మైలారం గ్రామం, వరంగల్, 1988లో ఒకరోజు..
ఓ యువతి పొలంలో కలుపుతీస్తోంది.. ‘ఝయ్..’మని ఆకాశంలో ఏదో చప్పుడు... ఆమె ఆసక్తిగా పైకి చూసింది. విమానం! ‘నా జీవితంలో ఎప్పటికైనా ఆ విమానం ఎక్కాలి’ ఆశ పడిందామె. అందులో తప్పులేదు. కానీ ఆమె పరిస్థితులు వేరు. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. బంధాలు.. బంధుత్వాలు.. కట్టుబాట్లు.. వీటి మధ్య ఆమెకది అత్యాశే. కానీ ఆమె అలా అనుకుంటే ఇప్పటికీ ఇంకా అదే పొలంలో పనిచేస్తుండేదేమో!


మే 2, 2000.. బేగంపేట ఎయిర్‌పోర్ట్, హైదరాబాద్
ఫీనిక్స్ ఎంత ఎగిరినా సూర్యుడిని అందుకోలేకపోయింది. కానీ ఆ యువతి కల నెరవేరింది. ఆకాశంలో ఎగరాలన్న ఆశ తీరింది. అమెరికా వెళ్లింది. అంతటితో ఆగిపోలేదు. ఆమె లక్ష్యం మరింత విస్తృతమైంది. ఆమె సంకల్పం ఫీనిక్స్ ఆశ కన్నా గొప్పది. అందుకే ఇప్పుడామె యుఎస్8 బేస్డ్ కంపెనీకి సిఈవో అయ్యింది. ఆమె పేరు జ్యోతి.. అలియాస్8 అనిల్‌జ్యోతి. అమెరికా ఆరిజోనాలో ఫీనిక్స్ అనే నగరం ఉంది. జ్యోతి స్థాపించిన కీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కార్యాలయం కూడా అక్కడే ఉంది. అందుకే ఆమె ఫీనిక్స్ జ్యోతి. 
Every successful story has a painful beginning..
- Dr. APJ Abdul కలం

ప్రతి విజయగాథ ఒక బాధాకరమైన పరిస్థితి నుంచే ప్రారంభమవుతుంది.


jyothi_1 telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema పాఠం 1 :No pain no gain ( నో పెయిన్ నో గెయిన్ )
పెయిన్ : వరంగల్ జిల్లా నర్సింహులు గూడెంలో ఒక సాధారణ కుటుంబం. ఐదుగురు తోబుట్టువుల్లో జ్యోతి ఒకరు. ఎమ్జన్సీ టైమ్‌లో తండ్రి వెంకట్‌డ్డి ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందులు. ‘తల్లిలేని పిల్ల’ అనే అబద్ధంతో జ్యోతిని హన్మకొండ బాలసదనంలో చేర్పించాడు తండ్రి. అమ్మ బతికే ఉన్నా అనాథలా హాస్టల్‌లో ఉండడం జ్యోతిని బాధించింది.


గెయిన్ : హాస్టల్లో ఉండడం వల్ల మమతాను రాగాలకు దూరమైనప్పటికీ ఆ బాధను మర్చిపోవడానికి ఆమె స్నేహితులతో ఎక్కువగా గడిపేది. మిగిలిన సమయం చదువుకు వెచ్చించేది. టెన్త్ ఫస్ట్ క్లాస్8లో పాసయ్యింది. ఇంకా బాగా చదువుకోవాలనుకుంది. వేసవి సెలవుల్లో టైపింగ్ నేర్చుకుంది. టీచరు ఉద్యోగం సంపాదించాలని ఒకేషనల్ కోర్సు చేసింది.


