Thursday, October 14, 2010

‘టైగర్‌ రతన్‌’

నేను పులి పిల్లను
money_magic
అతికొద్దిమంది మహిళా ఫండ్‌ మేనేజర్లలో ఒకరిగా వుంటూ ‘టైగర్‌ రతన్‌’ను స్థాపించి అందరి ప్రశంసలు అందుకుంటోంది నేహా చోప్రా. ఆర్థిక రంగానికి సంబంధించి భిన్నమైన వ్యూహం, వ్యవహార శైలిని అవలంబిస్తూ ముందుకెళ్తోంది. ఆ రంగంలో తలెత్తే మార్పులు, నిశితమైన విశ్లేషణ, పరిశోధనల ఆధారంగా పనిచేయడం వల్లే విజయాలు సాధిస్తున్నట్లు చెబుతోంది.

ప్ర.కొద్దిమంది ఫండ్‌ మేనేజర్లలో ఒకరుగా ఉండడం ఎలా అనిపిస్తోంది?
జ. మిహళనవడం ఒక అవరోధంగా ఎప్పుడూ భావించలేదు. చాలా కాలంగా పురుష ప్రపంచంలోనే ఉన్నాను కదా! అంతకు పూర్వం ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంకర్‌గా కృషిచేశాను. నేనెప్పుడూ ఈ విషయాల గురించి కలత చెందలేదు.కొద్దిమంది మహిళల్లో నేనొకదానై్ననందుకు నన్నందరూ ప్రశంసి స్తున్నారు.పురుషుడినైవుంటే అభినందనలు దక్కేవి కావు కదా!

ప్ర. వార్టన్‌ నుంచి 21 ఏట ఎం.బి.ఎ పూర్తి చేశారు. అంత చిన్న వయసు ఇంత పెద్ద విజయాన్ని ఎలా సాధించారు?
జ.వార్టన్‌ యూనివర్శిటీలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ చదువుతున్నపుడు మంచి మార్కులు వచ్చేవి. కనుక జూనియర్‌గా వున్నపుడే టీచింగ్‌ అసిస్టెం ట్‌గా పనిచేశాను. మూడు ఫైనాన్సు క్లాసులు చెప్పేదాన్ని.నిజానికి అప్పటికే ఎంబిఎ విద్యార్థులకు పాఠాలు చెప్పినట్లే. వేసవి సెలవల్లో గోల్డ్‌మాన్‌ సాక్స్‌ లో వారి ఎలీట్‌ మెట్రిక్యులేషన్‌ కార్యక్రమంలో భాగంగా పనిచేశాను. నాకు వచ్చిన మంచి గ్రేడ్లు, చిన్న వయసులోనే టీచింగ్‌ అసిస్టెంట్‌గా అనుభవం గడించడం, ఎంతో పేరున్న ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ అయిన గోల్డ్‌మాన్‌ సాక్స్‌లో అనుభవం వల్ల వార్టన్‌ విశ్వ విద్యాలయంలో ఎంబిఎ పాసయ్యాను.

ప్ర.అమెరికా చదువు వల్ల అదనపు ప్రయోజనం వుందనుకుంటున్నారా?
జ. అమెరికా చదువు ప్రత్యేకించి ఏలాటి ప్రయోజనాన్ని సమకూరుస్తుందని నేనకోవడంలేదు. పట్టుదల, కృషి విజయానికి మూలస్తంభాలని భావిస్తు భావిస్తున్నాను.మనం సాధించాలనుకున్నదానిపైనే దృష్టి కేంద్రీకరించాలి. మీ మక్కువను చూరగొన్న విషయంపై కృషి చేస్తే తప్పకుండా అద్భుతమైన విజయం సాధించవచ్చు.

ప్ర. యు.బి.ఎస్‌.లో మీరు పనిచేస్తున్నపుడు మీరు వయసు రీత్యా చాలా చిన్న అసిస్టెంట్‌ అవడం మూలాన ఎవైనా ఇబ్బందులు ఎదురైనట్లు భావిస్తు న్నారా?
జ. వయసులో చాలా చిన్న వారవడాన్ని ఒక అనుకూలమైన విషయంగా భావించి వ్యవహరించాలి. మన పట్ల చాలామంది సహాయపూర్వక వైఖరి అవలంబిస్తారు. అది నాకెంతో ఇష్టం. ఇంకా, ప్రతిభే ప్రధానంగా ఉన్న చోటే నేను పనిచేశాను. వయసు పరిమితులు విధించే అంశంకాదు. చేసేపని బాగా చేయగలిగే అసలు వయసొక అడ్డంకే కాదు. మన విజ్ఞానాన్ని ప్రతిభను రుజు వు చేస్తే వయసు అప్రస్తుతం అయిపోతుంది.

ప్ర. ప్రపంచంలోకెల్లా అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్లు జూలియన్‌ రాబర్ట్సన్‌తో మీ సంస్థకు అనుబంధం వుంది. ఇప్పుడు మీరు మీ సొంత హెడ్జ్‌ ఫండ్‌ సంస్థ ‘‘టైగర్‌ రతన్‌’’ నెలకొల్పారు. దీని గురించి కాస్త వివరిస్తారా?
జ. నేను పులి పిల్లను. నా సొంత హెడ్జ్‌ ఫండ్‌ సంస్థ ప్రారంభించే అవకాశం రాబర్ట్సన్‌ ఇచ్చారు. 2008లో మా స్నేహితులు, మా కుటుంబ వ్యాపారాలను నిర్వహించడం ప్రారంభించాను. ఒక ఏడాది అయిన తరువాత మే 2009లో టైగర్‌ రతన్‌ నెలకొల్పాను. మొదటి 12 నెలల్లో 32 శాతం సాధించింది. కనీసం 1 మిలియన్‌ డాలర్లు ఉండాలి. ఇప్పుడు ఇతరులు కూడా పెట్టుబడి పెట్టేట్లు ఫండ్‌ను వెలుపలి ఇన్వెస్టర్లకు తలుపులు తెరుస్తున్నాం. ఆర్థికరంగం చతికిలబడివున్నపుడు కూడా మా సంస్థ బాగా పనిచేసింది. ఇతర కంపెనీ లతో పోలిస్తే మాది భిన్నమై వ్యూహం వ్యవహార శైలి. తలెత్తే మార్పులు, నిశితమైన విశ్లేషణ, పరిశోధనల ఆధారంగా టైగర్‌ రతన్‌ నమూనా పనిచేస్తుంది.

ప్ర.కొద్దిమంది ఫండ్‌ మేనేజర్లలో ఒకరుగా ఉండడం ఎలా అనిపిస్తోంది?
జ. మిహళనవడం ఒక అవరోధంగా ఎప్పుడూ భావించలేదు. చాలా కాలంగా పురుష ప్రపంచంలోనే ఉన్నాను కదా! అంతకు పూర్వం ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంకర్‌గా కృషిచేశాను. నేనెప్పుడూ ఈ విషయాల గురించి కలత చెందలేదు. కొద్దిమంది మహిళల్లో నేనొకదానై్ననందుకు నన్నందరూ ప్రశంసి స్తున్నారు.పురుషుడినైవుంటే అభినందనలు దక్కేవి కావు కదా!

No comments:

Post a Comment