Friday, February 4, 2011

బిలియనీర్ల విలాసాలు * అత్యంత ధనికులు నలుగురి సరదాలు.

జుట్టున్నమ్మ ఏ ముడైనా వేయగలదని డబ్బున్న వారు ఏమైనా చేయగలరు.ప్రపంచంలోనే అత్యంత ధనికులుగా పేరుపొందిన వారు ఎల్లవేళలా సంపాదన యావలో ఉంటారని, డబ్బులు లెక్కచూసుకుంటూ కాలం గడుపుతారని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. వారికీ సరదాలు ఉంటాయి.కాకపోతే అవి కొంచెం ఖరీదైనవి అయి ఉంటాయి అంతే! మన దేశంలో అత్యంత ధనికులుగా పేరుగాంచిన నలుగురి సరదాలు ఏమిటో తెలుసుకుందాం..

mukeshambani_bbj2ఐశ్వర్యవంతులు తమ సరదాల కోసం లలు, కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు. తమకేదేమైనా ఇష్టమైతే ఎంత ఖరీదైనా కొనుగోలు చేసేందుకు వెనుకాడరు.అది ఒక పడవ కావచ్చు, విమానం కావచ్చు లేదా ద్వీపమే కావచ్చు. అది ఏదైనా సరే వారి మనసు దాని పైకి మళ్లిందో అది వారి స్వంతం కావలసిందే. ఇటువంటి కొందరు బిలియనీర్ల గురించి తెలుసుకుంటే అమ్మో...అనకుండా ఉండలేము.

హై ఫ్లయింగ్‌ బిలియనీర్‌...
మన దేశంలోని ధనవంతులలో మొదటి స్థానాన్ని ఆక్రమించే ముఖేష్‌ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఎంత కష్టపడతారో తన సరదాల కోసం అదే విధంగా ఖర్చుచేస్తారు. ఆయన తన భార్యా పిల్లలతో సరదాగా గడిపేందుకు ఎంత డబె్బైనా ఖర్చుచేస్తారు. ఇందుకోసం ముఖేష్‌ ఇటీవల బోయింగ్‌ బిజినెస్‌ జెట్‌2 విమానాన్ని కొను గోలు చేశారు. ఇందులో ప్రత్యేకంగా హోటల్‌ తో పాటు బోర్డు రూమ్‌ కూడా ఉంది. వీటిలో చక్కగా ఎంజాయ్‌ చేసేందుకు అవసర మైన సౌకర్యాలెన్నో ఉన్నాయి. 1,004 చదరపు అడుగుల ఈ ప్లేన్‌లో తన కోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్‌ ఆఫీస్‌, ప్రైవేట్‌ సూట్‌ను ఏర్పాటు చేసుకున్నారు ముఖేష్‌ అంబానీ. ఆయనకు తన భార్య నీతా అంటే ప్రాణం. ఆమె బర్త్‌డే గిఫ్ట్‌గా ఏకంగా 60 మిలియన్‌ డాలర్ల ఎయిర్‌ బస్‌ను కొనుగోలుచేసి ఇవ్వడం మరో విశేషం. ఇ తన పిల్లల కోసం ఏమి కొంటారో వేచి చూడాల్సిందే.

కార్లంటే ప్రాణం...
lamborghini_ambani_anilబిలియనీర్‌ సోదరులలో పెద్దవాడైనా ముఖేష్‌ అంబానీ లాగే అనిల్‌ అంబానీకి సైతం కొన్ని రకాల ఇష్టాలున్నాయి. అనిల్‌ అంబానీకి స్పీడ్‌గా వెళ్లే కార్లంటే ప్రాణం. వేగంగా వెళ్లే ఆరు లగ్జరీ కార్లను ఆయన కోట్ల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేశారు. లాంబ్రోగిని గల్లార్డో, మెర్సీడీజ్‌ ఎస్‌ క్లాస్‌, మేబ్యాచ్‌, బిఎండబ్ల్యూ 7 సీరీస్‌, అడీ క్యూ7, రాల్స్‌ రా యిస్‌, పోర్స్చ్‌, లెక్సస్‌ వంటి ఖరీదైన కార్లు ఆయన వద్ద ఉన్నాయి. మన దేశంలో ఇంతటి ఖరీదైన కార్లు మరెవరి దగ్గరి కూడా లేవంటే అతి శయోక్తి కాదు.ఈ విలాసవంతమైన కార్ల కోసం ఆయన తన నివాసం వద్ద ఓ ప్రత్యేక గ్యారేజీని కూడా ఏర్పాటుచేసుకున్నారు.

