Wednesday, November 2, 2011

సృజనాత్మకతయే వీరి సంపద

నేటి గ్లోబలైజేషన్‌ కాలంలో డబ్బు కళ్లముందు కనబడుతూనే మాయమౌతుంది. సంపాదించిన డబ్బుని నిలుపుకోవడమే కాకుండా దాన్ని రెట్టింపు చేయడం కొంత కష్టమైన విషయం.వేల కోట్లల్లో టర్నోవర్‌ఉండే కంపెనీలపై కొన్ని లక్షలమంది ఆధారపడతారు. అలాంటి సంస్థను అనునిత్యం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు నేటి మహిళలు.అంతే కాకుండా అత్యంత సంపన్నవంతమైన వ్యక్తులుగా అవతరిస్తున్నారు. ఇటీవలే ఫోర్స్బ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన సంపన్న జాబితాలో పలువురు భారతీయ మహిళలు కూడా ఉన్నారు. వారి గురించి............

సావిత్రి జిందాల్‌

jindal 

సావిత్రి జిందాల్‌ తన భర్త ఓం ప్రకాశ్‌జిందాల్‌ 2005లో మృతి చెందిన తరువాత ఆయన స్థానంలో కంపెనీ బాధ్యతలను చేపట్టి ప్రస్తుతం ‘జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌కు చైర్‌పర్సన్‌’గా కొనసాగుతున్నారు.గత నాలుగు సంవత్సరాల నుంచి భారతదేశంలోనే అత్యంత సంపదగల మహిళగా కొనసాగుతూనే ఉన్నారు.ఒ మ్యాగజైన్‌ ప్రకారం ఆమె సంపద విలువ దాదాపు 14.4 బిలియన్‌ డాలర్లుంటుందని అంచనా.గత ఏడాది ఆడాగ్‌ చైర్మన్‌ అంబాని మూడవస్థానం నుంచి ఆరవస్థానానికి చేరడంతో 13.3 బిలియన్‌ల డాలర్లతో ఏడవస్థానంలో నిలిచారు.ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకారం 2011లో ప్రపంచంలోని అత్యంత సంపదకల వ్యక్తులలో 56వ స్థానాన్ని సంపాదించారు.జిందాల్‌ సంస్థ దేశంలోనే అత్యధిక స్టీల్‌ను ఉత్పత్తి చేసే సంస్థల్లో ఒకటి. వీటితో పాటు పవర్‌, మైనింగ్‌,ఆయిల్‌,గ్యాస్‌, మౌలికసదుపాయాల ల్పన వంటి కార్యకలాపాలను కొనసాగిస్తుంది.

ప్రోఫైల్‌..

పూర్తిపేరు  : సావిత్రి జిందాల్‌
పుట్టినతేది  : మార్చి20,1950
భర్త   : ఓ.పి.జిందాల్‌
ప్రస్తుత హోదా : జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ 
    చైర్‌పర్సన్‌, హార్యాన విధాన సభ
    నుంచి ఎమ్‌ఎల్‌ఏ.
ర్యాంకు  : 56
బాధ్యతలు చేపట్టిన సం : 2005
సంపద  : 14.4 బిలియన్‌ డాలర్లు 


కిరణ్‌ మజుందార్‌ షా

kiran-original 

భారతదేశంలో అత్యంత సంపన్నమైన మహిళలలో కిరణ్‌ మజుందార్‌ షా ఒకరు.ఆమె మొత్తం సంపద విలువు 9 వందల మిలియన్‌ డాలర్లు.భారతదేశంలో మొదటి బయోటెక్నాలజీ సంస్థ ‘బయోకాన్‌ లిమిటెడ్‌’ను కిరణ్‌ మజుందార్‌షా 1978లో ప్రారంభించారు.అయితే ఈ సంస్థకు నిధులను సమకూర్చడానికి ఏ బ్యాంకు ముందుకు రాలేదట. ప్రయత్నంలో భాగంగా ఐ.సి.ఐ.సి.ఐ వెంచర్‌ మాజీ చైర్మన్‌ నారాయణ్‌ వాగుల్‌ను సంప్రదించారు. ఈ ప్రాజెక్టు గురించి విని, అందులోని అంశాలను పరిశీలించాక ‘ ఇలాంటి ప్రాజెక్టులకు నిధుల సమకూర్చాలనే లక్ష్యంతోనే మేము ఈ వ్యాపారంలో ఉన్నాము’ అని తెలిపారట. కిరణ్‌ మజుందార్‌ తన పరిజ్ఞానాన్ని అమెరికన్‌ పండ్ల రసాల కంపెనీకి చెందిన ఓషియన్‌ స్ప్రేలో తను అభివృద్ధి చేసిన ఎంజైమ్స్‌ను వాడారు.నేటికీ అదే సాంకేతికతను వాడుతుండటం తనకు గర్వకారణం అని చెబుతుంటారు.తను అద్దెకు ఉంటున్న ఇంట్లోని గ్యారెజ్‌లో రూ.10వేలతో ప్రారంభమైన బయోకాన్‌ నేడు ప్రపంచంలోని టాప్‌-20 బయోటెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా, బిలియన్‌ డాలర్‌ కంపెనీగా, ఆసియాలోనే అతిపెద్ద బయోఫార్మా కంపెనీగా అవతరించింది. ఐ.సి.ఐ.సి.ఐ వెంచర్‌ మాజీ చైర్మన్‌ నారాయణ్‌ వాగుల్‌ ఆమె గురించి తెలుపుతూ ‘ తన ఆత్మవిశ్నాసంపై ఎలాంటి సందేహం కలగలేదు. నా ఆఫీస్‌కు వచ్చి నాతో అరగంట తన ప్రాజెక్టు గురించి, తన ఆశయాల గురించి చర్చించినప్పుడే అనుకున్నాను తను మంచి స్థాయికి చేరుతుందని.
ప్రోఫైల్‌..

పూర్తిపేరు  : కిరణ్‌ మజుందార్‌ షా
పుట్టినతేది  : మార్చి 23,1953
ప్రస్తుత హోదా : మ్యానేజింగ్‌ డైరక్టర్‌- చైర్మన్‌, బయోకాన్‌ 
సంపద  : 900 మిలియన్‌ డాలర్లు


ఇందు జైన్‌
indu 

భారతదేశంలో ఉన్న బిలియనీర్‌లలో ఇందు జైన్‌ ఒకరు.ఇందు జైన్‌ ్రపస్తుతం దేశంలోని అతిపెద్ద మీడియా గ్రూప్‌ ‘ బెన్నెట్‌ ,కాలమన్‌ అండ్‌ కో.లిమిటెడ్‌’ సంస్థకు చైర్మన్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.అమె బాధ్యతలను స్వీకరించిన తరువాత ‘ది టైమ్స్‌ గ్రూప్‌’ భారతదేశంలో అతిపెద్ద మీడియా సంస్థగా అవతరించింది.సంపద విలువ 3 బిలియన్‌డాలర్లు. సాహు జైన్‌కుటుంబానికి చెందిన ఆమెకు ఇద్దరు కుమారులు. ఆమె మంచి ఆర్థిక వేత్తతో పాటు మంచి ఆధ్యాత్మిక సేవా చింతన గల వ్యక్తి కూడా.మానవతా వాదానికి ప్రాధాన్యతనిస్తారు.అందుకే ‘ది టైమ్స్‌ ఫౌండేషన్‌’ను ప్రారంభించి సామాజక సేవకు పూనుకున్నారు. ఈ ఫౌండేషన్‌ సామాజిక సేవను,వరదలు, తుఫాను వంటి విపత్కర సమయాల్లో అన్ని విధాలుగా ఆదుకోవడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది.అంతే కాకుండా మహిళల అభ్యున్నతికి పాటుపడుతుంటారు
ప్రోఫైల్‌..

పూర్తిపేరు  : ఇందు జైన్‌
సంతానం  : ఇద్దరు
ప్రస్తుత హోదా : బెన్నెట్‌ ,కాలమన్‌ అండ్‌ 
    కో.లిమిటెడ్‌ సంస్థకు చైర్మన్‌
సంపద  : 3 బిలియన్‌ డాలర్లు 
ఇతర కార్యలాపాలు : ది టైమ్స్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవా 
    కార్యక్రమాలను చేపట్టడం

అను ఆగా
anu 

థెర్మాక్స్‌ గ్రూప్‌కు చెందిన అను ఆగా ఫోర్స్బ్‌ మ్యాగజైన్‌ అత్యంత సంపన్నుల జాబీతాలో 51వ స్థానాన్ని సంపాదించింది. ఆమె సంపద విలువ 1.24 బిలియన్‌ డాలర్లు.ఆమె థెర్మాక్స్‌ లిమిటెడ్‌ అభివృద్ధిలో కీలక పాత్రను పోషించారు. ఎనెర్జీ , ఎన్విరాన్‌మెంట్‌ సంబంధిత కార్యకలాపాలను నిర్వహించే ఈ కంపెనీ విలువ 1996-2004 మధ్యకాలంలో రూ.3246 కోట్లకు చేరింది.ఈ కాలంలో ఈ కంపెనీకి చైర్‌పర్సన్‌గా అను వ్యవహరించారు.2007లో ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ సిద్ధం చేసిన అత్యంత సంపద కల భారతీయ మహిళల్లో ఎనిమిదవ స్థానంలో నిలిచారు.కంపెనీ బాధ్యతలను నుంచి విరమణ తీసుకున్నాక సామాజిక సేవపై దృష్టి కేంద్రీకరించారు. అమె సామాజిక సేవను గుర్తించి భారత ప్రభుత్వం భారత ప్రజలకు అందించే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ‘పద్మ శ్రీ’తో సత్కరించింది.
ప్రోఫైల్‌..

పూర్తిపేరు  : అను ఆగా
పుట్టినతేది  : ఆగస్టు 3,1942
జన్మస్థలం  : ముంబై
చేపట్టిన పదవి :మాజీ చైర్మన్‌, థెర్మాక్స్‌ లిమిటెడ్‌

Monday, October 3, 2011

వసంత కోకిల

" నిదుర పోరా తమ్ముడా! '' అంటూ 'సంతానం' సినిమా కోసం లతా మంగేష్కర్ పాడిన పాట విని తెలుగు నేలంతా తడిసి ముద్దయిపోయింది.  
ఆ పాట పాడింది హిందీ సినీ ప్రపంచంలోని ప్రసిద్ధ నేపథ్య గాయని లతా మంగేష్కర్ అని తెలుసుకుని ఆ పేరును తెలుగు శ్రోతలు తమ హృదయ పలకం మీద చెక్కుకున్నారు. ఆ తరువాత హిందీ తెలిసిన వారే కాదు, తెలియని వారు కూడా హిందీ సినీ సంగీతం వినడం అలవాటు చేసుకున్నారు. ఆ ఒక్కపాటతోనే లత తెలుగు నేల మీద అంత పదిలంగా నిలిచిపోయారామె.

కొండ శిఖరాల మీదుగా, ప్రవహించే తేనెల జలపాతం లాంటి ఆ గొంతు లోంచి వచ్చిన వేలాది పాటల్ని దేశప్రజలంతా మహానందంతో ఆస్వాదిస్తూ ఉండిపోయారు. లతా మంగేష్కర్ ఏడు దశాబ్ధాలుగా 30 వేలకు పైగా పాటలు పాడి భారతీయ హృదయాలను ఆనంద సీమలో ఓలలాడిస్తూనే ఉంది. అందుకు కృత జ్ఞతగా మన దేశం లతా మంగేష్కర్‌ను 2001లో 'భారత రత్న' పురస్కారంతో సత్కరించింది.

ఆత్మనాదం

మనిషికే కాదు, పాటకు కూడా శరీరం, మనసు, ఆత్మ ఉంటాయనే సత్యం లతాజీ గొంతు విన్న ఎవరికైనా తెలిసిపోతుంంది. గొంతులోంచి వచ్చే శబ్ధం పాట శరీరమైతే, ఆ గొంతులో పలికే భావోద్వేగాలు మనసు. ఆ భావోద్వేగాలకు అతీతంగా ధ్వనించే తాత్వికనాదం ఆత్మ. ఈ ఆత్మనాదమే సంగీతంలో పరమోన్నతమైనది. లత గొంతులో పలికేది ఆ ఆత్మనాదమే. నిజంగా లత గొంతులో పలికే ఆ నాదం ఎన్ని దుఃఖాలను ఓదార్చిందో లెక్కలేదు.

" యే మేరె దిలే నాదాన్- తూ గమ్‌సే న గబ్‌రానా

ఏక్ దిన్‌తో సమజ్‌లేగీ దునియా తేర అఫ్‌సానా ''

(ఓ బేల హృద యమా! గాయాలకు అంత గా కుంగిపోకు సుమా!

ఏదో ఒక రోజున లోకం నీ జీవితగాథను అర్థం చేసుకుంటుంది లేమ్మా! )

'టవర్ హౌస్' సినిమాల్లోని ఆ పాట సాహిత్యానికి తన తాత్విక స్వరాన్ని మిళితం చేసి పాడిన ఆ పాట విని కోటానుకోట్ల హృదయాలు గొప్ప ఓదార్పున స్ఫూర్తినీ పొందాయి. అలాగే 'బీస్ సాల్ బాద్ ' సినిమాలోని 'కహీ దీప్ జలే-కహీ దిల్'అన్న పాట, 'చోరీ చోరీ' సినిమాలోని 'రసిక్ బల్‌మా...హాయ్' అన్న పాటలోని లత తారస్వరాన్ని విని శ్రోతలే కాదు సంగీత దర్శకులు కూడా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు.

