కూచిపూడి నృత్యకళాకారిణి అరుణిమా కుమార్ గురించి కళాభిమానులకు ప్రత్యేక పరిచయం అవస రంలేదు. కూచిపూడి నృత్యానికి అరుణిమ చేస్తున్న సేవ అమెకు అంతర్జాతీయంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. తోమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆమ్రపాలి పాత్రలో బ్యాలెట్ ప్రదర్శన నిచ్చి కళాప్రియులను అలరించింది. ఈ ప్రదర్శన తరువాతే పూర్తి స్థాయిలో కూచిపూడి నృత్యాన్ని అభ్యసించడానికి ఉద్దండుల వద్ద చేరారామే. 1995లో జిఆర్కే మెమోరియల్ ట్రస్ట్ వారి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆమె అరంగేట్రం కోసం ఢిల్లీలోని త్రివేణి కళా సంఘంలో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
పద్మభూషణ్
అవార్డు గ్రీహత స్వప్నసుందరి నుంచి ఏడవ ఏటనే కూచిపూడి నృత్యాన్ని
నేర్చుకోవడం ప్రారంభించిన అరుణి తరువాత పద్మశ్రీ అవార్డు గ్రహీత
జయరామారావు, వన శ్రీ రావు వద్ద శిక్షణను కొనసాగించారు. దాదాపు 15 సంవత్సరా
లుగా ఆమె 15 దేశాలలో అనేక నాట్యోత్సవాలు, సాహిత్య, కళా ఉత్సవాలలో
ప్రదర్శనలిచ్చారు. కళాభిమానులు ఆమె నాట్య భంగిమలతో పాటు అభినయాన్ని
చూడటానికి ఆసక్తిని చూపిస్తారు. బృంద ప్రదర్శనలిచ్చినా, సోలో
పర్ఫార్మెన్స్లు ఇచ్చినా శాస్త్రీయ నృత్యప్రేమికులను అలరించడం ఆమె
ప్రత్యేకత. రంగస్థలంపై ఆమె నృత్యప్రదర్శన కోసం అభిమానులు వేయికన్నులతో వేచి
చూస్తుంటారు.

అరుణిమా ఆశయం
కూచిపూడి నృత్యాన్ని అంతర్జాతీయంగా ప్రసిద్ధం చేయాలని సంకల్పించిన కళాకారులలో అరుణిమా ఒకరు. దేశంలోనే అత్యుత్తమ కూచిపూడి నృత్యకారిణులలో ఆమె ఒకరు. ఆమె కళా ప్రజ్ఞను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను సంగీత నాటక్ అకాడమీ వారి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో గౌరవించింది. నృత్యం, సంగీతం, నాటకాలలో కృషి చేసిన వారికి ఈ బహుమతిని అందజేస్తారు.
టివి, రేడియో కార్యక్రమాలలో
అరుణిమకు శాస్ర్తీయ నృత్యంతో పాటు నటన అంటే కూడా ప్రత్యేకాభిమానం. స్టార్న్యూస్లో యోగ్ యాత్ర అనే టివి కార్యక్రమానికి ఆమెను ప్రేక్షకులు అభినందించారు. ఢిల్లీలో ఆమె అనేక సంగీతాధారిత వీడియోలను, వాణిజ్య ప్రకటనలు, చిరుచిత్రాలలో నటించారు. గ్లోబస్లో జరిగిన మైక్రోసాఫ్ట్ అంతార్జాతీయ చిత్రోత్సవాలలో ప్రత్యేక ప్రదర్శననిచ్చారు. ఇటీవలే వచ్చిన ప్రకాశ్ ఝా చిత్రం రాజ్నీతిలో అతిథి పాత్రలో కనిపించి అలరించారు.

