ఈమె పేరు రజనీ వుడ్. ఉండేది ఆస్ట్రేలియాలో. హోదా.. సౌత్ ఆస్ట్రేలియన్ ఛాప్టర్ (ఆస్ట్రేలియన్, ఇండియన్ బిజినెస్ కౌన్సిల్) వ్యవస్థాపక సభ్యురాలు, బోర్డ్ మెంబర్. హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసిన ఈమె ఒకప్పుడు అశ్విని హెయిర్ ఆయిల్, ఆప్కో సంస్థలకు మోడల్‌గా కూడా పనిచేశారు. మణిశంకర్ తీసిన చాలా డాక్యుమెంటరీల్లో నటించారు.ప్రస్తుతం చేస్తున్న పని.. సౌత్ ఆస్ట్రేలియన్ ఛాప్టర్ మెంబర్‌గా ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య వ్యాపార సంబంధాలు బలపడేలా చూడ్డం. ఇదీ ఈమె పరిచయం. మొన్న జరిగిన ఎలీప్ వాళ్ల సెమినార్‌కు ఆస్ట్రేలియన్ ప్రతినిధిగా హైదరాబాద్‌కు విచ్చేసినప్పుడు ఆమె తన గురించి చెప్పిన విశేషాలు ...
'పదిహేనేళ్ల క్రితం టానీ పాల్ వుడ్ అనే ఆస్ట్రేలియన్‌ను పెళ్లి చే సుకుని అక్కడే స్థిరపడ్డాను. నాకు మొదటి నుంచి నైన్ టు ఫైవ్ ఉద్యోగాలంటే పెద్ద ఆసక్తి లేదు. కొత్తగా, అందరికి భిన్నంగా చేయగలిగే పనుల పట్లే శ్రద్ధ వహించేదాన్ని. అలా మొదలుపెట్టిందే సౌత్ ఆస్ట్రేలియన్ ఛాప్టర్. దీన్ని స్థాపించిన తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాం.
నిజానికి ఇది ఎలాంటి లాభాపేక్షలేకుండా నడుస్తున్న సంస్థ. దీని తరపున ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య వ్యాపార సంబంధాలు బలపడేలా చూస్తున్నాం. అంటే ఇండియాలో ఉన్న ఉత్పత్తులకు ఆస్ట్రేలియాలో మార్కెట్ చూడడం, ఆస్ట్రేలియా వ్యాపారులకు ఇండియాలో అవకాశాలు చూపించడం మా పని. దీనివల్ల రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు బలపడ్డమే కాకుండా కొత్త కొత్త ఉత్పత్తులకు మార్కెట్ లభిస్తుంది.
అలాగే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇది ఇండియాకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. అందుకే మా సేవలకు మంచి గుర్తింపే లభిస్తోంది. అంతేకాదు మా సంస్థకు రెండుసార్లు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది. ఇది మేము సాధించిన విజయం.
కొత్త ఐడియా
ఎలీప్ వాళ్ల సెమినార్‌కి నాకు వక్తగా అహ్వానం అందింది. ఆ సమావేశంలో పాల్గొన్నాక కొత్త ఐడియా మెరిసింది. ఎంతోమంది మహిళలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని రకరకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. అందులో కొన్నిటిని ఆస్ట్రేలియన్ మార్కెట్‌కి పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన తట్టింది. అప్పుడు జనపనారతో తయారైన వస్తువులు నన్ను చాలా ఆకర్షించాయి.
పైగా ఆస్ట్రేలియన్లు పర్యావరణం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, ప్లాస్టిక్ నిషేధం చాలా స్ట్రిక్టుగా అమలవుతోంది. అందుకని ఇక్కడ వీళ్ల చేత జనపనారతో సంచులను తయారుచేయించి వాటిని అక్కడ మార్కెట్‌లో అమ్మితే మంచి లాభాలు ఉంటాయి.
ఇట్లా అక్కడి వాళ్ల డిమాండు తీరుతుంది ఇక్కడ వీళ్ల వస్తువులకు మార్కెట్టూ దొరుకుతుంది. ఈ ఒక్కటే కాదు ఇలా ఆస్ట్రేలియా డిమాండున్న ఇతర వస్తువులకూ ఇక్కడ వీళ్ల చేత ఉత్పత్తి మొదలుపెట్టించి అక్కడ మార్కెట్ చేయాలన్నది నా సంకల్పం. అందుకే ఇప్పుడు ముందుగా నమూనాకు కొన్ని జ్యూట్ బ్యాగులను తీసుకెళ్తున్నాను. దాన్ని బట్టి మిగతావాటికి ప్రణాళిక వేసుకోవాలని అనుకుంటున్నాను.
