Thursday, December 9, 2010

ముడియెట్టు నాట్యం

mudiyett
ఇది కేరళీయులందరికీ ఎంతో గర్వకారణమైన రోజు. ప్రతి ఒక్కరూ గుండెలనిండా సంతోషంతో తమ సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపు లభించిన ఆనందాన్ని ఆస్వాదించే రోజు. భద్రకాళికా మాత శత్రుసంహారం జరిపే ఘట్టానికి ఆ ప్రాంత వాసులు ‘ముడియెట్టు’ ఉత్సవంగా జరుపుకుంటారు. ఇది చాలా పురాతనమైన సంస్కృతీయ కళలకు సంబంధించిన ఎంతో ఘనమైన ఆచారం. కేరళలోని మారుమూల పల్లె ప్రాంతవాసులు అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటారు ఈ ఉత్సవాన్ని. ముడియెట్టు ఉత్సవానికి ఇటీవలే అంతర్జాతీయ భద్రతా సంస్థలో భాగమైన అంతర్జాతీయ కళాసంస్కృతికి సంబంధించిన ‘యునెస్కో’ గుర్తింపు లభించింది. కేరళలోని తిరుస్సూర్‌ ప్రాంతంలో ఈ ‘ముడియెట్టు’ ఉత్సవాన్ని ప్రజలు భక్తిప్రపత్తులతో జరుపుకోవడం విశేషం. ఈ గుర్తింపు వెనక ‘నాట్యవేది’ సంస్థకు చెందిన కో-ఆర్డినేటర్‌ సి.కె.థామస్‌ కృషి అనిర్వచనీయమైనది.

mudiyettu1
కేరళ రాష్ట్రానికే గర్వకారణమైన ఈ నృత్యాన్ని ‘యునెస్కో’ దృష్టికి తీసుకెళ్లడమేగాక దానికి సంబంధించిన క్లిప్పింగ్స్‌, జనాభిప్రాయసేకరణ అవన్నీ సమీకరించి అంతర్జాతీయ స్థాయికి కృషిచేశారు థామస్‌. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించడంలో...థామస్‌ ఖర్చుకు వెనకాడక మధ్య ట్రావెన్కూర్‌లోని అన్ని భద్రకాళి గుళ్లలో ఈ‘ముడియెట్టు’ ఉత్సవానికి సంబంధించిన రికార్టులను, వాటి మూల చరిత్రను సంపాదించగలిగారు. ఈ ప్రయత్నంలో ఇదే సబ్జెక్టుపై పరిశోధనలు జరుపుతున్న సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో మీనాపౌల్‌ సహకారం తీసుకున్నారు. తమ ‘నాట్యవేది’ సంస్థ తరపున దాదాపు ఒక కోటి రూపాయల మేరకు ఖర్చుపెట్టి ఓ 5 సంవత్సరాలపాటు పరిశోధనలు సాగించారు. థామస్‌ ‘నాట్యవేది’ కో-ఆర్డినేటర్‌గానేగాక త్రిస్సూర్‌ దూరదర్శన్‌ కేంద్రానికి డైరెక్టర్‌గా కూడా చేస్తున్నారు. దీనితో ఆయనకు పరిశోధన విషయంలో ఏ మాత్రం ఆటంకాలు ఎదురుకాలేదు.

No comments:

Post a Comment