నిజానికి అప్పటి దాకా వారు గాయనీమణుల స్వర స్థాయి పరిమితులను దృష్టిలో ఉంచుకునే బాణీలు కూర్చేవారు. కానీ, లత ఆగమనం తరువాత ఆ పరిమితుల్ని మరిచిపోయారు. ఎల్లలే లేని, ఎంత ఎత్తులోనైనా పాడగలిగే ఆమె స్వరం రసజ్ఞులను మంత్రముగ్ధుల్ని చేసింది. నిజానికి పాడటానికి స్వరజ్ఞానం ఒక్కటే సరిపోదు. ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. ఆ ఆత్మవిశ్వాసం లతా మంగేష్కర్ లో అనంతంగా ఉంది.

"భావ వ్యక్తీకరణకు లత పెద్దగా ప్రాధాన్యమివ్వరు'' అంటూ వ్యాఖ్యానించే వారిలో చాలా మంది ఆమె గొంతులో పలికే భావాతీత స్థితిని గమనించరు. లత ముందు ఒకసారి ఎవరో ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు " వృత్తి రీత్యా పాడటం వేరు కాని, సహజంగా ఎవరైనా భయం, బాధ , దుఃఖాల్లో ఉన్నప్పుడు పాడతారా? ఆ భావ్వేద్వేగాలనుంచి తేరుకున్నాకే పాడతారు. నిజమైన గానం అలాగే కదా ఉండాలి! నా మట్టుకు నేను పాడే సమయంలో ఆ విషయాన్నే గుర్తుంచుకుంటాను'' అన్నారు.

ఒంటి కోయిల

తన గాత్రంతో వేలాది పాటల్లో ప్రేమను పొదిగిన లత తాను మాత్రం వాటన్నిటికీ దూరంగానే గడిపేసింది, వేలాది యుగళ గీతాల్లో గొంతు కలిపినా జీవిత మంతా ఒంటరిగా ఒక సోలో గీతంగానే మిగిలిపోయింది. పెళ్లెందుకు చేసుకోలేదని ఎవరో ప్రశ్నించినప్పుడు, సమాధానంగా లత " నేపథ్య గాయనిగా నిలదొక్కుకోవడానికి నేను పడుతూ వచ్చిన సంఘర్షణ, ఆరాటం ఎంత తీవ్రంగా ఉంటూ వచ్చాయీ అంటే, నాకు జీవనసహచరుణ్ని ఎంచుకునే వ్యవధే లేకుండా పోయింది.

నిజానికి, నేను ఒంటరిగా ఉండిపోవాలనే నా నుదుట రాసి ఉందనే నాకనిపిస్తుంది. ఒకవేళ అందుకు విరుద్ధంగా నా పెళ్లి జరిగినా అది అతి త్వరలోనే విచ్చిన్ణమైపోయేదని కూడా నాకు అనిపిస్తుంది. వాస్తవానికి నేపథ్య గానాన్ని నిరంతరం ఒక సవాలుగా తీసుకునే నాకు సంగీతమే ఒక లోకమైపోయింది. మీరాబాయి కృష్ణున్ని ప్రేమించినంత పిచ్చిగా నేను పాటను ప్రేమిస్తాను. ఈ జన్మకు నాకీ ఆనందం చాలు'' అంటూ బదులిచ్చింది.

పసితనం పాట్లు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో లతా మంగేష్కర్ జన్మించింది. ఆమె తాతయ్య గోవా లోని ' మంగేష్' అనే గ్రామంలోని ఒక గుళ్లో పూజారిగా ఉంటూ నిరంతరం భజనలూ, కీర్తనలూ పాడుతూ ఉండే వాడు. లత తండ్రి దీనానాథ్ మంగేష్కర్, ఆయన కుంటుంబ వారసులు కూడా ఆ సంగీత పరంపరను కొనసాగిస్తూనే వచ్చారు. లతకు ముగ్గురు చెల్లెల్లు, (ఆశాభోంస్లే, ఉషా మంగేష్కర్, మీనా మంగేష్కర్) ఒక తమ్ముడు (హృదయనాథ్ మంగేష్కర్) ఉన్నారు.

తాను బాల్యంలో ఉన్నప్పుడే తండ్రి చనిపోవడంతో లతకు కుటుంబ భారాన్నంతా తన భుజాల మీదే మేసుకోవలసి వచ్చింది. జీవనాధారానికి తనకు తెలిసిన విద్య సంగీతం ఒక్కటే. అందుకే గొంతు చేత పట్టుకుని కుటుంబంతో సహా లత ముంబయికి చేరుకుంది. అనుకున్నంత వేగంగా ఏమీ జరగక చాలా కాలం దాకా ఇల్లు గడవడం ఎంతో కష్టంగా ఉండేది.

సినిమాల్లో పాడే అవకాశాల కోసం సంగీత కారుల చుట్టూ, రికార్డింగ్ స్టూడియోల చుట్టూ అదే పనిగా తిరగాల్సి వచ్చేది. ప్రయాణమంతా లోకల్ ట్రైన్‌లోనే. అందుకు కూడా డబ్బులు లేక ఎన్నోసార్లు మైళ్లకు మైళ్లే కాలి నడకన వెళ్లాల్సి వచ్చేది.

ఆత్మవిశ్వాసమే తోడుగా...

'కితీ హసాల్' అనే మరాఠీ సినిమాలో " మాథూ యా ఆడే ఖేల్ సారి '' అన్న పాటను తొలిసారిగా లతా మంగేష్కర్ పాడింది. అప్పడు ఆమె వయసు 12 ఏళ్ల 6 మాసాలు. అయితే పాడానన్న సంతోషమే గానీ, ఆ సినిమాలో ఆ పాటను చిత్రీకరించలేదు. పాడే అవకాశం కోసం 1947 లో ఒకసారి లత, అప్పటి ప్రసిద్ధ స్వరకర్త గులామ్ హైదర్ వద్దకు వెళ్లింది, వెంటనే ఆయన సినీ నిర్మాత రశ్‌ధర్ ముఖర్జీకి పరిచయం చేశాడు.

ముఖర్జీ లతతో ఒక పాట పాడించి "నేపథ్య గానానికి మరీ ఇంత సన్నటి గొంతు పనికి రాదు.'' అనేశాడు. ఆ మాట విని అవాక్కయిన హైదర్ వెంటనే," చూస్తూ ఉండండి. ఏదో ఒకరోజున నిర్మాతలందరూ ఈ గొంతు కోసమే పడిగాపులు కాస్తారు'' అన్నాడు. నిరాశాజనకమైన ఆ సంఘటనల్లో లత తన ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉంటే ఏమయ్యేది? హిందీ సినీ సంగీతం ఎంత నష్టపోయేదో వేరే చెప్పాలా? అయితే లత ఏమాత్ర నిరాశ చెందకుండా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో ముందుకే సాగిపోయింది.

ప్రైవేట్ గీతాలకు ప్రాణం

సినిమా పాటలకు కథాబలం, సన్నివేశ బలం ఉండటం వల్ల అవి బాగా జనాధరణ పొందుతాయని చాలా మంది అభిప్రాయం. అందుకే వర్ధమాన గాయనీ గాయకులంతా సినిమాల్లో పాడే అవకాశాలే సమస్తం అనుకుంటారు. ఆ వస్తే వచ్చినట్లు, లేకపోతే జీవితమే వ్యర్థమైపోయినట్లని కూడా అనుకుంటారు. కానీ, ప్రైవేట్ పాటలకు సామాజిక సన్నివేశ బలం ఉంటుంద న్న విషయాన్ని వారు మరిచిపోతారు. ప్రదీప్ రాసిన ఆ పాటను సి. రామచంద్ర స్వరపరిచారు.

లతా మంగేష్కర్ పాడిన " యే మేరె వతన్‌కే లోగో- జర ఆంఖ్ మె భర్‌లో పానీ, జో షహీద్ హుయే హై ఉన్‌కీ జర యాద్ కరో ఖుర్‌బానీ'' అనే పాటను ఉదాహరణగా తీసుకుంటే ఇది సినిమా పాటల కన్నా మిన్నగా ఆదరణ పొందిన ఒక ప్రైవేట్ గీతమిది. భారత చైనా యుద్ధంలో అమరులైన సైనికుల్ని ఉద్దేశించి సాగే ఈ పాట ఆ నాటి నుంచి ఈ నాటి వరకూ భారతీయ హృదయాల్లో మారు మోగుతూనే ఉంది.

దీనికి తోడు మీరాబాయి భజనలు, భగవద్గీత శ్లోకాల వంటి మరెన్నో ప్రైవేట్ ఆల్బమ్స్‌కు లత రూపం ఇచ్చారు. సినీ గీతాలతో సమానంగా ప్రైవేట్ గీతాలను నిలబెట్టవచ్చని లతా మంగేష్కర్ బలంగా చాటి చెప్పారు. వర్ధమాన గాయనీగాయకులంతా ఆమెనుంచి ఆ స్పూర్తి పొందితే ఎంత బావుండును!

Monday, July 18, 2011

జగమెరుగని ఝాన్సీరాణి

 


కొందరు నేతలు ఆకాశంలో ఉల్కల్లా కాంతివంతంగా ప్రకాశించి నేల రాలిపోతారు. వీరు జీవించేది అతి కొద్ది కాలమే అయినా ప్రజల జ్ఞాపకాల్లో మిగిలిపోతారు. చరిత్ర కూడా వీరికి ఒక సుస్థిర స్థానం కల్పిస్తుంది. ఇలాంటి వారిలో ఝాన్సీ లక్ష్మిబాయి ఒకరు. ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన లక్ష్మీబాయి బ్రిటిష్ వారిని ఎదిరించి నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడటం విధి వైచిత్రి అనే చెప్పాలి. 14 ఏళ్లకు పెళ్లి.. 18 ఏళ్లు నిండకుండానే భర్త మరణం.. మధ్యలో అస్వతంత్ర జీవనం.

ఆ తర్వాత బ్రిటిష్‌వారిపై పోరాడుతూ వీరమరణం పొం దటం.. ఇవన్నీ 23 ఏళ్ల జీవితం లోనే ముగిసిపోయాయి. 1857 నాటి పరిస్థితుల గురించి.. లక్ష్మీబాయి జీవితం గురించి విష్ణుభట్ మరాఠీలో రాసిన పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు మృణాల్ పాండే ఇటీవల ఇంగ్లీషులోకి అనువదించారు. దాని నుంచి- లక్ష్మిబాయి జీవితంలోని ముఖ్య మలుపులు.. ఘట్టాలు మీ కోసం అందిస్తున్నాం..
http://www.exoticindiaart.com/books/jhansi_ki_rani_laxmibai_idj767.jpg
"ఝాన్సీకి వెళ్లాలనుకున్న తర్వాత నాకు రాము మామ చెప్పిన అనేక విషయాలు గుర్తుకువచ్చాయి. రాము మామ చెప్పిన సమాచారం ప్రకారం- ఝాన్సీ ఉత్తర భారతదేశంలోని పెద్ద నగరాల్లో ఒకటి. జనాభా పదిహేను లక్షల దాకా ఉంటారు. దేశంలోని అతి పటిష్ఠమైన కోటల్లో ఝాన్సీ కోట కూడా ఒకటి. పూణేలో పేష్వాలు బలహీనపడిన తర్వాత గ్వాలియర్ మాదిరిగానే ఝాన్సీ కూడా స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఝాన్సీని పాలించిన రాజులలో చాలామందికి పిల్లలు లేరు. హిందూ సమాజంలోని ఉన్నత కులాల వారి మాదిరిగానే వారు కూడా మగపిల్లలను దత్తత తీసుకొనేవారు. మహారాజు మరణించిన వెంటనే అతని దత్తత కుమారుడు పరిపాలన చేపట్టేవాడు.

ఝాన్సీ మహారాజు గంగాధరరావు రెండు సార్లు పెళ్లి చేసుకున్నాపిల్లలు పుట్టలేదు. మగపిల్లవాడిని దత్తత తీసుకోవాలనే గంగాధరరావు అభిమతానికి బ్రిటిష్ పాలకులు అడ్డుపుల్ల వేశారు. అతను పెట్టుకున్న దరఖాస్తులకు కలకత్తాలోని గవర్నర్ జనరల్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. పిల్లలు లేరనే బాధతో గంగాధరరావు మరణించాడు. అతని భార్య లక్ష్మీ బాయి ఒక పన్నెండేళ్ల కుర్రాడిని దత్తత తీసుకుంది. బ్రిటిష్ పాలకులు ఆ దత్తతను కూడా చట్టబద్ధం చేయటానికి అంగీకరించలేదు. ఈ లోపులో సిపాయి తిరుగుబాటు జరిగింది.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష్మీ బాయే పగ్గాలు చేపట్టింది...అసలేం జరిగిందంటే..''

పెరిగింది ఇలా..