ఆస్ట్రేలియాలో ఈ ఉత్పత్తుల డిమాండుననుసరించి చక్కటి నైపుణ్యం గల కొంతమంది వర్కర్లను కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో నేను విజయం సాధించగలిగితే ఇక్కడి వర్కర్లను అక్కడికి తీసుకెళ్లినట్లే అక్కడ నైపుణ్యం ఉన్న వర్కర్లను కొంతమందిని ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను. దీనివల్ల ఒకరి పనితనాన్ని ఇంకొకరు నేర్చుకునే వీలుంటుంది. అంటే ఎక్సేంజ్ ఆఫ్ స్కిల్స్ అన్నమాట. ఇదీ నా భవిష్యత్ ప్రణాళిక.
డాక్టర్ అవుదామని....
నిజానికి నేను డాక్టర్ అవుదామనుకుని చివరకు ఆస్ట్రేలియన్, ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ వ్యవస్థాపకురాలినయ్యాను. సాధారణంగా ఇలా సినిమా యాక్టర్లు చెబుతారనుకుంటా. కాని నా విషయంలో కూడా జరిగిందదే. మెడిసిన్ చేద్దామనుకున్నాను. వయసు సరిపోలేదని ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి అనుమతి దొరకలేదు.
ఖాళీగా ఉండడం ఎందుకని అప్పుడే హోటల్ మేనేజ్‌మెంట్‌లో చేరాను. ఆ చదువు పూర్తవడంతోనే కృష్ణా ఒబేరాయ్(ఇప్పటి తాజ్ కృష్ణా)లో ఉద్యోగం వచ్చింది.అదే నా లక్ష్యాన్ని మార్చింది. ఆ రోజుల్లోనే ఓ వైపు ఉద్యోగం చేస్తూ ఇంకోవైపు మోడలింగ్ చేసేదాన్ని. అప్పుడే టానీ పరిచయం అవడం, ప్రేమగా మారడం, తర్వాత పెళ్లి చేసుకోవడమూ అయింది. ఆస్ట్రేలియా వెళ్లాక కృష్ణా ఒబేరాయ్‌లో ఉన్న అనుభవంతో అక్కడా ఓ మంచి హోటల్లోనే ఉద్యోగం దొరికింది. అలా చేస్తున్నప్పుడే అక్కడి ఓ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్(స్వచ్ఛంద సంస్థ)లో పనిచేసే మంచి అవ
కాశం దొరికింది. ఇలా సంస్థ తరపున ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ఎన్నో వ్యాపార పర్యటనలను, సమావేశాలను, వీటికి సంబంధించిన ఈవెంట్స్‌ను నిర్వహించేదాన్ని. రెండు దేశాల మధ్య ఎన్నో బిజినెస్ డీల్స్‌ని కూడా కుదిర్చిపెట్టాము. అలా ఎన్నో కీలకమైన వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించి ఒక్క యేడాదిలోనే ఆ సంస్థ సీఈవో స్థానానికి ఎదిగాను.
ఆస్ట్రేలియా వెళ్లాక కృష్ణా ఒబేరాయ్‌లో ఉన్న అనుభవంతో అక్కడా ఓ మంచి హోటల్లోనే ఉద్యోగం దొరికింది. అలా చేస్తున్నప్పుడే అక్కడి ఓ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (స్వచ్ఛంద సంస్థ)లో పనిచేసే మంచి అవకాశం దొరికింది.ఇలా సంస్థ తరపున ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ఎన్నో వ్యాపార పర్యటనలను, సమావేశాలను, వీటికి సంబంధించిన ఈవెంట్స్‌ను నిర్వహించేదాన్ని. రెండు దేశాల మధ్య ఎన్నో బిజినెస్ డీల్స్‌ని కూడా కుదిర్చిపెట్టాము. అలా ఎన్నో కీలకమైన వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించి ఒక్క యేడాదిలోనే ఆ సంస్థ సీఈవో స్థానానికి ఎదిగాను.
స్ఫూర్తి... విజయం
ఆ స్ఫూర్తితో కొంతమంది స్నేహితులతో కలిసి ఆస్ట్రేలియన్ ఛాప్టర్ (ఆస్ట్రేలియన్, ఇండియన్ బిజినెస్ కౌన్సిల్)ను స్థాపించాను. దీని వ్యవహారాలు నడుపుతూనే ఆస్ట్రేలియా సమాజంలో ఉన్న రుగ్మతల మీద పనిచేయడం మొదలుపెట్టాను. అక్కడ డ్రగ్స్ బారిన పడే యువత చాలా ఎక్కువ. వాళ్లను గుర్తించి కౌన్సిలింగ్‌లు ఇప్పించడం, పునరావాస కేంద్రాల్లో చేర్పించడం, వాళ్లకు పనులు నేర్పించడం వంటివి చేస్తుంటాను మా సంస్థ తరపున.
