నాట్య మయూరి.. సుధా చంద్రన్.
పదిహేడో ఏట కుడికాలును పోగొట్టుకుంది రోడ్డు ప్రమాదంలో. నాట్యమే ఊపిరిగా, జీవిత గమ్యంగా ఎంచుకుని, ఎంతో కృషి చేసి టీనేజ్లోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన ఆమెకు కుడికాలు పోవటం ఎంత దురదృష్టకరమో ఒక్క క్షణం ఆలోచించండి. ప్రఖ్యాత గాయకులకు గొంతు పోవటం. పేరున్న పెయింటర్లకు చూపు పోవటం, రచయితలకు మతి పోవటం ఎంత అన్యాయమో కదా! ఎవర్ని ప్రశ్నించాలి ఈ అన్యాయాల గురించి, విధి లీలల్ని గురించి. మూగబోయిన భగవంతుణ్ణా..? వక్రించిన విధినా...? నూటికి తొంభై తొమ్మిది మందికి ఎవర్ని ప్రశ్నించాలో, సమాధానాలు రాబట్టుకోవాలో తెలియక నిరాశా నిస్పృహలకు లోనయి జీవితాసక్తి కోల్పోతారు. మిగిలిన ఆ ఒక్క వ్యక్తి మనకు ధైర్యానికి, ఆత్మ స్థైర్యానికి ప్రతీకగా నిలిచి మార్గదర్శకులవుతారు. మానవ మనుగడకు, పురోగతికి వారే మూల స్తంభాలు. అలాంటి వ్యక్తే సుధా చంద్రన్.
ఏకలవ్యుణ్ణి ద్రోణాచార్యుడు గురు దక్షిణగా తన కుడిచేతి బ్రొటన వేలును కోసి కానుకగా ఇమ్మన్నట్లుగా దేవుడు కుడికాలును కోసి దక్షిణగా ఇమ్మన్నట్లుగా తోచి ఉండాలి సుధకి తన కుడి కాలును తీసేస్తున్నప్పుడు. కుడి మోకాలుకి పదిన్నర అంగుళాల కింద నుంచి ఆమె కాలుని పూర్తిగా తీసేసాడు. విధి క్రూరానికి ఎంతో షాకై ఉండాలి సుధా చంద్రన్. షాక్ నుంచి కోలుకున్న సుధా చంద్రన్ చెక్క కాలుతో, క్రచెస్‌తో తన జీవితాన్ని తిరిగి జీవించటం మొదలు పెట్టింది. కాలేజ్‌కి తిరిగి వెళ్లటం మొదలైంది.
ఆ గడ్డు సమయంలో ఆమెకు గొప్ప ఊరట, ధైర్యాన్ని ఇచ్చింది ఆమె తండ్రి. తల్లీ కొడుకులు, తండ్రీ కూతుళ్ల అనుబంధం ఎంతో అపురూపమైంది కదూ! ఈ యాక్సిడెంట్ జరిగిన ఆర్నెళ్లకు ఓ పత్రికలో చదివింది జైపూర్‌లోని డాక్టర్ సేథీ కృత్రిమ కాళ్లను తయారు చేసి అమరుస్తున్నాడని, ఈ కాళ్లను అమర్చుకున్న వాళ్లు అన్ని పనులు స్వయంగా చేసుకోవచ్చని. అణగారిన ఆశలు మళ్లీ చిగురించాయి. తను మళ్లీ డాన్స్ చేయగలుగుతుంది అని. స్వర్గ సుఖాలు పొందినంత ఆనందం కలిగి ఉండాలి ఆ ఘడియల్లో సుధా చంద్రన్ కి. వెంటనే డాక్టర్ సేథీకి ఉత్తరం రాసింది తన సమస్య గురించి, అవసరాల గురించి. తండ్రితో కలిసి జైపూర్ వెళ్లి డాక్టర్ సేథీని కలుసుకుంది. తను మళ్లీ నడవగలదని డాక్టర్ సేథీ అన్నాడు మరి డాన్సో? కృత్రిమ పాదాలను అమర్చుకొని శ్రామికుడు చెట్టు ఎక్కగలుగుతున్నప్పడు డ్రైవరు డ్రైవింగ్ చేయగలిగినప్పుడు నీకు డాన్స్ చేయటం ఏమంత కష్టం కాదన్నాడు డాక్టర్ సేథీ. దీన్నో చాలెంజ్‌గా తీసుకుని కొన్నాళ్లలో కృతిమ పాదం అమర్చాడు సుధా చంద్రన్ కుడికాలుకి.
