గ్రామీణులు, వ్యవసాయ కూలీలు, రైతాంగం, మహిళలు, సమాజంలో అట్టడుగు వర్గాలవారూ పడుతున్న కష్టనష్టాలకు మూలాలు వెతికి వారిని క్రాంతి పథంలోకి నడిపిన మహనీయుడు జ్యోతీరావ్ ఫూలే. ఆయన ఆలోచనలు, కార్యపథం ఎవ్వరికైనా సర్వదా ఆచరణీయం. చెప్పింది ఆచరించి చూపి మార్గదర్శి అయ్యారాయన. సమాజంలో కులం, మతం, ఆర్ధిక స్థోమత ఆధారిత అజ్ఞానం, అణచివేత, ఆధిపత్య దోరణే సమాజంలో విలువలు దెబ్బతినడానికి కారణాలుగా ఫూలె గ్రహించారు. 
వాటిని వ్యతిరేకించి మనిషికి సహజంగా ఉన్న మానవ హక్కులను అణగారిన వర్గాలు తెలుసుకుని అనుభవించే వాతావరణం ఏర్పాటుకు ఫూలే అహోరాత్రులూ శ్రమించారు. సమాజంలో మతం, మూర్ఖత్వం, అజ్ఞానాంధకారంలో సమాజశ్రేయస్సునే నిర్లక్ష్యం చేసిన వారిపట్ల ధ్వజమెత్తారు. సమాజంలో అట్టడుగువర్గాలవారూ సంపూర్ణ స్వేచ్ఛాఫలాలు అందుకోవాలని, కొత్త సమాజం కోసం ఆయన కలలు కన్నారు. సమాజంలో అణగారిన వర్గాల ఐక్యత, అభివృద్ధి కోసం ఫూలె ఎంతో పాటుపడ్డారు.

బాలికలకు పాఠశాల...

సమాజం అన్ని విధాలా ఎదగడానికి మహిళలు చదువుకోవాలన్న స్పూర్తిని కల్పించడంతోనే ఆగక వితంతు వివాహాలను కూడా ఆయన ప్రోత్సహించడం గమనార్హం. అంతేగాక బాలహత్య ప్రతిబంధక్ గృహ పేర ఒక సంస్థను ఏర్పాటు చేసి వితంతువుల పిల్లలను హత్యచేసే కుసంస్కారాన్ని, మూర్ఖ ఆచారానికి స్వస్తి పలికారు.
వితంతు వివాహాలు...
సమాజం అన్ని విధాలా ఎదగడానికి మహిళలు చదువుకోవాలన్న స్పూర్తిని కల్పించడంతోనే ఆగక వితంతు వివాహాలను కూడా ఆయన ప్రోత్సహించడం గమనార్హం. అంతేగాక బాలహత్య ప్రతిబంధక్ గృహ పేర ఒక సంస్థను ఏర్పాటు చేసి వితంతువుల పిల్లలను హత్యచేసే కుసంస్కారాన్ని, మూర్ఖ ఆచారానికి స్వస్తి పలికారు. ఈ యావత్ కార్యక్రమాల్లోనూ ఆయనకు చేదోడువాదోడుగా ఆయన భార్య సావిత్రీబాయి, ఇతర మిత్రుల సహకారం ఎంతో గొప్పది.
పూణేలో 1848లో బాలికలకు తొలి పాఠశాలను ఫూలె ప్రారంభించారు. అణగారిన వర్గాల్లో మహిళలు చదువుకోవాలని ప్రభోదించారు. ‘పూణె స్థానిక మహిళల పాఠశాలలు’, ‘మహార్, మాంగ్ల విద్యాభివృద్ధి సమాఖ్య’ పేర రెండు సంస్థలను ఆయన నెలకొల్పారు.
సత్యశోధక్ సమాజ్...
విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఫూలె సంస్థలు అన్ని విధాలా ప్రజల్ని ఆకట్టుకున్నాయి. ఆ లక్ష్యసాధనకు మరింత పట్టుగా 1873 సెప్టెంబర్ 24న ‘సత్యశోధక్ సమాజ్’ అనే మరో సంస్థను ఏర్పాటుచేశారు. సామాజిక, మత పరమైన అణచివేతను సంపూర్ణంగా అణచివేయడమే ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు కొన్ని సూత్రాలు రూపొందించింది. అవి.. దీక్షలు, సంప్రదాయాలపేర చేసే పనులు, పునర్జన్మ అనేవి సత్యదూరం. దేవునిసేవకు భట్లు(బ్రాహ్మలు) లేదా ఇతర మధ్యవర్తుల అవసరంలేదు. ఈ సమాజం అందించిన సందేశం యావత్ మహారాష్టన్రు కదిలించింది. అయితే సమాజంలో అనాదిగా వున్న అర్ధరహిత సంప్రదాయాలు, అగ్రవర్ణాల దాష్టికాలను అధిగమించి స్వేచ్ఛ పొందడానికి అణగారిని వర్గాలకు చెందిన ప్రతీ మహిళా విద్యావంతురాలు కావాలని ఆ సంస్థ ప్రచారం చేసింది.
జ్యోతీరావ్ 1827 ఏప్రిల్ 11వ తేదీన జన్మించారు. ఏడాది తిరక్కుండానే తల్లిని పోగొట్టుకున్నారు. 1834-38 మధ్య కాలంలో ప్రాథమిక విద్యనభ్యసించారు. 1840లో సతారా జిల్లా నయాగోవ్ గ్రామానికి చెందిన ఖండోజీ నవషో పాటిల్ కుమార్తె సావిత్రీబారుని ఫూలె పెళ్లి చేసుకున్నారు.
కుటుంబ నేపధ్యం....

