
ఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు చేసిన సందడి అభిమానులను ఉక్కిరిబిక్కిరిచేసింది. దీంతో సినీతారలు, మోడల్స్, క్రీడాకారులు, వ్యాపార ప్రముఖులు తదితర సెలబ్రిటీలు వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. బిగ్‌బాస్-4 రియాల్టీ షోలో పమేలా ఆండర్సన్ మొదలుకొని టెస్టుల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 50 సెంచరీలు, బాలీవుడ్లో సల్మాన్‌ఖాన్ టాప్ హీరోగా నిలిచి తమ అభిమానులకు మధురానుభూతులను పంచారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ ఏడాది వార్తల్లో ప్రముఖులుగా నిలిచి ఆకట్టుకున్నారు. అభిమానులను మైమరపించిన ఈ సెలబ్రిటీల గురించి తెలుసుకుందామా...
టెస్ట్ క్రికెట్లో 50 శతకాలతో రికార్డుల్లోకి...
క్రికెట్‌కు పర్యాయపదంగా మారారు సచిన్ టెండూల్కర్. ఈ మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్లో ఎవరెస్ట్ శిఖరంగా నిలిచారు. రెండు దశాబ్దాలుగా క్రికెట్ ఆడుతున్న సచిన్ ఎన్నో రికార్డులు సృష్టించారు. బ్యాటింగ్‌లో ఆయన సృష్టించిన రికార్డులు ఇప్పట్లో ఎవ్వరికీ సాధ్యం కాదు. సచిన్ ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్సింగ్‌లో సెంచరీ చేసి టెస్టుల్లో 50 శతకాలు చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా నిలిచారు. 50 సెంచరీలతో ఏ టాప్ బ్యాట్స్‌మన్‌కు అందనంత ఎత్తులో ఆయన నిలిచారు. ఇక టెస్టుల్లో 50 వ సెంచరీని ఆయన తన తండ్రికి అంకితమిచ్చారు. త్వరలోనే సచిన్ వన్డేల్లో కూడా 50 సెంచరీలను పూర్తి చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు చేసిన మొదటి క్రికెటర్‌గా నిలుస్తారు. ఈ రికార్డుకు చేరువలో సచిన్ ఉండడం మన దేశవాసులందరికీ గర్వకారణం.
బాలీవుగ్ టాప్ హీరోగా సల్మాన్ ఖాన్

ఈ ఏడాది బాలీవుడ్ టాప్ హీరోగా సల్మాన్ ఖాన్ నిలిచారు. సల్మాన్ ఇటీవలే 45వ బర్త్‌డే వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. సల్మాన్‌కు అమీర్‌ఖాన్‌కు ఉన్న యాక్టింగ్ స్కిల్స్, షారూఖ్ ఖాన్ వంటి చరిష్మా లేకున్నా ఈ ఏడాది ఆయన పలు హిట్ సినిమాలతో బాలీవుడ్ టాప్ హీరోగా నిలిచారు. ఈ ఏడాది సల్మాన్ నటించిన దబంగ్ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతోపాటు బిగ్ బాస్ సీజన్ 4లో యాంకర్‌గా చేసిన సల్మాన్‌కు ఎంతో పాపులారిటీ దక్కింది. బాలీవుడ్లో అమీర్‌ఖాన్, షారూఖ్ ఖాన్లు, సల్మాన్ ఖాన్లు ఖాన్ల త్రయంగా పేరుగాం చారు. ఈ ఏడాది ఖాన్ల త్రయంలో సల్మానే బెస్ట్‌గా నిలిచారు. ఇతర ఖాన్‌లకంటే తక్కువ వయస్సుగల ఈ బాలీవుడ్ కండలవీరుడు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని మానవతా వాదిగా సైతం పేరుతెచ్చుకున్నారు. బాలీవుడ్ ట్రేడ్ కన్సల్టెంట్ అమోద్ మెహ్రా మాట్లాడుతూ ‘ఈ ఏడాది బాలీవుడ్లో డబ్బింగ్ సినిమాలతో కలిసి 237 హిందీ సినిమాలు విడుదల య్యాయి. వీటన్నింట్లో నిజమైన సూపర్ హిట్ సినిమాలుగా నిలిచినవి మాత్రం దబంగ్, గోల్మాల్ 3 మాత్రమే. ఈ ఏడాది ఖానో మే ఖాన్ కౌన్ హై...అంటే నేను సల్మాన్ ఖాన్ అని చెబుతాను. సల్మాన్ నటించిన వీర్ సినిమా ఫెయిలైనప్పటికీ దబంగ్ సినిమాతో ఆయన టాప్‌స్టార్‌గా నిలిచారు’ అని ఆయన సల్మాన్‌ను పొగిడారు.
సల్మాన్‌ఖాన్‌తో పాటు గోల్ మాల్-3 సినిమా హీరో అజయ్‌దేవ్‌గన్ సైతం పాపులారిటీ సంపాదించుకున్నారు. దబంగ్, గోల్మాల్-3 సినిమాలు పెద్దమొత్తంలో కలె క్షన్లను తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది యంగ్ స్టర్ హీరోలు రణబీర్ కపూర్, ఇమ్రాన్ ఖాన్లు తమ హిట్ సినిమాలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.
పెళ్లితో ఆనందమయ జీవితంలోకి..

టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ను వివాహమాడి కొత్త జీవితంలోకి ప్రవేశించారు. దీంతో పాటు టెన్నిస్‌లో పలు విజయాలు ఆమెకు సంతోషాన్ని మిగిల్చాయి. ‘2010 సంవత్సరం నా జీవితంలోనే అదృష్టమైన సంవత్సరంగా భావిస్తాను. ముందుగా నా పెళ్లి షోయబ్‌తో జరగడంతో నా జీవితంలో ఆనం దం వెల్లివిరిసింది. ఇక ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో మెడల్స్ గెల్చుకోవడం సంతోషాన్నిచ్చింది. దీంతో పాటు దుబాయ్‌లో జరిగిన ఇంటర్నే షనల్ టెన్నిస్ ఫెడరేషన్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాను. వీటన్నింటితో ఈ ఏడాది నాకు అదృష్ట సంవత్సరంగా మారింది. గాయంనుంచి కోలుకొని గత కొన్ని నెలలుగా టెన్నిస్‌లో మళ్లీ పుంజుకొని విజయాలు సాధించడం నాకు ఊరటనిచ్చింది. వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కూడా నా ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను’ అని సానియా పేర్కొన్నారు. ‘షోయబ్ సహకారం, ప్రోత్సాహం నాకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఇటీ వల ఢిల్లీలోని ఓ టెన్నిస్ అకాడమీని సందర్శించాను. అక్కడ పలువురు యువ తులు టెన్నిస్ ఆడుతూ కనిపించడం గొప్పగా అనిపించింది. యువకులకు ధీటుగా యువతులు సైతం నేడు మనదేశంలో టెన్నిస్‌లో రాణిస్తుండడం శుభ పరిణామం. చిన్నతనంలో టెన్నిస్ నేర్చుకుంటున్న ప్రారంభంలో నా తల్లిదండ్రులు సైతం టెన్నిస్ నేర్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. చివరికి పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేసుకోవాల్సిన అమ్మాయిలకు స్పోర్ట్స ఎందుకనే వారు నేడు చాలా మంది ఉన్నారు. కానీ కేవలం భర్త, పిల్లలు, ఇల్లే కాదు క్రీడల్లోకూడా మహిళలు రాణించాల్సిన అవసరం ఉంది’ అని సానియా పేర్కొ న్నారు. ‘నన్ను పూర్తిగా అర్థం చేసుకునే భర్త షోయబ్ నాకు దక్కడం నా అదృ ష్టంగానే భావిస్తాను.
మేమిద్దరు క్రీడల్లో ఉన్నందున ఆయన నా సమస్యలను సులభంగా తెలుసుకొని ప్రోత్సహిస్తున్నారు’ అని ఆమె చెప్పారు. ‘టెన్నిస్‌లో సింగిల్స్‌తో పాటు డబుల్స్ గేమ్స్ కూడా ఆడుతున్నాను. . నా దృష్టిలో అయతే ర్యాకింగ్స్ కేవలం నెంబర్స్ మాత్రమే. చక్కగా ఆడుతూ ముందుకు వెళ్తుంటే మంచి ర్యాంకింగ్స్ వాటంతట అవే వస్తాయి. ఎప్పటివరకైతే పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యవంతంగా ఉంటానో అప్పటి వరకు విజయాలు సాధిస్తాను. టెన్నిస్‌లో కొనసాగుతాను’ అని సానియా ధీమాగా చెప్పారు.
సెలబ్రిటీ జంటగా దీపికా, సిద్దార్థ మాల్యా...