ద్వీపాన్ని సొంతం చేసుకొని...

విదేశాల్లో నివసిస్తున్న ఎన్‌ఐఆర్‌ బిలియనీర్లలో ఒకరు బాబ్‌ ధిల్లాన్‌. కెనడాలో నివసించే ఈ ఇండియన్‌ బిలియనీర్‌ అమెరికా బెలీజ్‌ ప్రాంతం సమీపంలో ఏకంగా 2300 ఎకరాల ద్వీపాన్ని కొనుగోలుచేశారు.సెంట్రల్‌ అమెరికన్‌ ఐలాండ్‌ అయిన దీన్ని ఆయన ఎంతో అందంగా తీర్చిదిద్దారు. పచ్చటి ప్రకృతితో కళకళలాడే ఈ ద్వీపంలో ధిల్లాన్‌ తన నివాసాన్ని భారీగా నిర్మించుకున్నారు. ఇక ఈ సిఖ్‌ బిలియనీర్‌ ఐలాండ్‌ పొరుగున హాలీవుడ్‌ స్టార్‌ లియోనార్డో డి కాప్రియో ద్వీపం ఉండడం విశేషం.

ద కింగ్‌ ఆఫ్‌ గుడ్‌ టైమ్స్‌...
bob_dhillon-islandఈ మాట అనగానే అందరికీ గుర్తొచ్చేది లిక్కర్‌ కింగ్‌ విజయా మాల్యా అని. ఈ ఐశ్వ ర్యవంతుడు విలాస వంతమైన మనిషిగా పేరు గాంచారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ అధినేత కూడా అయిన ఈ బిలియ నీర్‌కు విలాసవంతమైన బోట్లు అంటే ఎంతో ఇష్టం. ఆయన ఇటీవల 450 కోట్ల రూపాయలను వెచ్చించి ఖతారి రాయల్స్‌ 95 మీటర్ల బోటును కొన్నారు. ఇండియన్‌ ఎంప్రెస్‌ని దీనికి పేరుపెట్టారు. నీటిపైన తేలియాడే ఖరీదైన ఈ ప్యాలెస్‌ బోటును ఎంతో అం దంగా నిర్మించారు.ఇందులో ప్రఖ్యాత ఆర్టిస్ట్‌లు రెనాయిర్‌, చగల్‌ పెయింటిం గ్స్‌ను ఏర్పాటుచేయడం విశేషం.

ఇందులో విలాసవంతమైన సౌకర్యాలె న్నింటినో సమకూర్చారు. ఈ బోటులో మసా జ్‌, సోనా రూమ్‌లను ఏర్పాటుచేశారు. ఇం దులో హాయిగా సేద తీరవచ్చు. ఎల్టన్‌ జాన్‌ పియానో కూడా ఇందులో ఉంది. కొద్ది రోజుల క్రితం సూపర్‌ మోడల్‌ హైదీ క్లమ్‌, ఆమె భర్త సీల్‌ తమ ఆరుగురు పిల్లలతో కలిసి ఈ బోటుపై సరదాగా గడి పారు. ఇందులో ఉన్న విలాసవంతమైన సౌకర్యాలను చూసి వారు ఆశ్చర్యపోయారు.కొద్దిరోజుల పాటు ఈ బోటులో నివసించి వారు చక్కగా ఎంజాయ్‌ చేశారు.

ఖరీదైన బోటులో షికారు...
feratti_sunny_dewanరియల్‌ ఎస్టేట్‌ మొగల్‌గా పేరుగాంచిన సన్నీ దీవాన్‌ దేశంలోని టాప్‌ బిలియనీర్లలో ఒకరిగా నిలుస్తారు.ఈ బిలియనీర్‌ 527 కోట్ల రూపాయలతో ఫెర్రెట్టీ 881 బోటును కొన్నారు. 90 అడుగుల ఈ బోటులో విలాసవంతమైన సౌకర్యాలెన్నో ఉన్నాయి. అత్యాధు నిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ బోటు సముద్రంలో వేగంగా దూసుకెళ్తుంది. సముద్రంపై షికారుకెళ్లే సన్నీ దీవాన్‌ తర చుగా తన బోటును గేట్‌ఆఫ్‌ ఇండియా వద్ద పార్క్‌ చేస్తుం టారు. ఈ బోటును తిలకించేందుకు పర్యాటకులు అక్క డికి వస్తుంటారు.బాగున్నాయి కదూ మన వారి టేస్టులు? ఏమైనా పైసా మె హై పరమాత్మ.

No comments:

Post a Comment