జ్యోతీరావ్ ఫూలే పూర్వీకులు సతారా జిల్లా ఖతావ్ తాలూకాలోని కాట్గున్ గ్రామస్తులు. ఇంటిపేరు గోర్ఖే. ఫూలే ముత్తాత కోండిబ గోర్ఖే గ్రామపెద్దగా ఉండేవారు. ఆయనకు మరో గ్రామపెద్ద కులకర్ణికీ మధ్య విభేదాలు తలెత్తడంతో కొట్లాటలు జరిగాయి. అందులో దురదృష్టవశాత్తూ కులకర్ణి హత్యకు గురయ్యాడు. హంతకుడనే అపవాదు నుంచీ తప్పించుకోవడానికి ఆయన పూణేలోని పురందర్ జిల్లా ఖానావాడి తాలూక కాల్గున్ గ్రామానికి వెళ్లి పోయారు. ఆ తర్వాత కొండిబా కుమారుడు షెతిబా అక్కడ కరువు కాటకాల కారణంగా పూణేకి మకాం మార్చాడు. దీంతో వారి ఇంటి పేరు ఫూలేగా మారింది. షతిబాకు ముగ్గురు కుమారులు.. రానోజి, కృష్ణాజీ, గోవింద్. గోవిందరావుకు చిమ్నాబాయ్ అనే ఆమెతో పెళ్లయింది. వారి కుమారుడే జ్యోతిరావ్. ఆయనే భారత దేశంలో మహోన్నతమైన సామాజిక విప్లవానికి నాంది వేసిన జ్యోతిరావ్ ఫూలె.
జీవిత చరిత్ర...
జీవిత చరిత్ర...

జ్యోతీరావ్ 1827 ఏప్రిల్ 11వ తేదీన జన్మించారు. ఏడాది తిరక్కుండానే తల్లిని పోగొట్టుకున్నారు. 1834-38 మధ్య కాలంలో ప్రాథమిక విద్యనభ్యసించారు. 1840లో సతారా జిల్లా నయాగోవ్ గ్రామానికి చెందిన ఖండోజీ నవషో పాటిల్ కుమార్తె సావిత్రీబాయిని ఫూలె పెళ్లి చేసుకున్నారు. పరిస్థితుల కారణంగా కొంతకాలం ఫూలె విద్యకు స్వస్తి పలకాల్సివచ్చింది. అయితే ఆయనలో విద్య పట్ల ఆసక్తిని గ్రహించిన మున్షీ గఫార్ బేగ్, లిజిత్ అనేవారు సలహా మేరకు ఆంగ్లంలో చదువును కొనసాగించారు. వారి సూచన మేరకే 1841లో ఆయన ఇంగ్లీష్ పాఠశాలలో చేరారు. అక్కడ చదువుతున్న రోజుల్లో పూలె ‘రైట్స్ ఆఫ్ మాన్’ అనే పుస్తకం చదివారు. దీన్ని థామస్ పెయిన్ రాశారు. సమాజంలో సంభవించే మార్పులు, చేర్పులపై ఎంతో అవగాహన ఏర్పడింది. 
చదువు పూర్తిచేసుకున్న ఫూలె అందరిలా ఉద్యోగంలో చేరలేదు. తండ్రికి వ్యాపారంలో సహకరించారు. ఈ సమయంలోనే అంటే 1848లో ఆయన జీవితంలో ఓ గొప్ప సంఘటన చోటుచేసుకుంది. ఒకరోజు ఆయన తన స్నేహితుని ఇంట పెళ్లికి వెళ్లారు. అక్కడ అగ్రకులాలకు చెందినవారి హేళనతో మనస్తాపానికి గురయ్యారు. దీన్ని సామాజిక అసమానతగా ఖండించారు. దీన్ని అధిగమించడానికి ఈ తరహా దుష్టచర్యలకు సరైన మందూ విద్యమాత్రమే అని ఆయన గ్రహించారు. శూద్రలు, అతి శూద్రులనే అణగారిని వర్గాల స్వేచ్ఛా స్వాతంత్రాలకు, గౌరవమర్యాదలు కాపాడేందుకు విద్య ఒక్కటే సరైన ఆయుధమని, మార్గమని తెలుసుకున్నారు. సమాజంలో అజ్ఞానాన్ని, దారిద్య్రాన్ని తొలగించడానికి సమానత్వం నెలకొల్పడానికి కృషిచేయడం ప్రారంభించారు.