అప్పుడే మొదలైంది అసలు సంగ్రామం. కృత్రిమ పాదంతో నడక నేర్చుకొన్నాక నాట్యం మొదలుబెట్టింది. విపరీతమైన నొప్పి, రక్తం కారటం. డాన్స్‌కి ఈ లెగ్ పనికి రాదేమోనన్న సందేహం. డాక్టర్ సేథీ తన మనిషిని పంపాడు సుధా చంద్రన్‌కి సహాయం చేయటానికని. ఆమె డాన్స్ కదలికలకు అనుకూలంగా కృత్రిమ పాదాన్ని సరిచేసే వాడాయన. అయినా సమస్య సమసిపోలేదు. విపరీతమైన నొప్పి, రక్తం కారటం అలాగే ఉండిపోయినాయి. మళ్లీ జైపూర్ ప్రయాణం, ఈ సారి తన డాన్స్ టీచర్‌తో. సుధా చంద్రన్ డాన్స్ మూవ్‌మెంట్స్‌కి అనుగుణంగా మరో పాదం చేసి అమర్చాడు డాక్టర్ సేథీ. అమర్చి నేను చేయగలిగినంతా చేశాను.. ఇక మిగతాదినే కృషేనన్నాడు. తిరిగి కొత్త పాదంతో నృత్యం ప్రాక్టీసు మొదలుపెట్టింది. మళ్లీ అవే సమస్యలు.. భరించలేని నొప్పి, రక్తస్రావం. అయినా పట్టు విడవని విక్రమార్కుడిలాగా ప్రాక్టీస్ విడువలేదు. నొప్పి ముఖం మీద కనబడనీయకుండా అలవాటు చేసుకుంది. కాలక్రమేణా నొప్పి, రక్తస్రావం ఆగాయి. సుధా చంద్రన్ కలలు సాకారమయ్యే తరుణం ఆసన్నమైంది. తిరిగి జీవితంలో డాన్స్ చేయలేననుకొన్న సుధా చంద్రన్ మళ్లీ నాట్య ప్రదర్శనకు సిద్దమైంది.
జనవరి 28, 1984.. తనకు యాక్సిడెంట్ జరిగిన మూడేళ్లలోపే తిరిగి నాట్య ప్రదర్శనకు సిద్దమైంది సుధా చంద్రన్. అయితే చిన్న చిక్కుంది ఇక్కడ. యాక్సిడెంట్ జరగక ముందు ఎన్నో ప్రదర్శనలిచ్చి ఓ గొప్ప నృత్య కళాకారిణిగా పేరు ప్రఖ్యాతులార్జించింది. వాటితోపాటు ఎన్నో బిరుదులు, సన్మానాలు.. నృత్య మయూరి, నవ జ్యోతి వగైరాలు. తన కృత్రిమ పాదంతో తిరిగి నాట్యం చేసి తాను గతంలో సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను నాశనం చేసుకోదు కదా? అసలు తన కృత్రిమ పాదంతో గతంలో లాగా బాగా నాట్యం చేయగలదా? సందేహాల వెల్లువ. అయితే అమితమైన ఆత్మ స్థైర్యం 'నేను సాధించగలను' అనే అచంచలమైన విశ్వాసం. ఆమెను తిరిగి స్టేజీ మీద అడుగు పెట్టేలా చేసినాయి. 1984 జనవరి 28నాడు సుధా చంద్రన్ తన కృత్రిమ కుడి పాదంతో భరత నాట్యం మొదలుపెట్టింది. నాట్యంలో పూర్తిగా మునిగిపోయి తనకు కృత్రిమ పాదం ఉన్నదనే సత్యాన్నే మరిచిపోయి పురి విప్పిన మమూరిలాగా ఎంతో హృద్యమంగా, ఎంతో వేగంగా డాన్స్ చేసింది. డాన్స్ ముగించింది. ఒక్క క్షణం నిశ్శబ్దం ఆడిటోరియంలో తమ కళ్ల ముందు జరిగింది నిజమా కలా ? అంతే మరుక్షణం చప్పట్లతో, ప్రశంసలతో ఆ ప్రదేశం మార్మోగిపోయింది.