అలా మాదకద్రవ్యాల అలవాటు మానుకుని సాధారణ జీవితం గడుపుతున్న కొంతమంది అమ్మాయిలు రకరకాల పనులు నేర్చుకుని చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాంటి అమ్మాయిలనే కొంతమందిని ఎక్సేంజ్ ఆఫ్ స్కిల్ కార్యక్రమంలో భాగంగా ఇండియాకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చేపట్టిన చాలా పనుల్లో విజయాలే సాధించాను. ఇకముందు నేను చేపట్టబోయే కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయనే ఆశతోనే ముందడుగు వేస్తున్నాను.'
- సరస్వతి రమ
ఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు చేసిన సందడి అభిమానులను ఉక్కిరిబిక్కిరిచేసింది. దీంతో సినీతారలు, మోడల్స్, క్రీడాకారులు, వ్యాపార ప్రముఖులు తదితర సెలబ్రిటీలు వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. బిగ్‌బాస్-4 రియాల్టీ షోలో పమేలా ఆండర్సన్ మొదలుకొని టెస్టుల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 50 సెంచరీలు, బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ టాప్ హీరోగా నిలిచి తమ అభిమానులకు మధురానుభూతులను పంచారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ ఏడాది వార్తల్లో ప్రముఖులుగా నిలిచి ఆకట్టుకున్నారు. అభిమానులను మైమరపించిన ఈ సెలబ్రిటీల గురించి తెలుసుకుందామా...
ఈ ఏడాది బాలీవుడ్ టాప్ హీరోగా సల్మాన్ ఖాన్ నిలిచారు. సల్మాన్ ఇటీవలే 45వ బర్త్‌డే వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. సల్మాన్‌కు అమీర్‌ఖాన్‌కు ఉన్న యాక్టింగ్ స్కిల్స్, షారూఖ్ ఖాన్ వంటి చరిష్మా లేకున్నా ఈ ఏడాది ఆయన పలు హిట్ సినిమాలతో బాలీవుడ్ టాప్ హీరోగా నిలిచారు. ఈ ఏడాది సల్మాన్ నటించిన దబంగ్ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతోపాటు బిగ్ బాస్ సీజన్ 4లో యాంకర్‌గా చేసిన సల్మాన్‌కు ఎంతో పాపులారిటీ దక్కింది. బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్, షారూఖ్ ఖాన్‌లు, సల్మాన్ ఖాన్‌లు ఖాన్‌ల త్రయంగా పేరుగాం చారు. ఈ ఏడాది ఖాన్‌ల త్రయంలో సల్మానే బెస్ట్‌గా నిలిచారు. ఇతర ఖాన్‌లకంటే తక్కువ వయస్సుగల ఈ బాలీవుడ్ కండలవీరుడు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని మానవతా వాదిగా సైతం పేరుతెచ్చుకున్నారు. బాలీవుడ్ ట్రేడ్ కన్సల్టెంట్ అమోద్ మెహ్రా మాట్లాడుతూ ‘ఈ ఏడాది బాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమాలతో కలిసి 237 హిందీ సినిమాలు విడుదల య్యాయి. వీటన్నింట్లో నిజమైన సూపర్ హిట్ సినిమాలుగా నిలిచినవి మాత్రం దబంగ్, గోల్‌మాల్ 3 మాత్రమే. ఈ ఏడాది ఖానో మే ఖాన్ కౌన్ హై...అంటే నేను సల్మాన్ ఖాన్ అని చెబుతాను. సల్మాన్ నటించిన వీర్ సినిమా ఫెయిలైనప్పటికీ దబంగ్ సినిమాతో ఆయన టాప్‌స్టార్‌గా నిలిచారు’ అని ఆయన సల్మాన్‌ను పొగిడారు.