పాఠం 2 : Accept and adart to the reality (వాస్తవాల్ని అంగీకరించాలి... అనుగుణంగా మలుచుకోవాలి)
వాస్తవం : అప్పుడు జ్యోతికి 18 ఏళ్లు. ఒకేషనల్ కోర్సు టీచర్ ఉద్యోగానికి అర్హత కాదని తెలుసుకుంది. ఇంకా చదువుకోవాలనుకుంది. కానీ ఇంట్లోవాళ్లు అప్పటికే పెళ్లి చేశారు. ఇద్దరు ఆడపిల్లలకు తల్లికూడా అయింది. వ్యవసాయ కుటుంబం. పేదరికం. పొలం పనులు చేయడానికి పిల్లలను ఇంటి దగ్గరే వదిలి వచ్చేది. రోజుకు ఐదు రూపాయలు సంపాదన. ఏదో వెలితి. ఇది కాదు జీవితం. ఇంకా ఏదో కావాలి.
చిరుదీపం : జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం వాస్తవాల్ని అంగీకరించడం. అవి ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే ఫలితం ఏమీ ఉండదు. చిరుదీపం వెలిగించాలి. ఆ దీపమే నేషనల్ సర్వీస్8 వాలంటీర్ నోటిఫికేషన్. అతికష్టం మీద జ్యోతి అందులో వెలిగింది. నిన్న మొన్నటి వరకు తనతో కలిసి పనిచేసిన కూలీలకే వయోజన విద్య నేర్పింది.


పాఠం 3 : No condition is permanent ( ఏ పరిస్థితి శాశ్వతం కాదు )
కండీషన్స్ : ఏడాది గడిచింది. నెహ్రూ యువకేంవూదంలో అవకాశం వచ్చింది. కానీ ఇతర ప్రాంతాలు తిరగాలి. అంటే.. మకాం హన్మకొండకు మార్చాలి. కానీ ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. పిల్లలు తనలాగే బతకకూడదు. వారికి మంచి భవిష్యత్తునివ్వాలి. అంటే.. హన్మకొండకు వెళ్లక తప్పదు. చిన్న ఇనప్పెట్టెలో సామన్లు సర్దుకుని, ఇద్దరు పిల్లల్ని తీసుకుని హన్మకొండకు బయలుదేరింది.
మార్పు : ఏదీ శాశ్వతం కాదు. మార్పు మాత్రమే శాశ్వతం. జ్యోతి కోరుకుంది కూడా అదే. ఉద్యోగం చేస్తోంది. కానీ అదొక్కటే సరిపోదు. టైలరింగ్ నేర్చుకుంది. లంగాలు కుట్టి దుకాణాలకిచ్చేది. టైపింగ్ పాసయింది. ఎలాగైనా డిగ్రీ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు తనని ఆపేవారు లేరు. ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందింది. కష్టపడి స్పెషల్ టీచరుగా ఉద్యోగం సంపాదించింది. 18 నెలల తర్వాత రెగ్యులర్ అయింది.

పాఠం 4 : Work for growth  ( ప్రగతి కోసం కృషి )