రాము మామకు లక్ష్మీబాయి వాళ్ల నాన్న రాజశ్రీ మోరోపంత్ తాంబే బాగా తెలుసు. బిత్‌పూర్‌లో ఒక పెద్ద యాగశాల ఉంది. పిల్లలకు వేదం కూడా నేర్పుతూ ఉంటారు. రాము మామ ఈ యాగశాలకు అధిపతిగా ఉండేవాడు. ఆయన వచ్చేసిన తర్వాత మోరోపంత్ అధిపతి అయ్యాడు. ఆయన భార్య చనిపోయింది. దీనితో ఒకే ఒక బిడ్డ అయిన ఛాబిలీని అల్లారుముద్దుగా పెంచుతూ ఉండేవాడు. ఛాబిలీ చూడటానికి చాలా అందంగా ఉండేది.

తల్లి బతికి ఉంటే- ఛాబిలీని అసలు ఇంటి నుంచి బయటకు రానిచ్చేవారు కాదేమో! ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల - ఛాబిలీ కూడా తండ్రిలాగానే ఉదయాన్నే యాగశాలకు వచ్చేసేది. అక్కడే ఆడుకునేది. అక్కడే తినేది. మధ్యాహ్నం నిద్ర వస్తే అక్కడే పడుకొనేది. చుట్టూ ఉన్నది మగపిల్లలే కావటంతో, వారితోనే ఆడేది. చదవటం, రాయటంతో పాటు ఆమె విలువిద్య, గుర్రపుస్వారీ వంటి విద్యలు కూడా నేర్చుకుంది. అలా చూస్తుండగానే- ఛాబిలీకి పన్నెండేళ్లు వచ్చేశాయి. మోరోపంత్ ఆమెకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఛాబిలీ జాతకం ఎవరికీ నప్పేది కాదు. దీనితో అనేక మంది వెనక్కి వెళ్లిపోయారు. అంతే కాకుండా- బాగా చదువుకున్న తన కూతురును పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేయటం అతనికి ఇష్టం లేదు.
సరిగ్గా అదే సమయంలో గంగాధర రావు భార్య చనిపోయింది. అతను మళ్లీ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కాని అతనికి పిల్లను ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. కొందరి జాతకం అతనికి నప్పలేదు. మరి కొందరు అతని గురించి వచ్చిన వదంతులకు భయపడ్డారు. ఈ వదంతుల ప్రకారం-

కొన్ని సార్లు గంగాధరరావు తన దర్బారు నుంచి నేరుగా రాణివాసానికి వెళ్తాడు. అక్కడ మగ దుస్తులను వదిలేసి, పట్టుచీర, పావడా కట్టుకుంటాడు. చేతికి గాజులు వేసుకుంటాడు. ముక్కుకు పుడక పెట్టుకుంటాడు. కాళ్లకు పట్టీలు కూడా పెట్టుకుంటాడు. అలాంటి సమయంలో కేవలం ఆడవాళ్లతోనే మాట్లాడతాడు. మగవారితో మాట్లాడడు. అంతే కాకుండా నెలలో నాలుగు రోజులు మైల ఉందని- విడిగా ఒక గదిలోకి వెళ్లిపోతాడు. (మహిళలకు రుతుస్రావం అయినట్లు). ఆ సమయంలో దర్బారుకు రాడు. నాలుగవ రోజు స్నానం చేసి..పూజలు చేసిన తర్వాతే తిరిగి దర్బారుకు వస్తాడు. ఈ సమయంలో గోర్డన్ సాహెబ్ అనే అధికారి బ్రిటిష్ రెసిడెంట్‌గా ఉండేవాడు. గంగాధరరావు గురించి వచ్చిన వదంతులు ఆయనకు కూడా చేరాయి. గోర్డన్ సాహెబ్ ఒకసారి గంగాధరరావును కలిసాడు. "నాకు చాలా కాలంగా ఒక అనుమానం ఉంది. మీరు మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.

మీ తాతలు, తండ్రులు చాలా గొప్పవారు. అలాంటి వంశంలో పుట్టిన మీరు సంప్రదాయాలన్నింటిని వదిలేసి- ఆడవాళ్ల బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు? నెలకు నాలుగు రోజులు మైలను ఎందుకు పాటిస్తున్నారు. మీకు ఒక అమ్మాయిగా మసలటం ఇష్టమయి ఇలాంటి పని చేస్తున్నారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా?'' అని అడిగాడు. "నేనో చిన్న రాజ్యానికి రాజును కావచ్చు. కాని పెద్ద పెద్ద రాజ్యాలను పాలించే నా సోదర రాజులు సైతం ఏడు సముద్రాల అవతల నుంచి వచ్చిన మ్లేచ్ఛుల నియంత్రణలోకి వెళ్లిపోయారు. వారి రాజ్యంపైన వారికి అధికారం లేదు. ప్రజల దగ్గర నుంచి ఎంత పన్ను వసూలు చేయాలో నిర్ణయించే అధికారం లేదు. మేమందరం స్వేచ్ఛను పోగొట్టుకొన్నాం. నిస్సహాయులుగా జీవిస్తున్నాం.

ఒక మహిళ ఎంత భయం భయంగా బతుకుతుందో మేము కూడా అదే విధంగా జీవిస్తున్నాం. అందుకే నేను కూడా ఒక మహిళలా గాజులు వేసుకుంటున్నా..నాలుగు రోజులు విడిగా కూర్చుంటున్నా..'' అని సమాధానమిచ్చాడు. మోరోపంత్ ఈ విషయాలన్నీ ఆ నోట, ఈ నోట విన్నాడు. గంగాధరరావు తొలి భార్యకు ఒక బిడ్డ పుట్టి చిన్నప్పుడే చనిపోయాడు. అందువల్ల గంగాధరరావు మగవాడు కాకపోయే అవకాశం లేదని మోరోపంత్ భావించాడు. గంగాధరరావు ప్రవర్తన ఎలా ఉన్నా రాజ్యపాలన మాత్రం బావుండేది. దీనితో గంగాధరరావుకు ఛాబిలీని ఇచ్చి పెళ్లి చేయటానికి మోరోపంత్‌కు ఎటువంటి అభ్యంతరం లేకుండా పోయింది. గంగాధరరావుకు పెళ్లి సంబంధాలు చూస్తున్న వారితో ఈ విషయం చెప్పాడు.

అనుమానపు మొగుడు..

మోరోపంత్ అనే పురోహితుడి కుమార్తె చాలా అందంగా ఉంటుందని..ఆమెకు పెళ్లి చేయటానికి సంబంధాలు వెతుకుతున్నారని కొందరు మధ్యవర్తులు గంగాధరరావుకు చెప్పారు. వెంటనే గంగాధరరావు తన మనుషులను మోరోపంత్ దగ్గరకు పంపాడు. తనకు కన్యాశుల్కం అక్కరలేదని.. అయితే పెళ్లి ఖర్చులన్నీ గంగాధరరావే పెట్టుకోవాలని మోరోపంత్ షరతు విధించాడు. దీనికి గంగాధరరావు అంగీకరించాడు. గంగాధరరావు, ఛాబిలీల పెళ్లి ఝాన్సీలో ఘనంగా జరిగింది. అప్పుడే ఛాబిలీలి పేరు లక్ష్మిబాయిగా మారింది.

లక్ష్మిబాయి సంసారం మొదటి నుంచి అంత ఆనందంగా గడవలేదు. గంగాధరరావుకు తన కన్నా చాలా చిన్నదైన లక్ష్మిబాయిపై అనుమానం ఎక్కువ. దీనితో ఆమెను రాణివాసం నుంచి కూడా బయటకు రానిచ్చేవాడు కాడు. పడకగదిలోనే ఉంచి తాళం పెట్టేవాడు. మగవాళ్లు ఎవరూ ఆమె మహలు వైపు కూడా చూడటానికి వీలులేకుండా కొందరు మహిళా సైనికులను కాపలా పెట్టాడు. ఇంత కట్టుదిట్టం చేయటం వల్ల లక్ష్మిబాయి మనస్తత్వంలో అనేక మార్పులు వచ్చాయి. అమ్మాయిగా ఉండటం కన్నా అబ్బాయిగా పుడితేనే మేలని భావించేది. చిన్నప్పుడు స్వేచ్ఛగా మగపిల్లలతో తిరిగిన రోజులు ఆమెకు గుర్తుకువస్తూ ఉండేవి. దీనితో ఆమె కొన్ని సార్లు మగవాళ్ల బట్టలు వేసుకుంటూ ఉండేది. పెళ్లి అయిన కొద్ది రోజులకే గంగాధరరావు అనారోగ్యం పాలయ్యాడు. మరణశయ్యపై నుంచి గోర్డన్ సాహెబ్‌కు కబురుపెట్టాడు. "నా భార్య ఇంకా యుక్తవయస్సులో ఉంది. పిల్లలు లేరు.

అందువల్ల మా బంధువుల పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకోవటానికి అంగీకరించండి..'' అని అడిగాడు. గంగాధరరావు అంటే గోర్డన్ సాహెబ్‌కు కొంత సానుభూతి ఉంది. దీనితో అతను కలకత్తాలో ఉన్న తనపై అధికారులకు విషయాన్ని వివరిస్తూ ఒక ఉత్తరం రాశాడు. కానీ కలకత్తాలో అధికారుల వ్యూహం మరోలా ఉంది. "గంగాధరరావుకు పిల్లలు లేరు. అందువల్ల ఝాన్సీని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టండి. మీరు చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాధ్యతలు చేపట్టండి'' అని కలకత్తా నుంచి సమాధానమొచ్చింది. ఇక చేసేదేమీ లేక- గోర్డన్ సాహెబ్ ఝాన్సీ సామ్రాజ్యాన్ని తన అదుపులోకి తీసుకున్నాడు. ఇంతలో గంగాధరరావు మరణించాడు. గోర్డన్ సాహెబ్ మాత్రం లక్ష్మిబాయి పట్ల సానుభూతితోనే వ్యవహరించాడు. కోటలో కొద్ది భాగాన్ని ఆమెకు ఇచ్చాడు. గంగాధరరావు వదిలి వెళ్లిన సంపదను కూడా ఆమెకే వదిలేసాడు.

అన్నీ అడ్డంకులే..

భర్త చనిపోయిన కొద్ది కాలానికి లక్ష్మిబాయి-తాను ఒక బ్రాహ్మణ వితంతువులా జీవితాన్ని సాగించాలనుకుంది. గుండు చేయించుకొని వితంతువుగా మారటానికి కాశీ, ప్రయాగ పుణ్యక్షేత్రాలకు వెళ్లటానికి అనుమతి ఇవ్వమని గోర్డన్ సాహెబ్‌కు అర్జీ పెట్టుకుంది. దీనిని కూడా బ్రిటిష్ అధికారులు తిరస్కరించారు. స్వతహాగా లక్ష్మిబాయి చాలా తెలివైంది. బ్రిటిష్‌వారి నుంచి తనకు వారసత్వంగా వచ్చిన సామ్రాజ్యాన్ని నిలుపుకోవాలంటే మగపిల్లవాడిని దత్తత చేసుకోవటం తప్పనిసరని గ్రహించింది. ఒక పిల్లవాడిని దత్తత తీసుకొనే విషయమై బ్రిటిష్ అధికారులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. 1857 మే నాటికి దేశ పరిస్థితిలో అనేక మార్పులు వచ్చాయి.

బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా సిపాయిలు తిరుగుబాటు చేస్తారనే వార్తలు దావానలంలా వ్యాపించటం మొదలుపెట్టాయి. దీనితో బ్రిటిష్ పాలకులు- సంస్థానాధీశులపై పట్టుబిగించటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. లక్ష్మిబాయి పెట్టుకున్న దత్తత అర్జీలకు సమాధానాలు ఇవ్వలేదు. ఆమెకు ఇవ్వాల్సిన పెన్షన్‌ను కూడా నిలుపుచేశారు. ఈ పరిస్థితుల్లో మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. కొందరు బ్రిటిష్ అధికారులను చంపేశారు. దీనితో ఝాన్సీ కంటోన్మెంట్‌లో నివసించే అనేక మంది బ్రిటిష్ అధికారులకు వణుకుపుట్టింది. ప్రజాభిప్రాయం తమకు వ్యతిరేకంగా ఉందని బ్రిటిష్ అధికారులు గమనించారు. తమకు సాయం చేయమని లక్ష్మిబాయిని కోరారు.

జూన్ 8, 1857..

ఝాన్సీ కంటోన్మెంట్ అంతా చాలా ఉద్రిక్తంగా ఉంది. బాంబు ఎప్పుడు పేలుతుందో తెలియదు. అప్పటికే మీరట్‌కు చెందిన సైనికులు క్రమంగా అన్ని ప్రాంతాలకు వస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల అభిమానాన్ని పొందటానికి బ్రిటిష్ వారికున్న ఏకైక మార్గం సంస్థానాధీశులను మంచి చేసుకోవటం. ఝాన్సీ సంస్థానంలో ఉన్న ప్రాంతాలన్నిటి పరిపాలనను లక్ష్మిబాయికి అప్పచెబుతున్నామని.. ఈ ప్రాంతాల నుంచి ప్రతి ఏడాది వచ్చే 25 లక్షల రూపాయల ఆదాయాన్ని ఇకనుంచి ఆమే అనుభవించవచ్చంటూ గోర్డన్ సాహెబ్ లక్ష్మిబాయికి ఒక వర్తమానాన్ని పంపాడు.