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ను వివాహమాడి కొత్త జీవితంలోకి ప్రవేశించారు. దీంతో పాటు టెన్నిస్‌లో పలు విజయాలు ఆమెకు సంతోషాన్ని మిగిల్చాయి. ‘2010 సంవత్సరం నా జీవితంలోనే అదృష్టమైన సంవత్సరంగా భావిస్తాను. ముందుగా నా పెళ్లి షోయబ్‌తో జరగడంతో నా జీవితంలో ఆనం దం వెల్లివిరిసింది. ఇక ఆసియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో మెడల్స్ గెల్చుకోవడం సంతోషాన్నిచ్చింది. దీంతో పాటు దుబాయ్‌లో జరిగిన ఇంటర్నే షనల్ టెన్నిస్ ఫెడరేషన్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాను. వీటన్నింటితో ఈ ఏడాది నాకు అదృష్ట సంవత్సరంగా మారింది. గాయంనుంచి కోలుకొని గత కొన్ని నెలలుగా టెన్నిస్‌లో మళ్లీ పుంజుకొని విజయాలు సాధించడం నాకు ఊరటనిచ్చింది. వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కూడా నా ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను’ అని సానియా పేర్కొన్నారు. ‘షోయబ్ సహకారం, ప్రోత్సాహం నాకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఇటీ వల ఢిల్లీలోని ఓ టెన్నిస్ అకాడమీని సందర్శించాను. అక్కడ పలువురు యువ తులు టెన్నిస్ ఆడుతూ కనిపించడం గొప్పగా అనిపించింది. యువకులకు ధీటుగా యువతులు సైతం నేడు మనదేశంలో టెన్నిస్‌లో రాణిస్తుండడం శుభ పరిణామం. చిన్నతనంలో టెన్నిస్ నేర్చుకుంటున్న ప్రారంభంలో నా తల్లిదండ్రులు సైతం టెన్నిస్ నేర్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. చివరికి పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేసుకోవాల్సిన అమ్మాయిలకు స్పోర్ట్‌స ఎందుకనే వారు నేడు చాలా మంది ఉన్నారు. కానీ కేవలం భర్త, పిల్లలు, ఇల్లే కాదు క్రీడల్లోకూడా మహిళలు రాణించాల్సిన అవసరం ఉంది’ అని సానియా పేర్కొ న్నారు. ‘నన్ను పూర్తిగా అర్థం చేసుకునే భర్త షోయబ్ నాకు దక్కడం నా అదృ ష్టంగానే భావిస్తాను.
దేశంలోని కోటీశ్వరులలో ఒకరైన విజయ్‌మాల్యా గురించి తెలియని వారుండరు. ఆయన లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమానిగా ప్రపంచ ప్రసిద్దిగాంచారు. ఐపిఎల్ ట్వంటీ ట్వంటీ క్రికెట్లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ టీం యజమాని కూడా విజయ్‌మాల్యానే. ఇక విజయ్‌మాల్యా తనయుడు సిద్దార్థ మాల్యా తండ్రి వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడు. సిద్దార్థ ఐపిఎల్‌లో తమ టీం బెంగళూర్ క్రికెట్ మ్యాచుల్లో కనిపించి సందడిచేశారు. బెంగళూర్ జట్టుకు సెలబ్రిటీ సపోర్టర్‌గా ఉన్న బాలీవుడ్ అందాలతార దీపికా పదుకునే సైతం ఐపిఎల్ మ్యాచుల్లో సిద్దార్థతో కలిసి మెరిసారు. అప్పటి నుంచి ప్రారంభమైంది వీరిద్దరి మధ్య ప్రేమాయణం. వారిద్దరు కలిసి న్యూ ఇయర్ వేడు కలను లండన్‌లో జరుపుకు నేందు కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇద్దరూ కలిసి లండన్ షాపింగ్ చేయ డం, పార్టీల్లో పాల్గొనడం, ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ వేడులను జరుపుకొని మధురానుభూతులను పొందేందుకు సిద్దమయ్యారు. ఈ మధ్యన దీపికా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె కొంత నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో సిద్దార్థతో కలిసి లండన్‌లో కొద్ది రోజులు గడిపితే కొత్త ఉత్సాహంతో మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొనవచ్చని దీపికా భావిస్తున్నారు. ఇక దీపికా తన వెంట చాలు అంతకంటే మించిన ఆనందం మరోటి లేదని సిద్దార్థ అంటున్నారు.