కృషి : చేసే పనిలో క్వాలిటీ ఉండాలి. అందులో ఎదిగేందుకు ప్రయత్నించాలి. జ్యోతి అదే చేసింది. పరకాల మండలం రామకృష్ణాపూర్‌లో ఉద్యోగం. 4వ తరగతి వరకు ఉంటుంది ఆ స్కూల్లో. పిల్లలు మాత్రం 16 మందే. అదే ఊర్లో ప్రయివేటు స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువగా ఉండేది. జ్యోతి రోజూ బస్8కు వెళ్లి వచ్చేది. ఆలస్యం అయితే ఆబ్‌సెంట్ వేసేవాడు హెడ్‌మాస్టర్. తిరిగి వెనక్కి రాలేదు. ఆ రోజున ఊళ్లోకి వెళ్లి పిల్లల తల్లిదంవూడులతో మాట్లాడేది. ప్రయివేటు స్కూల్‌కి, గవర్నమెంట్ స్కూల్‌కి తేడా తెలియజెప్పేది. వారిలో మార్పు వచ్చింది. ఏడాదిలోనే గవర్నమెంట్ స్కూల్‌కి సొంత భవనం... 270మంది స్ట్రెంత్. మూతపడిన ప్రయివేటు స్కూల్ టీచర్లకు కూడా ఉపాధి కల్పించింది.
ప్రగతి : నలుగురు చేసే పనిని నలుగురిలా కాకుండా వైవిధ్యంగా తనదైన శైలిలో చేసి విజయం సాధించింది జ్యోతి. ఆ సమయంలోనే ఎంఏ సోషియాలజీ వన్‌సిట్టింగ్‌లో పాసయ్యింది. టీచర్ ఉద్యోగం నుంచి పదోన్నతి పొంది మండల్ గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయింది.
పాఠం 5 :Never wait for Miracle (అద్భుతాల కోసం ఎదురుచూడొద్దు)
ప్రగతి కోసం : జీతం పెరిగింది. జీవితం బాగుంది. ఇక చాలు. ఇంతకన్నా సాధించడం వీలుకాదు.. అని సర్దుకుని సంతృప్తి చెందితే ఎదుగుదల ఆగిపోయినట్లే. చాలామంది ఈ కంఫర్ట్ జోన్ కోసమే బతుకుతుంటారు. ఇంకా ఎదగాలంటే జీవితంలో ఏదో అద్భుతాలు జరగాలని ఎదురుచూస్తుంటారు. అలాంటివాప్పటికీ సగటు మనిషిగానే మిగిలిపోతారు. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అంటారు అబ్దుల్ కలామ్. మన లక్ష్యాలు పెద్దగా ఉండాలి. ప్రయత్నించాలి. కానీ అద్భుతాలు జరగాలని ఎదురుచూడొద్దు. ఈసారి జ్యోతి లక్ష్యం పెద్దది. ప్రయత్నం మొదపూట్టింది.
కృషి : బంధువుల్లో చాలామంది అమెరికాలో ఉండడంతో తను కూడా అక్కడికి వెళ్లాలనుకుంది. కంప్యూటర్ కోర్సు నేర్చుకుంది. వీసా కోసం ప్రయత్నించింది. మరి పిల్లలు? వారికి నచ్చజెప్పి హాస్టల్‌లో చేర్పించింది. హెచ్1 వీసా దొరకలేదు. విజిటర్స్ వీసా మీద అమెరికా వెళ్లింది. కానీ ఆ వీసాతో ఉద్యోగం చేయడానికి అక్కడి చట్టాలు అనుమంతిచవు. అయినా తను అక్కడ బతకాలంటే ఏదో అద్భుతం జరగాలి. కానీ అలా జరగదని ఆమెకు తెలుసు.
పాఠం 6 : Never loose courage (ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు)
ధైర్యం : నెలకు 20 వేల రూపాయల ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని కొత్త జీవితం మొదపూట్టాలని అమెరికాలో అడుగుపెట్టిందంటే ఆమెది కచ్చితంగా సాహసోపేతమైన నిర్ణయమే. మొండి ధైర్యమే. కానీ ఆ ధైర్యం ఇప్పుడు కోల్పోవాల్సి వచ్చింది. ఎంత కాలం ఇలా పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ చిన్న చిన్న షాపుల్లో పనిచేయాలి? మళ్లీ ప్రశ్న. జీవితంలో ఎప్పుడో ఎదురైన సమస్య. కాదు ఎప్పుడూ ఎదురయ్యే సమస్యే. వెంట తెచ్చుకున్న డబ్బులు అయిపోవస్తున్నాయి. ఏం చేయాలి? ఒక్క ఛాన్స్ ఉంది. అలాంటి వారు భారతీయుల దుకాణాల్లో పనిచేసే అవకాశం ఉంది. ఒక మూవీ క్యాసెట్ షాపులో సేల్స్ గర్ల్‌గా చేరింది.
ముందడుగు : ఇంగ్లీష్ రాదు. డబ్బులు లేవు. షాప్‌లో పనిచేస్తే వచ్చే డబ్బు సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వెనకడుగు వేయాల్సి వస్తుంది. కానీ ఆమె అడుగు ముందుకే పడింది. తమ ఊరివాళ్ల సహాయంతో ఓ సాఫ్ట్‌వేర్ కన్సప్టూన్సీలో ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత సిఏ అమెరికా కంపెనీలో రిక్రూటర్‌గా చేరింది.