సుధా చంద్రన్ కల నిజమైంది. మనిషి తలచుకుంటే అసాధ్యాలంటూ ఏవీ లేవని మరోసారి నిరూపించబడింది. ఆ నాట్య ప్రదర్శనను ఒక అద్భుతంగా గొప్ప అనుభూతిగా అసాధారణ విజయంగా వర్ణించినాయి పత్రికలు. స్టార్ మారిపోయింది సుధా చంద్రన్ క్షణాల్లో. అంతే కాదు ఆమె జీవిత గాధ ఆధారంగా మయూరి అనే సినిమా మొదలైంది. అందులో ఆమె కథానాయిక. గొప్ప సంచలనం సృష్టించింది ఈ సినిమా యావద్దేశంలో. ఇప్పుడో క్షణం ఆగి ఒక్కసారి సుధా చంద్రన్ చరిత్రను పునరావృతం చేసుకొని ఆలోచించి చూడండి. మనకు నిజానికి అసాధ్యాలంటూ ఏవైనా ఉంటాయా ?

మనసా వాచా కర్మణా ఏమైనా సాధించాలి మనం కోరుకుని శ్రమిస్తే, ఆ కలలు సాకారం కాకుండా ఉంటాయా ? సుధా చంద్రన్ పోరాటం ఆమె విజయాలు గగుర్పాటు కలిగించేవి. ఆమె ఒక గొప్ప నర్తకే కాదు అంతకన్నా గొప్ప ఫైటర్. తిరిగి గతంలోలాగానే అంతే అద్భుతంగానే నాట్య ప్రదర్శనలివ్వాలని ఆమె చేసిన పోరాటం, ఆమె చూపిన ధైర్యసాహసాలు, ఆమె ఆత్మ విశ్వాసం, ఆమె సాధించిన విజయాలు మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి ఎంతో కాలం. వచ్చే వారం మరో విశిష్ట వ్యక్తి విజేత సర్ రోజర్ బెన్నిస్టర్ని కలుసుకుందాం. ఈయన జీవిత గాధ కూడా ఎంతో స్ఫూర్తినిచ్చేదే. అసాధ్యాలంటూ ఏవీ లేవని చెప్పేదే...
- ఎజి కృష్ణమూర్తి
Sudha Chandran, is an Indian actress, who was born in 1964. She is a dancer who lost her leg in an accident in 1982.
In 1984, based on her life and how she overcame the loss of a leg, the Telugu movie Mayuri was released. She starred in the movie. It won the Special Jury Award at the National Film Award ceremony. The same movie, retaining her in the lead, was released in Hindi as Naache Mayuri (1986).

కానీ నా లోపల దాగున్న తృష్ణని మాత్రం ఏ మాత్రం నెరవేర్చుకోలేకపోయాను. నేను ఏంటో తెలుసుకోవాల్సిన సమయం అనిపించింది. నాకు సంతోషం కలిగించే అంశం ఏంటి అని? నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అప్పుడే అనిపించింది నాకు సంతో షాన్ని కలిగించే అంశం సంగీతం ప్రస్తుతం నా జీవితంలో అది లేదు. అప్పుడే మొదలైంది సంగీత విద్యార్థిగా. ఎంతో గొప్ప గొప్పవారి దగ్గరికి వెళ్ళి క్లాసికల్, హిందుస్థానీ సంగీతాన్ని తెలుసుకున్నాను. పండిట్ గిరిష్ వాజాల్వర్ వంటి వారి తో కలిసి పనిచేశాను. ఆయన నాకు అసలు గురువు. వీణ సహస్ర బుద్ధే దగ్గర, శుభ్ర గుహ, పండిట్ విజయ్ కిచ్లు దగ్గర కూడా దీన్ని నేర్చుకున్నాను’ అని చంద్రిక చెబుతోంది.