రాజ్యంలో ప్రశాంతత ఏర్పడేవరకూ ఆమే సర్వాధికారిణి అని..అయితే బ్రిటిష్‌వారి ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ఆమె గోర్డన్ సాహెబ్, ఇతర బ్రిటిష్ అధికారులకు రక్షణ కల్పించాలనే షరతు కూడా ఆ వర్తమానంలో ఉన్నాయి. దాన్ని చదివిన లక్ష్మిబాయికి విపరీతమైన కోపం వచ్చింది. "నన్ను ఒక రాణిగానే మీరు గుర్తించలేదు. కలకత్తాలో జరిగిన రాజ్యాధీశుల సమావేశానికి పిలవలేదు. నా భర్త చివరి కోరికగా- ఒక బిడ్డను దత్తత తీసుకుంటానంటే అంగీకరించలేదు. నేను కాశీ, ప్రయాగ తీర్థయాత్రలకు వెళ్తానంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు మీ ప్రాణాల మీదకు వచ్చింది కాబట్టి, ఇవన్నీ ఇస్తున్నారా? మిమల్ని దయతో మా దగ్గర ఉంచుకోవాలా? బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేసిన సైనికులు దీనికి అంగీకరిస్తారా? మీరు మా దగ్గర రక్షణ పొందుతున్నారని తెలిసిన తర్వాత వాళ్లు మమ్మల్ని వదులుతారా? '' అని అవేశంగా మధ్యవర్తిని ప్రశ్నించింది. బ్రిటిష్ వారి ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది..

అర్థరాత్రి అయింది. అందరూ ఉద్విగ్నంగా ఉన్నారు. చీకటి మాటున గోర్డన్ సాహెబ్ ఒంటరిగా రాణిమహల్‌కు వచ్చాడు. "నా భార్యకు ఏడోనెల. బయట పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. బ్రిటిష్ ప్రజలు కనిపిస్తే చంపేస్తున్నారు. కంటోన్మెంట్‌లో సిపాయిలు రేపు తిరుగుబాటు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మీరు రక్షణ ఇవ్వకపోతే- మా ప్రాణాలకు ముప్పు తప్పదు. నా భార్యను, పుట్టబోయే బిడ్డను కాపాడండి..'' అని లక్ష్మిబాయిని వేడుకున్నాడు. లక్ష్మిబాయి మనసు కరిగింది. మహిళలకు, పిల్లలకు రక్షణ ఇవ్వటానికి అంగీకరించింది. మర్నాడు ఉదయం ఏడు గంటలకు బ్రిటిష్ అధికారుల భార్యలు, పిల్లలు రాణివాసానికి రహస్యంగా వచ్చేశారు.

జూన్ 9, 1857..

ఉదయం పది అయింది. ఒక్క సారి పెద్ద అల వచ్చినట్లు.. సైనికులందరూ రోడ్ల మీదకు వచ్చారు. సైనిక క్యాంపును కాపలా కాస్తున్న బ్రిటిష్ అధికారులను విచక్షణారహితంగా చంపేశారు. క్యాంపుకు నిప్పు అంటించారు. ఆ తర్వాత సైనికులందరూ రాణివాసం దగ్గరకు వచ్చారు. "మీరే మాకు సర్వ సైన్యా«ధ్యక్షురాలు. మీ ఆదేశాలు మేం పాటిస్తాం..'' అని పెద్దగా నినాదాలు చేయటం మొదలుపెట్టారు. సైనిక దుస్తుల్లో రాణి లక్ష్మిబాయి వారి ముందుకు వచ్చింది. "పెద్ద యుద్ధం ఇంకా ముందు ఉంది. మనందరం కలిసికట్టుగా పోరాడితేనే శత్రువును తరిమి తరిమి కొట్టగలుగుతాం..'' అంటూ ప్రసంగించింది లక్ష్మీబాయి. ఝాన్సీ ప్రాంతానికి తాను రాణిగా పాలనాబాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించింది. ఆయుధాల కర్మాగాలన్నింటిలోను ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సైనికులకు బ్రిటిష్‌వారు తగ్గించిన వేతనాలను తిరిగి పెంచుతున్నట్లు ప్రకటించింది.

పరిపాలన షురూ..

రాణి లక్ష్మిబాయి చాలా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపేది. వ్యాయామం పట్ల ఆమెకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. పెళ్లి అయిన తర్వాత భర్త పెట్టిన నిబంధనల వల్ల వ్యాయామం మానేసినా భర్త చనిపోయిన తర్వాత మళ్లీ వ్యాయామం మొదలుపెట్టింది. ఉదయాన్నే లేచి కొద్ది సేపు కుస్తీ పట్టేది. ఆ తర్వాత బరువులు ఎత్తేది. ఈ రెండూ పూర్తయిన తర్వాత గుర్రపు స్వారీ చేసేది. గుర్రపు స్వారీలో అనేక రకాల విన్యాసాలు ప్రదర్శించేది. వేగంగా వెళ్తున్న గుర్రం మీద నుంచి గోడల మీదకు దూకేది. అక్కడ నుంచి కందకం సైతం దాటి బయటకు దూకేది. ఒక్కోసారి సుగంధద్రవ్యాలతో రెండు మూడు గంటలు స్నానం చేసేది.

ఆమె స్నానం కోసం పదిహేను నుంచి ఇరవై పెద్ద పెద్ద గుండిగలతో నీళ్లను కాచేవారు. స్నానం తర్వాత తెల్లని చందేరీ పట్టు చీరను కట్టుకొనేది. కాశీ, ప్రయాగ తీర్థయాత్రలకు బ్రిటిష్ పాలకులు అంగీకరించకపోవటంతో- లక్ష్మిబాయి తన శిరోజాలు తీయించుకోలేదు. శాస్త్ర ప్రకారం- శిరోజాలు తీయించుకోని విధవరాలు - కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తే తప్ప భగవంతుడిని పూజించకూడదు. అందువల్ల ప్రతి రోజు లక్ష్మిబాయి తులసి మొక్కకు పూజ చేసేది. ఆ తర్వాత శివప్రార్థనకు ఉపక్రమించేది. మధ్యాహ్న భోజనం తర్వాత ఆమె కొద్ది సేపు విశ్రాంతి తీసుకొనేది. కొన్నిసార్లు ఆమె దర్బారుకు మగదుస్తులలో వచ్చేది. పంచె, పైన కోటు, కుచ్చుతలపాగా పెట్టుకొనేది. నడుముకు బంగారు ఎంబ్రైడరీ చేసిన గుడ్డ కట్టుకొనేది. దానికే కత్తి వేళ్లాడుతూ ఉండేది. కొన్ని సార్లు ఆమె ఆడవేషంలో కూడా దర్భారుకు వచ్చేది. భర్త మరణం తర్వాత లక్ష్మిబాయి ముక్కుపుడక పెట్టుకోవటం మానేసింది.

మట్టి గాజులు వేసుకోవటం మానేసి- బంగారు గాజులు మాత్రమే ధరించేది. మెడచుట్టూ ఒకే వరస ఉన్న ముత్యాలు, చేతికి వజ్రాల ఉంగరం పెట్టుకొనేది. నాకు తెలుసున్నంత వరకూ ఆమె ఎప్పుడూ ఇతర ఆభరణాలు ఏమీ ధరించలేదు. ఆమె జుట్టును గుండ్రంగా చుట్టుకొనేది. కొన్ని సార్లు జడ కూడా వేసుకొనేది. ఆమె దర్బార్ హాలులో కూర్చున్నప్పుడు తెల్ల శాలువాను నెత్తి మీద నుంచి కప్పుకొనేది. రాజ ప్రధాని లక్ష్మణ రావు ఆమె ముందు నిలబడి ఉండేవాడు. ఎనిమిది నుంచి పది మంది సిబ్బంది ఆమె జారీ చేసిన ఆదేశాలను నమోదు చేస్తూ ఉండేవారు. లక్ష్మిబాయి ఏ వివాదాన్నయినా చాలా సులువుగా పరిష్కరించేది. కొన్నిసార్లు నేరస్తులను ఆమే స్వయంగా కర్రతో కొట్టేది.
http://www.historytalking.com/images/pix150/ranijhansi150.jpg
చూడటమే వేడుక..
లక్ష్మిబాయి గుర్రపు స్వారీని గాని, రథయాత్రను గాని చూడడం ఒక వేడుక. ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉండేది. ఆమె ర«థాన్ని రెండు వైపులా బంగారు జరీతో ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ కర్టెన్లతో మూసేసేవారు. మెరిసిపోయే ముత్యాల సెట్‌తో పాటు అందమైన పట్టుచీర కట్టుకొనేది. మగబట్టలు కట్టుకున్నప్పుడు తలపాగ తప్పనిసరిగా ఉండేది. ఆమె రథంతో పాటు నలుగురు అందమైన అమ్మాయిలు పక్కన పరిగెడుతూ ఉండేవారు. వీరికి చిన్నతనం నుంచి రాణి పక్కన రథంతో పాటు పరిగెత్తటాన్ని శిక్షణ ఇచ్చేవారు. సాధారణంగా వీరు దక్షిణభారతదేశానికి చెందినవారై ఉండేవారు.
http://www.gegensatzpress.com/rani.jpg
అందమైన ఈ అమ్మాయిలు ఒక చేతిలో బంగారపు కర్రలు, మరో చేతిలో బంగారపు విసనకర్రలు పట్టుకొని పరిగెడుతూ ఉంటే- వారిని చూడటానికి వందలమంది గుమిగూడుతూ ఉండేవారు. రథం ముందు కొందరు వాయిద్యాలు వాయిస్తూ వెళ్తూ ఉండేవారు. వెనక దాదాపు రెండు వందల మంది సైనికులు నడుస్తూ ఉండేవారు. వీరందరితో పాటు - రథం వెనక ప్రధానితో సహా అనేక మంది ముఖ్యాధికారులు కూడా ఉండేవారు. లక్ష్మిబాయి గుర్రం స్వారీ చేసేటపుడు ఇంత ఆర్భాటం ఉండేది కాదు. కొద్దిమంది అధికారులు, సైనికులు మాత్రమే ఆమె వెంట ఉండేవారు. రాత్రి అయితే ఆమెకు దారి చూపించటానికి కాగడాలను మోసేవారు కూడా ఉండేవారు. కాని చాలాసార్లు లక్ష్మిబాయి వారిని దాటి చీకట్లోనే కోటలోకి వెళ్లిపోయేది.

వందేళ్లకు ఇంగ్లీషులోకి...

విష్ణుభట్ గాడ్సే అనే చిత్‌పవన్ బ్రాహ్మణుడు బొంబాయి సమీపంలోని వార్సాయ్‌లో నివసిస్తూ ఉండేవాడు. కడు పేదవాడు. ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద యాగం జరుగుతోందని తెలిసి కొంతమందితో కలిసి అక్కడికి బయలుదేరి వెళతాడు. ఇంతలో సిపాయి తిరుగుబాటు మొదలవుతుంది. విష్ణుభట్ బృందం ఆ జ్వాలల్లో చిక్కుకుపోతుంది. ఒక పక్క బ్రిటిష్ సేనలు మరోపక్క భారతీయ సైనికులు వాళ్లందరిని తప్పించుకుంటూ ఆయన మో నుంచి ఢిల్లీ దాకా అనేక ప్రాంతాలు తిరిగాడు. 1857-58 మధ్య కొన్ని నెలల పాటు ఝాన్సీ కోటలో పురోహితుడిగా ఉన్నాడు.

లక్ష్మీబాయిని బ్రిటిష్ వాళ్లు చంపేసిన తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో కూడా బతుకుతెరువు కోసం ప్రయత్నించి చివరికి నిరాశతో స్వగ్రామం చేరుకున్నాడు. తాను ఉత్తరభారత దేశంలో చూసిన సంఘటనలన్నిటితోను మరాఠీలో ఒక పుస్తకం రాశాడు. దాని పేరు మజాప్రవాస్: 1857 చా బండాసి హకీకత్ (నా ప్రయాణాలు: 1857 తిరుగుబాటు కథ). ఈ పుస్తకాన్ని ఆయన దాదాపు 30 ఏళ్ల తర్వాత రాస్తే అది అచ్చయి బయటికి వచ్చింది. 1907లో దానిలో ఝాన్సీ సంస్థానం గురించి ప్రముఖంగా ప్రస్తావించాడు. ఈ పుస్తకంలో ఉన్న చాలా విషయాలు- విష్ణుభట్ స్వయంగా చూసినవి. మరికొన్ని వాళ్లు వీళ్లు చెప్పగా విన్నవి. దాదాపు వందేళ్ల తర్వాత ఈ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు మృణాల్ పాండే ఇంగ్లీషులోకి అనువదించారు.

