Wednesday, February 23, 2011

మనసు చూపిన మార్గం

చంద్రికా కృష్ణమూర్తి... సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ వుమన్‌... న్యూయార్క్‌ యూనివర్శిటీ ట్రస్టు బోర్డు మెంబర్‌.. పెప్సికో సిఇఓ ఇంద్రానూయికి సోదరి... అది కొద్ది కాలం క్రితం వరకు ఇప్పుడు.. ఓ మంచి సంగీత విద్వాంసురాలు. 56 ఏళ్ల వయసులో తనలో దాగున్న అంతర్గత ప్రతిభకు ప్రాణం పోసుకుంది. గిటారు నేర్చుకుంది. సంగీత సాధన చేసింది.  భక్తి సంగీతంతో                  ఓం నమశ్శివాయ  పేరుతో మొదటి ఆల్బమ్‌ను విడుదల చేసింది.  ఇక రెండవ ఆల్బం ఓం నయో నారాయణతో గ్రామీ అవార్డుకు ఎంపికయ్యింది.

yellowscarfచంద్రికా కృష్ణమూర్తి ఫేస్‌ బుక్‌ ఓపెన్‌ చేస్తే చాలు.. 25 వేల రకాల పూలు నవ్వుతూ పలకరిస్తాయి. ఆ పూలలోని సుగంధం చల్లగా కదిలిస్తుంది. నెమ్మదిగా పరికించి చూస్తే అందులో ఆమె పరిచయం చేసే కొత్త విషయాలెన్నో.

పాటలంటే ప్రాణం...
చిన్నతనం నుండి రేడియోలో పాటలు వింటూ పెరిగారు. అన్ని రకాల సంగీతా న్ని విని ఆనందించేవారు.శనివారం రాత్రి పాఠకులు కోరిన పాటలను ప్రసా రం చేసేవారు. అవంటే చంద్రికకు ఎంతో ఇష్టం. తప్పకుండా వినేది. ఇక టామ్‌ జోనెస్‌ పాటలు అంటే చాలా చాలా ఇష్టం. డీన్‌ మార్టిన్స్‌ సాంగ్‌ మొదటి సారి వినగానే ఆమెకు నచ్చింది. వుడ్‌ స్టాక్‌ సాంగ్స్‌ని ఒకే వారంలో పన్నెండు సార్లు విన్నది.అలాగే చిన్నతనం నుండి ఎక్కువ హమ్మింగ్‌ చేసేది. ఇక భక్తి పాటలం టే చంద్రిక ప్రాణం పెట్టేది.జాతీయ గీతాల పట్ల మక్కువ ఎక్కువ. ఫ్రెంచ్‌ సంగీతం కూడా నేర్చుకుంది.

నాకు నేనే ప్రశ్నగా..
పెరిగి పెద్దవుతున్న కొద్దీ చంద్రిక పూర్తిగా చదువు వైపుకి మళ్లింది. ఉన్నత స్థానానికి చేరుకుంది. కానీ ఏదో వెలితి. ఎంత సాధించి నా సంతృప్తి లేక బాధపడింది. ఓసారి తనను తాను పూర్తిగా అర్థం చేసుకునేం దుకు ప్రయత్నించింది. ‘నాకు సంబంధించి ప్రతి విషయంలోనూ సంగీతం వుంది. ఇది లేకుండా నేను బతకడం అనేది సాధ్యం కాదు. నాకు నేనే ఓ పెద్ద నీడలాంటి దాన్ని దాని గురించి నాకు నేనే ఎప్పుడూ చెప్పుకుంటూ వుంటాను. తొమ్మిది సంవత్సరాల క్రితం నా కూతురిని స్కూలుకు పంపిచడం మొదలు పెట్టాకే మేలుకున్నాను. బిజినెస్‌లో ఎంతో విజయం సాధించాను.

Chandrika1కానీ నా లోపల దాగున్న తృష్ణని మాత్రం ఏ మాత్రం నెరవేర్చుకోలేకపోయాను. నేను ఏంటో తెలుసుకోవాల్సిన సమయం అనిపించింది. నాకు సంతోషం కలిగించే అంశం ఏంటి అని? నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అప్పుడే అనిపించింది నాకు సంతో షాన్ని కలిగించే అంశం సంగీతం ప్రస్తుతం నా జీవితంలో అది లేదు. అప్పుడే మొదలైంది సంగీత విద్యార్థిగా. ఎంతో గొప్ప గొప్పవారి దగ్గరికి వెళ్ళి క్లాసికల్‌, హిందుస్థానీ సంగీతాన్ని తెలుసుకున్నాను. పండిట్‌ గిరిష్‌ వాజాల్వర్‌ వంటి వారి తో కలిసి పనిచేశాను. ఆయన నాకు అసలు గురువు. వీణ సహస్ర బుద్ధే దగ్గర, శుభ్ర గుహ, పండిట్‌ విజయ్‌ కిచ్‌లు దగ్గర కూడా దీన్ని నేర్చుకున్నాను’ అని చంద్రిక చెబుతోంది.