ప్రొఫైల్

పూర్తి పేరు : అరుణిమా కుమార్
పుట్టిన తేది: 1978 జూలై 1
జన్మస్థలం : ఢిల్లీ
వృత్తి : కూచిపూడి కళాకారిణి
అవార్డులు : సంగీత నాటక్ అకాఅవార్డు వంటి
అవార్డులు అనేకం..
భారతదేశంలో ఉత్తమ ప్రదర్శనలలో కొన్ని
- ఆమ్రపాలి బ్యాలెట్ -1987 ( తొలి ప్రదర్శన)
- హైదరాబాద్ కళాఉత్సవం
- ఇండియా హాబిట్ సెంటర్-1998, 1999,2003.
- ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 1999, 2002,2003,2006.
- భారత్యాత్రా ఫెస్టివల్, కూచిపూడి గ్రామం
- శృంగారమణి ఉత్సవం-2001‚
- ఖుతాబ్ ఉత్సవం
- విరాసత్ ఉత్సవం, డెహ్రాడూన్ 2005
- గోవా అంతర్జాతీయ కేంద్రం -2006
- హైదరాబాద్ బయోటెక్ కాన్ఫరెన్స్-2006
- నెహ్రూ సెంటర్, ముంబై 2006
- ఉగాది ( ఏపి భవన్) ఉత్సవాలు-2006
- బ్రహ్మ గాన సభ, చెనై్న -2008
- ఉస్తాద్ అల్లా ఉద్దిన్ ఖాన్ సమారోహ్, గ్వాలియర్-2008
- ఖజురహో నృత్యోత్సవం 2010
లండన్ ప్రదర్శనలలో ఉత్తమం - రాయల్ ఒపేరా హౌజ్, లండన్-2009
- సాల్ఫర్డ్లోని లోవ్రిలో డ్యాన్స్ ఇండియా కార్యక్రమంలో భాగంగా-2009
- ఇండియా సెంటర్, కార్డిఫ్-2009
- ఎక్పో 1998, లిస్బన్, పోర్చుగల్
- ఎక్పో 2000 హాన్నవర్, జర్మని
- ఐసిసిఆర్ టూర్, ఆస్ట్రేలియా 2003
- ఇండోనేషియా అంతర్జాతీయ నాట్యోత్సవం-2004
- ఫిలిప్పెన్స్ ఎసియన్ ఆర్ట్స ఫెస్టివల్-2007
- టాగోర్ ఇంటర్నేషనల్ సెంటర్ బెర్లిన్-2005
- ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన భారతదేశ వారోత్సవాలు 2005
- ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ కన్వెన్షన్, కాలిఫోర్నియా 2008
అవార్డులు, గౌరవాలు - ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం (సంగీత నాటక్ అకాడమీ)-2009
- సాహిత్య కళా పరిషత్ స్కాలర్షిప్ -1998
- సుర్ శృంగార్ సంస్థనుంచి శృంగారమణి టైటిల్-2004
- 2006లో రాష్టప్రతి భవన్లో రాష్టప్రతి ఎదుట ప్రదర్శన
- అల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో ఏ గ్రేడ్ పొందిన కళాకారిణి
- గిన్నిస్ బుక్ రికార్డును సాధించడానికి కాలిఫోర్నియాలో 400 మంది కళాకారులతో కలిసి కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు.
- దూరదర్శన్, సోని, ఆజ్‌తక్, స్టార్‌న్యూస్, హిందుస్తాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, బిజినెస్ స్టాండర్డ్ వంటి ఛానల్స్, పత్రికలు ఉత్తమ మహిళల లిస్ట్‌లో స్థానం సంపాదించారు.
- లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రత్యేక గౌరవం
- గతీ అనే నృత్య కళాకారుల ఫారమ్‌కు స్పాన్సర్ కూడా.
ప్రముఖ ప్రదర్శనలు - మలేషియాలోని ఇండియన్ కల్చర్ సెంటర్లో..
- కెఎల్ కన్వెన్షన్ సెంటర్, కౌలలంపూర్, మలేషియాలో-2010
- అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ఎన్నో నృత్యప్రదర్శనలనిచ్చారు.