అనువాదం : సివిఎల్ఎన్ ప్రసాద్

Thursday, May 19, 2011

మెరుపు తగ్గినందుకే '' ఎరుపు '' ఓటమి

 http://www.currentnewsindia.com/wp-content/uploads/2011/04/cpm-logo_1.jpg
బెంగాల్ అంటే భారతదేశపు తూర్పువాకిలి మాత్రమే కాదు మార్పువాకిలి కూడా. ఇంగ్లీషువాడు అడుగుపెట్టి తొలిరాజ్యం స్థాపించుకున్నది ఇక్కడే. సాంస్కృతిక పునరుజ్జీవనమని పిలిచే పడమటిగాడ్పు సుడులు తిరిగింది ఇక్కడే. రాజారామమోహన్‌రాయ్, ఈశ్వర్‌చంద్రవిద్యాసాగర్, బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సరోజినీదేవి,హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, జగదీశ్‌చంద్రబోసు, సత్యజిత్‌రే, అమర్త్యసేన్.. చెప్పుకుంటూ పోతే జాతి గర్వించదగ్గ మేధావులు ప్రతిభావంతులు ధీరులు వీరులు వందల వేల సంఖ్యలో కనిపిస్తారు. బెంగాల్ నేడు ఏమి ఆలోచిస్తుందో దేశం రేపు అదే ఆలోచిస్తుందట. బెంగాల్ ఆకాశం ఎరుపెక్కినప్పుడు, ప్రపంచం దానివైపు ఆసక్తిగా చూసింది. జనం రైటర్స్ బిల్డింగ్ గర్భగుడిలో ఎర్రదేవుడిని ప్రతిష్ఠించినప్పుడు దేశమంతటా ఆ జైత్రయాత్ర కొనసాగుతుందనిపించింది. http://westbengalelections2011.com/wp-content/uploads/2011/02/Election-in-West-Bengal-Assembly-Election-in-West-Bengal.jpg
చిట్టగాంగ్ వీరుల దగ్గరనుంచి చారుమజుందార్ దాకా బెంగాల్ ప్రజావిప్లవాలకు వేదికగానే ఉండింది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన తెభాగా రైతాంగ ఉద్యమం కానీ, స్వాతంత్య్రానంతరం రెండుసార్లు చెలరేగిన ఆహారభద్రతా ఉద్యమాలు కానీ బెంగాలీ ప్రజానీకాన్ని సమరశీలంగా మలిచాయి. ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమానికి, చీలిక తరువాత అతివాద పక్షంగా ఉండిన మార్క్సిస్టు పార్టీకి, మరో చీలిక అనంతరం నక్సలైట్ పార్టీలకు బెంగాల్ వేదిక అయింది.

1967 నుంచే అధికారంలో భాగస్వామ్యం సాధించుకోగలిగిన మార్క్సిస్టు పార్టీ, ఎమర్జెన్సీ చీకటిరోజుల అనంతరం, 1977లో సహవామపక్షాలతో కలసి రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పరచే స్థాయికి ఎదిగింది. అధికారంలోకి రాగానే భూసంస్కరణల అమలును చేపట్టింది. మిగులు భూములను పంచడం, కౌలుదారుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించడం లక్ష్యాలుగా తొలిదఫా జ్యోతిబసు ప్రభుత్వం పనిచేసింది. ఫలితంగా, రాష్ట్రంలో పార్టీకి గట్టిపునాదులు వేయగలిగింది. అన్ని స్థాయిలలో ప్రభుత్వ యంత్రాంగంపై పార్టీ పట్టును స్థాపించగలిగింది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhh1M-BnJftw-88Zqk9oWhosluz0E6IZ18on2kzimfupSpXTALMrefVExaN0Hf9llcio1sEqNHA3nhWAKBmwGe1LPJmTyXB6ncHDC4_10CZa3WSAshxaK4XnthPZvHbV3RGdvwfhTVHI1R0/s1600/Buddha+WB.JPG
రాష్ట్రంలో సిపిఎం నాయకత్వంలో బలంగా ఉండిన ట్రేడ్‌యూనియన్ ఉద్యమం, కిసాన్ ఉద్యమం వామపక్ష ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగేందుకు బాటలు వేశాయి.వామపక్ష ప్రభుత్వం హయాంలో సంక్షేమపథకాలు, పేదలకు అనుకూలమైన విధాన నిర్ణయాలు కొన్ని సాధ్యపడ్డాయి కానీ, పారిశ్రామికాభివృద్ధి మాత్రం అంగుళం ముందుకు సాగలేదు. ప్రతిపక్ష ప్రభుత్వమని చెప్పి కేంద్రం ప్రభుత్వరంగ పరిశ్రమలకు అవకాశం ఇవ్వలేదు. కమ్యూనిస్టు ప్రభుత్వమని, అల్లరిపెట్టే ట్రేడ్‌యూనియన్ల రాష్ట్రమని ప్రైవేటు రంగమూ ప్రవేశించలేదు. http://images.jagran.com/cpm-b-11-4-2011.jpg
కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఎత్తుగడగా మాత్రమే ఎన్నికలను, ప్రభుత్వ నిర్వహణను ఆశ్రయిస్తున్నామని చెప్పిన మార్క్సిస్టు పార్టీకి రాష్ట్రాభివృద్ధికి అనువైన మార్గమేదో బోధపడలేదు. బెంగాల్ అంటే భారతదేశంలో ఒక మారుమూల రాష్ట్రం, పరిశ్రమలు బతకలేని రాష్ట్రం- అన్న ముద్ర ఖాయపడింది. రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగులకు, భృతి ఇవ్వడం సంక్షేమచర్యే అయింది తప్ప, పరిష్కారం కాలేకపోయింది. http://static.ibnlive.com/pix/sitepix/10_2010/prakash-karat2710630_271x181.jpg
వరుస విజయాలతో అధికారానికి అలవాటుపడిపోయిన పార్టీ యంత్రాంగంలో అనేక అవలక్షణాలు ప్రవేశించాయి, ఉద్యమశీలత కొరవడింది. జ్యోతిబసుతో సహా పార్టీ, ప్రభుత్వ అధినేతలందరూ వ్యక్తిగత నిజాయితీకి, నిరాడంబరతకు ప్రతీకలుగా ఉండినప్పటికీ, దిగువస్థాయిల్లో పార్టీనాయకుల తీరు భిన్నంగా ఉండింది.

బెంగాల్‌తో సంబంధం లేకుండా మార్క్సిస్టు పార్టీ సరళిలో కూడా మార్పులు రాసాగాయి. కొత్తరకం రాజీకమ్యూనిస్టులే తప్ప కడదాకా నిలిచే విప్లవ కమ్యూనిస్టులు కాదని నక్సలైట్లు 1960లలోనే విమర్శించినప్పటికీ, ఎమర్జెన్సీ ముగిసేదాకా మార్క్సిస్టు పార్టీకి మిలిటెంట్ పార్టీ ప్రతిష్ఠే ఉండేది. అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిర అణచివేతచర్యలకు లక్ష్యంగా ఉన్నవారిలో, అజ్ఞాతజీవితం గడపవలసివచ్చినవారిలో మార్క్సిస్టులు కూడా ఉన్నారు.

ఆ తరువాత కొంతకాలం దాకా సిపిఎం మాటల్లో విప్లవం, తగిన సమయంలో సాయుధపోరాటం వంటి మాటలు వినిపిస్తూనే ఉండేవి. మరోవైపు ఇందిరాగాంధీతో అంటకాగి అప్రతిష్ఠపాలైన సిపిఐతో పోల్చినప్పుడు, మార్క్సిస్టుపార్టీ నికార్సయిన పార్టీగానే కనిపించేది. బెంగాల్ విజయంతో స్ఫూర్తిపొందిన ఆపార్టీ 1980ల తరువాత ప్రధానస్రవంతి రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించింది. జాతీయస్థాయిలో ప్రతిపక్ష ప్రత్యామ్నాయాలను నిర్మించడంలోను, రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెసేతర పక్షాలతో పొత్తుపెట్టుకోవడంలోను ఆసక్తిపెరిగిపోయింది.

అదే సమయంలో తనకు అనుబంధంగా ఉన్న రైతాంగ, కార్మిక, ఉద్యోగ సంఘాల ద్వారా పోరాటాలను కూడా పార్టీ నిర్వహించేది. అయితే, పాలకపార్టీలతో పొత్తుల క్రీడ కారణంగా అప్పుడప్పుడు నాలుగుసీట్లు అదనంగా గెలుచుకోగలిగినా, మరోసారి అవే ప్రధానపార్టీలు చతికిలపడినప్పుడు వామపక్షాల సభాబలం కూడా తగ్గిపోయేది. పోరాటాల ద్వారా ఏర్పడే ప్రజాబలం మాత్రమే వారికి స్థిరంగా ఉంటూ వచ్చింది.

ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా సిపిఎం, ఎన్నికల రాజకీయాలపైనే మొగ్గు చూపుతూ వచ్చింది. ప్రధాన పాలక పార్టీల ఘర్షణలో ముందుకు వచ్చిన దేశసమగ్రత, సమైక్యత, సుస్థిరత, లౌకికవాదం, తీవ్రవాదంపై పోరాటం- వంటి నినాదాల చుట్టూ పరిభ్రమించింది. శ్రామికవర్గపార్టీగా ఉండిన సంస్థ భావరంగంలో ఎగువ మధ్యతరగతికి, ఆర్థికవిధానాల్లో పారిశ్రామికులకు ఆమోదకరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.

1990దశకం ప్రారంభంలో అమలులోకి వచ్చిన ఆర్థికసంస్కరణలు వామపక్షాలకు కొత్త పోరాట అవకాశాలను తెరిచాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కొత్త పారిశ్రామికవిధానం వల్ల కార్మికులకు ఏర్పడిన అభద్రత కమ్యూనిస్టులకు నూతన పోరాట ఎజెండాను కల్పించాయి.

అయితే, ఆ అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో వామపక్షాలు విఫలమయ్యాయి. సంస్కరణల తొలి దశాబ్దంలో వామపక్షాలు చేసిన ఉద్యమాలన్నీ సారాంశంలో- ప్రభుత్వం తాను తలపెట్టిన సంస్కరణలను కొద్దిపాటి సవరణలతో అమలుచేయించడానికి పనికివచ్చాయి. చివరకు ట్రేడ్‌యూనియన్లు, ఉద్యోగసంఘాలు బలహీనపడ్డాయి. మార్క్సిస్టు పార్టీ నేతలే సంస్కరణల్లోని మంచిని కూడా చూడాలనే వాదన ప్రారంభించారు.
http://img2.allvoices.com/thumbs/event/609/480/53688836-buddhadeb-bhattacharjee.jpg
బుద్ధదేవ్ భట్టాచార్య బెంగాల్‌లో సంస్కరణలకు ప్రతినిధిగా చూస్తున్నాము కానీ, 1990లలో జ్యోతిబసు రాష్ట్రానికి ప్రయోజనం కలిగినట్టయితే విదేశీపెట్టుబడులను ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఇక బుద్ధదేవ్ హయాంలో అయితే, మార్పు స్పష్టంగా కనిపించింది. 2006లో ఆయన ఘనవిజయం సాధించినప్పుడు మొదటగా అభినందించింది రతన్‌టాటాయే.

ఉద్యోగాలు దొరుకుతున్నప్పుడు విదేశీపెట్టుబడి మీద ఏమిటి మీ అభ్యంతరం?- అని బుద్ధదేవ్ కేరళలోని తన సహచరుడు అచ్యుతానందన్‌ను ఒక సందర్భంలో ప్రశ్నించారు. బెంగాల్‌లో మార్క్సిస్టు పార్టీ మాట్లాడుతున్న మాటలకు, ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ అనుసరించిన వైఖరికి పొంతన లేక పార్టీ అభిమానులు గందరగోళపడ్డారు. తన విధానంలోని ద్వంద్వ స్వభావానికి పార్టీ తగిన వివరణ ఇవ్వలేకపోయింది.

భూములను పంచి, కౌలురైతాంగానికి హక్కులు ఇచ్చి, రైతు అనుకూల చర్యలు చేపట్టిన ప్రభుత్వం పరిశ్రమల కోసం నందిగ్రామ్‌లో, సింగూర్‌లో రైతుల భూములను ఇవ్వడం బెంగాల్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దీర్ఘకాలంగా బెంగాల్‌లో పార్టీరాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగడుతున్న తృణమూల్ కాంగ్రెస్‌కు, నలభైయేండ్ల కిందట విఫలమైన ప్రయత్నాన్ని మరోసారి చేపట్టిన మావోయిస్టులకు క్రమంగా రాష్ట్రంలో ఆదరణ పెరిగింది.
http://get.cfn.netdna-cdn.com/wp-content/uploads/2010/06/Mamta-Trinamool-Congress.jpg
ఒకనాడు బెంగాల్‌లో తలదాచుకున్న సిక్కు తీవ్రవాదులను పంజాబ్ పోలీసులు అపహరించి ఎన్‌కౌంటర్ చేస్తే అభ్యంతరం చెప్పిన వామపక్ష ప్రభుత్వం ఇప్పుడు స్వయంగా కేంద్రబలగాలతో కలసి ప్రజలపై అణచివేతచర్యలను నిర్వహించడం, బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడం రాష్ట్రంలో దిగజారిన విలువలకు సాక్ష్యంగా నిలిచాయి.

మూడున్నర దశాబ్దాల కిందట ఏర్పడిన వామపక్ష ప్రభుత్వం చాలా కాలం పాటు కట్టుబడిన విలువలను కూడా చివరి సంవత్సరాలలో వదులుకున్నది. అందుకే, నందిగ్రామ్, సింగూర్ తరువాత జరిగిన అన్ని స్థాయిల ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్ పరాజయాన్ని చవిచూస్తూ వచ్చింది. సిపిఎంనేతలు అంటున్నట్టు బెంగాలీలు కోరుకున్నది కేవలం పార్టీల మార్పు, నేతల మార్పు కాదు. విధానాల మార్పు.