ఇవంటే చాలా ఇష్టం..
అమెరికాలో టాప్‌ 40 హిట్‌ పాటలన్నీ చంద్రికకు చాలా ఇష్టం. నును డెమీస్‌ రౌసెస్‌, ఊమ్‌ కథోమ్‌, నానా మస్కౌరి వారి పాటల నుండి ఎంతో నేర్చు కుంది. వాటి నుండి స్ఫూర్తి పొందింది. ఇక వారి మెలోడీ పాటలు ఆమెను ఎంతగానో ప్రోత్సహించాయి. ఎబిబిఎ, బ్రెజిలి యన్‌ సంగీతం, ది ఈగల్స్‌, బిగీస్‌, జోన్‌ బేజ్‌ వంటి ఎన్నో కలెక్షన్స్‌ ఆమె దగ్గర వున్నాయి. పాశ్చాత్య సంగీత క్లాసిక్స్‌ అన్నీ సేకరించారు.

ఆషామాషీ కాదు..
మొదటి ఆల్బమ్‌ను 2005లో చంద్రిక విడుదల చేసింది. అనుకున్నదే తడవు గా చేసింది కాదిది.అందుకు ఆమె ఎంతో శ్రమించింది. ‘ఆల్బమ్‌ మొదలు పెట్టే ముందే అన్నిటికీ సిద్ధం అయ్యాను. భారతదేశంలో ఎంతో మంది ప్రముఖుల ను కలుసుకున్నాను. సంగీతాన్ని తెలుసుకున్నాను’ అని చంద్రిక అంటోంది.

గ్రామీ అవార్డుకు ఎంపిక...

పాశ్చాత్య పాప్‌ సంగీతాన్ని అక్కడి సంగీత హోరును అన్నిటినీ మరిపించి చం ద్రిక రెండవ ఆల్బం ఓం నమో నారాయణ గ్రామీ అవార్డుకు ఎంపికయ్యిం ది. బేలాఫ్లెక్‌, బేబిల్‌ గిల్‌బర్టో, అంజెలి క్యూ కిడ్జో, సెర్జియో మెండెస్‌ వం టి ప్రముఖుల ఆల్బమ్స్‌ను దాటుకుని ఆమె నామినీగా నిలిచినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Chandrikaమీ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నా రా? అని చంద్రికను అడిగితే ‘ఇదో గౌరవం. అసలు ఎంపిక అవ్వడమే ఎంతో గర్వంగా అనిపించింది.కలలో కూడా అనుకోలేదు. నేను ఏదో అవార్డు వస్తుంది.. తెచ్చుకోవాలని అనే ఆశతో అయితే పని చేయలేదు.భవిష్యత్తులో దాని కోసం ప్రయత్నించే దా న్ని. కానీ ఇప్పుడే వ స్తుందని మాత్రం అ నుకోలేదు’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

ఎంత ఎదిగినా ఒదిగే...
‘నా జీవితం ఏమీ మార దు. నేను నా శక్తి వంచన లే కుండా నాలోని ప్రతిభను పూర్తిగా వినియోగించుకుని ఆల్బమ్‌ చేశాను. ఇక గ్రామీ నామినేషన్‌ అనేది నా సంగీతాన్ని ఎంతో మందికి తెలిసేలా చేసింది. ఎన్నోకష్టాలను దాటుకు ని అది ఆ స్థానానికి చేరుకుంది. సంగీతం అనేది మనసు మూలాలను తాకేదిగా వుండాలి. అప్పుడే విజయం సాధిస్తుంది. నా పాటల్లో ఆ ప్రత్యేకత వుంది కాబట్టే ఈ స్థాయికి వచ్చింది’ అని ఎంతో వినమ్రత ప్రదర్శిస్తారు.

ఎవరి ప్రత్యేకత వారిదే..
ఇంద్రానూయి చెల్లెలుగా పుట్టడం ఎంతో గర్వంగా అనిపిస్తుందని చంద్రిక అం టోంది. ‘ఆమె ఎంతో శక్తివంతమైన మహిళ. లక్షలాది మంది అభిమానులు ఆమెకున్నారు. వారందరిలో నేను ముందు వరుసలో వుంటాను. కలలను నెరవే ర్చుకోవడం అంటే ఏంటో ఆమె నుండే నేర్చుకోవాలి. ఇద్దరం ఎంతో సన్నిహి తంగా వుంటాం. 35 సంవత్సరాలుగా ఎవరికి వారు బతుకుతున్నాం. ఆమె వ్యా పారంలో అంచెలంచెలుగా ఎదిగింది. నేను నా స్థాయిలో వున్నాను. ఓ ఫౌండేష న్‌ని ఏర్పాటు చేశాను. బిజినెస్‌ స్కూలుకు బోర్డు మెంబర్‌గా వున్నాను. దీనితో పాటు అమెరికన్‌ ఇండియా ఫౌండేషన్‌లో కూడా భాగస్వామిగా వున్నాను’ అని చంద్రిక వారి మధ్య గల ప్రత్యేకతలను చెబుతున్నారు. అంతే కాదు..ఇంద్రా నూయి చంద్రికకు ఎంతో సపోర్టుగా కూడా వుంటారు. సంగీతం వైపుకు వెళ్లేందుకు మార్గదర్శకురాలు కూడా. ఈ విజయం అనేది ఆమెకు ఓ స్వీట్‌ న్యూస్‌. భవిష్యత్తులో తన ప్రతిభకు మరింత పదును పెట్టుకుని ముందుకెళ్ళేందుకు ఇప్పుడు చంద్రిక సిద్ధమవుతోంది. ఆమెకు ఆల్‌దిబెస్ట్‌.

No comments:

Post a Comment