మీ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నా రా? అని చంద్రికను అడిగితే ‘ఇదో గౌరవం. అసలు ఎంపిక అవ్వడమే ఎంతో గర్వంగా అనిపించింది.కలలో కూడా అనుకోలేదు. నేను ఏదో అవార్డు వస్తుంది.. తెచ్చుకోవాలని అనే ఆశతో అయితే పని చేయలేదు.భవిష్యత్తులో దాని కోసం ప్రయత్నించే దా న్ని. కానీ ఇప్పుడే వ స్తుందని మాత్రం అ నుకోలేదు’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. 
వేసవి సెలవుల్లో సదన్ సూపరింటెండెంట్ వాళ్లతోనే ఉంటూ టైపింగ్‌ను నేర్చుకుంది జ్యోతి. అక్కడ టెన్త్ పూర్తయిన తర్వాత టీచరు ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో ఒకేషనల్‌కోర్సులో చేరితే అది పూర్తయిన తర్వాత కాని తెలియలేదు జ్యోతికి... ఆ కోర్సుతో టీచర్ ఉద్యోగం రాదని! జ్యోతి హతాశురాలయ్యింది. చదువుకుంటానని మొత్తుకుంది. కాని ఇంట్లో వినకుండా పెళ్లి చేసేశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అత్తగారి కుటుంబం జ్యోతి కుటుంబానికి దగ్గరి బంధువులే అయినా అప్పటిదాకా పెరిగిన హాస్టల్ జీవితానికి పూర్తిగా భిన్నంగా అనిపించిందామెకు. వ్యవసాయ కుటుంబం కావడంతో పనులు చేయడానికి పిల్లలను ఇంటిదగ్గరే వదిలిపెట్టి పొలం దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. ఏ పని చేస్తున్నా సరే ఏదో వెలితి ఆమెను వెన్నాడటం మానలేదు. అప్పుడే నేషనల్ సర్వీస్ వాలంటీర్ నోటిఫికేషన్ రావడంతో అతికష్టం మీద జ్యోతి అందులో చేరింది. ఉద్యోగరీత్యా జిల్లా అంతా తిరగాల్సి వచ్చేది. దాంతో వరంగల్‌కు మకాం మార్చి ప్రత్యామ్నాయాల అన్వేషణలో పడింది. ఎలాగో టైలరింగ్ నేర్చుకుని లంగాలు కుట్టి దుకాణాలకిచ్చేది. అప్పుడే టైపింగ్ పరీక్ష కూడా పాసయ్యారు. అప్పుడు వచ్చిన ఓ ఆలోచన ఆమె జీవితాన్నే మలుపుతిప్పింది.
ఆడపిల్లగా పుట్టినంత మాత్రాన జీవితాంతం తండ్రి, భర్త, పిల్లలు ఇలా ఎవరో ఒకరిపై ఆధారపడుతూనే ఉండాలా? లింగ భేదానికి అతీతంగా ప్రతివారు పనిచేయాలి. ఎవరిమీదా ఆధారపడకూడదు. అలాగని కుటుంబ సంబంధాలు, ప్రేమానురాగాల్లేకుండా ఉండాలనేది నా అభిమతం కాదు. పని సంస్కృతికి ప్రతి గ్రామీణ మహిళా అలవాటు పడాలి. ఇందుకోసం గ్రామీణప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వనరులను గుర్తించి, శిక్షణ, ఉపాధి వంటి వాటికోసం నా శక్తిని, అనుభవాన్ని ఉపయోగించాలని ఉంది.