బెంగాల్, కేరళల్లో పరాజయం మార్క్సిస్టు పార్టీకి ఒకరకంగా మేలుచేస్తుంది. తన విధానాలను సమీక్షించుకోవడానికి ఉపకరిస్తుంది. ఏ శషభిషలు లేకుండా దేశంలో అమలవుతున్న అభివృద్ధి విధానాన్ని సమర్థించడమా, నానాటికి పెరుగుతున్న ప్రజాచైతన్యాన్ని పరిగణనలోకి తీసుకోవడమా వారు నింపాదిగా, ఏ పరిమితులూ లేకుండా చర్చించుకోవచ్చు. 2000 సంవత్సరం తరువాత నాలుగేళ్ల పాటు మన రాష్ట్రంలో మార్క్సిస్టు పార్టీ నిర్వహించిన ఉద్యమాలను గుర్తు తెచ్చుకుంటే, దాని శక్తిసామర్థ్యాలను తక్కువ చేయలేము.

ఆ ప్రయాస అంతా రాజశేఖరరెడ్డి విజయానికి తోడ్పడిందనుకోండి, అది వేరే విషయం. విప్లవకరమైన, మిలిటెంట్ పార్టీగా మార్క్సిస్టు పార్టీ ఉండాలని ఇప్పుడు ఎవరూ ఆశించడంలేదు. నికార్సయిన సోషల్ డెమొక్రాటిక్ పార్టీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఎంతో చేయగలదు. భారత రాజకీయచిత్రపటంలో ఒక కట్టుబాటున్న ప్రజాస్వామిక రాజకీయ పక్షం అవసరం స్పష్టంగానే కనిపిస్తున్నది. మార్క్సిస్టు పార్టీ ఆత్మవిమర్శ ఆ కర్తవ్యాన్ని నెరవేర్చే దిశగా సాగాలని కోరుకోవాలి.

మార్క్సిస్టుపార్టీ స్వయంకృతాపరాధాల కారణంగా ఓడిపోయిందని గ్రహించడం అవసరమే కానీ, అందుకు ఆనందించడం కానీ, సంబరపడడం కానీ అనవసరం.మార్క్సిస్టులు బలహీనపడితే, ప్రధానస్రవంతి రాజకీయాల్లో ప్రజానుకూలమైన గొంతు కనీసంగాకూడా, అప్పుడప్పుడైనా వినిపించే అవకాశం ఉండదు. అలాగే, మమతాబెనర్జీ పరిపాలన ఎట్లా ఉండబోతున్నదో చెప్పడానికి పెద్దగా కష్టపడనక్కరలేదు. రెండు ఊర్లలో భూమిని అన్యాక్రాంతం చేసినందుకే ప్రభుత్వంపై ఆగ్రహించిన బెంగాలీలు, మొత్తం రాష్ట్రాన్ని అంగట్లో పెట్టగలిగే విధానాలున్న మమతను ఎంతో కాలం సహించరు.
http://economictimes.indiatimes.com/photo/8289643.cms
-కె. శ్రీనివాస్

Monday, May 16, 2011

జయమైనా.. అపజయమైనా... ఆమెది ఒకటే తీరు..!

 
తమిళనాడు పదహారవ ముఖ్యమంత్రిగా జయలలిత చెనై్నలోని మద్రాసు యూనివర్శిటీ ఆడిటోరియంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ఫలితాల రోజు ఎటువంటి ఆత్రుత లేకుండా ఎలా కనిపించారో ప్రమాణ స్వీకార సమయంలోనూ ఆమె ఎటువంటి బావోధ్వేగాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డా రు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఓ మహిళగా ఆమె సాధించిన ఈ విజయం.. మహిళాలోకానికే గర్వకారణం..

jaya 
ఎన్నికల తేదీల ప్రకటన వెలువడిన క్షణం నుండి... ప్రచారం... ఫలితా లు ప్రమాణ స్వీకారం వంటి అన్ని సందర్భాల్లోనూ ప్రతిపక్ష నేతగా, అన్నాడీఎంకే అధినేత్రిగా.. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఒకే రకమైన హావభావాలను ప్రదర్శించారు.
అనుచరులకు అమ్మగా...
ఎంజీఆర్‌ వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అనతికాలంలో ఎంత పేరుప్రఖ్యాతులు సాధించిన ఆమెను పార్టీలోని వారంతా ‘అమ్మా’ అని ప్రేమగా పిలుచుకుంటారు. రాజకీయాల్లోకి అడుగిడక ముందు సినీ ప్రపంచంలో ఓ అందాల తార.. ఎదురులేని నాయకి... రాజకీయాల్లోనూ అంతే అడుగిడింది మొదలు ఎన్ని సమస్యలు.. అడ్డంకులు వచ్చినా ఎదురు నిలవడమే కానీ వెనక్కి వెళ్లడం అంటే ఏమిటో ఆమెకు తెలియదు.. ఆమె స్వభావాన్ని కొందరు మొండి తనం అంటే మరికొందరు ఆత్మవిశ్వాసం అంటారు. ఏది ఏమైనా ఆమె లక్ష్యం మాత్రం ముందుకు సాగడమే...

చిన్నతనం...
తమిళనాడులోని శ్రీరంగంలో జన్మించిన జయలలిత ప్రాధమిక విద్యా భ్యాసం బెంగళూరులో చేశారు.అనంతరం మద్రాసుకు వలసవెళ్లారు. 15 ఏళ్ల వయసులో తల్లి ప్రోత్సాహంతో జయలలిత నటనా రంగంలో ప్రవేశిం చారు. ఆమె అన్న విజయకుమార్‌ 1990లో చనిపోయారు. ఆయనకు ఇద్దరు పిల్లలు.

సినీ జీవితం...

తమిళసినీ రంగంలో ఎదురులేని తారగా జయలలిత వెలిగారు. 1961లో మాజీ రాష్టప్రతి వి.వి.గిరి కొడుకు శంకర్‌ గిరి నిర్మించిన ఇంగ్లీష్‌ సినిమా లో నటించారు. మొదటి సినిమాను మాత్రం కన్నడలో చేశారు. అది చాలా పెద్ద హిట్టు కావడంతో ఆమెకు ఇక వెనుదిరిగి చూసే అవకాశం లేకపో యింది. అన్నిటా విజయమే.తెలుగునాట ఆమెకు అభిమానులు బ్రహ్మర థం పట్టారు. హిందీలోనూ ఆమె కొన్ని సినిమాలను చేశారు. కేవలం నటన మాత్రమే కాదు ఆమె స్వయంగా పదికి పైగా పాటలను కూడా పాడారు.

రాజకీయ జీవితం...
1981లో ఎంజీఆర్‌ ప్రోత్సాహంతో అన్నాడీఎంకేలో చేరి 1988లో రాజ్య సభకు ఎన్నికయ్యారు. ఎంజీఆర్‌ మరణానంతరం పార్టీ నాయకత్వ బాధ్య తలను జయలలిత తీసుకున్నారు. మొదటిసారి 1991 తమిళనాడు అసెం బ్లీ ఎన్నికలలో గెలిచి మొదటి మహిళా ప్రతిపక్షనాయకురాలిగా మారారు.

ప్రతిపక్షం నుండి ముఖ్యమంత్రిగా...
jaya1అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎంజీఆర్‌ వారసత్వంతో 1982లో రాజ కీయాల్లోకి వచ్చి ఆయన మార్గంలోనే నడిచారు. మొదటి సారి బోదినా యక్కలనూర్‌ నియో జకవర్గం నుండి పోటీ చేసి గెలు పొందారు. ఈ ప్రాం తం కేరళకు సమీపంలో వుంది. తరువాత ఈ ప్రాంతం రెండుగా విభజిత మైంది.అందులో ఒక భాగం, తమిళనాడులో, మరో ప్రాంతం కేరళలో వుంది.

1984లో ఎంజీఆర్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆమె పార్టీ పగ్గాలు చేపట్టారు. అనంతరం ఎంజీఆర్‌ మరణానంతరం ఆమె ఆయన నియోజక వర్గం ఆండిపట్టినుండి నుండి పోటీ చేసి గెలుపొందారు. అనతరం ఈ ప్రాం తం అన్నాడీఎంకే స్థావరంగా మారింది. వరుసగా అన్నాడీఎంకే పార్టీలే గెలు పొందుతూ వచ్చింది.మధ్యలో రెండు సార్లు డీఎంకే ఈ స్థానాన్ని గెలుచుకుం ది. తిరిగి 2002, 2006లలో జయలలిత ఈ ప్రాంతం నుండి పోటీ చేసి గెలు పొందారు. ప్రస్తుత విజయం మాత్రం ఆమెకు అందించింది శ్రీరంగం నియోజ కవర్గం.
రాజకీయ విజయాలు...
  • ప్రయివేటు సంస్థల్లో ఎక్కువ వడ్డీని వసూలు చేయడాన్ని నిషేధించారు.
  • చెనై్నకి న్యూ వీరనం నీటి సరఫరా పథకాన్ని పూర్తి చేశారు.
  • లాటరీ టికెట్ల అమ్మకాలపై నియంత్రణ విధించారు.
  • జైళ్లలో, కోర్టుల్లో వీడియో కాన్ఫిరెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు.
  • వర్షపు నీటి నిల్వ పథకాన్ని ప్రారంభించి విజయవంతం చేశారు.
  • గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.

    మర్చిపోలేని సందర్భాలు...
  • 1991 జూన్‌ 24-1996 మే 12 వరకు ముఖ్యమంత్రిగా వున్నారు.
  • 1996లో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష నాయకురాలిగా కొనసాగారు.
  • ఎన్నో క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కుని వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడ్డారు.
  • 2001 ఎన్నికలలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చారు.
  • అసెంబ్లీకి ఎన్నిక కాకుండానే ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టి మరిన్ని వివాదాలలో చిక్కుకున్నారు.
  • 2001 సెప్టెంబర్‌ 21న సుప్రీం కోర్టు క్రిమినల్‌ కేసుల్లో చిక్కుకుని వున్న వ్యక్తి 163(1)కింద ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీలులేదనే తీర్పు నిచ్చింది. ఆమెపై వారెంటును జారీ చేసింది.
  • దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ నాయకుల్లో ఒకరైన పన్నీర్‌ సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించాల్సి వచ్చింది.
  • 2003లో జయలలిత తిరిగి తనపై వచ్చిన ఆరోపణలు సవాలు చేస్తూ న్యాయస్థానంలో పోరాడారు. ఎన్నికల ద్వారా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
  • 2006లో పన్నీర్‌సెల్వం పార్టీ నాయకునిగా ఎన్నికయ్యారు. ఆమెను అవసరం అయితే తప్ప సమావేశాల్లోనూ పాల్గొనరాదన్న నిబంధనను కూడా జారీ చేశారు. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు.
  • 2006లో అసెంబ్లీకి ఎన్నికైన అనంతరం ఆమె తిరిగి అన్నాడీఎంకే పార్టీ నాయకురాలిగా, అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.

    పొందిన అవార్డులు...
  • 1972లో తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామని
  • 1991లో మద్రాసు యూనివర్శిటీ నుండి డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌
  • 1992లో ఎంజీఆర్‌ మెడికల్‌ యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్‌
  • 1993లో మధురై కామరాజు యూనివర్శిటీ నుండి గౌరవ డిగ్రీ పట్టా
  • 2005లో తమిళనాడు డాక్టర్‌ అంబేద్కర్‌ న్యాయ విద్యాలయం నుండి గౌరవ న్యాయవాద డిగ్రీ.
    ప్రొఫైల్‌...
    పుట్టిన తేది    : ఫిబ్రవరి 24, 1948 (63 ఏళ్లు)
    రాజకీయ పార్టీ    : అన్నాడీఎంకే
    నియోజకవర్గం     : శ్రీరంగం
    నివాసం     : చెనై్న, తమిళనాడు
    వృత్తి     : అన్నాడీఎంకే అధినేత్రి
     

మారుతున్న గ్రామీణ భారతానికి ప్రతీక.. ఛవీ రజావత్‌

లక్షల సంపాదన వదిలి... సమాజసేవవై కదిలి
http://www.thehindubusinessline.com/multimedia/dynamic/00330/2010041650130402_330710e.jpg
సరిగ్గా 50 రోజుల క్రితం.. మార్చి 25, 2011.. ఐక్య రాజ్య సమితి వేదికగా.. 11వ ‘ఇన్ఫో-పావర్టీ’ సదస్సు జరుగుతోంది. భారత్‌ నుండి ఓ మహిళా గ్రామ సర్పంచ్‌ ఇప్పుడు ప్రసంగిస్తారు అని సదస్సు చైర్‌పర్సన్‌ ప్రక టించగానే.. అక్కడ ఉన్న వివిధ దేశాల రాయబారులు, మంత్రులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందరో మహామహులు ప్రసంగించాల్సిన ఈ సదస్సులో ఒక సర్పంచ్‌ ఏం మాట్లాడుతుంది అని చెవులు కొరుక్కు న్నారు.