పాఠం 7 : Associate with good people (మంచివాళ్లతో సన్నిహితంగా ఉండాలి)
గుడ్ పీపుల్ :  ఎలా బతకాలో ఎవరూ పాఠంగా నేర్పరు. పరిస్థితులు నేర్పిస్తాయంతే. చాలాసార్లు చూసి నేర్చుకోవాల్సిందే. అంటే.. మనం ఎవరితోనైతే ఎక్కువ కాలం కలిసి ఉంటామో వారు మనకన్నా అనేక విషయాలు తెలిసినవారై ఉండాలి.
విత్ అసోసియేషన్ : జ్యోతి అలాంటి వారితో కలిసి పనిచేసి కొంచెం కొంచెంగా ఇంగ్లీషు నేర్చుకుంది. వీసా గడువు మాత్రం దగ్గరపడుతోంది. ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలి. హెచ్1 వీసా కోసం ఎన్నో కష్టాలు పడింది. మొత్తానికి సాధించింది. వర్జీనియాలో మంచి ఉద్యోగం సంపాదిచింది. కాలంతో పాటు కష్టపడితేనే ఇవన్నీ దొరికాయి.


పాఠం 8 : Inspire and give hope (స్ఫూర్తిని రగిలించు, ఆశని కలిగించు)
స్ఫూర్తి : మే 2000లో అమెరికా వెళ్లిన జ్యోతి అక్టోబర్ 2001 నాటికి సొంత కంపెనీ ప్రారంభించగలిగింది. తన పరిస్థితులను అర్థం చేసుకుని ఎవరినీ నిందించకుండా తనకు తానుగా ఎదిగి ఇప్పుడు అమెరికాలో కీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ పేరుతో కంపెనీని ప్రారంభించింది. సాధారణ రైతుకూలీ నుంచి సక్సెస్8ఫుల్ ఉమెన్‌గా ఎందరికో స్ఫూర్తిగా నిస్తోంది.
హోప్ : జీవితంలో ఒక్కసారైనా అమెరికా చూసి రావాలని కలలుకనే సగటు భారతీయురాలిగానే ఆలోచిస్తే ఆమె జ్యోతి ఎందుకవుతుంది? అమెరికాలో ఎదురైన అనుభవంతో గ్రామీణ భారతంలోని మహిళా సాధికారత, స్వావలంబన కోసం పనిచేస్తోంది. తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసింది. మంచి భవిష్యత్తునిచ్చింది. వృద్ధాక్షిశమాలకు, అనాథలకు తనవంతు సహాయం చేస్తోంది. కాలేజీ విద్యార్థులకు తన జీవితాన్నే మోటివేషన్ పాఠంగా చెబుతోంది.

చివరగా ఒక మాట. స్టీవ్ జాబ్స్ చెప్పిన మాట. ‘మీ లక్ష్య సాధన కోసం అవసరమైతే పస్తులుండండి. అవసరమైతే అవహేళనలు ఎదుర్కోండి ( 2005, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ). పేదవాడిగా పుట్టడం మీ తప్పుకాదు.. కానీ పేదవాడిగానే చచ్చిపోతే కచ్చితంగా అది మీ తప్పే. అందుకే మీ లక్ష్యం పెద్దదిగా ఉండాలి.
 ఆల్ ది బెస్ట్. 
* బీరెడ్డి నగేష్ రెడ్డి
ఫోటోలు : కె. సాయిలు

No comments:

Post a Comment