ఐశ్వర్యవంతులు తమ సరదాల కోసం లలు, కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు. తమకేదేమైనా ఇష్టమైతే ఎంత ఖరీదైనా కొనుగోలు చేసేందుకు వెనుకాడరు.అది ఒక పడవ కావచ్చు, విమానం కావచ్చు లేదా ద్వీపమే కావచ్చు. అది ఏదైనా సరే వారి మనసు దాని పైకి మళ్లిందో అది వారి స్వంతం కావలసిందే. ఇటువంటి కొందరు బిలియనీర్ల గురించి తెలుసుకుంటే అమ్మో...అనకుండా ఉండలేము.
బిలియనీర్ సోదరులలో పెద్దవాడైనా ముఖేష్ అంబానీ లాగే అనిల్ అంబానీకి సైతం కొన్ని రకాల ఇష్టాలున్నాయి. అనిల్ అంబానీకి స్పీడ్‌గా వెళ్లే కార్లంటే ప్రాణం. వేగంగా వెళ్లే ఆరు లగ్జరీ కార్లను ఆయన కోట్ల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేశారు. లాంబ్రోగిని గల్లార్డో, మెర్సీడీజ్ ఎస్ క్లాస్, మేబ్యాచ్, బిఎండబ్ల్యూ 7 సీరీస్, అడీ క్యూ7, రాల్స్ రా యిస్, పోర్స్చ్, లెక్సస్ వంటి ఖరీదైన కార్లు ఆయన వద్ద ఉన్నాయి. మన దేశంలో ఇంతటి ఖరీదైన కార్లు మరెవరి దగ్గరి కూడా లేవంటే అతి శయోక్తి కాదు.ఈ విలాసవంతమైన కార్ల కోసం ఆయన తన నివాసం వద్ద ఓ ప్రత్యేక గ్యారేజీని కూడా ఏర్పాటుచేసుకున్నారు.
ఈ మాట అనగానే అందరికీ గుర్తొచ్చేది లిక్కర్ కింగ్ విజయా మాల్యా అని. ఈ ఐశ్వ ర్యవంతుడు విలాస వంతమైన మనిషిగా పేరు గాంచారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత కూడా అయిన ఈ బిలియ నీర్కు విలాసవంతమైన బోట్లు అంటే ఎంతో ఇష్టం. ఆయన ఇటీవల 450 కోట్ల రూపాయలను వెచ్చించి ఖతారి రాయల్స్ 95 మీటర్ల బోటును కొన్నారు. ఇండియన్ ఎంప్రెస్‌ని దీనికి పేరుపెట్టారు. నీటిపైన తేలియాడే ఖరీదైన ఈ ప్యాలెస్ బోటును ఎంతో అం దంగా నిర్మించారు.ఇందులో ప్రఖ్యాత ఆర్టిస్ట్‌లు రెనాయిర్, చగల్ పెయింటిం గ్స్‌ను ఏర్పాటుచేయడం విశేషం.
రియల్ ఎస్టేట్ మొగల్‌గా పేరుగాంచిన సన్నీ దీవాన్ దేశంలోని టాప్ బిలియనీర్లలో ఒకరిగా నిలుస్తారు.ఈ బిలియనీర్ 527 కోట్ల రూపాయలతో ఫెర్రెట్టీ 881 బోటును కొన్నారు. 90 అడుగుల ఈ బోటులో విలాసవంతమైన సౌకర్యాలెన్నో ఉన్నాయి. అత్యాధు నిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ బోటు సముద్రంలో వేగంగా దూసుకెళ్తుంది. సముద్రంపై షికారుకెళ్లే సన్నీ దీవాన్ తర చుగా తన బోటును గేట్‌ఆఫ్ ఇండియా వద్ద పార్క్ చేస్తుం టారు. ఈ బోటును తిలకించేందుకు పర్యాటకులు అక్క డికి వస్తుంటారు.బాగున్నాయి కదూ మన వారి టేస్టులు? ఏమైనా పైసా మె హై పరమాత్మ.