మన దేశంలోని పలు టివి ఛానెల్స్‌లో ఈ మధ్యన రియాల్టీ షోలు హంగామా చేస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలను దృష్టిలో పెట్టుకొని పలు ఛానెల్స్ వెరైటీగా రియాల్టీ షోలను నిర్వహిస్తున్నాయి. ఈ రియాల్టీ షోలలో అన్నిటికంటే గొప్ప సక్సెస్‌ను సాధించింది మాత్రం బిగ్ బాస్. దీని హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక బిగ్ బాస్-4లో సెలబ్రిటీ గెస్ట్‌గా హాలీవుడ్ ‘అందాల’ తార, బేవాచ్ గర్ల్ పమేలా ఆండర్సన్ సెలబ్రిటీ గెస్ట్‌గా పాల్గొని అభిమానులకు కనువిందుచేశారు. ఇందుకోసం ఈ హాలీవుడ్ నటి పమేలా ముంబయ్‌కు విచ్చేశారు. ఆమె సెలబ్రిటీ గెస్ట్‌గా బిగ్ బాస్ 4 హౌస్‌లో మూడు రోజుల పాటు గడిపారు. పమేలా బిగ్ బాస్ షో కోసం ప్రత్యేకంగా తళుకులీనే తెల్లటి చీరను ధరించారు. జుంకాలు, గాజులతో పాటు ముఖానికి బింధీ ధరించి అభిమానులను మైమరపించారు. ఈ డ్రెస్సింగ్‌లో ఆమె యానా గుప్తా ఐటమ్ సాంగ్ ‘బాబూజీ జరా ధీరే చలో’ పాట మధ్య బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. అనంతరం ఆమె రెండు చేతులు జోడించి నమస్తే అంటూ హౌస్ మేట్స్ అందరినీ పలకరించి ఆకట్టుకున్నారు. మూడవ గెస్ట్‌గా ప్రవేశించిన పమేలాను చూసి ఈ షోలో పాల్గొన్నవారు ఆనందపడ్డారు. పమేలా ఆండర్సన్‌ను అకస్మాత్తుగాచూసి ఈ షోలో పాల్గొన్న అస్మిత్ పటేల్, హృషాంత్ గోస్వామిలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కలర్స్ టివి ఛానెల్‌లో ప్రసారమైన బిగ్ బాస్-4 షో పమేలా ఎంట్రీతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
ఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు తమ జీవిత భాగస్వామితో విడిపోయి సైతం వార్తల్లోకెక్కారు. ఇటువంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ ఉడ్స్ గురించి. ఆయన వివాహేతర సంబంధాలతో వార్తల్లోకెక్కారు. పలువురు మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్న అతని విషయం చివరికి భార్యకు తెలిసింది. దీంతో అతని భార్య టైగర్ ఉడ్స్ నుంచి విడాకులు తీసుకుంది. భార్య నుంచి దూరమైన అనంతరం టైగర్ ఉడ్స్ పశ్చాత్తాపపడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇక బ్రిటన్ సెలబ్రిటీ లిజ్ హర్లీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్‌వార్న్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భారతీయ సంతతికి చెందిన బిజినెస్ టైకూన్ అరుణ్ నాయర్‌ను పెళ్లి చేసుకున్న లిజ్ కొంతకాలం క్రితం నుంచి అతనితో సఖ్యతగా ఉండడం లేదు. చివరికి షేన్‌వార్న్‌తో జతకట్టింది లిజ్. ఈ జంట లండన్‌లోని ఓ హోటల్‌లో కొన్ని రోజులు కూడా గడిపారు. ఈ విషయం మీడియా ద్వారా బయటపడడంతో లిజ్ భర్త అరుణ్ నాయర్‌తో కొద్ది రోజుల నుంచే దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. షేన్‌వార్న్‌తో తన సంబంధం గురించి మాత్రం ఏమీ చెప్పలేదు.


వీణ వాయించే సిస్టర్స్ గురించి మనకి తెలుసు. కాని శాక్సోఫోన్‌పై రాగాలు పలికించే సిస్టర్స్ గురించి తెలుసా మీకు? 'అచ్చమైన పాశ్చాత్య పరికరం అది. దాన్ని సరిగ్గా పట్టుకోవడమే రాదు మన అమ్మాయిలకి' అని అనుకుంటున్నారా! అబ్బాయిల సంగీత పరికరంగా ముద్ర పడిన శాక్సోఫోన్‌ని అలవోకగా వాయించేస్తున్నారు ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు. వీళ్లు విదేశీయులు కాదు మన భారతీయులే. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లావణ్య, సుబ్బలక్ష్మి 'శాక్సోఫోన్ సిస్టర్స్'గా సంగీత ప్రపంచంలో స్థానం సంపాదించుకున్నారు.
దాంతో మన సంప్రదాయ సంగీతం పలికిస్తే చాలా బాగుంటుంది' అని ఆమె తన ఆశయాన్ని ఒక్క మాటలో చెప్పింది. బిడ్డ మాట కాదనలేక తండ్రి తన స్నేహితుడైన శాక్సోఫోన్ దిగ్గజం కద్రి గోపాల్‌నాథ్ దగ్గర శిక్షణ ఇప్పించారు.