దేశంలోని కోటీశ్వరులలో ఒకరైన విజయ్‌మాల్యా గురించి తెలియని వారుండరు. ఆయన లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమానిగా ప్రపంచ ప్రసిద్దిగాంచారు. ఐపిఎల్ ట్వంటీ ట్వంటీ క్రికెట్లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ టీం యజమాని కూడా విజయ్‌మాల్యానే. ఇక విజయ్‌మాల్యా తనయుడు సిద్దార్థ మాల్యా తండ్రి వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడు. సిద్దార్థ ఐపిఎల్‌లో తమ టీం బెంగళూర్ క్రికెట్ మ్యాచుల్లో కనిపించి సందడిచేశారు. బెంగళూర్ జట్టుకు సెలబ్రిటీ సపోర్టర్‌గా ఉన్న బాలీవుడ్ అందాలతార దీపికా పదుకునే సైతం ఐపిఎల్ మ్యాచుల్లో సిద్దార్థతో కలిసి మెరిసారు. అప్పటి నుంచి ప్రారంభమైంది వీరిద్దరి మధ్య ప్రేమాయణం. వారిద్దరు కలిసి న్యూ ఇయర్ వేడు కలను లండన్‌లో జరుపుకు నేందు కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇద్దరూ కలిసి లండన్ షాపింగ్ చేయ డం, పార్టీల్లో పాల్గొనడం, ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ వేడులను జరుపుకొని మధురానుభూతులను పొందేందుకు సిద్దమయ్యారు. ఈ మధ్యన దీపికా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె కొంత నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో సిద్దార్థతో కలిసి లండన్‌లో కొద్ది రోజులు గడిపితే కొత్త ఉత్సాహంతో మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొనవచ్చని దీపికా భావిస్తున్నారు. ఇక దీపికా తన వెంట చాలు అంతకంటే మించిన ఆనందం మరోటి లేదని సిద్దార్థ అంటున్నారు.
బిగ్ బాస్‌లో పమేలా సందడి...

మన దేశంలోని పలు టివి ఛానెల్స్‌లో ఈ మధ్యన రియాల్టీ షోలు హంగామా చేస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలను దృష్టిలో పెట్టుకొని పలు ఛానెల్స్ వెరైటీగా రియాల్టీ షోలను నిర్వహిస్తున్నాయి. ఈ రియాల్టీ షోలలో అన్నిటికంటే గొప్ప సక్సెస్‌ను సాధించింది మాత్రం బిగ్ బాస్. దీని హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక బిగ్ బాస్-4లో సెలబ్రిటీ గెస్ట్‌గా హాలీవుడ్ ‘అందాల’ తార, బేవాచ్ గర్ల్ పమేలా ఆండర్సన్ సెలబ్రిటీ గెస్ట్‌గా పాల్గొని అభిమానులకు కనువిందుచేశారు. ఇందుకోసం ఈ హాలీవుడ్ నటి పమేలా ముంబయ్‌కు విచ్చేశారు. ఆమె సెలబ్రిటీ గెస్ట్‌గా బిగ్ బాస్ 4 హౌస్‌లో మూడు రోజుల పాటు గడిపారు. పమేలా బిగ్ బాస్ షో కోసం ప్రత్యేకంగా తళుకులీనే తెల్లటి చీరను ధరించారు. జుంకాలు, గాజులతో పాటు ముఖానికి బింధీ ధరించి అభిమానులను మైమరపించారు. ఈ డ్రెస్సింగ్‌లో ఆమె యానా గుప్తా ఐటమ్ సాంగ్ ‘బాబూజీ జరా ధీరే చలో’ పాట మధ్య బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. అనంతరం ఆమె రెండు చేతులు జోడించి నమస్తే అంటూ హౌస్ మేట్స్ అందరినీ పలకరించి ఆకట్టుకున్నారు. మూడవ గెస్ట్‌గా ప్రవేశించిన పమేలాను చూసి ఈ షోలో పాల్గొన్నవారు ఆనందపడ్డారు. పమేలా ఆండర్సన్‌ను అకస్మాత్తుగాచూసి ఈ షోలో పాల్గొన్న అస్మిత్ పటేల్, హృషాంత్ గోస్వామిలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కలర్స్ టివి ఛానెల్లో ప్రసారమైన బిగ్ బాస్-4 షో పమేలా ఎంట్రీతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
జీవిత భాగస్వామితో విడిపోయి...

ఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు తమ జీవిత భాగస్వామితో విడిపోయి సైతం వార్తల్లోకెక్కారు. ఇటువంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ ఉడ్స్ గురించి. ఆయన వివాహేతర సంబంధాలతో వార్తల్లోకెక్కారు. పలువురు మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్న అతని విషయం చివరికి భార్యకు తెలిసింది. దీంతో అతని భార్య టైగర్ ఉడ్స్ నుంచి విడాకులు తీసుకుంది. భార్య నుంచి దూరమైన అనంతరం టైగర్ ఉడ్స్ పశ్చాత్తాపపడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇక బ్రిటన్ సెలబ్రిటీ లిజ్ హర్లీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్‌వార్న్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భారతీయ సంతతికి చెందిన బిజినెస్ టైకూన్ అరుణ్ నాయర్‌ను పెళ్లి చేసుకున్న లిజ్ కొంతకాలం క్రితం నుంచి అతనితో సఖ్యతగా ఉండడం లేదు. చివరికి షేన్‌వార్న్‌తో జతకట్టింది లిజ్. ఈ జంట లండన్‌లోని ఓ హోటల్లో కొన్ని రోజులు కూడా గడిపారు. ఈ విషయం మీడియా ద్వారా బయటపడడంతో లిజ్ భర్త అరుణ్ నాయర్‌తో కొద్ది రోజుల నుంచే దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. షేన్‌వార్న్‌తో తన సంబంధం గురించి మాత్రం ఏమీ చెప్పలేదు.