
పదిహేనేళ్ల వయసులోనే లావణ్య దృష్టి శాక్సోఫోన్‌పై పడింది. 'నువ్వు నేర్చుకోవాలంటే మన సంప్రదాయ సంగీత పరికరాలు ఎన్ని లేవు? ఎక్కడో ఆ విదేశీ వాయిద్యం ఎందుకు' అని చాలామంది ఆ ప్రయత్నానికి అడ్డుపడ్డారు. 'నేను చూపించే ఆసక్తి పాశ్చాత్య సంగీతంపై కాదు పరికరంపైన.

కుటుంబానికి పేరైతే ఉంది కాని ఆర్థికంగా ఉన్నవారేం కాదు. అయినా ఎంతో కష్టపడి శాక్సోఫోన్ నేర్చుకుంటున్న అక్క శ్రద్ధని ఆదర్శంగా తీసుకుంది చెల్లెలు సుబ్బలక్ష్మి. ఇద్దరూ కలిసి నేర్చుకున్నారు. కలిసి శాక్సోఫోన్‌తో మన దేశ సంప్రదాయ రాగాల్ని పలికించారు. చిన్న చిన్న కచేరీలతో మొదలైంది వీరి సంగీత ప్రయాణం. ఆ నోటా ఈ నోటా వీరి గురించి నలుగురికీ తెలిసింది.
కలర్స్ టీవీ చానెల్ వారు నిర్వహించిన 'ఇండియా హాజ్ గాట్ టాలెంట్' కార్యక్రమంలో పాల్గొనడంతో వారి ప్రతిభ దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. అప్పటి నుంచే దేశవ్యాప్తంగా వారికి ఆహ్వానాలు అందాయి. విదేశాల్లో వీరిచ్చే కచేరీలకు బోలెడంత డిమాండ్ పెరిగింది. తమ దేశ సంగీత పరికరంతో భారతీయ రాగాలు పలకిస్తున్న ఈ సిస్టర్స్‌ని వారు చక్కగా ఆదరిస్తున్నారు. దేశ, విదేశాల్లో ఈ శాక్సోఫోన్ సిస్టర్స్ ఇప్పటివరకూ 600 కచేరీలు ఇచ్చారు.
No comments:
Post a Comment