మహిళా సర్పంచ్‌ అనగానే.. ఓ 40-50 ఏళ్ళ వయస్సులో.. గ్రామీణ వస్తధ్రారణలో.. ఉంటుందని భావించిన వారికి ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మాయి. ఆమె అందం, ఆధునిక వస్తధ్రారణ చూసి.. ఈమె సర్పంచ్‌ కానేకాదు ఐటీ ప్రొఫెషనల్‌, మోడల్‌ అయి వుంటుందని అనుకున్నారంతా.. ఆమె రాజస్థాన్‌లోని సోడా గ్రామ సర్పంచ్‌ 30 ఏళ్ళ ఛవీ రజావత్‌. మేనేజ్‌ మెంట్‌ డిగ్రీని సైతం పక్కనబెట్టి.. ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేటు సహకారం లేకుండా.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ‘ధీర’ వనిత. ఆమె సేవలకు గుర్తింపుగా.. ఇటీవల ‘టెక్నాలజీ డే’ సందర్భంగా.. మాజీ రాష్టప్రతి డా అబ్దుల్‌ కలామ్‌ చేతుల మీదుగా.. ప్రశంసాపత్రాన్ని అందుకుంది.


chhavirajawat 
ఛవీ రజావత్‌.. రాజస్థాన్‌లోని మారుమూల సోడా గ్రామ సర్పంచి.. మారుతున్న గ్రామీణ భారతానికి అసలు సిసలు ప్రతీక.. 30 ఏళ్ల రజావత్‌ ఎంబీఏ చేసిన ఏకైక గ్రామ సర్పంచి.. అంతేకాదు.. ఈ పదవిలో ఉన్న అత్యంత పిన్న వయస్కురాలు కూడా..! మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రఖ్యాతి గాంచిన రిషీ వ్యాలీ స్కూల్‌లో ప్రాథమిక విద్య... ప్రతిష్టాత్మక లేడీ శ్రీరాం కాలేజీలో కాలేజీ విద్య... పుణెలోని బాలాజీ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుండి ఎంబీఏ పూర్తిచేసన రజావత్‌ తన స్వగ్రామానికి సేవ చేసేందుకు..


భారతీ-టెలీ వెంచర్స్‌లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థానాన్ని సైతం వదులుకున్నారు. సిటీ లైఫ్‌ను విడిచిపెట్టి.. సోడాలోని మట్టి రోడ్లపై తిరుగుతూ.. ప్రజల తో మమేకమవుతూ తన గ్రామ ఉజ్వల భవితకు పునాది రాళ్లు వేస్తున్నారు. మార్చి 24-25 తేదీల్లో ఐరాసలో జరిగిన ఈ సద స్సు ప్యానెల్‌ చర్చలో పాల్గొన్న రజావత్‌.. దారిద్య్రానికి వ్యతిరేకం గా పోరాడటంతో.. అభివృద్ధిని ప్రోత్సహించడంలో పౌర సమా జం పాత్రపై ప్రసంగించారు. వనరులు పరిమితంగా ఉన్న ప్రస్తు త తరుణంలో మిలియనియం అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ- సర్వీసెస్‌ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవా లని చెప్పారు.


సోడాకు కొత్త సొబగులు...
‘‘గత సంవత్సర కాలంలో నేను, గ్రామస్తులు కలిసి మా సొంత కృషితో గ్రామంలో మంచి మార్పు తెచ్చాం. మాకు బయటి మద్ద తు లేదు. ఎన్జీవోలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సహకారం లేదు. అయితే, మిలియనియం అభివృద్ధి లక్ష్యాల సాధనకు మాకు కార్పొరేటు ప్రపంచం, బయటి ఏజెన్సీల మద్దతు కావాలి’’ అని రజావత్‌ కోరారు. తమ గ్రామంలో తొలి బ్యాంకు ఏర్పాటుకు సహకరించిన ఐరాస ఆఫీ్‌ ఫర్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ కృతజ్ఞతలు తెలి పారు. ‘‘మూడేళ్లలో నా గ్రామాన్ని పూర్తిగా మార్చేస్తా. నాకు డబ్బు అక్కర్లేదు. మా గ్రామంలో ప్రాజెక్టులను దత్తత తీసుకునే వ్యక్తులు, సంస్థలు కావాలి. నా గ్రామంలో సత్వర అభివృద్ధి కోసం ఈ సదస్సు సహకారమందించాలి. అప్పుడే మీరు, నేను అనుభవిస్తున్న మంచి జీవితాన్ని ప్రస్తుత తరం అనుభవించడాని కి వీలుంటుంది’’ అని ఉద్వేగభరితంగా పిలుపునిచ్చారు. రజావత్‌ ప్రసంగానికి ప్రతినిధుల నుంచి అపూర్వ స్పందన లభించింది.
http://img.technospot.in/Chhavi-Rajawat.png
జీన్స్‌ ప్యాంట్‌... గుర్రపుస్వారీ...
సంప్రదాయంలో భాగంగా తమ ముఖం ఇతరులకు కనిపించ కుండా ముసుగు ధరించే మహిళలు ఎక్కువగా ఉండే రాజస్థాన్‌ గ్రామీణ ప్రాంతాల్లో ఆమె జీన్స్‌ ప్యాంట్‌, టీ షర్ట్‌ ధరించి.. గ్రామ సభలకు హాజరవుతారు.గుర్రపు స్వారీ చేస్తారు. సాధారణంగా.. ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివిన ఎవరైనా కార్పొరేట్‌ రంగంలో లక్షల సంపాదనతో స్థిరపడతారు. కానీ, రజావత్‌ అలా కాదు, కార్పొరేట్‌ ఉద్యోగాన్ని సైతం కాదని. జన్మభూమి సేవలో తరిస్తున్నారు. గత మూడేళ్ళలో గ్రామ సర్పంచ్‌గా సోడా గ్రామాన్ని ఎంతో అభివృద్ధిలోకి తెచ్చింది. దీనికి గుర్తింపుగానే ఐరాస సదస్సు ప్యానల్‌ చర్చల్లో పాల్గొనే అరుదైన ఘనతను సొం తం చేసుకున్నారు రజావత్‌. ఎలాంటి సహాయ సహకారాలను ఆశించకుండా.. తీసుకోకుండా తనదైన ఆలోచనలతో తన గ్రామంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. సాధారణ మను షులకు సాధ్యం కాని పనిని చేసి చూపించింది. అందుకే 30 ఏళ్ళ వయస్సులోనే ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించింది. భారత్‌ లోనే పిన్నవయస్కురాలైన, ఎంబిఎ చదివిన ఏకైక మహిళా సర్పం చ్‌ రజావత్‌ (30). గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించేందుకు ఎయిర్‌టెల్‌కు చెందిన భారీ టెలీవెంచర్స్‌లో ఉన్నతస్థాయి ఉద్యో గాన్ని సైతం వదులుకుంది. గ్రామ సర్పంచ్‌గా తాను అనుకున్నది సాధించిన వైనాన్ని ఐక్యరా జ్యసమితి సదస్సులో వివరించింది. దారిద్య్రంపై పోరు, అభివృద్దిలో పౌరసమాజం పాత్ర, అభివృద్ధి చర్యలను పౌరసమాజం ఎలా అమలు చేయాలి అనే అంశంపై చర్చలో పాల్గొంది.
http://images.jagran.com/PTI3_30_2011_000016B_49592.jpg
ఈ-సేవలు అమలు చేయాలి...
వనరులు పరిమితంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మిలీనియం లక్ష్యాలను సాధించాలంటే ఈ-సేవలు వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సహా వివిధ వ్యూహాత్మక చర్యలను గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ సదస్సులో ప్రతినిధులకు సూచించింది. ‘‘స్వాతంత్య్రం సంపాదించినప్పటినుంచీ గత 65 ఏళ్ళు ఒకే రీతిలో పురోగతిని సాధించేందు కు భారత్‌ కృషి చేస్తోంది. కానీ ఇది సరైనరీతిలో లేదు.ప్రజలకు నీరు, విద్యుత్తు, మరుగుదొ డ్లు, పాఠశాలలు, ఉద్యోగాలు అందించడంలో మనం విఫలమయ్యాం.


Chhavi_Rajawat
వీటిని వేరొకదారిలో సాధించడవచ్చు. వేగంగా చర్యలు చేపట్టవచ్చునని నేను భావిస్తున్నారు. గడిచిన ఒక్క ఏడాది లోనే నేను, సోడా గ్రామస్తులు కలిసి సొంత సామర్థ్యంతో గ్రామంలో సమూల మార్పులు తీసుకొచ్చాం.మేము ఎవరి మద్దతును తీసుకోలేదు. ఎన్జీవోలు గానీ, ప్రభుత్వం లేదా ప్రైవేటు వ్యక్తులు ఎవరి సాయం తీసుకోలేదు’’ అని చెప్పారు. మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను సాధిం చేందుకు బయట ఏజన్సీలు, కార్పొరేట్‌ ప్రపంచం మద్దతును కోరుతున్నానని ఆమె చెప్పారు.


మేనేజ్‌మెంట్‌ డిగ్రీ గ్రామ పాలనకు ఉపయోగపడుతోంది...
‘‘గ్రామస్తులకు సేవ చేయడం ద్వారా నేను నా మూల్లాలోకి వెళుతున్నాను. ఇందుకు ముంద స్తుగా అనుకున్నది కాదు. ఎక్కడైతే నేను ఎదిగానో అదే గ్రామానికి నేను సేవలు అందిస్తున్నా ను’’ అని ఐక్యరాజ్యసమితి సదస్సు అనంతరం రజావత్‌ చెప్పారు. నా ఎంబీఏ డిగ్రీ గ్రామ పాలనకు, కొత్త రక్తాన్ని తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతోంది. దీనిని నేను కెరీర్‌గా భావిం చడం లేదు. సామాజిక సేవగా భావిస్తున్నాను అని చెప్పారు. ఎన్జీవోల సాయంతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం, సురక్షితమైన తాగునీరు తెచ్చేందుకు దృష్టిపెడుతున్నాను రజావత్‌ తెలిపారు.
http://images.idiva.com/media/content/2011/Mar/woman_sarpanch_chhavi_600x450.jpg
రిషీ వ్యాలీ టు సోడా...
ఛవీ రజావత్‌ నేతృత్వంలో సోడా గ్రామం ప్రగతిపథాన ముందుకు పోతుంటే, పత్రికా విలేఖ రులు, ప్రచార ప్రసార మాధ్యమాలు, ిసినీ నిర్మాతలు సోడా గ్రామానికి బారులు తీరారు. ఓ మహిళ నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి పథకాలు ఎలా అమలు జరుగుచున్నాయనేదే అందరి ధ్యాస. సోడాలో మంచి నీరు ప్రధాన సమస్య. రజావత్‌ గతంలో జైపూర్‌లో గుర్రాల స్వారీ స్కూలును నడుపుతూ, తల్లికి హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో సహకరించేది. రజావత్‌కు పూర్వ సర్పంచ్‌ విధులు సరిగా నిర్వహించని కారణాన గ్రామస్థులు విసిగి వేసారిపోయారు.


ఆమెను ఈసారి సర్పంచ్‌గా పోటీకి నిలువకపోతే ధర్నాకు సిద్ధమయ్యారు. ఓ వైపు తలంతా కప్పుకున్న గృహిణులు, మరోవైపు జీన్స్‌ ప్యాంట్‌తో ఈమె ఎలా గ్రామానికి పొంతన కుదరుతుందని కొం దరు ప్రశ్నించారు. ఆమె ఏ దుస్తులు ధరించినా సోడా గ్రామవాసి. అదే ఆ గ్రామానికి కోడలై తే రాజస్థానీ దుస్తులు ధరించాలని పట్టుబట్టే వారే. గుర్రమెక్కి గ్రామంలో ఇంటింటి బాగోగు లు వాకబు చేస్తుంది. ఛవీ రజావత్‌ రాజ్‌పుట్‌ కుటుంబీకురాలు. వారికి సోడా, పరిసర గ్రామాలలో వందల ఎకరాలున్నాయి.


ఇరవై సంవత్సరాల క్రితం ఆమె తాతగారు ఆ ఊరి సర్పంచ్‌ వారి పాలనలో గ్రామస్థుల కష్టాలు తీరాయి.మళ్లీ సర్పంచ్‌ మారడంతో అభివృద్ధి నోచుకోలేదు. మహిళా రిజర్వేషన్‌ అమలు జరుగుతుందని సర్పించ్‌ భార్యను సర్పంచ్‌గా నుంచోమన్నాడు. కానీ గ్రామస్థులంతా ఛవీ రజావత్‌నే సర్పంచ్‌గా ఆదరించి గెలిపించారు.రాజస్థాన్‌లోని సర్పంచ్‌ల ఎన్నికల్లో చావీ రజావత్‌కే అత్యధికంగా మెజారిటీ లభించింది.

ఉపాధి హామీ...

టాంక్‌ జిల్లావెనుకబడిన ప్రాంతం. గ్రామస్థులంతా ఆవాలు, గోధుమ, ధనియాలను పండించే వారు.వర్షాభావ ప్రాంతం గత రెండు సంవత్సరాలుగా చెరువులు, వాగులు ఎండిపోయాయి. భూమిలో నీరు ఇంకిపోతుంది.బిసాల్పూర్‌ డామ్‌ నీళ్లు జైపూర్‌కు మళ్లిస్తున్న కారణాన టాంక్‌ జిల్లాలోని గ్రామాలకు నీరు అందటం లేదు. చావిరజావత్‌ సోడా గ్రామానికి నీరు రప్పించేందుకు కంకణం కట్టుకుంది. మరోవెపు జాతీయస్థాయిలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే వ్యవస్థలో అవినీతిపై రజావత్‌ యుద్ధం ప్రకటించింది. పంటలకాలం ముగిస్తే, గ్రామంలో పెక్కుమందికి ఉపాధి లభించుట లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకై రజావత్‌ శ్రమించింది. పంటకాలం ముగిస్తే, చేతులు ముడుచుకొని ఎవరినీ కూర్చోవద్దన్నది.


మహిళా కార్మికులు...
పొలం గట్లు వేయటం, మట్టి పనులలో అధికంగా మహిళా కార్మికులే పని చేస్తారు. చదువుకున్న విద్యార్థినులు కూడా మట్టి పనులు చేస్తున్నారు. ఏదైనా పొలాలకు నీరందితేనే కానీ, వారి భవిష్యత్‌ మారదనేది వారి వాదన. రోజూ నీటికై మహిళలు ఎన్నోమైళ్లు నడిచివెళ్లాలి. రోజూ రెండు సార్లు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాలి. కొందరు నగరానికి వలసలు వెళ్లారు. మరి కొందరు సోమరులుగా సోడా గ్రాంలోనే కాలం గడుపుతున్నారు.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj4DQP_uTb9y7rwtPTNJac8JjjRK9P__GlnGQF0jYq-mwpvwQ3Ep_vk7mStdvbrfmuwbWt0T-qG6Klv5cKb9JHhCjrQYnLNYiqewLIzOh1pkoJabl0Z0ao-UAPBKMz7wM6w-oTQiEuL7Cs/s400/Chhavi-Rajawat.jpg

మారిన ఆలోచనాధోరణి...
తండ్రి, ఛవీ రజావత్‌కు బాసటగా నిలిచారు. చెరువులను తవ్వించటం, చెట్లు పెంచటం, డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకాలకు రూపకల్పన చేయటం వారి నిత్యవిధులు. వర్షపు నీటిని సక్రమంగా విని యోగించమని గ్రామస్థులకు తెలియజేశారు. ఛవీ రజావత్‌ చేపట్టిన విప్లవాత్మక మార్పులలో, ఎవరినీ సోమరిగా కూర్చోవద్దన్నది. కష్టించి పనిచేసే మనస్తత్వాన్ని అలవాటు చేసింది. గ్రామాలలో పలుచోట్ల ప్రభుత్వం పైనే, ప్రతి పనికీ గతంలో ఆధారపడేవారు. ఛవీ రజావత్‌ అలా కాకుండా గ్రామస్థులను వారి కాళ్లపై నిలబడే స్వభావాన్ని పెంచింది. వారి ఆలోచనలను మార్చడం కష్టమే. కానీ కాలగమనంలో ఛవీ రజావత్‌ దీక్ష, పట్టుదల ముందు వారు తలొగ్గారు. ప్రతీ చిన్న పనికీ ప్రభుత్వంపై ఆధారపడక, గ్రామాభివృద్ధికై వారిని శ్రమయేవ జయతే బాటలో నడిపిస్తుంది.

Monday, April 25, 2011

దివ్య మోహన చిత్రరాజం * ' రాజా ' రవివర్మ

"రవివర్మకే అంద ని అందానివో..!'' అన్న ఈ ఒక్క పాదం చాలు,అందాన్ని చిత్రించడంలో 'రాజా' రవివర్మ ఎంతటి అత్యున్నత స్థానంలో ఉన్నాడో చెప్పడానికి . అందమంటే అదేదో కేవలం రూపురేఖలకు సంబంధించినదని కాదు. అది భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, భారతీయ తాత్వికతను, అన్నింటినీ మించి ఒక దివ్యత్వాన్ని సంతరించుకున్న అందాల్ని అయన చిత్రించాడు. భారతీయ చిత్రకళా కీర్తిని ప్రపంచమంతా విస్తరింపచేశాడు. నేడు ఇంటింటా కనిపించే దేవతా చిత్రపటాల్లో చాలా వరకు రవివర్మ రూపకల్పనలే అంటే ఆశ్చర్యం వేయవచ్చు. కానీ, ఇది నిజం.  ఆయన జయంతి ఏప్రిల్ - 29.

ముక్కోటిదేవతల్లో ఏ ఒక్కరికీ అప్పటికింకా స్పష్టమైన రూపురేఖల్లేవు. అంతకు ముందే మనసులో ఉన్న రూపాలతో వాటిని అన్వయించుకుని వాటితోనే సర్దుకుపోవలసిన నిస్సహాయ స్థితి. దివ్యకళ లేకపోయినా కనీసం జీవకళ అయినా లేని దేవతా రూపాలనే పూజించుకోవలసిన నిస్సహాయ స్థితి రాజా రవివర్మను అమితంగా వేధించింది. ఈ వెలితి ఇంకా ఇలాగే ఎప్పటికీ కొనసాగడం సముచితం కాదనుకున్నాడు. రామాయణ, మహాభారతాల్లోని రాముడూ, కృష్ణుల పైన మానవాళికి ఇంత ప్రేమా భక్తులు ఉన్నా, వారి రూపాన్ని గురించిన స్పష్టత లేకపోవడం ఆధ్మాత్మికంగా కూడా నష్టమేననుకున్నాడు.

అందుకే ఆ లోటును పూరించడానికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించుకున్నాడు. కాకపోతే ఒక మనిషి తన జీవిత కాలంలో ముక్కోటి దేవతల చిత్రాలు గీయడం అసాధ్యం కదా! అందుకే దేవతా మూర్తుల్లో కొంత మంది ప్రముఖుల చిత్రాలైనా వేయాలనుకున్నాడు. అంతే! అదే ఆయన జీవిత లక్ష్యమై పోయింది. అప్పటిదాకా భారతీయుల ఊహల్లోనే ఉండిపోయిన దేవతా రూపాలను ఆయన తొలిసారిగా సజీవంగా జీవద్వంతంగా చిత్రించే పనిలో నిమగ్నమైపోయాడు. ఒక తపస్విలా మారిపోయాడు. రవి వర్మ తన చిత్రలేఖనంలో దేవతా మూర్తుల రూపురేఖలకే పరిమితం కాకుండా గొప్ప అందాన్ని, అంతకన్నా మించి ఒక దివ్యత్వాన్ని చిత్రించేవాడు.

భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలతో అమితంగా ప్రభావితమైన వ్యక్తి రవి వర్మ. ఆయన గీసిన ప్రతి చిత్రంలోనూ భారతీయ ఆధ్యాత్మికత, తాత్వికత తొంగిచూస్తూ ఉంటాయి. నిజానికి రవి వర్మ శిక్షణ పొందింది పాశ్చాత్య చిత్రకళా రీతుల్లోనే.అయినా, ఆ కళానైపుణ్యాలను భారతీయ కళను మెరుగుపరచడానికి, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతలను ఆవిష్కరించడానికే వినియోగించాడు. ఆయన కళా రూపాలు ప్రపంచవ్యాప్తంగా అమితమైన ఆదరణ పొందడానికి ఈ లక్షణం ఒక ప్రధాన కారణమయ్యింది. నిజానికి కళలు అంటేనే సమైక్యపరిచేవి. అవి భాషకో, ప్రాంతానికో, దేశానికో పరిమితమై ఉండవు.

అవి విశ్వవ్యాప్తమై ఉంటాయి. అందుకే పాశ్చాత్య చిత్రకళా రీతులను భారతీయ చిత్రకళతో మేళవించడంలో అతనికేమీ అభ్యంతరకరంగా అనిపించలేదు. కళలు మానవ అంతరంగాన్ని అవిష్కరించే గొప్ప వేదికలు. అవి విశ్వస్పృహతో పనిచే సినప్పుడే జీవితాలను తేజోవంతం చేస్తాయి. జీవితానికి ఒక కొత్త అర్థాన్ని చెబుతాయి. సత్యాలను లోతుగా అర్థం చేసుకోవడానికే కాకుండా జీవిత విలువలు శాశ్వతంగా నిలబడేందుకు కూడా తోడ్పడతాయి.

దేవతా రూపాల్లో...
భారతీయ కళలు ఎక్కువగా సంకేతాత్మకంగానే ఉంటాయి. రాముడు, కృష్ణులను ఆజాను బాహులుగా చిత్రించడం వారి అపార శక్తిని తెలియ చెప్పడానికే. కొంత మంది దేవతలకు నాలుగు తలలు ఉంచడం వెనుక నాలుగు రెట్లు అధికంగా ఉండే వారి మేధోశక్తికి సంకేతంగా ఉంటాయి. ఇలాంటి విషయాలను పైపైన చూసే వారు వాటిలోని అంతర్మూలాలను గుర్తించలేరు. భారతీయ కళలు స్థూల విషయాలనుంచి సూక్ష్మ విషయాలకు, భౌతిక అంశాలనుంచి అభౌతిక విషయాలకు నడిపించడానికి ప్రాధాన్యం వహిస్తాయి. అలాగే నీడల్లోంచి నిజాల్లోకి వెళతాయి. దేవతా మూర్తుల్లో చాలా వరకు ఇలాంటి సంకేతాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి రవివర్మకు అత్యంత ప్రియంగా ఉండేవి. ఈ కారణంగా రవివర్మ భారతీయ ఇతిహాసాలకు , భారతీయ సంస్కృతీ రీతులకు విశేష ప్రాధాన్యతను ఇచ్చారు.

దివ్యత్వం ప్రధానం

భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికత కూడా ఒక ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది. ఇది ఒక దివ్యత్వానికి బీజంగా ఉంటుంది. యోగులు, రుషులకే పరిమితం కాకుండా ఈ దివ్యత్వం కొంతమంది సామాన్యుల్లోనూ కనిపించడం రవివర్మను అమితంగా ఆకర్షించింది . అందుకే ఆయన గీసిన ప్రతీ చిత్రంలోనూ దివ్యత్వం కనిపిస్తూ ఉంటుంది. ఆయన తన ప్రతి కళారూపంలోనూ సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొదుగుతాడు. కళాత్మకత, తోడుకాకుండా జీవితం పరిపూర్ణం కాదని అతడు బలంగా నమ్ముతాడు.

నిజానికి కళలన్నీ లోకంలోని వెలితిని పూరించడానికే కదా! పరిశీలిస్తే ఈ ప్రపంచంలో అడుగడుగునా అన్నీ పరిమితులు, లోపాలు, నిరాశాజనక అంశాలే కనిపిస్తాయి. ఎక్కువగా మనం ఆశించినదానికి విరుద్ధంగానే ఉంటాయి. అయితే ఈ పరిమితులను తుడిచేసి, లోపాలను తొలగించి ఆశావహ ఆంశాలను నింపగలిగేవి కళలే అంటాడు రవివర్మ. వాస్తవికతో సంబంధం లేకుండా కళ లు మనలోని వెలితిని అవి పూరిస్తాయని, మనసులో పెనవేసుకున్న దుఃఖాన్ని రూపుమాపి మనలో ఆనందాన్ని నింపుతాయని అతడు బలంగా నమ్ముతాడు.

ఈ భావజాలమే అతని పెయింటింగ్స్ ఒక విశిష్ట స్థానాన్ని పొందడానికి దోహదం చేశాయి. రాముడు, కృష్ణుడితో పాటు ఆయన చిత్రించిన శకుంతల, నల, దమయంతులు, చిన్ని కృష్ణుడు-యశోద, లక్ష్మి, సరస్వతి, రాధా-కృష్ణులు, అర్జున-సుభద్ర, గంగను తన శిరస్సు మీదికి ఆహ్వానించే శివుడు ఇలాంటి రవివర్మ చిత్రాలు అపురూప ఖండాలుగా నిలిచాయి.

స్థానిక ప్రభావం
రవివర్మ పేరుకు ముందు 'రాజా' అన్నది అతని పెయింటింగ్స్‌కి పురస్కారంగా బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు. అంతే తప్ప అతనేమీ రాజవంశీకుడు కాదు. కేరళలోని కిలిమనూర్ అనే చిన్న పట్టణంలో జన్మించిన రవివర్మ పై ఆ ప్రాంత ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆ ప్రాంతపు స్త్రీలే ఆయన పెయింటింగ్స్‌కు స్ఫూర్తిగా నిలిచారని ప్రతీతి. ఆయనకు 1873లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన వియానా ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఆయన పెయింటింగ్‌కు ప్రధమ బహుమతి లభించింది. అప్పటి నుంచే ఆయన పేరు దశదిశలా వ్యాపించింది.

వీటన్నిటినీ మించి ఆయన గీసిన దేవదేవతలే మానవ హృదయాల్లో నిలిచిపోయారని ఆయన గీయని మిగిలిన వారెవరూ అంతగా నిలబడలేదన్న వ్యాఖ్యలు మనకు అక్కడక్కడా వినపడుతూ ఉంటాయి. అవి నిజమనిపించే ఆధారాలూ కనిపిస్తాయి. దేవతలను నిలబెట్టిన మనిషి అనడం కన్నా మించిన బిరుదు లోకంలో ఇంకేముంటుంది?. అక్టోబర్-2, 1906లో రవివర్మ తన జీవితం చాలించినా భారతీయ చిత్రకళా ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయారు.